బ్యాడ్‌ టచ్‌! (ద్వితీయ బహుమతి పొందిన కథ)

 

బ్యాడ్టచ్‌!

- పాణ్యం దత్తశర్మ
సెల్ : 9550214912

            ‘‘అమ్మా, నేను ఇప్పట్నించి పక్కింటి అంకుల్దగ్గరికి ట్యూషన్కు వెళ్లను!’’ అంటూ తల్లికి చెప్పింది ఎనిమిదేళ్ల సౌరభ.

            ‘‘ట్యూబ్‌’లో తదేక దీక్షతోకార్తీక దీపంసీరియల్ను చూస్తూన్న నీరజ ఒక్కక్షణం తలెత్తిచూసి, ‘ఆగు! డిస్టర్స్చేయకు! నీ గోల ఎప్పుడూ ఉండేదేగా! చదువంటే ఎక్కడలేని పేచీలు వస్తాయి నీకు’’ అంటూ మళ్లీ సీరియల్పారవశ్యంలో మునిగిపోయిందా తల్లి.

            ‘‘అది కాదమ్మా,’’ అంటూ చిన్నారి ఏదో చెప్పబోతుంటే ఒక్క కసురు కసిరి  ‘‘టేబుల్మీద కార్న్ఫ్లేక్స్‌, చాకొలెట్మిల్క్పెట్టాను, వెళ్లి తిను" అన్నదామె.

            నిస్సహాయంగా తల్లివైపు చూసి, డైనింగ్టేబుల్వద్దక నడిచిందాపిల్ల. స్నాక్స్తిని, హాల్లో సోఫాలో స్మార్ట్ఫోన్చూసుకుంటున్న తండ్రి వద్దకు వెళ్లింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి భార్యను కించపరచే విధంగా, పాలక పక్షనాయకులు ఏదో అన్నారని, ఆయన భోరున మీడియా ముందు ఏడుస్తూ, తానింక అసెంబ్లీకి రానని అనగా తామలాంటి మాటలు అనలేదని, అదంతా దొంగ ఏడుపని ముఖ్యమంత్రిగారు చెప్పడం, దానిమీద రాజకీయ, సామాజిక విశ్లేషణ చర్చలు, టీవీ ఛానళ్లలో జరుగుతున్నాయి. అవి ఎంతో ఆసక్తిగా చూస్తున్నాడు పవన్సాయి. బాగా ఎంజాయ్చేస్తున్నాడు!

            వెళ్లి తండ్రిమీద వాలింది చిన్నారి. ఈయన తల్లికంటె కొంచెం నయం. కూతుర్ని దగ్గరికి తీసుకునిమా బుజ్జితల్లి సౌరూ ట్యూషన్అయిపోయిందా! స్నాక్స్ఏం తిన్నావు బంగారం? అంటూ లాలించాడు.

            ‘‘నేను మన పక్కింటి అంకుల్దగ్గరకు ట్యూషన్కు వెళ్లను" అన్నది అమ్మాయి. పిల్ల ముఖంలో ఒక ఉద్వేగం.

            ‘‘ఎందుకురా సౌరూ, రంగధామ్అకుల్సైన్సు, మ్యాత్స్‌, బాగా చెబుతాడని నీవేగా అన్నావు? మరి ఎందుకు వెళ్లనంటున్నావు? ఇచ్చినవర్క్సరిగా చేయలేదని తిట్టడం, కొట్టడం ఏమైనా చేశాడా ఆయన?’’

            ‘‘లేదు నాన్న!’’ పిల్ల ముఖంలో ఒక ఆందోళన!

            ‘‘మరి? ఇంటి పక్కనే ఇంత బాగా ట్యూషన్చెప్పేవారు దొరకరు రా. ఎక్కడి కోపం పటం, నిన్ను దిగబెట్టడం, మళ్లీ తీసుకుని రావడం, ఎంత కష్టం! అంకుల్చానా మంచివారు! చక్కగా చదువుకో బంగారూ!’’ అంటూ మళ్లీ ఫోన్లో తలదూర్చాడా పితృపాదుడు.

            సౌరు సెయింట్యాన్స్లో సెకెండ్స్టాండర్డ్చదువుతూంది. పెద్ద పెద్ద కళ్లు. ఒత్తైన బాబ్డ్హెయిర్‌, పాల బుగ్గలు, పింక్కలర్లో మెరిసిపోతూంటుంది. వయసుకు మించిన శరీర సౌష్టవం. ఇంకా విరియని మంచులో తడిసిన గులాబీ మొగ్గ!

            వాళ్ల పక్కింట్లోనే ఉంటాడు రంగధామ్‌! అతని భార్య కొన్నేళ్ల క్రిందటే చనిపోయింది. ఒకే కొడుకు. యు.ఎస్లో ఉంటాడు. రైల్వేస్లో అకౌంట్స్ఆఫీసరుగా పనిచేసిన ఆయన గత సంవత్సరమే వి.ఆర్‌. తీసుకున్నాడు. కాలక్షేపానికి, చుట్టు పక్కల ఐదారు మంది పిల్లలకి, అదీ ఆడపిల్లకు మాత్రమే, ట్యూషన్చెబుతాడు సాయంత్రాలు. పిల్లలను బాగా ముద్దు చేస్తాడని పేరు. పిల్లలకు ర్యాంకులు కూడ బాగా వస్తూండడంతో  పేంరేంట్స్కూడ హ్యాపీ!

            ఆరోజు ఆదివారం. టిఫిన్చేసి పక్కవీధిలో తెలిసిన వాళ్ల ది గృహప్రవేశమంటే వెళుతున్నారు పవన్‌, నీరజ. సౌరబ్తాను రానంది. టి.వి.లో కార్టూన్షోస్చూస్తానంది.

            ‘‘సరే, హాట్ప్యాక్లో పెసరట్టు ఉప్మా పెట్టాను కాసేపాగి రంగధామ్అంకుల్కు ఇచ్చిరా!’’ అన్నది నీరజ.

            ‘‘నేను వెళ్లను!’’ అన్నదాపిల్ల. ‘‘నేనూ వస్తాను మీతో!! అన్నది పైగా.

            ‘‘అదేమిటి? నీవు ఇప్పుడు రెడీ కావాలంటే టైం చాలదు. ప్రతిదానికీ మొండి చేయకు. అంకుల్కు టిఫిన్ఇచ్చేసి, తలుపు వేసుకుని జాగ్రత్తగా ఉండు. మధ్యాహ్నానికి వచ్చేస్తాం. వచ్చింతర్వాత ముగ్గురం లంచ్కు వెళదాం.’’ అన్నది తల్లి.

            మౌనంగా ఉండిపోయింది సౌరభ.

            టిఫిన్బాక్స్తీసుకుని, పక్కింటికి వెళ్లింది. రంగధామ్షార్ట్స్లో ఉన్నాడు. పైన షర్టు వేసుకోలేదు. పెద్ద బొజ్జ అసహ్యంగా కనపడుతూంది!

            ‘‘అంకుల్‌ ! గుడ్మార్నింగ్‌! అమ్మ మీకు టిఫిన్యిచ్చిరమ్మంది!’’ అంటూ ఆయన చేతికి బాక్స్ఇచ్చింది.

            ‘‘గుడ్అక్కడ పెట్టు" అన్నాడతను. అతని చూపులు అమ్మాయి శరీరాన్ని కామంతో తడుముతున్నాయి. ‘‘సౌరూ! దిసీజ్ఫర్యు!’’ అంటూ ఒక డైరీ మిల్క్ చాక్లెట్పెద్దది ఇచ్చాడు. ఇస్తూ దగ్గరకు లాక్కున్నాడు. ‘‘ఛబ్బీ చీక్స్నీవి!’’ అంటూ బొగ్గ కొరికాడు. పెదవులను వేలితో వ్రాస్తూ డ్రస్మీద పిల్ల వక్షం మీద తడుముతున్నాడు. తొడలు, పృష్టభాగం నొక్కుతున్నాడు. విదిలించుకోడానికి ప్రయత్నించింది. కుదరలేదు.

            ‘‘ఎవ్వరికీ చెప్పకు దిసీజ్ఫన్‌!’’ అంటూ పెదవులు కొరికాడు. సోఫామీదకు తోసి, అమ్మాయి పాంటీని క్రిందికి లాగాడు.

            ‘‘ప్లీజ్లీవ్మీ, అంకుల్‌! ’’ అన్న చిట్టి పాప అభ్యర్ధనలు పురుషవరాహం లెక్క చేయలేదు.

             ఇంటికి తిరిగి వచ్చారు తల్లీతండ్రి. తలుపు దగ్గరగా వేసి ఉంది. సోఫా మీద ఇంచుమించు స్పృహ లేకుండా పడి ఉంది పాప. జ్వరంతో ఒళ్లు కాలిపోతూ ఉంది. క్రింది పెదవి వాచి ఉంది. డ్రస్మీద మరకలు, ‘‘ప్లీజ్లీవ్మీ, అంకుల్‌!’’ అంటూ పలవరిస్తూంది. నీరజకు అర్థమయింది. రంగధామ్గాడు మన సౌరూ మీద అత్యాచారం చేశాడండీ!’’ అంటూ బావురుమందా తల్లి.’’ మధ్య వాడి దగ్గరకు వెళ్లనని చెబుతూనే ఉంది. మనమే పట్టించుకోలేదు.

            ‘‘వాడి అంతు చూస్తానీరోజు!’’ అంటూ పక్కింటికి పరిగెత్తాడు పవన్ యింటికి తాళం వేసి ఉంది. పరారీ అయ్యాడు పాపాత్ముడు!

            పరువు పోతుందనుకోకుండా పోలీస్కంప్లెయింట్యిచ్చారు. రంగధామ్మీద కేసు పెట్టారు. లాయరు గురుమూర్తిగారు వారి తరఫున వాదిస్తున్నారు. రంగధాం లాయరు కామేశ్వరరావు, ‘‘దుస్తుల మీదుగ శరీరాన్ని తాకినా, నొక్కినా, లైంగిక హింస క్రిందకు రాదని" వాదించాడు. గురుమూర్తిగారు ‘‘ఫాప్సోచట్టం ప్రకారం అది తప్పని, హైకోర్తు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసిందని వాదించారు.

            చివరకు ఎనిమిదేళ్ల సౌరభ కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం కీలకమయినది. ‘‘జడ్జీ అంకుల్‌, రంగధాం అంకుల్నన్ను...’’ అంటూ ఏడుస్తూ, జరిగినదంతా వివరించింది.’’ అంతేకాదంకుల్‌, మా స్కూల్బస్అటెండరు, మా డ్రిల్లు టీచరు, ఇలా చాలా మంది మా ఆడపిల్లలను ముట్టుకొని, నొక్కి సతాయిస్తుంటారు. బ్యాడ్టచ్లు మేం భరించలేం".

            జడ్జిగారి కళ్ళలో నీళ్లు! రంగధామ్కు కఠిన శిక్ష పడిరది. కోర్టులోనే అతన్ని తన్నడానికి కొందరు ప్రయత్నించారు. ధైర్యంగా లైంగిక హింసను బయట పెట్టినందుకు సౌరభను, ఆమె పేరెంట్స్ను అందరూ అభినందించారు!’’

12 కామెంట్‌లు:

  1. ఇటువంటి వాళ్లు పసి వాళ్ల ను
    బత క నివ్వడమ్ లే దు

    రిప్లయితొలగించండి
  2. ఇలాంటి వెధవల్ని ఏం చేసినా తప్పులేదు ఇతర దేశాల్లో చాలా చోట్ల భయంకరమైనటువంటి శిక్షలు ఉన్నాయి అలాంటి శిక్షలు ఇక్కడ కూడా వస్తే ఇలాంటి వాళ్ళ ఆట కట్టించినట్లుగా ఉంటుంది

    రిప్లయితొలగించండి
  3. బాణావత్ వసంతయామిని23 జులై, 2023 7:41 AMకి

    చిన్నపిల్లలనుంచి ఎముకలు తప్ప మరేమీ లేని ముసలి అవ్వలదాకా ఆడతనాన్ని వెతుకుతున్న ఇలాంటి వెధవలవల్ల దేశం యొక్క పరువు పోతుంది. ఇలాంటి వారు మరెవ్వరితోనూ అలా ప్రవర్తించకుండా వుండాలంటే వారి అంగాన్ని తొలగించటమే సరైన శిక్ష. దీనిపై గతంలో ఒక తీర్పు కూడా వెలువడింది. రేపిస్టులందరికీ, ముఖ్యంగా చిన్నారులపై లైంగికదాడులకు పాల్పడే వారికి వారి అంగాన్ని తొలగించటమే సరైన శిక్ష అని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
  4. This is a story for every parent to read and understand the cruelty of outside world.please don’t trust leaving your child with anyone blindly .Always be attentive when children try to express their discomfort to be around certain people .

    రిప్లయితొలగించండి
  5. పిల్లలు ఏదైనా చెప్పబోతే నింపాదిగా తలిదండ్రులు వినాలి.తమంతట తామే అప్పుడప్పుడూ స్కూలు విషయాలు అడిగి తెలుసు కోవాలి.అపుడే కొంతవరకూ child abuse ని అరికట్టగలం.
    మంచి పాయింట్ తీసుకొని కథ రాసిన పాణ్యం దత్త శర్మ గారు అభినందనీయులు్.

    రిప్లయితొలగించండి
  6. రంగధామ్ వంటి గోముఖ వ్యాఘ్రాలుసంఘలోప్రతిచోట ఉంటారుతల్లిదండ్రులుపిల్లలనుపట్టించుకోకుండాతమతమవ్యాపకాలనుండిబాహ్యప్రపంచంలోనికివచ్చిపరిస్థితులనుఅవగాహనచేసుకొనితమపిల్లలుఏమిచెప్పబోవుచున్నారోకూడతెల్సుకోవాలి.ప్రస్తుతంసమాజానికిపట్టినరంగధామ్ లాంటిదుర్మార్గులనుండిపిల్లలనురక్షించుకోవాలి.లేనట్లైతేపిల్లలజీవితాలునాశనమౌతాయి.రచయితశ్రీపాణ్యందత్తశర్మగారుసమాజహితాన్నికాంక్షిస్తూసమాజంలోజరిగేఅకృత్యాలనువివరిస్తూతస్మాత్ జాగ్రత అనిహెచ్ఛరిస్తూ వ్రాసినతెలుగురైటర్సుఅడ్డా:బ్యాడ్ టచ్! చాలా చక్కగావివరించారు.ఇలాంటివిసామాజికదృక్పథంతోవ్రాయాలనికోరుచున్నాను.

    రిప్లయితొలగించండి
  7. పిల్లలను కంటే చాలదు.వాళ్ళ అవసరాలను గమనించుకొనడం చాతకాని తల్లిదండ్రులకు కూడా శిక్ష పడాలి

    రిప్లయితొలగించండి
  8. మీ కథ బాగుంది సార్.నిత్యం జరుగుతున్నదే..పిల్లల ను కనడం మాత్రమే కాకుండా జగ్రత్త గా చూడాలి.

    రిప్లయితొలగించండి
  9. బ్యాడ్ టచ్ అనే కథ కథ అనడానికి వీలు లేనట్టుగా ఉన్నది ఇది నిజంగా జరుగుతున్న సంఘటనే. ఆంటీ మేక వన్నె పులులు టీచర్ రూపంలోనే కాదు,చాలా రూపాలలో ఉంటారు ఇతివృంతని తీస్కొని ఎంతో సునితంగ కథ అల్లడం ఈ రచిత కే సాధ్యం అయింది ఇక్కడ అమలినత చూపించకుండా సూటిగా విషయాని సాధారణ పాఠకుణ్ణి కి చెరవేయగలగడం ఒక్క గొప్ప ప్రక్రియ ఈ రచియట ఆ విషయం లో కృతకృతియల అసియరు తల్లి తండ్రులకు కనువిప్పు కల్గించే ఈ కథ సామాజిక స్ప్రుకలిగినది. రచయిత చక్కటి ప్రయత్నం చేశారు కథ చెప్పడంలో ఉపయోగించిన శైలి చాలా సున్నితంగా ఉంది. —KSR Sastry.

    రిప్లయితొలగించండి
  10. అసలు అఘాయిత్యాలే తప్పనుకుంటే,విరిసీవిరియని మొగ్గల మీద కూడా చండాలమైన ప్రవర్తన. ఉన్నారు సమాజంలో ఇలాంటి వాళ్లు. వాళ్లని బయటికి లాగితేనే పరుగు పోతుంది నోరుమూసుకుంటారు అప్పుడు

    రిప్లయితొలగించండి
  11. సమాజాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న Child Abuse ని అంశంగా తీసుకుని పాణ్యం దత్త శర్మ గారు వ్రాసిన కథ బ్యాడ్ టచ్ ’ తల్లిదండ్రుల్లో ఆ విషయంలో ఎవేర్ నెస్ కలిగించేదిలా వుంది.వయసు తో సంబంధం లేకుండా తోడేళ్ళు మన పక్కనే పొంచివుంటాయి. పిల్లలను తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకోవాలంటే పిల్లల్ని వినాలి,వారితో సమయం గడపాలి.

    కఠినమైన శిక్షలు కఠినంగా అమలుపరిస్తేనే వినటానికే అసహ్యంగా వున్న ఈ దుష్కృతాలను అరికట్టగలం.
    తల్లిదండ్రుల భాద్యతలను గుర్తు చేసిన కథ.
    రచయిత అభినందనీయులు.

    రిప్లయితొలగించండి
  12. సామాజిక స్పృహ వున్న కథకు బహుమతి అందుకున్నారు. హృదయ పూర్వక అభినందనలు సార్ !

    రిప్లయితొలగించండి