కబీరు దోహాలు (మధురకవి మంగళాశీస్సులు)

ఇయ్యవి మధురు కవి బిరుదాంచితులు శ్రీ మతుకుమల్లి పార్ధసారధి రావు మహోదయుల కరుణా కటాక్షలబ్ద కవిత్వ సిద్ధులును, భానూదయ లేఖినీ నామ విభ్రాజితులును శ్రీ గాయత్రీ విద్యామందిర్ పట్టాభిపురం, గుంటూరు ప్రధానోపాధ్యాయులును, బోధకాచార్యులు, దృశ్య నాటక నిర్మాణ, దర్శకత్వ, నిర్వహణాదక్షులును, పురాతన నాణెముల సేకరణ యందత్యంత అభిరుచి కలవారును, సరసకవియు నయిన శ్రీ మునిపల్లె వంశపయుక్ష్మ పారావార రాకా సుధాకరులు బ్రహ్మశ్రీ శ్రీరామమూర్తి, హనుమతీదేవిల ద్వితీయ పుత్రరత్నమునయిన శ్రీ సూర్యనారాయణ(బి.కామ్) గారి అమృత లేఖిని నుండి జాలువారిన కవితా సుధాబిందువులు, శ్రద్ధాళువులయిన పాఠక మహాశయుల పాలిటి స్వర్లోక పారిజాతము. సాహితీ బంధువులకు సాహిత్య లోకానికి అత్యంత భక్తి భావముతో వారు ప్రసాదించిన అమూల్యమయిన కానుక. తెలుగు భారతికి వారు కైసేసిన నవ్య గళాభరణములు ఇందు ప్రముఖ రామభక్తులు,ఆధ్యాత్మిక విద్యానిధులు, యోగివరేణ్యులు, తత్త్వికులు అయిన కబీరుదాసు హిందీలో పలికిన దోహాలకు అత్యంత సన్నిహితము, మూలము చెడని అందమయిన పదాలతో కర్ణపేయము సులభగ్రాహ్యమునైన శైలిలో పామర జనులకు కూడా స్వయంగా చదివి అవగాహన చేసికొనగల తీయ తేనియలొలుకు తెలుగు పద్యముల (అనువాదము) లిఖిత గ్రంధము. 

శుభం భుయాత్, సర్వేజనా స్సుఖినో భవంతు

హరిః ఓం తత్ సత్


మంగళాశీస్సులతో

మధురకవి

దుద్దేల పుల్లయ్య

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి