అడుగులో అడుగేసుకుంటూ విశ్వనాధుడు తులసిని సమీపించాడు..
ఆమె మీద చెయ్యి వేయబోయేంతలో విశ్వనాధునికి మరో అనుమానం వచ్చింది..
‘‘ పట్టపగలు.. తనగది తలుపులు ఎన్నడూ మూసి వుంచిందే లేదు. అటువంటిది ఈ సమయంలో తన గది తలుపులు మూసి వుండటం చూస్తే, పైగా పరాయి స్త్రీ తన గదిలో వుండగా తలుపులు మూసివుంటే, అదీకాక ఆగదిలో తనుకూడా వుంటే ఇంకేమైనా వుందా.. ?’’ అని విశ్వనాధుని గుండెలు గుభిల్లుమన్నాయి.
మనసేమో ఆమెని తనివితీరా తాకాలని ఆరాటపడుతోంది.. రాబోయే పరిస్థితుల్ని మెదడు ఆలోచనల రూపంలో హెచ్చరిస్తోంది. ఇలాంటి పరిస్థితి విశ్వనాధునికి ఇంత వరకూ రాలేదు. ఎలా ఎదుర్కోవాలో కూడా తెలీటంలేదు.
ఒకవైపు రారమ్మని తులసి దేహం తనని ఆహ్వానిస్తున్నట్లుగా అనిపిస్తోంది. మరో వైపు బావా ఏంటీ పని అని ముకుందుడు నిలదీస్తే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలీనిస్థితి. ఇలా ఆలోచిస్తూనే విశ్వనాధుడు ఓరగా గదితలుపు తెరచి వీదివాకిలి వైపు చూశాడు. అక్కడ ముకుందుడు లేడు. విశ్వనాధ శాస్త్రికి గుండె ఆగినంత పనైంది. తులసి వైపు చూశాడు. అప్పటి వరకూ కిటికీ వైపు ఒత్తిగిలి పడుకున్న తులసి తలుపు వైపుకి తిరిగి పడుకుంది. తులసి తన చేష్టలను గమనించిందా.. గమనిస్తే తన మనసులో నేను చులకనైపోనూ అనుకున్నాడు. కానీ అంతలోనే విశ్వనాధునికి ధైర్యం వచ్చింది తులసి విషయంలో.. ఎందుకంటే ఆమె స్పృహలో లేనట్లుగానే మూలుగుతోంది. కనుక తులసి తనని గమనించలేదు. కానీ ముకుందుడి విషయంలోనే అనుమానంగా వుంది.
తను తలుపులు వేసినప్పుడు ముకుందుడు లోనికి వచ్చి తలుపులు లోపల గడియ పెట్టి వుండటాన్ని చూసి వెనుదిరిగి వెళ్ళిపోయాడా? అలా వెళ్ళిపోతే మనసులో తనగురించి ఏమనుకుంటాడు. ఇప్పటి వరకూ వాడి మనసులో నేనంటే గౌరవ భావం వుంది. అది కాస్తా ఈ ఒక్క చర్యతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లే.. అని కాసేపు తనలో తనే మల్లగుల్లాలు పడ్డాడు.
ఏదైతే అదైంది. ముకుందుడు ఎక్కడున్నాడో చూడాలి.. అనుకుంటీ వీధి వాకిలి వద్దకు వెళ్ళాడు. అక్కడ ముకుందుడు వేరే ఎవరితోనో మాట్లాడుతున్నాడు. అంతే విశ్వనాధశాస్త్రికి పోయిన ప్రాణం లేచివచ్చినట్లయింది.
హమ్మయ్య వీడు చూడలేదు. బుద్దొచ్చింది. మరెప్పుడూ ఇలాంటి పాడు పనులు చెయ్యకూడదు.. అని అనుకున్నాడు. అలా అనుకుంటూనే తన గదివైపు చూశాడు. ఈసారి తులసి స్థన్యాలూ మూడొంతులు బయటికి కనిపిస్తున్నాయి.
‘‘ ముకుందుడు కబురు చేస్తానంటూ ఇంట్లోనే వుంటే తన చేష్టలకి, చర్యలకీ చాలా ఇబ్బందిగా వుంటుంది. అందుకే ముకుందుడుని ముందు ఇంటి నుంచి కాసేపు పంపిస్తే చాలు..’’ అనుకున్నాడు.
‘‘ కానీ ఏం చెప్పి పంపించాలి?’’ అని ఆలోచించాడు.
కోరికతో వున్న విశ్వనాధుడి మెదడు పాదరసంలా వేగంగా పనిచెయ్యటం మొదలు పెట్టింది.
‘‘ ఆ.. ఆచారిగారిని వెంటపెట్టుకు తీసుకురమ్మని చెబితే.. వాడు ఆచారిగారింటికి వెళ్ళి ఆయన్ని వెంటబెట్టుకొని వచ్చే సమయం చాలు.. నా పని నేను చూసుకోవటానికి.’’ అని నిర్ణయించుకున్నాడు.
తనలాంటి వాడికిలాంటి ఆలోచనలు రావటమేంటో.. కేవలం తన కామవికారాన్ని తీర్చుకోవటం కోసం ఇన్నిపాట్లు పడాల్సి రావటం.. అంతా విశ్వనాధునికి విచిత్రంగా వుంది. అయినా సరే.. కామాగ్నిని చల్లార్చకపోతే తననే దహించేస్తుందేమో అని భయం కూడా పట్టుకుంది.
‘‘ ఏదయితే అదైంది.. ముందు వీడిని ఆచారిగారింటికి పంపించి.. వీధి తలుపులు వేసి అప్పుడు తులసిపట్ల తనకున్న కామవికారాన్ని అణచుకుంటే సరిపోతుంది.’’ అని నిర్ణయించుకొని వీధిలో వున్న ముకుందుడిని దగ్గరికి రమ్మని కేకవేశాడు.
బావగారు పిలిచేసరికి పరుగున ముకుందుడు దగ్గరికి వెళ్ళాడు.
ముకుందుడితో...
‘‘ ఆచారిగారికి కబురు చేశావా?’’ అన్నాడు.
‘‘ లేదు బావా.. అటువైపు వెళ్ళేవాళ్ళు ఇప్పటి వరకూ కనిపించలేదు. ఏం చెయ్యాలో అర్ధంకావట్లేదు.’’ అన్నాడు అదోలా మొహం పెట్టి.
‘‘ ఏం ఫర్వాలేదు. నువ్వే స్వయంగా వెళ్ళి ఆయన్ని వెంటబెట్టుకు తీసుకురా. ఆలస్యమైనా ఫర్వాలేదు. వెంటబెట్టుకొని రా..’’ అంటూ ప్రత్యేకంగా చెప్పాడు.
‘‘ బావగారు ఎప్పుడూ అలా ఆచారిగారిని వెంటబెట్టుకురమ్మని చెప్పడు. వెళ్ళి చెప్పిరమ్మనటమో, కబురు చెయ్యమని చెప్పటమో చేస్తాడు. ప్రత్యేకంగా వెంటబెట్టుకు రమ్మంటున్నాడేంటి? ఈ దేవదాసిపట్ల బావగారికింత ప్రత్యేక శ్రద్ధఏంటో ’’ అని ముకుందుడు మనసులో అనుకున్నాడు.
కానీ తన భావనని బయటపడనీకుండా ‘‘అలాగే బావా.. నేనే దగ్గరుండి ఆచారి గారిని తీసుకొస్తాను.’’ అంటూ వత్తి పలుకుతూ అక్కడి నుండి బయల్దేరాడు.
ముకుందుడు వీధి మలుపు తిరిగిందాకా అక్కడే వుండిపోయాడు విశ్వనాధుడు.
ఈలోగా తులసి తనలో...
‘‘ ఏవిటీ శాస్త్రిగారు ఏదో చేస్తాడనుకుంటే తననిలా వదిలేసి వెళ్ళిపోయాడు. అసలు ఏమైనా చేస్తాడా లేక చేసిన దానితో సరిపెట్టుకుటాడా.? ఇలా అయితే కష్టమే.. కష్టమేముందిలే.. ఇంతదూరం వచ్చినవాడు.. మరింత దూరం రాకుండా వుంటాడా? అలా రాకుండా వుంటే నేనెందుకు నా పనితనమెందుకు? అయినా శాస్త్రిగారు ఏం చేస్తున్నారో చూద్దాం..’’ అనుకుంటూ గది బయటికి రాబోయింది.
(సశేషం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి