లాహిరి లాహిరి లాహిరిలో
అరుణ చామర్తి ముటుకూరి
సెల్ : 9000683826
"అత్త, నేను అమ్మ దగ్గరికి వచ్చాను. మీరు వీలు చూసుకుని రాగలరా? నేను.. చాలా పనులు పెట్టుకొని వచ్చాను. అందుకే రా..లేక మిమ్మల్ని రమ్మని "
"పర్లేదులే, ఈ మాత్రం దానికి ఇంత చెప్పాలా. ఉన్నట్టుండి చెప్పకుండా ఇలా వచ్చేసారేంటి?. సర్లే , సుధీర్ కి ఒకసారి ఇవ్వు "
ఒక్క క్షణం తర్వాత "సుధీర్ రాలేదు అత్తయ్య"
" ఒకదానివే వచ్చావా?"
" అవును అత్తయ్య, వస్తారుగా మాట్లాడదాం."
" సరేలే "అన్నా అన్య మనస్కంగా. సుధీర్ ఎందుకు రాలేదు? అసలు ఒక్కతే రావడం ఏంటి ? వాడితో ఫోన్లో మాట్లాడకుండా చాలా నెలలవుతోంది. ఏమై ఉంటుంది? నాలో నేనే మాట్లాడుకుంటూనే గబగబా రెడీ అయ్యాను కాలేజీకి. అవును మరి లెక్చరర్ని కదా నేను ఆలస్యంగా వెళ్లడం నాకే అస్సలు నచ్చదు .
రెండు రోజుల తర్వాత లీవ్ దొరికింది రెండు రోజులు ఆదివారంతో కలుపుకొని మూడు రోజులు హాయిగా ఉండొచ్చు .శుభ తో కూడా కాలం గడిపి చాలా రోజులైంది. నేను, సూర్య ఆనందంగా బయలుదేరాము .సూర్యకి కాస్త కంగారు ఎక్కువ. "రమ్యని చిన్నప్పటినుంచి చూస్తున్నాం నీ స్నేహితురాలు కూతురనీ కోడలు చేసుకుంటే ఒకటే వచ్చాను అంటుంది ఏమైందో ఏమిటో ?వాడికి ఏం కాలేదు కదా! లేకుంటే ఏమైనా గొడవపడ్డారు అంటావా?"
" అబ్బే అట్లా ఏమీ అయ్యుండదు సూర్య డోంట్ వర్రీ ఇద్దరు తెలిసిన వారే కదా ఎవరూ కోపాలు పెంచుకునేవారు కాదు" సూర్యకి నచ్చచెప్పినా నాలో కూడా ఏమూలో చిన్న ఆందోళన సుధీ ఈమధ్య గతంలో లాగా వీడియో ఫోన్లో మాట్లాడలేదు .బహుశా మూడు నెలలు అయిందేమో కనీసం గొంతు విని. వెళ్తే తెలుస్తుందిలే అని పైకి నిబ్బరంగానే ఉన్నాను ఇంట్లోకి అడుగుపెడుతూ ఉంటే శుభ గొంతు వినపడుతోంది హార్షగా పెద్దగా.
" ఏమిటే నీ నిర్వాకం అసలు అర్థం కావడం లేదు. నువ్వు చెప్పే విషయం. నా స్నేహితుల దగ్గర నా పరువు పోగొట్టేలా ఉన్నావ్ .సరిగ్గా చెప్పు నాకు బిపి పెరిగిపోతుంది"
సూర్య నేను మొహమొహాలు చూసుకున్నాం. విషయం ఏదో ఉంది అన్నట్టుగా చూసిన సూర్యకి ఈసారి తేలిగ్గా తీసుకోమని చెప్పలేకపోయాను. నెమ్మదిగా 'శుభ 'అని పిలిచా .నా గొంతు నాకే పీలగా బలహీనంగా.
నా గొంతు విని "అత్తయ్య" అంటూ చెంగును బయటికి వచ్చింది రమ్య ."జాగ్రత్త, నెమ్మదిగా" అప్రయత్నంగా శుభ .ఎంతైనా తల్లి మనసు.
" ఏం తల్లి బాగున్నావా? ఏంటి మా శుభని విసిగిస్తున్నావా?
"లేదత్త చెప్పిన విషయం అర్థం చేసుకుందో లేదో కానీ కోపం మాత్రం వచ్చింది "
" రాధీ బావున్నావా ?అన్నయ్య రండి కాలు కడుక్కుందురు గాని "అంటూ శుభ పలకరించినా ఏదో ఒక కంగారు మా దృష్టిని దాటిపోలేదు .ఇప్పుడే విషయం కదపకూడదని సత్యం వచ్చేలోగా మేము స్నానాలు ,టిఫిన్లు చేసి కూర్చున్నాను
అప్పుడు అడిగాను "రమ్య సుధీర్ ఏంటమ్మా ,చాలా రోజులుగా మాట్లాడటం లేదు"
నా భ్రమా ,నిజమా రమ్య మొహంలో ఏదో విషాదం కళ్ళల్లో నీళ్లు నాకు తెలియకుండా. తేరుకొని
"తనకి మా కంపెనీ మరో బ్రాంచ్ పెడుతున్నామని కొత్త ప్రదేశానికి పంపారు అత్త. అక్కడ చాలా చిన్న ఊరట నాతోనే మేమున్న ఊరికి వచ్చేదాకా మాట్లాడడం కుదరలేదు ."
"ఏంటి ,అమెరికాలో కూడా అలా ఉన్నాయా "సూర్య సందేహం.
"కాదు మావయ్య పక్కన వేరే ఏదో చిన్న దేశం .కరెంటు కూడా ఉండదట" తడబడుతూ చెప్తున్నట్లు అనిపించింది .ఏదో ఉంది పిల్ల చెప్పుకోలేక బాధపడుతుంది అనిపించింది.
" ఏమ్మా పెళ్లయిన ఈ రెండేళ్లు మిమ్మల్ని ఏమీ అడగలేదు. ఇకనైనా మాకు బుజ్జి రమ్యను చిన్న సుధీనోఇచ్చేది ఉందా?" విషయం తెలుసుకోవాలని అన్నా.
రమ్య మొహంలో నునుసిగ్గు నాకు ఏదో చెప్పకనే చెప్పాయి
"అది అలా అడుగురాధీ వాడు ..,నోరు జారినట్లు నాలిక కొరుక్కుని, అదే.. అదే అల్లుడుగారు వేరే దేశం వెళ్లి ఆరు నెలలు అంట .ఈవిడ గారికి మూడో నెలట .ఇదేం విడ్డూరం చెపుతుంది . నేనూ చదువుకున్న గా నీలా ఉద్యోగం చేయకపోయినా."
" ఏమిటిది శుభ! అది మన పెంపకంలో మన కళ్ళ ముందు పెరిగిన పిల్ల .ఏం మాటలవి . బాధపడదూ తప్పు అలా మాట్లాడకు "రమ్య ఒక్క పరుగున వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని వెక్కిపడింది.
"అర్థం చేసుకున్నవ్ అత్త"
" అమ్మకి మాత్రం తెలియదూ నీ గురించి. ఏదో మాట వస్తే అని బాధ .అంతే కానీ.. ఈ విషయం ఏంటో వివరంగా చెప్పు తల్లి "
"బావగారు రండి "సత్యమన్న సూర్య ని బయటకు తీసుకు వెళ్ళాడు .నాకు ఇదే మంచిదనిపించింది .
"అత్తయ్య సుధీర్ కి అమెరికా పక్కన ఉన్న దేశాల్లో కంపెనీ గురించి చెప్పి ఆర్డర్ చేసి ఇచ్చే ఉద్యోగం అప్పగించిన మాటలు నిజమే. అయితే"
" చెప్పమ్మా !మనసు కీడు శంకిస్తోంది నువ్వు అలా నానిస్తే"
" లేదమ్మా సుధీర్ కి ఏమీ కాలేదు. అక్కడ మా కంపెనీ బిజినెస్ బాగానే చేసి రెండు నెలల తర్వాత పది రోజుల సెలవు మీద తిరిగి వస్తున్నాడు. అప్పుడు ఫ్లైట్లో చిన్న ఇబ్బంది ఏర్పడి అంటే సాంకేతిక కారణమో ఏమో తెలియదు కానీ క్రాష్ ల్యాండింగ్ చేయవలసి వచ్చింది."
"ఆ ..అయితే ఇద్దరం ఒక్కసారే ఆత్రంగా .
"అప్పుడు పైనున్న మెటల్ దేదో ఊడి తనకి నడుము పై పడి బలంగా తగలడంతో"
" చెప్పు ఏమిటి !చెప్పు,... ఇద్దరమరిచేసాం .
ఎప్పుడు వచ్చారొ కానీ అన్నయ్య సూర్య అయితే బొమ్మల్ల నిలబడిపోయారు.
"నాన్న, మామయ్య సుధీర్ కి ఏం కాలేదు క్షేమంగానే ఉన్నాడు" వాళ్ళని చూసి గబగబా చెప్పేసింది .
"నడుము భాగంలో ఏదో ఒత్తిడి పెరిగి నడుము నుంచి కిందికి పేరలైజ్ అయింది."
" సుధీర్, అల్లుడూ "అంటూ దుఃఖంతో గొంతు పూడుకుపోయింది నలుగురికి.
"తలకి చిన్న దెబ్బ వల్ల ఒక వారం రోజులు మన లోకంలోనే లేడు .అన్ని రోజులు స్పృహ రాకపోవడంతో కోమాలోకి వెళ్ళాడు ఏమో అన్న అనుమానం కూడా వచ్చింది డాక్టర్లకు ."
"ఇంత జరిగితే ఎవరో ఒకరికి చెప్పడం, సాయం తీసుకోవడం చేయాలనిపించలేదా? ఏం మేం చచ్చామనుకున్నావా? శుభ అరిచేసింది.
ఒక చేతితో శుభని మరో చేతితో రమ్యని దగ్గర తీసుకొని "ఊరుకో శుభ" అంటూ" చిన్న పిల్ల, పాపం ఒక్కతే ఎంత ఒత్తిడికి గురైందో. మనకు చెప్తే ఎంత భయపడతామో అని తనే భరించి "
"మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి తల్లి "గంభీరంగా అడిగినా ఏ చెడు వినడానికి సిద్ధంగా లేను నిజానికి.
ఈలోగా ఎప్పుడు చేసిందో వీడియో కాల్ చేసింది హాస్పిటల్ బెడ్ మీద వాడిని చూస్తే మా నలుగురికి ఏడు పాగలేదు
"అమ్మ అత్త ఊరుకోండి ఈ మాత్రం ఇలా ఉన్నానంటే రమ్య వల్లే సాధ్యమైంది మరో రెండు నెలల్లో లేచి తిరుగుతా చూడండి" ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు సుధీర్
వాడినల ఎక్కువ సేపు చూడలేక కాల్ కట్ చేశా.
" సరే మరి బిల్లు, వైద్యం ఎలా చేశావు రమ్య?"
"అత్త తప్పు వాళ్ళదే కాబట్టి వైద్యమంతా కంపెనీ భరిస్తోంది .అలాగే నాకు రాను పోను ఇంకో ఇద్దరినీ తోడు తెచ్చుకుందుకు వాళ్ళిద్దరికీ ఫ్లైట్ టికెట్స్ కూడా భరిస్తుంది."
"పోన్లే కొంత ఊరట .అయినా మనం పెట్టలేమని కాదనుకో"
"ఇవన్నీ సరే వాడు వారం తర్వాత స్పృహలోకి రావడం ఎలా జరిగింది? "
"అది నేను రోజు మీ అందరి గొంతులూ తనకు చెవి దగ్గర వినిపిస్తూ పిల్లల కోసం మేము కన్న కలల్ని నెమరేస్తూ ఉండేదాన్ని .దాంతో తనకి బతకాలనే కోరికతో పాటు భవిష్యత్తుపై ఆశ కలిగిందని డాక్టర్ అన్నారు .నన్ను మెచ్చుకున్నారు "మెరిసే కళ్ళతో చెప్పింది రమ్య .
"మరి "అసలు ప్రశ్న ఎదుర్కోవడానికి అన్నట్టు సిద్ధమైంది రమ్య .
"వాడిలా ఆరు నెలలుగా అయితే ఇందాక మరి నీ సిగ్గు శుభ మాటలు ఏంటి దాని అర్థం?"
"అత్తా నాన్న ,అంత శ్రద్ధగా వినండి .చేసింది తప్పో ఒప్పో తెలియదు కానీ తన వైద్యంలో చాలా సుగుణం కనిపించిన ఇంకా తనంతటతాను కాళ్లు కదపలేకపోతున్నారు. అందుకని డాక్టర్ తో సంప్రదించి కృత్రిమ గర్భధారణతో నాపై ప్రయోగానికి సిద్ధమయ్యాను అది చాలా హింసే. మొదటిసారి ఫెయిల్ అయింది. తర్వాత నెలలో ఫలించి ఇప్పుడు నాకు మూడోనెల. ఈ కొత్త జీవి కోసం తనలో మరింత ఆశ పెరిగి తను నడవాలని కోరిక బలపడింది .నేను రెండుసార్లు పడిపోతున్నట్లుగా తన ఎదురుగా నడిస్తే కంగారుపడి పట్టుకోడానికి ప్రయత్నం చేశారు .అలా నరాల్లో కాస్త కదలిక వచ్చింది. త్వరలో నడుస్తారు అని చెప్పారు డాక్టర్ "
"అది అంతా సరే ఇలాంటి పద్ధతిలో గర్భం దాలుస్తున్నావని వాడికి తెలుసా?"
"అత్త పేరుకి కృత్రిమ గర్భధారణమే .కానీ నేను సుధీర్ బిడ్డకే తల్లిని కాబోతున్నాను"
" ఏమిటి? "
"అవునత్తా !ఇది కూడా ఒక తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయానికి రావడం జరిగింది
తను స్పృహలోకి వచ్చాక ఒకరోజు వేరే పేషెంట్ బాత్రూంకి వెళ్తూ తన నెలల పిల్లని నర్స్ కప్పగించింది. ముద్దుగా ఉన్న బాబుని చూసి ఎత్తుకొని సుధీర్ దగ్గరికి వెళ్లాను. చూడగానే ఒక్కసారిగా కళ్ళు మెరిసేయి సుధీర్ కి .అంతలోనే చిన్న బోయాడు. ఆ బాబుని ఇచ్చేసి వచ్చాక 'నేను విడాకులు ఇచ్చేస్తాను నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో ఈ పరిస్థితుల్లో నేను నీకు భారమే తప్ప ఎటువంటి ఆనందము లేదు 'అనగానే నాకు ఏడుపు .
"సుధీర్ ఇంకెప్పుడూ అలా మాట్లాడకు నువ్వు నా పక్కన ఉంటే ప్రపంచాన్ని జయించినంత బలం. నిన్ను వదలలేని బలహీనత రెండు నువ్వే .ఆ బాబుని తీసుకురావడంతో నువ్వు అలా అంటున్నావు కదా. క్షమించు ఏదో చూడగానే చిన్నపిల్లల మీద ఉన్న ఇష్టంతో ఎత్తుకొని నీకు చూపిద్దామని తీసుకు వచ్చాను .అంతే ,ఇంకొకసారి అలా మాట్లాడి నన్ను బాధ పెట్టకు" అంటూ ఉండగా మా పక్క ఇంట్లో ఉన్న రాబర్ట్ తనకోసం వచ్చాడు.
" సారీ రమ్య ,సుధీర్ వినాలని వినలేదు ఐ యాం సారీ !వస్తూ ఉంటే వినబడింది మీరు ఇందుకు ఏమాత్రం బాధపడనవసరం లేదు ఎందుకంటే స్పెర్మ్ బ్యాంకులో స్పెర్మ్ ఇవ్వటానికి నేను వెళుతూ సుధీర్ ని కూడా తీసుకువెళ్లాను .అప్పుడు నేను కంపెల్ చేయడం వల్ల సుధీర్ కూడా బ్యాంకులో భద్రంగా ప్రిజర్వ్ చేయించుకున్నాడు. కాబట్టి నువ్వు హాయిగా సుధీర్ పిల్లల్ని కనొచ్చు మీతో ఉన్న చనువుతో ఈ మాత్రం కల్పించుకొని మాట్లాడాను ఏమీ అనుకోకండి ". రాబర్ట్ చెప్పడం అయిపోగానే ,
సుధీర్ ఆనందం తో అరిచేసాడు .నాకీ ఏర్పాటు బాగుందనిపించింది. సుధీర్ ఎంతో ఉద్వేగంగా ఉత్సాహంగా
" నిజమే రమ్య ఆ తర్వాత దేశం, నిన్ను వదిలి వెళ్ళే హడావిడిలో అసలు గుర్తే రాలేదు "
"థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ రాబర్ట్"
" అయ్యో ఇందులో నేను చేసింది ఏముంది. దేవుడు ఒక దారి మూసేస్తే మరొకటి తెరుస్తాడు అన్న మీ సానుకూల ఆలోచన నిజమైంది
అంతే " నవ్వుతూ తేల్చేసాడు రాబర్ట్.
"అలా చేసిన ప్రయత్నం ఇది నిజానికి అది కూడా నరకమే. చాలా హింసే మొదటిసారి ఫెయిల్ అయింది రెండోసారి పలించి ఇప్పుడు నాకు మూడో నెల"
" నా తల్లి ఒక్కదానివే ఎంత క్షోభపడ్డావొ" నుదుటన ముద్దు పెట్టింది అత్త.
నాన్న మామయ్య అభినందన గా చూశారు
"దటీజ్ మై కోడలు రమ్య"
" ఎంత ఎదిగిపోయావురా రమ్య" అంటూ అత్త అమ్మ నన్ను ఉక్కిరి బిక్కిరి చేశారు.
"చూశావా !శుభ అది మన పెంపకం భార్యాభర్తల బంధం ఈరోజుల్లో ఎంత సులభంగా వీగిపోతుందో మనకు తెలియంది కాదు. భర్త గుర్రు పెట్టాడనో ,భార్య పార్టీకి రమ్మంటే రాలేదని.. ఇలా ఏదో చిన్న చిన్న విషయాలకే ఆత్మాభిమానం దెబ్బతిందని ,అహం మీద కొట్టారని, అత్త ఆడపడుచులతో ఉండనని, గౌరవం ఇవ్వట్లేదని ..ఇలా రకరకాల కారణాలతో ఎవరికివారుగా విడిపోతున్నారు. కొంతమంది వేరే వారిని కలుస్తున్నారు అనుకో. అలాంటి జనరేషన్లో పుట్టిన మన ఇంటి పిల్ల.. బంధం నిలబెట్టుకోవాలని ఎంతగా తాపత్రయపడిందో చూశావా. అది కేవలం మనకు వారసులని ఇవ్వాలనే కాదు, సుధీర్ ని కూడా చంటిపాపలా అది జాగ్రత్తగా చూసుకోబట్టే వాడు మనకు దక్కాడు."
అవునన్నట్టుగా తల ఊపింది శుభ
"శుభ ,నువ్వు అన్నయ్య తర్వాత రండి .వీసా ఏర్పాట్లు చేయమని చెప్పి వెళతాం. మేము ఇప్పుడు రమ్యతో వెళ్ళిపోతున్నాం .వీసా రాగానే మీరు తర్వాత వద్దురుగాని" అని చెప్పింది అత్త నానమ్మను కాబోతున్నానన్న సంబరంతో.
Bavundi
రిప్లయితొలగించండిధన్యవాదాలు అండి
తొలగించండికథలు ఇలా రావాలి. సాంకేతిక అంశాలు తెలియాలి.ఇలాంటివి జరగాలని కాదు కానీ కథల వలన కొన్ని సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి.నిజానికి కథారచన వలన ఒనగూరే ప్రయోజనాలలో ఇదీ ఒకటి. . నిస్సందేహంగా ప్రయోజన కరమైన రచన. కథనం చాలా బాగుంది.
తొలగించండిథాంక్యూ సో మచ్ సార్. మీ అభిమానం ఇలాగే ఉంటే మరిన్ని ఇలాంటి కథలు తీసుకొస్తాను రాస్తాను
తొలగించండిNice story. The way of describing story is very nice.
తొలగించండిఈ రోజుల్లో కూడా అక్కడక్కడ ఇలాంటి భార్యలు ఉన్నారని మీ కథ గుర్తు చేసింది. పెద్ద ప్రమాదం ఆమెలోని గొప్ప మాతృత్వాన్ని బయటకి తీసింది. రమ్యకి ఇప్పుడు ఇద్దరు బిడ్డలు... తన భర్తను కూడా బిడ్డలానే సాకుతుంది. నైస్ స్టోరీ మేడం.
రిప్లయితొలగించండిధన్యవాదాలు అండి మీ అభిప్రాయానికి
తొలగించండినేటి మన సమాజములోనూ,ఇంటి పరివారములోనూ అనుకోని అనుభవములేని అకస్మాత్తుగా ఊడిపడిన చిన్న ఇబ్బంది కూడా ఆపరివార సహృదయుల మనసున ఆందోళనకు గురి చేసీ,మానసిక వ్యధను కొంతమేరకు రగిలించినా కూడా ఏదో చిగురాకులవోలె ఆలోచనలు,ఆసరాలు ఆ సమయంలో దుఃఖాన్ని శాస్వతముగా ఉపశమనము కలిగిస్తుంది.ఈ విషయము ప్రతి మనిషికి ఎదురైనను చక్కగా కథానిక రూపన మన పాఠకులకు పంచిన రచయిత్రి, మా సోదరి శ్రీమతి అరుణ గారి కలలకృషి,కలంశ్రమకు అభినందనమందారములు.శ్రీపుష్పం.
రిప్లయితొలగించండిమీ అభిమానానికి కృతజ్ఞతలు సోదర
రిప్లయితొలగించండిసూపర్బ్ అరుణా... భార్యాభర్తల అనుబంధం ఎలా ఉండాలో చక్కగా చెప్పావు. అలాగే ఆ తల్లిదండ్రులు పిల్లను ఎంత సంస్కారాలతో పెంచారో చెప్పకనే చెప్పిన విధానం చాలా బాగుంది
రిప్లయితొలగించండిbandhala viluvalu telipae kadha ... chaalaa chaalaa baavundi . 👌👌
రిప్లయితొలగించండిdhanyavadalu andi
తొలగించండిBaagundhi...
రిప్లయితొలగించండిtq
తొలగించండిచిన్న కథ అయినా పెద్ద నీతిని బోధిస్తుంది కథ చదివినట్టు గాక మన కళ్ళ ముందు చూస్తున్నట్లుగా వ్రాసిన రచయిత్రికి అభినందనలు ఒక సమస్య వచ్చినప్పుడు దానిని నూతనంగా వస్తున్న టెక్నాలజీతో ఎలా సమస్తవంతంగా పరిష్కరించుకోవచ్చు ఈ కథ ద్వారా రచయిత్రి తెలియజేశారు తెలియని వారు కూడా ఈ విధంగా తెలుసుకోవచ్చు రమ్య తనకు తెలిసిన పద్ధతులతో ఒక ప్రాణాన్ని నిలబెట్టటమే కాకుండా వంశాన్ని కూడా నిలబెట్టి మాతృత్వాన్ని అనుభవిస్తుంది ఇలాంటి సమస్య పరిష్కారం చూపించే కథలు ఇంకా వస్తే అడ్డదారులు తొక్కకుండా తెలుసుకుంటారు ప్రచురించిన మీకు రచయిత్రికి అభినందనలు మరిన్ని కథలు ఇలాంటివి రచయిత్రి నుండి రావాలని కోరుకుంటున్నాను
రిప్లయితొలగించండిధన్యవాదాలు అండి. నీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది
తొలగించండిబాగుంది. కొత్త విషయాలు సులభంగా అర్థమయ్యేలా చెప్పారు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు అండి
రిప్లయితొలగించండికథలో మొదట ఒక అనుమానాన్ని రేకెత్తించిన విషయం తర్వాత శుభవార్త గా పరిణమించటం గొప్ప ట్విస్ట్. రమ్య వివాహబంధాన్ని పటిష్టం చేసిన తీరు గొప్పగా వుంది.
రిప్లయితొలగించండి