జగతికి వెలుగు' అమ్మ'
డా. బండారి సుజాత
సెల్ : 9959771228
"అవునా !చాలా సంతోషం పాపం వాళ్ళు ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్నారుకదా! అవును పెళ్లయి ఏడు ,ఎనమిది సంవత్సరాలయింది కదా!" అన్నాడు సూర్యం .
"ఆ అవును పాపం సీతక్కకొడుకుకు సంతానం కొరకు మొక్కని దేవుడు లేడు ,చేయని పూజ లేదు ,తిరగని డాక్టర్ లేడు వాళ్ళిద్దరిని పట్టుకని చేయాల్సిసవెన్నెన్నో చేసింది. ఇన్ని సంవత్సరాలకు వాళ్ళ ఇంట్లో చిన్ని పాప వచ్చింది " అన్నది సంతోషంగా సుమిత్ర .
సుమిత్ర అక్క కొడుకుకు పాప పుట్టడంతో అందరికి చెప్పి సంతోషాన్ని పంచుకొంటున్నది సుమిత్ర.
"అబ్బో !అక్క కంటే నీకే ఎక్కువ సంబరం ఉన్నట్టున్నది" అన్నాడు సూర్యం.
"భలేవారే !చిన్న పిల్లలున్న ఇల్లే అందాల పొదరిల్లు పిల్లలు లేకుంటే ఆ ఇంట్లో సందడేది" అన్నది సుమిత్ర .
"అంతేకాదు ,మన ఎదురింటి లక్ష్మమ్మ చిన్న కొడుకుకు కూడా కొడుకు పుట్టాడు" అన్నది సుమిత్ర.
"ఇవాళ అన్ని ఇవే ముచ్చట్లు చెప్తావా ? తినడానికా ఏమన్నా పూట్టేదివుందా" అన్నాడు సూర్యం.
"మరి నాకు ఇంకేం పనివుంది అలా అలవాటయిపోయింది. ఎవరింట్లో పసివాళ్ళుపుట్టగానే నాకే చెప్తారు కదా! అది మీకు తెలుసు" అన్నది సుమిత్ర.
మీరు త్వరగా కాల్లు కడుక్కుని రండి వడ్డిస్తానంటూ వంటింట్లోకి వెళ్ళింది సుమిత్ర.
సుమిత్ర ,సూర్యం లకు ఇద్దరు కొడుకులు . వాళ్ళ చదువులు ,పెళ్ళిళ్ళు పిల్లలతో ఇల్లు సందడికి మారు పేరుగా ఉండేది. కొడుకులు ఉద్యోగాలంటూ, దూరంగా వెళ్ళిపోవడంతో ఇంట్లో మిగిలింది మళ్లీ ఇద్దరే.
పెద్ద కొడుకుకు ఒక కూతురు, ఒక కొడుకు , ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.కోడలుకూడా ఉద్యోగం చేస్తోంది. చింతలేని కుటుంబం . ఈ మధ్యనే ఇల్లుకూడా కట్టుకున్నారు.పెద్దకొడుకు ఒకరిని అడగడు ,ఎవరికి పెట్టడు .పిల్లలతో హాయిగా జీవించే ఆధునిక కుటుంబం.
రెండో కొడుకుకు ఒక బాబు వాళ్ళిద్దరు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. రెండో కొడుకు, కోడలు గుర్తు రాగానే బాబు పుట్టినప్పటి సంగతులు జ్ఞాపకం వచ్చాయి సుమిత్రకు.
బంగారం లాంటి బాబు పుట్టాడని అందరూ సంతోషించారు. "అసలు ఇప్పుడు మాకు పిల్లలే వద్దనుకున్నా కాని ఇతను వినలేదు" అన్నది రాధిక .
అవేం మాటలమ్మా! పండంటి బాబుకు జన్మనిచ్చావు. సంతానం లేకుంటే ఎంత బాధ నీకు అర్థం కావడంలేదు" అన్నది సుమిత్ర .
రాధిక తల్లికూడా "తొమ్మిదినెలలు మోసి కన్నావు. అలాంటి మాటలు మాట్లాడొద్దని "చెప్పింది.
"అయినా బాబంటే నాకు ఇష్టం లేదు .కావాలంటే మీరే పెంచుకోండి ."అన్నది కోడలు రాధిక.
"తల్లి గర్భం నుండి భూమి మీదకు వచ్చి కేరు ,కేరు మని ఏడ్చే పిల్లలకు అమ్మపాలే అమృతమమ్మా , తప్పకుండా బాబుకు నీపాలు పట్టాలన్నది". డాక్టర్ లావణ్య.
"శిశువు శారీరకంగా మానసికంగా పెరగాలంటే తల్లిపాలే శ్రేష్టమని తేల్చి చెప్పింది "డాక్టర్ .
"చూడమ్మా సృష్టిలోని ప్రతి జీవిలో మాతృత్వం దాగి ఉంటుందనే విషయం తెలియని వారెవ్వరు .ఒకసారి నీ బాబుకు పాలచ్చి చూడు అష్టైశ్వర్యాలు కూడా పనికిరావు" అన్నది డాక్టర్ లావణ్య .
"చూడు రాధికా నువ్వు డెలివరీ అయిన రోజే సమత అనే అమ్మాయి కి ఆబార్షన్ చేశాను . ఎందుకో తెలుసా ?లోపల పాప ఎదగ లేదుకనుక ఆ అమ్మాయి బోరున ఏడుస్తోంది పాప కొరకు. నువ్వు పుట్టిన బిడ్డకు పాలివ్వనంటున్నావన్నది డాక్టర్ లావణ్య.
లావణ్య ,సుమిత్రకు ఫ్యామిలీ డాక్టర్. అంతేకాదు సుమిత్ర చెల్లెలు కూతురు కనుక అనేక విధాలుగా నచ్చచెప్పుతూనే ఉంది .రాధిక పై ఎక్కువ వత్తిడి తెస్తే మానసికంగా
అనారోగ్యానికి గురవుతోందని వదిలేసింది" లావణ్య .
బాబు ఏడ్చినప్పుడు డబ్బా పాలు పడుతున్న పెద్దవాళ్ళిద్దరి కళ్ళు నీళ్లతో నిండిపోతున్నాయి.
ఇక సుధీర్ ఆమె చెప్పినట్లే వింటే అయిపోయేది. పసిప్రాణాన్ని బాధపెడుతున్నానని బాధపడుతున్నాడు .
"చూడమ్మా రాధిక కోడి ఇరవైఒక్క రోజులు పొదిగి పిల్లలు రాగానే తన రెక్కల కింద బధ్రంగా దాచుకుంటుంది. దగ్గరకు ఎవరొచ్చినా పొడుస్తుందని నీకు తెలుసు. ప్రతి జీవికి పిల్లలపై మమకారం అలాంటిది " అన్నది సుమిత్ర .
"ఆవులు గేదెలు బిడ్డ పుట్టగానే ప్రేమతో తమ నాలుకతో నాకుతూ వాటికి దగ్గరవుతాయి. పశుపక్ష్యాదులలోని ప్రేమ నువ్వు చూడనిది కాదు. కనీసం బాబుని దగ్గర తీసుకోమ్మా ! నేనే పెంచుకంటాను పసివాడు కదా!" అన్నది సుమిత్ర .
"నీకిదేం ఆలోచనే కుక్కలు, పిల్లులు క్షీరదాలన్నింటిగురించి చదువుకున్నావు కదా! ఇంక నువ్వు టీచర్ వే కదా! పిల్లులు తమ పిల్లలనుఏడు ఇండ్లలో తిప్పుతూ కాపాడుకుంటాయి. కుక్క ,పిల్లల దగ్గరకు ఎవరినీ
రానీయకుండా పిల్లలను కాపాడుకుంటుంది. అంతే కాదు ,నేను నీకుపాలివ్వకుంటె నువ్వు ఎక్కడ ఉండేదానివన్నది "రాధిక తల్లి జయమ్మ .
"అందరు చెప్పే మాటలే కాక పిల్లలకు పాలిస్తే ,పిల్లల ఆరోగ్యం ఎలా ఉంటుందో, ఇవ్వకుంటే ఎలా ఉంటుందో గూగుల్లో చూపి నచ్చజెప్పడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు "రాధిక భర్త సుధీర్ .
బాబు పుట్టి రెండు రోజులైంది గుక్క పట్టి ఏడుస్తున్నాడు . అందులోబాబుకు 'పసకలు' కూడా కావడంతో బాక్స్ లో పెట్టి ఉంచారు.
సుమిత్ర ,జయమ్మ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆవు ఎక్కడఉందని తెలిసుకొని ఆవుపాలను తెప్పించి బాబుకు తాగిస్తున్నారు పెద్దవాళ్ళు.
"చూడు రాధికా నీకు ఇంకోసారి చెప్తున్నా నువ్వేం చిన్నపిల్లవు కాదు, చదువుకున్న దానివి పిల్లలకు పాలిస్తే అందమేమి చెడిపోదు "అన్నది లావణ్య.
"ప్రసవానంతరం పాలు లేత పసుపు రంగులో చిక్కగా ఉంటాయి .వీటి లోనే పిల్లలకు కావాల్సిన ముఖ్యమైన పోషకాలుంటాయి.ఇవి పిల్లలకు పట్టడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి అంటువ్యాధులు రాకుండా కాపాడతాయి వీటినే 'ముర్రుపాలు' అని అంటారు.ఇవి పిల్లలకు తప్పనిసరిగా తాగించాలన్నది లావణ్య .
అంతేకాదు ,"బిడ్డకు పాలివ్వడం వలన పెరిగిన బరువు తగ్గుతుంది .గర్బసంచి యధాస్థానానికి వస్తుంది. క్యాన్సర్ ప్రమాదం నుండి రక్షిస్తుంది. రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ.అంతే కాదు బిడ్డకు పాలిస్తే 'ఐదువందల 'నుండి 'ఏడువందల ' కేలరీలు కూడా ఖర్చు అవుతాయి. నీ అందం ఇంకా రెట్టింపవుతుంది తెలుసా?బాలింతమోము బంగారు బొమ్మలా మెరిసిపోతోంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం మోములో కలకలలాడుతుందన్నది " లావణ్య.
"ఏమండీ ! మన హిమాన్షికి పాపపుట్టిందట"అన్నది సుమిత్ర భర్త సూర్యం తో
"బాబు పుట్టి ఇప్పటికి మూడు రోజులు .పాలు పడలేదనుకుంట. పాలు పడుకుంటే నువ్వే అదృష్టవంతురాలవు . ఎందుకంటే నీ అందాన్ని కాపాడుకోవచ్చు. నేను కూడా పాలు రాకుండా మందులిస్తానన్నది " లావణ్య .
"బిడ్డకు పాలు పట్టడం లేదని ఏడ్చే తల్లులను చూశాను కానీ , నీ లాంటి దాన్ని చూడటం ఇదే మొదలు. ఎంతో మంది పిల్లల పెంపకానికి తమ కెరీర్ను కూడా వదలుకుంటున్నారు. అసలు నీ బాధ ఏమిటో నాకు అర్థం కావడం లేదన్నది "లావణ్య .
"ఒకవేళ తల్లికి పాలు సరిగా పడకపోతే పసుపు ,వెల్లుల్లి ఆహారంతో తీసుకోవడం పాలవృద్ది అవుతుంది .అంతే కాదు నానపెట్టిన బాదాం గింజలను 'ఎనిమిది 'లేదా 'పది' ఉదయం గ్రైండు చేసి గోరువెచ్చని పాలలో వేసి తాగించాలి .ఇంకా పాలలేమి ఉన్నచో ఆయుర్వేద ఔషధాలలో 'శతవరి' వాడితే మంచి గుణం కనపడుతుందని ,అలా చాలా మందికి సూచనలిచ్చి పిల్లలకు పాలు ఇప్పిస్తున్నానన్నది" లావణ్య.
అదే ఆస్పత్రిలో డెలివరీ అయిన సుష్మ ,రాధిక స్నేహితురాలు. ఆమెకు పాప పుట్టింది. రాధిక కూడా ఇక్కడే ఉందని తెలిసి చూడడానికి వచ్చింది సుష్మ వాళ్ళమ్మ సునీత.
బాబు ఏడుపు ,బాబుకు పోసే పోత పాలు చూసి,"అయ్యో రాధికకు పాలు పడలేదా ?సుష్మకు త్వరగానే పాలు పడ్డాయన్నది "సునీత. బాబుకు ఆ పాలు పట్టకండి. ఇక్కడున్నన్ని రోజులు సుష్మే బాబుకు పాలు ఇస్తదన్నది సునీత . తల్లి పాలను మించినది ఏదీలేదు సరేనన్నారు జయమ్మ ,సుమిత్ర .
తన బిడ్డకు స్నేహితురాలు పాలిస్తుందని తెలిసి సిగ్గుపడింది రాధిక .
అప్పటికి ఐదు రోజులు అవుతుండడంతో రొమ్ములలో పాలు పడి సలపడం మొదలు పెట్టింది రాధికకు ."అమ్మా !బాగా నొప్పి పెడుతున్నాయన్నది " రాధిక
"పాలు పడ్డాయనకుంట.అవే తల్లి పాలు. అవి నీబిడ్డకు ఇచ్చావంటే బాబు ఆరోగ్యం బాగుంటుంది .నీకు నొప్పి ఉండదు అని చెప్పింది" జయమ్మ .
"పాలిచ్చే తల్లి సిగ్గు పడాల్సిందేమీ లేదు .ఎలా ఏడుస్తున్నాడో చూడు.మా ఇద్దరికీ నిద్ర లేకుండా చేస్తున్నాడు. బాబుని తీసుకొని రమ్మంటావా? అని అడిగింది" రాధిక తల్లి జయమ్మ.
ఏడ్చే బాబునుఎత్తుకొని ఊర్కోపెడతున్నది సుమిత్ర.
"వదినమ్మా! బాబును ఇవ్వండి రాధిక ' పాలు' పడుతుందన్నది" సుమిత్ర.
బాబు బాధను చూసి ముగగా రోదిస్తున్న సుమిత్ర అవునా! ఒప్పుకుందా!నిజమా !వదినమ్మ అనగానే ,మీరు కూడా రండి మనం మన మనవడికి పాలు పడదామన్నది జయమ్మ.
ఏ దేవుడు నా మొర విన్నాడో అనుకొని ఏడ్చేసింది సుమిత్ర . కళ్ళు తుడుచుకుంటూ , బాబుకు తల్లి పాలు పడుతున్నది జయమ్మ. బాబు పాలు తాగుథుంటె మంత్రం వేసినట్టు నొప్పి మాయమవడంతో, వాణ్ణి గుండెలకు హత్తుకుని బోరున ఏడ్చింది రాధిక .
'"మేడం ! మీమరదలు రూములో అందరూ ఏడుస్తున్నారు. అని ఆయమ్మ చెప్పగానే పరుగున వచ్చింది లావణ్య.
అక్కడ దృశ్యం చూసి, సంతోషించి రాధిక వెన్ను తట్టి "నువ్వు వద్దనుకున్నా మాతృమూర్తి మమత నందుకున్నాడు నామేనల్లుడని
బాబును ముద్దుచేసింది డాక్టర్ లావణ్య .
"బిడ్డకు పాలిచ్చిన తర్వాత మెల్లగా ఎర్రనిబట్టతో
పెదవులు తుడవాలని అత్తగారు చెప్పే మాటలకు తలూపింది రాధిక. అప్పటివరకు బెంగతో ఉన్న అందరి మొహాల్లో నవ్వులు పూసాయి .
ఇప్పటికైనా నీ మొండితనం వదిలావు. బిడ్డకు సంపూర్ణ ఆహారం తల్లిపాలే ,పిల్లలు కనీసం 'ఇరవది' గంటలు నిద్ర పోవాలి. తల్లి పాలలో వుండే 'ట్రిప్టోఫాన్ 'రాత్రి వేళ శిశువు ప్రశాంతంగా నిద్ర పోవడానికి ఉపయోగపడుతుంది.
"నిద్రపోతే లేపవద్దు. బాబు ఏడవగానే పాలు పట్టు . వాడి పెదాలు తాకగానే శరీరంలో మార్పులు జరుగుతాయన్నది" లావణ్య .
"అన్నం పెట్టి ,మాట్లాడుతూ, మాట్లాడుతూ ఆలోచిస్తున్న భార్యను తట్టి ఏమిటి ఆలోచిస్తున్నావు" అన్నాడు సూర్యం .
ఏమీ లేదండి రాధిక చేసిన హఠం , చిన్నోడి ఏడుపు అన్ని గుర్తుకు వచ్చినవని కళ్ళు
తుడుచుకొంది సుమిత్ర.
"ఏదైతేనేం తప్పు తెలుసుకొని బాబుని బంగారంలో చూసుకుంటుంది కదా" అన్నాడు సూర్యం .
అప్పటినుండి ఊర్లో
ఏ ఇంట్లో పాప పుట్టినా ,సుమిత్రకు చెప్పడం అందరికీ అలవాటైంది. వాళ్లకు తల్లి పాల శ్రేష్టత గురించి చెప్పి, పోతపాలు పోయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఏమి తింటే పాలు పడతాయో చెప్తూ ,యోగ క్షేమాలు తెలుసుకొంటూ ,పుట్టిన పిల్లలందరితో అమ్మమ్మ , నాన్నమ్మ అని పిలిపించుకొంటున్నది సుమిత్ర.
తనవాళ్ళు దూరంగావున్నా ,
పసి పిల్లల ఆలన పాలనలో
తనను తాను సాంత్వన పరుచుకొంటూ ,ఆనందగా
జీవిస్తున్నది సుమిత్ర .

సమాప్తం
పిల్లల కోసం తపించే , నోములు నోచే తల్లులు ఎందరో సమాజంలో – కానీ రాధిక పిల్లాడ్ని కని వద్దనుకోవటం, తల్లిపాలు ఇవ్వటానికి నిరాకరించడం కథలో ఒకభాగం. అయితే రాధికకు హితబోధ చేసే క్రమంలో మాతృత్వం గురించి, తల్లిపాల శ్రేష్ఠత గురించి తల్లీ, అత్త దగ్గర్నుంచీ డాక్టర్ లావణ్య వరకూ చెప్పిన విషయాలు తల్లులకు మంచి సమాచారం. చివరకు రాధిక పిల్లాడికి తల్లిపాలు ఇవ్వటంతో ఆమెలోని మాతృత్వం మమతను పంచటం మంచి ముగింపు.
రిప్లయితొలగించండిరచయిత్రి గారికి అభినందనలు.