బాపూరి బ్రహ్మయ్య కథ
బాపూరి బ్రహ్మయ్యగారు గొప్ప శివభక్తులు. వారు తెలతెలవారుచుండగా నిద్రనుంచి మేల్కొని రకరకముల పుష్పములను కోసి సొగసుగా కట్టి భక్తులకు ఇచ్చెడివాడు. ఇట్లు కష్టపడి సముపార్జనచేసిన ద్రవ్యమును పరమేశ్వరుని ఆరాధించుటకు ఉపయోగించెడి వాడు. ఒకనొకరోజున పరమేశ్వరునిచే వారు పరీక్షించబడిరి.
అపుడు వారు తన సమస్తభారమును శివునిపై ఉంచి రాతినందిచే గ్రాసాన్ని పులగాన్ని కూడా తినిపించితిరి. మరొకసారి ఇంకొక మహత్మ్యాన్ని కూడా చూపించితిరి. ఆ గ్రామ జనులందరూ చూచుచున్న సమయమున జొన్నలను లింగాకారంగా ప్రతిష్టించిరి. వీరు బాపూరు అను గ్రామమున కాలమును గడుపుచున్న రోజులలో ఒక సంఘటన జరిగినది.
ఒకరాజుగారు పరరాజులను జయించే దండయాత్రలో భాగంగా బాపూరి గ్రామునకు తూర్పున ఉన్న పువ్వులతోట దగ్గర విడిది చేసిరి. అపుడు వారి సేనలోని మదగజము తప్పించుకొని ఆ గ్రామముపై పడెను. అపుడు గ్రామప్రజలు భయపడిపోయి.అప్పుడు బ్రహ్మయ్యగారు హో!హో! అను శబ్దముతో ఆ యేనుగును అదల్చుటచే కదలక నిలుచుండిపోయెను. ఆ సన్నివేశమును చూసిన రాజభటులు గడగడ వణుకుచూ కంఠగాద్గత్యముతో ఓ మహారాజా! మదగజము కట్టునుంచి విడిపించుకొని వేగముగా పరుగులు తీయుచుండగా ఒక మహాభక్తుడు ఈ పల్లెనుంచి పూలను కోసుకొని వచ్చుచుండగా ఆ ఏనుగుకు ఎదురుగా వచ్చుచుండెను. ఆయనను చూసిన గజమునకు మరింత మదమెక్కి మహోద్రేకములో ఆయనను మట్టుపెట్టాలని మీదకురికెను. ఆయన కదలకుండా చేయెత్తి అదుపుగా పో!పో! నిలువవా ఏమి? భీకర గద్గదస్వరములో భయపెట్టెను. ఇట్లు ఆయన శాసించగా భీతిల్లిన ఆ యేనుగు నదీతీరంలోనికి వడివడిగా వెళ్లి నదిలోపడి ప్రాణములను వదిలెను. అని చెప్పగా అప్పుడారాజు అయ్యయ్యో! ఎంతపని జరిగినదని ఆ మహాభక్తుని ఈ పాడు ఏనుగు ఎంత అవస్థకు గురిచేసినదో అని పరితపిస్తూ వెంటనే వచ్చి ఆ మహాత్ముని పాదములపై వ్రాలెను ఆ రాజు. తను ఎందుకొరకు ఆ ప్రాంతమునకు వచ్చెనో పూర్తిగా వివరించెను. అప్పుడు బ్రహ్మయ్య ఆ రాజును చేతితో పైకిలేపి ఓ మహారాజా! నీవు ప్రభువునకు సంబంధించిన గజము అదే విధము పరివారము కూడా గౌరవించుటకు అర్హమైనది. ఇందు కారణంగా నేను ఆ ఏనుగును నీ పరివారమును బ్రతికించెదనని చెప్పి బ్రతికించెను.
బ్రహ్మయ్యగారు పరమేశ్వరుని యెడల ఉన్న భక్తిచే సర్వులను రక్షించవలెను అనెడి కాంక్ష మిక్కిలి ఉన్నట్లు భావించవచ్చును. ఈ అంశము ద్వారా భక్తిభావము సామాజికులకు సహకారముగా ఉండుటకు తగినది అని నిరూపించబడినది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి