కుసుమం 2

 భాగ్యనగరపు నడివీధులలో వేగంగా వెళుతున్న బస్సు ఒక్కసారిగా షడన్‌బ్రేక్‌ వేసేసరికి ముందుకు తూలిపడ్డాడు రాహుల్‌. 

అతని తల ముందున్న రాడ్‌కు కొట్టుకుంది. 

ఆలోచనలనుండి ఒక్కసారిగా బయటపడ్డాడు. చుట్టూ చూశాడు....

 అంతా తననే గమనిస్తున్నారనే భ్రాంతి... 

కిటికీలోంచి బయటకు చూశాడు. ట్రాఫిక్‌ జామ్‌....

రోడ్‌రోఖో కార్యక్రమం. 

‘‘అవతల ఇంటర్వూకి టైం అవుతోంది. మధ్యలో ఈ నాన్సెన్స్‌. భాగ్యనగరమన్నాక ఇక్కడి ఇలాంటివి మామూలే....వాచ్‌ చూసుకున్నాడు...
మద్యాహ్నం 12.00 
తను ఆఫీసుకి వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్‌ అవ్వటానికి ఇంకో గంట టైం వుంది. 
‘‘ ఈ రోడ్‌రోఖో వుద్యమం చూస్తే ఇప్పుడప్పుడే అయ్యేలా లేదు. అయినా వీళ్ళనని లాభంలేదు. ఇంటర్వ్యూ వుందని తెలిసికూడా ముందురోజే వచ్చి ఫ్రండ్‌రూమ్‌లో వుంటే ఏంపోయింది. ఇందాక ట్రైన్‌ కూడా మిస్సయ్యేది..... ఆ అమ్మాయి పుణ్యమాఅని అందుకున్నా......లేకుంటే ఈ ఇంటర్వ్యూకూడా అంతే.....భగవంతుడా ఇప్పుడునాకిేం దారి....'' అనుకుంటూ లేచి చిన్నగా కండక్టర్‌ దగ్గరకెళ్ళి 
'' సర్‌...బస్సు ఎన్నిగంటలకు కదులుతుంది'' అని అడిగాడు....
కండెక్టర్‌ చిరాగ్గా '' వెళ్ళి రోడ్‌రోఖో చేస్తున్న వాళ్ళనడుగు. వాళ్ళు రోడ్డుమీంచి లేస్తే ఎంటనే కదుల్తది.'' అన్నాడు.
చేసేది లేక చిన్నగా బస్‌దిగి నడుచుకుంటూ కొంతదూరం వెళ్ళి ఆటోఎక్కి  ఇంటర్వూ జరిగే ఆఫీసుకి వెళ్ళాడు.
టైం 12.30 నిముషాలు. 
మీటర్‌మీద యాభై ఆటోవాడికి చదివించుకున్నాడు. 
చిన్నగా లోనికి అడుగుపెట్టాడు.
--------------------
వాష్‌ బేసిన్‌లో చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నాడు సుధీర్‌. 
అప్పటికే ఆమె ఆర్డర్‌ చేసిన దోసె టేబుల్‌మీద వచ్చివుంది.
'' ఏంటి ఇప్పిదాకా...'' చిరాగ్గా అడిగింది.
''.....'' సమాధానం చెప్పకుండా చికిన వేలు పైకిలేపి చూపాడు.....
ఆమె తనలో తనే నవ్వుకుంది.
'' ఎందుకు నవ్వుతావ్‌... ఇదొస్తే ఆపటం ఎవ్వరివల్లాకాదు....'' అన్నాడు తనూ నవ్వుతూ..
'' సరే. ఇంతకూ ఏం డిసైడ్‌ చేశావ్‌....'' అన్నది ఆత్రుతగా
'' ఇక్కడిదాకా వచ్చాం కదా....'' తేలిగ్గా....
'' వస్తే...'' ఆమె బృకుటి ముడిపడింది.
'' సమస్యని ధైర్యంగా ఎదుర్కుందాం.....'' కూల్‌గా దోశ తింటూ....
'' తీరిగ్గా ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా? టైం చాలా తక్కువగా వుంది.'' మందలిస్తూ...
'' ఆలోచన ఎప్పుడో అయిపోయింది. ఆచరించానికే కొద్దిగా టైం కావాలి. ఆ విషయానికి వస్తే ముందు గడ్స్‌కావాలి'' అన్నాడు ఒళ్ళువిరుచుకుంటూ....
'' గడ్స్‌కావాలా....అదుండబట్టే ఇక్కడిదాకా వచ్చింది.....'' అన్నది కొద్దిగా గర్వంగా.....
'' ఐనో..ఐనో...నాకు బాగా తెలుసు నీకున్న గడ్స్‌...అందుకే కదా నిన్ను ఏరికోరి సెలక్ట్‌చేసుకుంది...'' అన్నాడు నవ్వుతూ....
'' దో చాయ్‌'' ఆర్డరిచ్చింది....
'' నాకొద్దు'' అన్నాడు....
'' చాయ్‌ క్యాన్సిల్‌.....'' అని లేచి కౌంటర్‌ దగ్గరకెళ్ళి హ్యాండ్‌బ్యాగ్‌లో పర్స్‌ కోసం వెతికింది... 
బిల్‌ సుధీర్‌ పే చేసి బయటకు నడిచాడు. 
అక్కడినుండి ముందు అనుకున్నట్లుగా గ్రీన్‌కలర్‌ క్వాలిస్‌లో బయల్దేరాడు....
క్వాలిస్‌ అలా ఆ రోడ్డు మలుపు తిరిగిందో లేదో ఆరెస్టారెంట్ ముందు పెద్ద విస్పోటనం...
కొన్ని వందలప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. 
మరెందరో గాయపడ్డారు. 
కొందరు ప్రాణాపాయస్థితిలో కొట్టుమ్టిడుతున్నారు. 
అసలు రెస్టారెంట్ రూపురేఖలు కోల్పోయింది. 
రోడ్డుమీద ట్రాఫిక్‌పోలీసుతో సహా చనిపోయినవారి సంఖ్య రెండువందలమంది. 
మొత్తమీద ఆరోడ్డులో ప్రయాణించే వారు దాదాపుగా ఈ విస్పోటనం బారిన పడినవారే......
-----------------
అబిడ్స్‌: హోటల్‌ గ్రీనిచ్‌..... రిసెప్షన్‌ కౌంటర్‌......
'' మే ఐ హెల్ప్‌యు '' రిసెప్షనిస్ట్‌ అడిగింది.
'' యస్‌. మిస్టర్ అండ్ మిసెస్ ఆదిత్య పేరుతో సూట్ రూమ్ బుక్ చేశాం. '' జవాబిచ్చాడు సుధీర్‌.
కంప్యూటర్ లో చెక్ చేసింది.
ఐడి చూసి కన్ఫర్మ్ చేసింది.
'' ఎన్నిరోజులుంటారు. '' నవ్వుతూ
'' పని అయిందాకా.....'' అన్నది నవ్వుతూ
'' ప్లీజ్‌ సిగ్నేచర్‌ ఇక్కడ చెయ్యండి ''
'' ఓ.కె. '' సంతకం చేసి '' మేడం మాకోసం కాల్స్‌ ఏమైనా వస్తే అస్సలు కనెక్షన్‌ ఇవ్వద్దు'' అన్నాడు.
'' ఓ.కె. సర్‌ . ఆపరేటర్‌కి చెబుతాను. ఇదిగోండి మీ రూమ్‌ కీస్‌...''
బాయ్ వచ్చాడు. వాళ్ళ లగేజ్ తీసుకొని సూట్ లో దించాడు.
సుధీర్ బాయ్ కి 3వేలు టిప్ ఇచ్చాడు.
శ్రావణి బాయ్ నెంబరు తీసుకొని ‘‘ అవసరమైనప్పుడు కాల్ చేస్తాం. అటెండ్ అవ్వు.’’
‘‘ అలాగేసార్’’ అంటూ బాయ్ సలాం కొట్టి వెళ్ళిపోయాడు.
రూమ్‌ తలుపులు మూసుకొన్నారు. 
'' మిస్టర్‌ ఆదిత్య ఇప్పుడేిం మ్యాటర్‌. '' అడిగింది తన జర్కిన్‌ విప్పుతూ....
'' అబ్జర్వేషన్‌ '' ఆమె వైపు ఒరగా చూస్తూ....
'' ఏంటి? '' అన్నది బాత్‌రూమ్‌లోకి వెళుతూ....
'' అదే సీనరీస్‌...'' అంటూ కిటికీ తెరిచాడు.... 
-----------------
పాతబస్తీ : చార్మినార్‌  సెంటర్‌ గాజుల దుకాణం వద్ద పోలీసుల గస్తీ ముమ్మరంగా వుంది. అప్పుడే  అక్కడకి క్వాలిస్‌ వచ్చి ఆగింది.
'' అంతా అయిపోయింది. అనుకున్నంతా జరిగిపోయింది. ఎవడో గొట్టంగాడి రికమండేషన్‌ పుచుకొచ్చాడు. ఆపోస్టుకాస్తా వాడికెళిపోయింది. అంతకాడికీ ఇంటర్వ్యూలు పెట్టటమెందుకు. గవర్నమెంట్  వాళ్ళను మేపటానికి కాకబోతే......'' గొణుక్కుంటూ ముందుకు నడుస్తున్నాడు.
టీ తాగుదామని ఒక క్యాంటిన్‌లోకి వెళ్ళాడు. 
టీవీ ఛానల్‌లో......
'' కారుబాంబు పేలిన చోటికి అన్ని మీడియా బృందాలు చేరుకున్నాయి. బహుశ ఈ బాంబు పేలుడు వెనుక విదేశీహస్తం వుందని పోలీసువర్గాలు అభిప్రాయపడుతున్నట్లు డి.ఐ.జి అంజన్‌ పేర్కున్నారు.'' వార్త రాష్ట్రమంతా క్షణంలో వ్యాపించింది.
గ్రీన్‌ కలర్‌ క్వాలిస్‌ వచ్చి కరెక్ట్‌గా అమానుల్లా కంగన్‌ షాప్‌ ముందు ఆగింది. 
దాంట్లోంచి సుధీర్‌, శ్రావణిలు దిగారు.
మరునాడు స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు జరుపుకోటానికి పాతబస్తీ ముమ్మరంగా తయార వుతోంది. 
ఎటువంటి గొడవలూ జరగకుండా వుండేందుకు ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకునేలా ఏర్పాట్లు చేసింది. 
అన్ని సెంటర్లలో పోలీసుల్ని మోహరించింది. రాహుల్‌ టీతాగుతూ పక్కనే ఉన్నవ్యక్తితో 
'' అసలీ వెధవలకి  బుద్దెలా లేదు సార్‌... నడిరోడ్డుమీద అంతమంది ఛావుకు కారణమై వాళ్ళు ఏమి సాదిద్దామని.'' అంటూ సుధీర్‌ వైపు చూశాడు.  అతన్ని గుర్తుపట్టి......
'' మీరా సర్‌. బాగున్నారా....'' అన్నాడు విష్‌ చేస్తూ....
నవ్వుతూ తలూపాడు. '' అరె మేడం మీరూ ఇక్కడే వున్నారా....మున్నా ఔర్‌దోచాయ్‌...'' ఆర్డరిచ్చాడు. 
శ్రావణి ఏదో చెప్పబోతుండగా ఆమెను సుధీర్‌ ఆమెను ఆపుతూ '' మీరేంటి ఇక్కడ ''
'' ఉద్యోగం కోసం వచ్చాడు '' అన్నది శ్రావణి.
'' ఇక్కడా '' అన్నాడు జోక్‌ చేస్తూ సుధీర్‌...
'' భాగ్యనగరంలో బ్రతుకు తెరువుకోసం వచ్చా...'' అన్నాడు  నవ్వుతూ... 
'' టీ తీసుకోండి '' ఇద్దరూ టీ తాగి 
'' దొరికిందా ...''
'' లేదు సర్‌.''
'' దిస్‌ ఈజ్‌  మై సెల్‌నెంబర్‌. మరో పదినిముషాల తర్వాత అదిగో ఆరోడ్‌ అవతల కనిపించే యస్‌.టి.డి నుండి కాల్‌చెయ్యండి..బ్రతుకు దెరువు చూబిస్తా....ఓకెనా..'' అంటూ నెంబర్‌ ఇచ్చాడు. 
'' పిలిచి  ఉద్యోగం ఇస్తే వద్దనే వాడెవడు సర్‌...'' అన్నాడు ఆనందంతో....
'' టీ బిల్‌  ఎంత? '' జేబులోంచి డబ్బులు తీస్తూ అడిగాడు సుధీర్‌....
''  నేనిస్తాలెండి...?'' అన్నాడు రాహుల్‌.
'' అడ్వాన్స్‌ శాలరీగా దీన్ని  వుంచు '' అంటూ ఐదువేలు రాహుల్ కి ఇచ్చి అక్కడినుండి ఇద్దరూ వెళ్ళిపోయారు.
స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోబోతున్నామనే ఆనందోత్సాహాలతో పాతబస్తీ కళకళలాడుతున్న సమయంలో గ్రీన్‌ కలర్‌ క్వాలిస్‌ అక్కడే వదిలివేయబడింది. 
పోలీసులు జనాన్ని గుంపులుగా వుండనీయకుండా తగుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
8 నిముషాల తర్వాత సుధీర్‌ఇచ్చిన నెంబర్‌కి ఎస్ టిడి బూత్ నుండి ఫోన్ చేయటం కోసం అక్కడి నుండి రాహుల్‌ బయల్దేరాడు.
చిన్నగా నడుచుకుంటూ బయల్దేరాడు గ్రీన్‌ కలర్‌ క్వాలిస్‌ నుండి ఇతనికి మధ్యదూరం వెయ్యి అడుగులు. 
క్వాలిస్‌ నుండి పోలీసులకు మధ్యదూరం 400 అడుగులు. 
సరిగ్గా సమయం రాత్రి 7.49 నిముషాలు. 
సుధీర్‌చెప్పిన  యస్‌.టి.డి ఖాళీఅయింది. 
‘‘ బిచ్చగాళ్ళదగ్గర కూడా సెల్ ఫోన్ వున్న ఈ రోజుల్లో కూడా ఎస్.టి.డిలు ఇంకా ఎలా రన్ అవుతున్నాయో. అయినా సార్ ఏంటి ఈ ఎస్.టి.డి నుండి నన్ను కాల్ చెయ్యమనటం. ఏమోలే పెద్దోళ్ళు ఏం చెప్తే అదే చెయ్యాలి. వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయ్...’’
పాతబస్తీలో కొట్లదగ్గర అక్కడక్కడా జాతీయ జండాలు , వివిధరకాల రంగుల పేపర్లు ....... తమ స్కూల్‌ని డెకరేట్ చేసుకుంటానికి అవికొనుక్కోటానికి వచ్చిన చిన్నపిల్లలు, గాజులు కొనుక్కోటానికి వచ్చినవారితో, సందడి వాతావరణం.. చూడముచ్చటగా వుంది. 
యస్‌.టి.డి లోకి వెళ్ళి ఫోన్‌ లిఫ్ట్‌చేసి ఒక్కొక్కనెంబర్‌ నొక్కుతున్నాడు. 
ఫోన్ రింగ్‌అవుతోంది . 
'' సర్‌.సర్‌. త్వరగా లిఫ్ట్‌ చెయ్యండి సర్‌'' అనుకుంటున్నాడు.
‘‘ ట్రింగ్.. ట్రింగ్..ట్రింగ్..’’
ఈసారి మోగలేదు.....పెద్దపేలుడు వినిపించింది. 
ఆ పేలుడు తాలూకు మంటలు దాదాపు పన్నెండువందల అడుగుల వరకూ కమ్ముకున్నాయి. 
చాలామంది గాయపడ్డారు. 
చాలామంది ఛనిపోయారు. 
దాదాపుగా ప్రేలుడు సంభవించిన చోట చనిపోయిన వారిలో ఎక్కువ శాతం చిన్నపిల్లలూ మహిళలే వున్నారు. 
రాహుల్‌ వున్న యస్‌టిడికి మంటలంటుకున్నాయ్‌. 
కొంత ఇతనూ గాయపడినా ఎలాగోలా బయటపడ్డాడు.
గస్తీకాస్తున్న పోలీసులు కూడా ఆబాంబ్‌ బ్లాస్ట్‌కి బలైపోయారు. 

(సశేషం)

1 కామెంట్‌: