కట్టరువుచోడిడి కథ
నారచోరుని కథ మరింతవిశిష్ఠమైనది. పట్టపుదేవి శివాగారములోని ధాన్యాన్ని భోజనమునకు వినియోగించినది అని తెలుసుకొని, ఆమె గర్భవతి అని కూడా కనికరం చూపక, కడుపులోని బిడ్డతో సహా ఆ పట్టుపురాణిని సంహరించటానికి ప్రయత్నించబోగా మేము ప్రత్యక్షమై వరము కోరుకోమని అడుగగా అతడు మోక్షమును కోరగా, వెంటనే మోహమును నీకిచెద్చదనని పలికి ఇప్పుడు నీ అభిమతమేమిటో తెలుపమని అడుగగా, పట్టపురాణి శివాగారములోని ధాన్యమును గూర్చి విచారింపక, కుటుంబ ఉపయోగమునకై వినియోగించుటచే శిక్షను అనుభవించినది. అనికాని ఆమెను ఆమె కడుపున పెరుగుచున్న బిడ్డను బ్రతికించవలసినది అని కాని కోరలేదు.
నీవు, వాడితో ఇక నాకు మరులు ఏమిటని ఊరుకోలేదు కదా! పిలవమంటే మళ్లీ పిలిచావు. ఇక్కడ నిమ్మవ్వ చూడు. నీ కొడుకును పిలువమ్మా వాడు తినకుండా నేనెట్లా తినేది అన్నా కూడా మరి ఆ ప్రసక్తి పెట్టుకోలేదు. ఆ కడుపు వ్యామోహం లెక్కపెట్టలేదు. ఇటువంటి భక్తులు ఎందరెందరో ఉండగా ఓ సిరియాళ! శెట్టీ నేనే శివ భక్తులందరిలోనూ శ్రేష్ఠుణ్ణి. నావంటి వాళ్లు ఇంకొకరు లేరు. ఎక్కడున్నారు? అనుకోవటం ఎంతవరకు సబబు? అంటూ భక్తవత్సలుడైన పరమశివుడు నిమ్మవ్య కొడుకును బ్రతికించాడు. కైలాసాన్ని ఆ బాలుడికి అనుగ్రహించాడు. జంగమలింగ అర్చనను దర్శించటం చతుర్విధ ఫలపుషార్థం సాధనం కన్నా ఉత్కృష్టమని నిమ్మవ్వ మాత్రం నేను కైలాసానికి రాను, ఇక్కడే ఉండిపోతానని స్థిర నిశ్చయురాలై ఉండిపోయినది.
కాబట్టి పుణ్యకార్యాలు చేసేప్పుడు గర్వము పనికిరాదు బసవయ్యా! నా తండ్రీ! అట్లా కాక అహంకరిస్తే ఆ భక్తి నిష్ఫలమే కదా! కొరగాకుండా పోతుందికదా అని మాచయ్య బసవేశ్వరునికి ప్రబోధించి, ఆ తర్వాత శివుడు చిరుతొండ నండి శివభక్తి తత్పరతదృష్టాంతాలు ఇంకా ఏఏ విధంగా బోధపర్చిందీ చెపుతున్నాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి