నాన్న బంగారు
- సరోజ .జి
‘‘ మా నాన్న బంగారు ! ఇది మీ అమ్మ ముద్ద ’’ తండ్రి నోటి దగ్గరకు తెచ్చాడు భరత్.
తల అడ్డంగా తిప్పి, ముఖం పక్కకి తిప్పుకున్నాడు తండ్రి మూర్తి గారు.
‘‘ఇది మా అమ్మ ముద్ద .’’ రెస్పాన్స్ లేదు.
‘‘ ఇది నా ముద్ద ’’ క్షణం ఆలోచించి తల అడ్డంగా తిప్పాడు మూర్తి.
‘‘ మీ బంగారు కొండ ముద్ద’’
‘‘ నాబంగారం నామాటవిననప్పుడు, నేనెందుకు తినాలి.’’ మొండిగా అన్నాడు మూర్తి.
‘‘ అసలు మీరు నా అమ్మ, !’’
‘‘ అదేమిటి అంత మాట అనేసావు’’ అంది తల్లి అన్నపూర్ణ.
‘‘ మరి, మీ స్టేజ్ లో వుండే అమ్మ, నాన్నలు అందరూ, ఎదిగిన కొడుకు తమ దగ్గరే.వుండాలని కోరుకుంటారు. మరి,మీరు.. మీ నాన్న అదో టైప్. ఆయన రూట్ సపరేట్. ఫైనల్ గా చెప్పు, నా మాట వింటావ, లేదా ! ’’
‘‘ వినకచస్తానా’’ , అయిష్టంగా అన్నాడు.
‘‘ ఇప్పుడు పెట్టు ముద్ద.’’
ముద్ద నోట్లో పెడుతూ ‘‘ఇలా రోజు మీ నోట్లో ముద్ద పెట్ట లేను, మీ చేతిముద్ద తినలేను’’ బాధ గా అన్నాడు భరత్.
‘‘తెల్లారి కండ్లు తెరవగానే మీ ముఖం చూడకుండా, నాకు తెల్ల వారదు నాన్న!’’
‘‘ డోంట్ బి సెంటిమెంటెల్ .. వాట్స్ అప్ వుందిగా గుడ్ మానింగ్, గుడ్ నైట్, ఇక్ వీడియో చూస్తూ ఇద్దరం తిందాములే. ఇక్కడ గ్రోత్ లేదు బంగారు, నేను మానాన్నల, నువు నా లాగ మావి చాలి, చాలని డుప్పట్లో ముడుచుకుని పడుకునే జీవితాలు. నువు గొప్పవాడు కావాలి. నా కొడుకు పెద్ద కంపనీ సి ఇ ఓ కావాలి. నీ గొడుగు లో పది మందికి నీడ ఇవ్వాలి. ఇప్పుడే చెబుతున్న అయిదు సంవత్సరాల తర్వాత మనం కూడా అమెరికా లో వుందాం.’’
...
హాల్లో బంగారు !ఎలా వున్నావు అమ్మను అన్నం తిననిస్తున్నవా, పస్తులతో మాడుస్తున్నవా! ఏదో మాట్లాడు నోరు తెరిచాడు మూర్తి గారు. మళ్ళీ తనే కంటిన్యూ చేసాడు భరత్.
మరి తమరు అలిగి తినడం మానేస్తే, తను పస్తు వుంటుంది కదా అమ్మ. పతిభక్తి. మాకు వుంది పత్ని భక్తి ఈ మధ్య మీ అమ్మకు మోకాళ్ళ నొప్పి, పాదాలకు అనెలు, అరికాళ్ళ మంటలు వరించాయి.మోకాళ్ళ లో గుజ్జు అరిగిపోయాయ్ ,ఆపరేషన్ చెయ్యాలి అంటున్నారు డాక్టర్లు. అమ్మో ఆపరేషన్ వద్దు అంటుంది మీ అమ్మ. అందుకే కేరళ ఆయుర్వేదం ట్రీట్మెంట్ లో భాగంగా మోకాళ్ళకు ఆయిల్ మర్దన సేవ పూర్తి చేసి. పాదాలకు మర్దన కు సిద్ధం గా వున్నాను ... ఇటువంటి పత్ని సేవ రాగం అందుకున్నాడు మూర్తి.
మీరు గ్రేట్ బంగారు ! ప్రతిది లైట్ గా చిరునవ్వు తో ఆహ్వానిస్తారు, అక్సెప్ట్ చేస్తారు.
జరిగేవన్ని మంచి కే అని అనుకోవటం మనిషి పని మళ్ళీ రాగం అందుకున్నాడు.
మీ గాత్ర కచేరీ వినే టైం నాకు లేదు, మరి అమ్మ ఇంటి పనులు..
ఎం నేను లేను, నా చేతి వంట మీ అమ్మ నోటికి అందిస్తున్నాను.
అబ్బా బంగారు! మంచి కార్పొరేట్ సీనియర్ సిటిజెన్ హోం లో చేర్పిస్తాను.
వద్దురా బంగారు! ఈ ఇల్లు నా సెంటిమెంట్.
నా మాట ఎప్పుడు విన్నారు కనుక, మీకో గుడ్ న్యూస్ నేను సీఈఓ లిస్ట్ లో వున్నాను. ఆర్నెల్లు కష్టపడి నా టాలెంట్ చూపితే, సీఈఓ అవుతాను. బంగారు! ఓ ఆర్నెల్లు మీ కాల్ నేను రిసీవ్ చేసుకోక పోయినా ఏమీ అనుకోవద్దు. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చెయ్యద్దు కట్ చేశాడు భరత్.
మూర్తి గారి చెవుల్లో డిస్టర్బ్ చెచెయ్యద్దు మాట రిపీట్ అవుతున్నది.
....
అమ్మా! నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నది. ఛార్జింగ్ లేదా ! బంగారు గొంతు విని ఆర్నెల్లు అవుతున్నది. పిలు. మౌనంగా వుంది అన్నపూర్ణమ్మ
రెట్టించాడు భరత్
ఆయన ఫ్రెండ్ కి ఆరోగ్యం బాగాలేక పోతే...
సరే ! నేను ఇండియా వచ్చేసాను ఇంకో గంటలో ఇంటికి వచ్చేస్తాను. బంగారం చేతి ముద్ద తినాలి.
అదేమిటి చెప్పకుండా!
సర్ప్రైజ్ చేద్దామని కట్ చేసాడు.
బంగారు బంగారు వచ్చేశాడు భరత్.
తను వచ్చేటప్పటికి కాస్త ఆలస్యం అవుతుంది, నా బదులు ఈ రోజు నీ చేత్తో తిని పించు అన్నాడు
స్నానం చేసిరా. !
కోసిరి, కోసిరి తిని పించింది.
అసలు నేను వచ్చినట్టు నాన్నకి చెప్పవా
భో రున ఏడ్చింది
కంగారు పడ్డారు భరత్
లోనికి వెళ్లి ఆస్తిక ముంత తెచ్చి కొడుకు చేతికి అందించింది
ఏమీ అర్దం కానట్టు చూసాడు
ఇంత జరిగితే నాకు ఎందుకు ఫోన్ చెయ్యలేదు
నిన్ను డిస్టర్బ్ చెయ్యటం ఆయనకుఇష్టం లేక, నువు ఈ మాట ఎప్పటికయినా అంటావు అన్న ఉద్దేశం రికార్డ్ చేశాను విను.
....
మూర్తిగా రికి టాబ్లెట్ ఇచ్చి ..
అబ్బాయికి ఫోన్ చెయ్యండి
తల అడ్డంగా తిప్పాడు
ఇప్పుడు కూడా చెయ్యక పోతే ఎలాగండి. మీ ఆరోగ్యము సరిగా లేదు. రేపు జరగరానిది ఏమన్నా జరిగితే, నాకెందుకు ఫోనేచేయ్యలేదు అని వాడు నిష్టూరంగా మాట్లాడితే..
వాడు వచ్చి ఎం చేస్తా డే! నా తలకు కొరివి పెడతాడు. బూడిద గాల్లో కలిసి పోతుంది. దాంతో పాటు వాడి భవిష్యత్తు కూడా. ఇంకో నెలలో సీఈఓ అవుతాడు.ఊహూ లెక్క చెయ్యకుండా వున్నపళంగా వచ్చేస్తాడు. అది కాదు నాకు కావలసింది. వాడి బంగారు తల మీద కిరీటం వుండాలి. దాని నీడలో పది మంది ఆశ్రయం పొందాలి. వాడ్ని డిస్టర్బ్ చెయ్యను.
తండ్రి రూపం కంటి ముందు దృష్ట్యా మయింది. కన్నీళ్లు తుడుస్తూ బంగారు అంటూ ముద్దు పెట్టుకున్నట్టు అనిపించింది. బోరు మన్నాడు భరత్ .....
అయిపోయింది
Nice story.
రిప్లయితొలగించండిమూర్తి గారి చెవుల్లో ‘ డిస్టర్బ్ చెయ్యొద్దు ’ అన్న కొడుకు మాట చివరి వరకూ మిగిలిపోయింది. తను చనిపోయినా భరత్ కు విషయం తెలియనీయలేదు. కొడుకు సి ఇ ఓ అయ్యి పదిమందికి ఆశ్రయం కల్పించాలన్న ఆశయంతో చనిపోయిన తండ్రిని తలచుకుని విలపిస్తాడు భరత్.
రిప్లయితొలగించండినిజంగా హృదయం బరువెక్కి పోయింది కథ ముగింపు చదివితే. కళ్ళు తడి అయ్యి అక్షరాలు అలుక్కుపోయాయి.
రచయిత్రి సరోజ గారికి ప్రత్యేక అభినందనలు.