హెచ్చరిక (కధ)
రచన : శ్రీమతి ఎస్.ప్రసన్న ,
ముక్తినూతలపాడు,
ఒంగోలు కార్పోరేషన్,
సెల్ :7893305878.
రాజశేఖరం, విశ్వనాథం ఇద్దరు బాల్య స్నేహితులు. చిన్నతనం నుండి కలిసే చదువుకుంటున్నారు. రాజశేఖరం కి షేర్లు, రియల్‌ఎస్టేట్‌లో బాగా కలిసివచ్చి కోట్లు సంపాదించాడు. విశ్వనాథం ది సాధారణమైన జీవితం. భార్య చాలా క్రితమే చనిపోయినది. మిత్రులిద్దరికి చెరొక కొడుకు ఉన్నారు. విశ్వనాథం తన కొడుకు భరత్‌ని చిన్నతనం నుండి విలువలతో పెంచుతూ ప్రస్తుతం ఐ.ఏ.యస్ ప్రిపేర్ అయ్యే స్థాయికి తెచ్చుకున్నాడు. రాజశేఖరం తన కొడుకు ఆనంద్‌కు పూర్తి స్వేచ్ఛనిస్తూ తను అడిగినా, అడక్కపోయినా కావలసినంత డబ్బు తన అకౌంట్‌లో వేస్తుంటాడు. ప్రస్తుతం ఆనంద్ యమ్.టెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. రాజశేఖరం బార్య రాజేశ్వరి బాగా చదువుకున్నదే. భర్త కోరిక మేరకు చేస్తున్న ఉద్యోగం మానుకుని లేడిస్ క్లబ్ ఈవెంట్స్‌లో సరదాగా పాల్గొంటూ కాలక్షేపం చేస్తున్నది. రాజశేఖరం కు ప్రతిరోజు డ్రిరక్ చేసే అలవాటు ఉంది. ఆయనకు అదొక పిచ్చి. ఆ పిచ్చిని కాస్త భార్యకు అంటించాడు. ఒకరోజు క్లబ్ ఫంక్షన్‌లో సరదాగా తాగింది. ఆరోజు ఇంటికి రాకుండా క్లబ్ గెస్ట్ హౌస్‌లోనే పడుకుని మరుసటి రోజు ప్రొద్దుటే ఇంటికి వచ్చింది. మాటల సందర్భంలో కొడుకు ఆనంద్‌కి డౌట్ వచ్చి అడుగుతాడు. ‘‘అమ్మా, రాత్రి నువ్వు డ్రిరక్ చేసావు కదు’’ అంటాడు. రాజేశ్వరి నివ్వెరబోయి ఏదో సర్ది చెప్పబోయింది. ‘‘నువ్వు అబద్దం చెబుతున్నావు మమ్మి’’ అని అంటాడు. రాజశేఖరం భార్యపై మండిపడ్డాడు. ఇరువురి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకరి బండారం ఒకరు బయట పెట్టుకుని నానా రబస చేసుకుంటారు. కొడుకు అది భరించలేక ‘‘»» Stop it . what is this Mummy, Dady. We are all One. There is no more igos in our family, common enjoy,, అంటూ ముగ్గురు ఆనందంగా అల్లిబిల్లి తిరుగుతున్న సమయంలో అంతకుముందే అదంతా చూస్తున్న విశ్వనాథం వచ్చాడు. మిత్రుడిని మందలిస్తాడు. ‘‘ఒరేయ్ ఒకప్పుడు చెప్పాను నీ కొడుకు ఈ వయస్సులోనే సిగిరెట్ తాగుతున్నాడు కాస్త జాగ్రత్త పడు అని’’ నువ్వు పట్టించుకోలేదు. ఇప్పుడు కన్న కొడుకు కళ్ళముందే మీ భార్య భర్తల బ్రతుకు బండారం బహిర్గతమైతే రేపు మీ బిడ్డ పరిస్థితి ఎలా వుంటుందో ఊహించావా. మొక్కై వంగనిది మ్రానై వంగునా గుర్తుంచుకో అంటాడు. రాజశేఖరం ఆ మాటలను పెడచెవిన పెట్టి ‘‘రేయ్ మీ బావాలతో పెరిగిన మీ కొడుకు రేపు ఎంత గొప్పవాడవుతాడో నా ఆలోచనలకు అనుగుణంగా మా పెంపకంలో పెరిగిన నా కొడుకు ఎంత గొప్పవాడవుతాడో చూద్దాం అంటాడు. విశ్వనాథం మిత్రుడి అజ్ఞానానికి మనసులోనే బాధపడతాడు.
కొన్నాళ్ళ తరువాత రాజశేఖరం జీవితం తారుమారు అయింది. యుద్ధం కారణంగా షేర్ మార్కెట్ పడిపోయి తీవ్రంగా నష్టపోయాడు. రియల్ ఎస్టేట్ కూడా బాగా పడిపోయి కొనేవారు లేక, బ్యాంకు లోన్లు బకాయిలు కట్టలేక, ఇళ్ళు సీజ్ చేసే పరిస్థితి ఏర్పడిరది. కొడుక్కి ఈ విషయం తెలిసి నివ్వెరబోయి డబ్బు లేకుండా నేను ఎలా బ్రతకాలో అని వాపోయాడు. రాజశేఖరానికి దిక్కు తోచక అప్పుల వాళ్ళకు మోహం చూపించలేక పిచ్చి పట్టినవాడిలా తిరుగుతు చివరిగా కొడుకుని చూడాలన్న ఆశతో ఎక్కడో 50 వేలు సేకరించి కొడుకు దగ్గరకు ప్రయాణమయ్యాడు.
అది వైజాగ్‌లో ఆనంద్ ఉంటున్న ఇళ్ళు. అక్కడ ‘‘చందు’’ అనబడే ఆనంద్ మిత్రుడు కూడా ఉంటున్నాడు. భరత్‌కి రూమ్ దొరక్క ఆనంద్‌ను రూమ్ దొరికేదాకా షెల్టర్ అడుగుతాడు. 10 రోజుల నుండి భరత్ కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు. అయితే వారి తండ్రులు ఇద్దరు స్నేహితులైన వీళ్ళిద్దరికి మాత్రం ఒకరికి ఒకరు పరిచయం లేదు. ఆనంద్‌కు చేతులో డబ్బు లేనిదే నిద్ర పట్టదు. తండ్రి పరిస్థితి దిగజారిపోయాక పక్క దారి పట్టాడు. ఈజి మని కోసం వెంపర్లాడుతున్నాడు. తన స్నేహితులతో కలిసి దొంగతనాలు, కిడ్నాప్‌లు, బెదిరింపులు చేస్తూ డబ్బురాబట్టే పరిస్థితిల్లో ఉన్నాడు. ఆ సమయంలో రాజశేఖరం కొడుకు ఉంటున్న ఇంటికి వచ్చాడు. అక్కడ ఆ సమయంలో భరత్ మాత్రము ఉన్నాడు. ‘‘ఎవరండి’’ మీరు అని ఆప్యాయంగా పలకరించాడు. సకల మర్యాదలు చేసాడు. చివరికి భరత్ తన మిత్రుడు విశ్వనాథం కొడుకు అని తెలుసుకుని ఆనందించాడు. ఆనంద్ బయట టీ కొట్టు దగ్గర ఉండి ఉంటాడు పిలుచుకు వస్తాను అని బయటకు వెళ్ళాడు భరత్. కొద్ది క్షణాలల్లో కొడుకు ఇంట్లో నుంచి ఫోన్ మాట్లాడుతూ హాలులోకి వస్తాడు. కొడుకుని చూసి ‘‘బాబు ఆనంద్’’ అని ఆప్యాయంగా పలకరించాడు. తండ్రిని చూసి ఆనంద్ ఉగ్రుడై ‘‘ఎందుకొచ్చావ్ ఇక్కడికి’’ ఇన్నాళ్ళు నీకొక కొడుకు ఉన్నాడని గుర్తుకురాలేదా. ఈ అవతారంలో నిన్ను చూస్తే నువ్వు మా నాన్నవని తెలిస్తే నా ఫ్రెండ్స్ ముందు నా పరువు పోతుంది. ‘‘వెంటనే వెళ్ళిపో’’ అంటాడు. రాజశేఖరంకు మతి పోయింది. మాటలు పెగల్లేదు. ఇంతలో ఆనంద్ ఫ్రెండ్ చందు వచ్చి, ‘‘ఆనంద్ ఎవడ్రా ఈయన’’ అంటాడు. ఆనంద్‌కి వెంటనే ఏమి చెప్పాలో అర్థం కాక ‘‘ఈయన మా ఇంటి పనిమనిషి రా’’ అంటాడు. రాజశేఖరం ఒక్కసారిగా స్టాను అయిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న భరత్ ఆనంద్‌ని మందలిస్తాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరుగుతుంది. ఈ నేపథ్యంలో భరత్‌ని ఆనంద్ చెంపపై కొడతాడు. తండ్రి ఉగ్రుడై ‘‘ఒరేయ్ అని కొడుకుని చెంప చెళ్ళుమనిపించి భరత్‌ను ఓదార్చి నీలాంటి వ్యక్తి ఈ మృగాల మధ్య ఉండటం మంచిది కాదు బాబు, నా మాట విని ఇక్కడినుంచి వెళ్ళిపో నాయనా’’ అని చెప్పి కొడుకు నుద్దేశించి ‘‘రేయ్ ఆ బిడ్డని కొట్టడానికి చేతులు ఎలా వచ్చాయి రా దౌర్భాగ్యుడా’’ అని వాపోతాడు. చివరికి భరత్, రాజశేఖరం ఇద్దరు కలిసి ఆ ఇంటి నుండి భయటకు వెళ్ళిపోతారు.
అది విశ్వనాథం గారి ఇల్లు. ప్రస్తుతం రాజశేఖరం భార్య రాజేశ్వరి అక్కడే వుంటుంది. భర్త రాక కోసం, కొడుకు కోసం దిగులుతో మంచాన పడిరది. విశ్వనాథం అంతా మంచే జరుగుతుంది ఆందోళన పడకండి అని సర్ది చెబుతాడు. ఆ సమయంలో భరత్, రాజశేఖరం లు అక్కడకు వస్తారు. భర్తను చూసి భార్య, భార్యను చూసి భర్త మనసులు విలవిలలాడిపోయాయి. భార్య భర్తలను ఏకాంతంగా వదిలి భరత్, విశ్వనాథం భయటకు వెళ్ళారు. రాజేశ్వరి ఏడుస్తూనే కొడుకుని గూర్చి ఆరా తీస్తుంది. భర్త చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయింది. అంతలో పోలీస్ అనౌంన్స్‌మెంట్ వినిపించింది. ఆనంద్ పరిగెత్తుకుంటూ ఆ యింట్లోకి వచ్చి తలుపులు మూసి అలసటతో రొప్పుతున్నాడు. ‘‘ఎవరు నువ్వు మాట్లాడవే’’ గర్థించాడు రాజశేఖరం. తీరా చూస్తే కొడుకు. ఒకరినొకరు చూసుకునా ఆశ్చర్యపోయారు. తల్లిని చూసి మమ్మీ అని పిలిచాడు. ఆనంద్ ఆ పిలుపుకు తల్లి హృదయం ఉప్పోంగి కొడుకుని గుర్తు పట్టి బాబు అని కౌగిలించుకుని ‘‘ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఏమి చేస్తున్నావు రా’’ అని అడిగింది. సమాధానం లేదు. ‘‘దొంగ ఎవరైన తన బండారాన్ని బయట పెట్టుకుంటాడా’’ రాజేశ్వరి . నీ కొడుకు ఒక దొంగ, దోపిడీదారుడు, స్మగ్లర్. ఇప్పుడు ఆ ఏటియం బ్యాంకు చోరి చేసింది కూడా వీడే అయ్యుంటాడు అందుకే పోలీసులు వెంటాడుతున్నారు. ‘‘ఓరేయ్ నిన్ను ఈ క్షణంలోనే పోలీసులకు పట్టిస్తాను’’. అని తలుపు తీయబోయాడు. ‘‘ఆగు’’ తలుపు తీసినా, నాగురించి పోలీసులకు ఏమైనా చెప్పిన తల్లిదండ్రులని కూడా చూడను పిట్టల్ని కాల్చినట్లు కాలుస్తాను అని గన్ చూపించాడు. ఆక్షణంలో ఎస్.ఐ వచ్చి తలుపు తడుతూ ‘‘ఎవరండి లోపల తలుపు తీయండి మేము పోలీసు డిపార్టుమెంట్ వాళ్ళము. తలుపు తీయండి’’ అని వినిపించింది. తండ్రి తలుపు తీయటానికి ముందుకు ఉరికాడు. వెంటనే కొడుకు తండ్రిని నోరు మూసి గన్ చూపించి తలుపు పక్కగా నిలబడ్డాడు. రాజేశ్వరి తలుపు తీసింది. ఎస్.ఐ లోపలికి వచ్చి రాజేశ్వరిని విచారించాడు. సరైన సమాధానం లభించలేదు. అనుమానం వేశింది. అక్కడే ఆనంద్ బ్యాగ్‌ను చూసి, తెరిచి చూడగానే అన్ని నోట్ల కట్టలు. రాజేశ్వరి గుండె పగిలినంత పనయ్యింది. ‘‘ఏమిటివి, ఇంత డబ్బు ఈ బ్యాగ్‌లోకి ఎలా వచ్చింది ? చెప్పు ఎక్కడ దాచావు నీ కొడుకుని’’ అంటూ గర్దించాడు. తెలీదు అంది. చెంప చెళ్ళుమనిపించాడు. ఆ దెబ్బకు ఆనంద్ తండ్రిని వదిలి ‘‘రేయ్ మా అమ్మనే కొడతావురా’’ అని ఎస్.ఐ చెంప పగలగొడతాడు. ఇద్దరి పెనుగులాటలో ఎస్.ఐ ని కత్తితో పొడిచాడు. కొద్ది క్షణాల్లోనే ఎస్.ఐ విలవిల లాడుతూ చనిపోయాడు. ఆనంద్‌కి ఏమి అర్థం కాలేదు. ఎస్.ఐ ని అలాగే చూస్తూ ఉండిపోతాడు. తండ్రి కొడుకుని దూషించాడు. తల్లి ఆనంద్ దగ్గరకు వచ్చి ‘‘ఎందుకు చేశావు ఇంత దారుణం, ఎస్.ఐ గారు చేసిన తప్పుఏమిటి ? ఒక దొంగను వెంటాడడం ఆయన చేసిన నేరమా ? డబ్బు కోసం మనుషులను చంపుతావంట్రా నువ్వు ’’ అని చెంపలు పగలగొట్టింది. ‘‘ఓరేయ్ నిన్ను నేను స్వయంగా పోలీసులకు అప్పజెప్తాను ఏవండీ 101 కు ఫోన్ చేసి విషయం చెప్పండి. వీడ్ని బిడ్డ అని కూడా చూడకండి. ఫోన్ చేయండి’’ అని గర్ధించింది. తండ్రి ఫోన్ చేస్తున్నాడు. ఆనంద్‌కు భయం వేసి అమ్మా అని తల్లిని విధిలించుకొని గన్ తీసి ‘‘నిన్ను చంపటం నాకొక క్షణం చాలు, కాని చంపలేను. ఎందుకంటే నేను మనిషినేనమ్మా ! మీరన్నట్లు మృగాన్ని, నరరూపరాక్షసున్ని కాదు. నాలోనూ మానవత్వం వుంది. జాలి, దయ, కరుణలు ఉన్నాయి. కాని వాటిని ‘‘మీరే, మీ ఇద్దరు కలిసి నలిపి నలిపి చంపేశారు. ఎందుకమ్మా నన్ను ఇంత గారాభంగా పెంచారు. మీ గారాబమే నన్ను ఒక ఉన్మాదిని చేసింది. అదొక భూతమై నన్ను ఆవహించింది. ఈ హత్యకు పరోక్షంగా కారణం మీరు’’ అని తల్లిని, తండ్రిని గుండెలు తరక్కపోయే మాటలు అడిగాడు. తల్లిదండ్రులకు పశ్చాత్తపముతో మాటలు రాలేదు. సమాధానం లేదు. తాము చేసిన గారాభం, తమ పెంపకమే తన బిడ్డ చేత ఈ హత్య చేయించింది అని ఈ తల్లిదండ్రులకు అర్థం అయ్యింది. ఆనంద్ ఎస్.ఐ ని చూస్తూ ‘‘నేను తప్పు చేసాను, కాని నాలోనూ మానవత్వం వుంది. జాలి, దయ, కరుణ ఉన్నాయని నిరూపించుకోవాలి. నా చావు నా తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక కావాలి. ‘‘ నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను’’. అని పిస్టల్ తో తన ఖనతపై కాల్చుకుంటాడు. ఆనంద్ ప్రాణం అనంతవాయువులో కలిసిపోయింది. తల్లిదండ్రుల రోధన, ఆవేదన వర్ణనాతీతం.
నా ఈ కథ తల్లిదండ్రులలో ఓ మార్పును తెస్తుందని విశ్వసిస్తున్నాను.
కథ చాలా బాగుంది.. ఇలాంటి కథలు మరిన్ని రాయాలని కోరుతున్నాను.
రిప్లయితొలగించండి