తృతీయాశ్వాసము
రాజకోశమున ధనమంతా కూడా భక్తలకు బసవేశ్వరుడిస్తున్నాడని ఇతర రాజోద్యోగులు చెప్పబగా బిజ్జలుడు మా ధనము మాకిమ్ము పరధనము నాసించుట తగదు-ఇంక నీ ప్రధానమంత్రి పదవి – భాండాగారాధిపతి పదవి విడిచిపెట్టుము అని ఆజ్ఞాపించాడు.
‘‘మీధనము మీకిచ్చితి. నాకేమీ అవసరంలేదు. దానిని
నేను ఆసింపను – నాకు అవసరంలేదు. అనవసరం. క్షీరాబ్దిలో క్రీడించు హంస సామాన్యమైన
పడియల నీరు త్రాగుతుందా? చంద్రుని వెన్నెల కిరణాలలోని అమృతము తాగు చకోరం చీకటి
తాగటానికిష్టపడుతుందా? మామిడి పండ్లను తినే చిలుక భూరుహఫలాలు తింటుందా? తామరలో
విహరించు తుమ్మెద బిబ్బిలి పూవులను చేరుతుందా? మీ ధనమునకు నేను చేయిచాపను. మీధనము
మీకిచ్చతిని’’ అన్నాడు బసవడు.
బిజ్జలుని
ధనము అతనికి చూపించి ‘‘ ఇందులో రవంత తక్కువైనా లేదు. ఏమీ తరగలేదు. అట్లు తరిగిన
నేను శివభక్తుడను కాను. పూర్వపు లెక్కలు చూసుకోండి. ఇదిగో తాళాలు’’ అని బిజ్జలుని
చేతికిచ్చాడు.
ధనమంతా
అలాగే వుంది. బిజ్జలుడు మారుమాట్లాడలేక చేసేదిలేక ఊరకుండిపోయాడు.
- నక్కలు గుఱ్ఱాలవ్వటం
శివభక్తుల
మహిమ అద్భుతము. పూర్వం మధురలో పాండ్యునిపై శత్రవులు దండెత్తగా చొక్కనైనారు తనవద్ద
గుఱ్ఱములు లేకపోవట చూచి నక్కలనన్నిటిని గుఱ్ఱాలుగా మార్చేశాడు.
ఇదివిని
బిజ్జలుడు.‘‘ ఇకముందు బసవనిపైనే కొండెములను చెప్పరాదు. అట్లు చెప్పినవారి నాలుకలు
కోయించి నోళ్ళలో సుక పోయింతును’’ అని కట్టడి చేశాడు. బసవేశ్వరుడు పూర్వరీతి
శివభక్తులకు కావలసిన ధనము వస్తువులను ఇస్తుండేవాడు.
- తన భార్య చీరెను భక్తునికిచ్చుట
ఒక
విటుడు వేశ్య ఇంటియందుండి ‘‘ బసవేశ్వరుని వద్దకి వచ్చి నిత్యము నిచ్చు పడినిదెమ్ము
’’ అని తన సేవకుని పంపాడు. అతడు వచ్చి బసవేశ్వరుని భార్యకట్టిన చీరె చాలా మనోహరంగా
వుందని ఆ సంగతి విటునికి చెప్పాడు. అతడు వచ్చి ఆ చీరెని తనకిమ్మని కోరాడు.
బసవేశ్వరడు వెంటనే దానిని విప్పి ఇచ్చేయమని భార్యని ఆజ్ఞాపించాడు. ఆమె అలానే
చేసింది. తన చీరవిప్పగానే ఆమె మొలన మరొక చీరెవుంది. అది విప్పగా దానిని విటుడు
తీసుకొన్నాడు. ఆమె విప్పినప్పుడెల్ల కొత్తచీరె వచ్చింది. అవి ఒక మోపడయ్యాయి.
వాటిని విటుడు తాను మోయగలిగిన చీరెలను తీసుకొని తన వేశ్యకిచ్చాడు.
పూర్వం
దేవరదాసయ్య అనే భక్తుడు పన్నెండేళ్ళు నేసిన చీరెను శివభక్తుడు కోరగా ఇచ్చాడు.
శివభక్తుల మహిమలకడ్డులేదు. మొన్నయ ధరుడను భక్తుడొకడు కోరిన ధనంకంటే
ఇమ్మడిగానిచ్చాడు. తన కూతురుకి పెండ్లికి సవరము కావలసి అడగిన మానకంజారుడు తన భార్య
జడను కోసి ఇచ్చాడు. అట్లనే బసవేశ్వరుని మహిమ వలన భార్యకట్టిన చీరెవిప్పినను అట్లే
వచ్చెను. శివభక్తుల మహిమ ఇలాగే వుంటాయనుటకు ఈ కథ ఉదాహరణ.
- ముగ్ధసంగయ్య కథ
బసవేశ్వరుని
సమకాలికుడైన ఇతడు శివభక్తిపరుడై వున్నాడు. ఒక నాడు తాను వేశ్య ఇంటికి వెళ్ళెదనని
అతనితో చెప్పాడు. అతడుకూడా వెళ్ళమని చెప్పాడు. అతడు వేశ్య ఇంటికిపోగా ఆమె
సాక్షాత్తు రద్రగణికలాగా కనిపించింది. ఆమె ముగ్ధసంగయకు పాదములు కడిగి భక్తితో
అర్చనలు చేసింది. అతని చక్కగా శృంగారింప చేసింది. అతనికి తెల్ల
రుద్రాక్షలనిచ్చంది. అతడాశ్చర్యపడి ఇదియేమి, తెల్లరుద్రాక్షలు జగత్తులో లేవే, ఇవి
ఎక్కడివి అని అడిగాడు.
ఆమె ‘‘
నేను పార్వతిదేవి చెలులలో ఒకదానిని. కనుక నాకు ఇవి లభించాయి. మమ్మల్ని
రుద్రగణికలంటారని ’’ చెప్పి అతని శివభక్త్యాంబుధిలో ఓలలాడించింది.
(సశేషం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి