కుసుమం 3

ఇక్కడ ఇంతమంది చనిపోయారు.. 

తనకి ఉద్యోగమిస్తానన్న సుధీర్ గారు ఏమయ్యారు? అని అనుకుంటూ అతను మెల్లెగా ఆ ప్రేలుడు వైపు వెళుతున్నాడు. 

అయితే అతన్ని అటువైపు ఎవ్వరూ వెళ్ళనివ్వలేదు.

--------------

అగస్టు 14 రాత్రి '' బాంబుప్రేలుళ్ళతో అట్టుడిగిన భాగ్యనగరం. దీనివెనుక తీవ్రవాదుల హస్తం వుందంటున్న పోలీసు వర్గాలు ''  ఏ ఛానల్‌చూసినా ఇదేన్యూస్‌...
నగర పోలిస్‌ కమిషనర్‌ నరేంద్రసిన్హా అన్ని చెక్‌పోస్ట్‌లను అలెర్ట్‌చేశాడు. 
అన్ని వాహనాలు తనిఖీ, కొత్తవ్యక్తులకు ఆశ్రయమివ్వద్దంటూ అనౌన్స్‌ మెంట్......
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సవ్యంగా సాగుతాయా అన్న డౌట్ అందరిలోనూ నెలకొన్న ప్రశ్న.
కమిషనర్‌ ఆఫీస్‌కి వైర్‌లెస్‌ మెసేజ్‌ 
'' మా నెక్ట్స్ టార్గెట్ అసెంబ్లీ.....దమ్ముంటే ధైర్యంగా ఎదుర్కోండి''
మిలటరీ ఫ్రోర్స్‌ కావాలంటూ ప్రధానమంత్రికి పిటీషన్‌ అందించింది రాష్ట్రప్రభుత్వం.
చాలాసేపు తర్జనబర్జన తర్వాత కేంద్రం ఆమోదించింది.
ఆ రాత్రికే పారామిలటరీని  భాగ్యనగర వీధుల్లో మోహరించింది ప్రభుత్వం.
గస్తీకాస్తున్న వీరజవాన్లు.
అనుమానితుల్ని అరెస్ట్‌ చేసి స్టేషన్ కి తరలించి విచారిస్తున్నారు.
బాంబ్‌బ్లాస్ట్‌లో గాయపడ్డవారిని  కొంతమందిని ఉస్మానియా, మరికొంతమందిని గాంధీ ఆసుపత్రులకి తరలించారు. 
క్షతగాత్రుల బంధువులతో హాస్పిటల్స్ కిటకిటలాడుతున్నాయి.
హాస్పిటల్ గేట్ల ముందు పలు మీడియా ఛానెల్స్ ఎవరికి తోచింది వారు చెప్పేసుకుంటూ వారి వారి టిఆర్పిని పెంచుకునే పనిలోపడ్డారు.
మరణించిన వారి సంఖ్య చెప్పటానికి అటు హాస్పిటల్ వర్గాలు కానీ, ప్రభుత్వ వర్గాలు కానీ చెప్పటానికి నిరాకరించాయి.
ఈ విషయాన్నే మీడియా పదేపదే చెబుతూ ప్రేక్షకులకు ఉత్కంఠత కలిగిస్తూ టిఆర్పినీ పెంచుకుంటున్నాయి. 
కానీ హాస్పిటల్లోపల మరణించిన వారి బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి.
--------------
రాత్రి 11 గంటలు హోటల్‌ గ్రీనిచ్‌  లైట్స్ ఆఫ్‌ చేయబడి వున్నాయి. 
టి.విలో వార్తలు చూస్తున్నారు సుధీర్‌, శ్రావణులు. 
తాము చేసిన బాంబ్‌ బ్లాస్టింగ్‌ ప్రభావం ఏమేరచూబిస్తున్నారోనని. 
తమ పధకం ప్రకారం మరణించిన వారిలో రాహుల్‌ వుండాలి. 
కానీ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్సతీసుకుంటూ కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌అయ్యారు ఇద్దరూ.
'' వీడు అంత బ్లాస్టింగ్‌నుంచి తప్పించుకుాంనికి వీల్లేదు. నేను సెట్ చేసిన బాంబ్‌బ్లాస్టింగ్‌ రేంజ్ వీడున్న యస్‌.టి.డి బూత్‌దాటి మరో రెండువందల అడుగుల వరకూ జరిగింది. వీడెలా గాయపడ్డాడు. ఒక వేళవీడు ఆనంబర్‌నుండి కాకుండా మరేనెంబర్‌నుండి డైల్‌చేసినా బ్లాస్టింగ్‌ జరగదు.'' అన్నాడు ఆలోచనలో పడ్తూ....
'' మృత్యుంజయుడంటే వీడేనేమో...'' అన్నది నవ్వుతూ మరోపెగ్‌ విస్కీ గొంతులో పోసుకుంటూ......
'' .....'' తనూ మరోపెగ్‌కోసం గ్లాస్‌ పట్టాడు.
'' ఏంటి ఆలోచిస్తున్నావ్‌ '' అన్నది తిరిగి....
'' వాడుమాత్రమే మనల్ని గుర్తు పట్టగలడు...వాడికి గానీ ఆలోచించే టైం ఇస్తే మనం ఇరుక్కుంటాం...'' అన్నాడు గ్లాసులోని విస్కీ గొంతులోకి వంపుకొని....
'' ఇప్పుడేంచేద్దామని'' అన్నది సిగరెట్  నోట్లో పెట్టుకొని....
'' ఆలోచిస్తున్నా....'' ఏదో ఆలోచనవచ్చినవాడిలా......
'' వాడ్ని లేపేస్తే '' అన్నాడు.
'' ఎలా? మర్చిపోయావా పోలీసులు, మిలటరీఫోర్స్‌ మనకోసం గాలిస్తున్నాయని.''
'' మన ముఖాలు తెలీదుగా...''
'' తెలీనంతమాత్రాన... చూడు పిచ్చిగా ఆలోచించకు. వాడున్నది హాస్పిటల్‌లో....అక్కడ ఫుల్‌గా సెక్యూరిటీ వుంది. టీ.విలో కనబడటంలేదా......'' అడిగింది.
'' నిజమే .....వాడు ఆలోచిస్తే మనం ఇరుక్కోక తప్పదు. ప్రత్యక్షసాక్షి వాడే....'' ఏదో ఆలోచన వచ్చినవాడిలా పేపర్‌,పెన్ను తీసి లెక్కలు కడుతున్నాడు......
లెక్క మొత్తానికి ఒక కొలిక్కి వచ్చింది. '' శ్రావణీ తప్పదు ''
'' ఏంటినువ్వు మాట్లాడేది....''
'' అవును .  మన దరిద్రం తీరిపోవటానికి, మనకిచ్చిన లక్ష్యం నెరవేరటానికి ప్రాణత్యాగం చెయ్యక తప్పదు. అదృష్టం బాగుంటే ప్రాణాలతో బయటపడతాం, లేక పోతే ....... ''
'' చచ్చిపోతాం... అందుకు సిద్దమయ్యేగా వచ్చింది.''
'' ఈ ఆపరేషన్‌కి నేను మాత్రమే వెళుతున్నాను. ఆలస్యం చేస్తే ఇద్దరికీ ప్రమాదం....''
'' నేనూ వస్తాను.'' 
'' వద్దు . ఈ బ్యాగ్‌లో ఐదుకోట్ల క్యాష్ వుంది. ఎక్కడో అక్కడ నువ్వు సెటిల్ ఐపో....'' అంటూ ఆమె చెయ్యాల్సింది మొత్తం చెప్పాడు. 
అతను బైటికి వెళ్ళిపోయాడు....డోర్‌వైపు అలాగే చూస్తూ వుండిపోయింది.
----------------
అగస్టు 14 సమయం రాత్రి 1.30 నిముషాలు రోడ్లు నిశ్శబ్దంగా వున్నాయి. 
సైనికులు గీస్తీకాస్తున్నారు. 
పోలీసులు వచ్చిపొయ్యే వాహనాలు తనిఖీ చేస్తున్నారు. 
కొత్తవారుకనబడితే వాళ్ళను అరెస్ట్‌చేస్తున్నారు. 
ఉస్మానియాహాస్పిటల్‌లో పేషంట్ల మూలుగులతో మారుమ్రోగుతోంది. 
చిన్నగా రోడ్డుమీద నడిచి వెళుతున్నాడు సుధీర్‌. 
మిలటరీ జవాన్‌ అతన్ని అడ్డగించాడు. 
ఉస్మానియా ఆసుపత్రిలో తనకు చెందిన వ్యక్తినిప్పుడే గాయాలతో టి.విలో చూబించారని...అతన్ని కలుసుకోవానికి వెళుతున్నానని చెప్పాడు. 
వివరాలడిగి అతన్ని పంపించేశారు మిలటరీవాళ్ళు.
అతను అడుగు పెట్టేసమయానికి అసుపత్రి మృతిచెందినవారి బంధువుల రోధనతో దద్దరిల్లుతోంది. 
అక్కడ క్షణక్షణానికి మృతులు పెరుగుతున్నారు. 
ఆ వాతావరణం మృత్యగీతం పాడుతోంది. 
మృత్యుదేవతే సుధీర్‌రూపంలో వచ్చిందా అనిపిస్తోంది.
అతనా కాంపోండ్‌లోకి అడుగుపెడుతుండగా ఇద్దరు పోలీసులు అతన్ని చుట్టుమ్టుారు. 
తనకు బాగాతెలిసిన వ్యక్తి లోపలగాయాలతో వున్నాడని అతన్ని చూడాలని వచ్చానని చెప్పి చిన్నగా అతన్ని వెతుక్కుంటూ లోపలికి వెళ్ళాడు.
'' సాక్ష్యం వుండకూడదు. సాక్షివుండకూడదు. ఎక్కడున్నాడు వీడు'' అని రూమ్‌లన్నీ వెతుకుతూ నడుస్తున్నాడు. 
అలా ఒకరూమ్‌లోకి వెళ్ళగానే షాక్‌అయ్యాడు.........
ప్రత్యక్షసాకక్షుల్లో బ్రతికివున్నవాడు ఇతడే.....పోలీసులు అతణ్ణి ఇంటరాగేట్ చేస్తున్నారు. 
''ఈపరిస్థితుల్లో నేనతన్ని కలవాలని వెళితే .......వద్దు....వెనుదిరిగితే .......... వద్దు. వెళ్దాం! వెళ్ళి వాడ్ని కలుసుకుందాం ఏదైతే అదిజరుగుతుంది.'' 
అనుకుంటూ ఏదో గుర్తు వచ్చినవాడిలా తనజేబులోంచి ఓ పాలితిన్‌ కవర్‌తీసి అందులోచి ఒక  బాల్‌ తీసుకున్నాడు. 
అది సామాన్యమైనది కాదు. కొన్ని వేలగుండుసూదులు సైనేడ్‌లో ముంచి అందులో నిక్షిప్తపరచబడిన బాల్‌. 
ఎలక్రోమ్యాగ్న్‌ మీద వర్క్‌చేస్తుంది. గుండుసూదులన్నీ టెన్షన్‌గల స్ప్రింగ్‌కి అమర్చబడి వున్నాయి.
స్ప్రింగ్‌ వదిలివేయబడితే ఆగుండు సూదులు 120 కిలోమీటర్లస్పీడుతో మనిషిశరీరంలోకి చొచ్చుకుపోతాయి. ఆ బంతిలోనే మరొక స్ప్రింగ్‌వుంది. 
అది ఎలక్ట్రో మాగ్న్‌ అధీనంలో వున్న ఒక చిన్న బ్లేడ్‌ దానిని నొక్కిపట్టి వుంచుతుంది. ఎలాక్ట్రోమ్యాగ్న్‌ ఫెయిల్‌ అయిన మరుక్షణమే ఈ స్ప్రింగ్‌ గుండుసూదులున్న స్ప్రింగ్‌ను వదిలివేసేలా చేస్తుంది. మొదటి స్ప్రింగ్‌ ఎలక్ట్రోమాగ్న్‌ చిప్‌ ఫెయిలయిన వెంటనే పెద్దశబ్దం చేస్తూ బాల్‌ని పగలగొడుతుంది. అదేనిముషంలో రెండవ స్ప్రింగ్‌ను కూడా గుండుసూదులు వదిలివేసేందుకు తోడ్పడుతుంది. రెండవ స్ప్రింగ్‌నుండి గుండుసూదులు నలుదిశలా వెదజిమ్మి అక్కడి మనుషుల ప్రాణాలు తేలిగ్గా తీసేందుకు దోహదపడుతుంది. ఇదంతా జరగానికి ఎలక్ట్రోమ్యాగ్నిజం ఫెయిల్‌ అయిన మరుక్షణం సెకనులో వెయ్యోవంతు కాలంలో ఏమీ మిగలదు. ఎన్నో వేల శవాలక్కడ లెక్కతేలతాయి. చేతిలోకి తీసుకున్న ఆబంతిమీది వాల్వ్‌ఓపెన్‌ చేశాడు. అక్కడున్న బటన్‌ ప్రెస్‌ చేశాడు. గోడవారగా కికీలోంచి లోపలికి జారవిడిచి  అక్కడనుండి బయటకు వస్తున్నాడు. ఒక లైట్ కింద  ఆగి అతని చేతివాచీలో టైం చూసుకొని గడియారం ముల్లుని తొమ్మిది గంటల నలభై అయిది నిముషాలమీదకు వెనక్కితిప్పాడు. అంతే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. గస్తీకాస్తున్న పోలీసులు, మిలటరీదళాలు ఆసుపత్రిని చుట్టుమ్టుారు. పేలుడుశబ్దానికి భయపడిన పేష్స్‌ంతాలూకు బంధువులు పరిగెత్తుతూ వచ్చారు. వాళ్ళతో పాటే సుధీర్‌కూడా పరిగెత్తుతూ వచ్చాడు. అలా వస్తున్న దారిలో చూశాడు. ఇతను చేసిన తప్పేంటో......అక్కడక్కడా వున్న సిసికెమెరాలను గమనించలేదు. తప్పకుండా ఇతను దొరికి పోయినట్లే.... అంతే మరేం ఆలోచించకుండా తన మెడలో వేలాడుతున్న పొాషియం సైనేడ్‌ న్లోపెట్టుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇతన్ని గమనించిన ఒకానొక పోలీసుకానిస్టేబుల్‌ అతని ప్రయత్నాన్ని అడ్డుకొని అరెస్ట్‌ చేశాడు. అతన్ని అక్కడినుండి జైల్‌కి తరలించారు.
(సశేషం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి