మాజీ యువకులు
“దైవజ్ఞ రత్న డాక్టర్ బొక్కా శ్రీనివాసరావు
9080734124
చెప్పుకోడానికి ఎన్నో కథలున్నాయి. అయితే మధ్యతరగతి కథల్లో ఉండేంత అర్హత, అవేదన, ఆదుర్దా వగైరాలు మరి ఏ కథలోనూ వుండవు. అంత వుంది కథలోని కథ. ఏది ఏమైనా... కథ చెప్పడమంటే కథ విన్నంత తేలిక కాదని తెలిసినా... నా అనుభవంలో చూసిన ఓ జంట కథని మీ ముందు వుంచబోతున్నాను. ఆ జంటలోని భర్త పేరు భరత్, భార్య పేరు పద్మ ఇద్దరిదీ అన్యోన్య దాంపత్యమే. ఏ అరమరికలూ లేవు. ఎంతగా అంటే... అతని జీతం అమెకు తెలుసు. అమె వయసు అతనికి తెలుసు. ఏదో సామెత గుర్తొస్తోంది కదూ.! అవునవును... 'మగాడి జీతం... అడదాని వయసు” అడక్కూడదంటారు. ఇదేగా అ సామెత. ఇంతకీ చెప్పాచ్చేదేమంటే... ఈ సామెత తప్పని చెప్పేంతగా వారి జీవితం సాగుతోం౦౦ం౦.....ది. ఇద్దరూ ఏదో చిన్నపాటి ఉద్యోగం వెలగబెడుతున్నారు. “గుడ్డిలో మెల్లొలాగా వాళ్ళిద్దరి ఆఫీసులు పక్క పక్కనే కావడంతో... కలిసి వెళ్ళి... కలిసి తిరిగి వస్తుంటారు. వాళ్ళ జీవితంలోని అత్యంత అద్భృష్యం అంటే... ఈ ఒక్క విషయమే. సరే ఇక అసలు కథలోకి వస్తున్నా.
భరత్, పద్మలిద్దరూ ఉద్యోగం అంటే... ఇంక ఇంటి పనిలో హడావుడి ఎలా వుంటుందో మాటల్లో చెప్పలేనిది. ఇద్దరూ పనిని పంచుకుంటే తప్ప... టిఫిన్లు గానీ, భోజనాలు గానీ తయారు కాని పరిస్థితి ఏర్పడింది. అలా హడావుడిగా పని చేసుకుని... ఆఫీసుకి వెళ్ళినా... అక్కడ మళ్ళీ ఒత్తిడిలో పని చేయాల్సిన పరిస్థితి. ఇక సాయంత్రం తిరిగి రాగానే... అలసటతో వస్తారు. సంసారం అన్నాక కేవలం భార్యభర్తలిద్దరే కాదు కదండీ. ఇంట్లో పెద్దవాళ్ళుంటారు కదా. అయితే ఈ జంట ఇంటిలో ఒకే ఒక పెద్దాయన భరత్ తండ్రి పరంధామయ్య మాత్రమే వుంటున్నాడు. ఆయన కేవలం ఇంటికి మాత్రమే పరిమితం. దాదాపు 70 ఏళ్ళ వయసు. ఇంక వేరే పెద్దలెవరూ లేరు. ఇలా వుండగా... అయ్యో... అయ్యో... క్షమించండి. కథ ఇంకా చెప్పడం లేదని అనుకుంటున్నారు కదూ. సరే. సరే. చెపుతున్నా.
ఒకానొక రోజున, యథావిథిగా తెల్లారింది. భరత్, పద్మలిద్దరి స్నానాలు అయిపోయాయి. ఇద్దరూ ఆఫీసుకి రడీ అయిపోయారు. ఇంక వెళ్ళడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో... పరంధామయ్య తన గదిలోంచి బయటికి వచ్చాడు. తన కొడుకుతో ఏదో మాట్లాడుదామనుకునేసరికి.... కోడలు పద్మ వంటగదిలోంచి లంచ్ బాక్స్‌లుతో వచ్చి... భరత్‌తో మాట్లాడుతూండడంతో అగిపోతాడు.
“డాబామీద నుంచి బట్టలు తెచ్చావా భరత్" అని పద్మ అడుగుతుంది. ప్రాజెక్టు పనిలో వుండి మర్చిపోయానంటాడు. అంతలోనే పద్మ అగ్గి మీద గుగ్గిలంలా అయిపోయి... మరీ ఇంత బాధ్యత లేకుండా ప్రవర్తిస్తావేంటి అని నిలదీస్తుంది. ఏంటి బట్టలు తేకపోవడం, మరీ ఇంత అంతర్జాతీయ సమస్యనా అని భరత్ అడుగుతాడు. అంతలో పరంధామయ్య... కనీసం కోడలుతో అయినా మాట్లాడుదామని... దగ్గరకు రాబోయి వాళ్ళిద్దరి మధ్యకి వెళ్ళడం ఎందుకని ఆగిపోతాడు. అంతలో పద్మ... 'నీకో దణ్ణం బాబూ” అని తనని తాను సంబాళించుకుని... తనే బట్టలు తేవడానికి వెళుతుంటే... భరత్ తను వెళతానని వెళ్ళబోతోంటే.. అతడిని తోసేసి వెళ్ళిపోతుంది. భరత్ ఆ తోపుకి పడబోయి తమాయించుకుని... “మొండి... శిఖండి' అని మనసులోనే తిట్టుకుంటూ... 'షూస్” వేసుకోడానికి వెళతాడు. ఇంక చేసేదేమీ లేని పరంధామయ్య దివాను మీద అనాసక్తంగా కూర్చుంటాడు. అదే సమయానికి పద్మ బట్టలతో వస్తూండడం చూసి... బట్టల్ని దివాను మీద 'పెడుతుందేమోనని, అక్కడనుంచి లేచి వెళ్ళి ఏదో ఒక కుర్చీ మీద కూర్చుంటాడు. పరంధామయ్య అనుకున్నట్టుగానే... బట్టల్ని ఆ దివాను మీదే పెట్టి... వంటగదిలోకి వెళుతుంది. ఇంతలో భరత్ షూస్ తీసుకుని... వేసుకోడానికి వస్తూంటాడు. తన కుర్చీలో కూర్చుంటాడేమో అని పరంధామయ్య అక్కడనుంచి కూడా లేచి వెళ్లి... మళ్ళీ తన గది బయటే నిలబడి వుంటాడు. తాను అనుకున్నట్టుగానే... భరత్ అదే కుర్చీలోనే కూర్చుంటాడు. ఏవిటో ఇవాళ అన్నీ పరంధామయ్య అనుకున్నట్టుగానే జరిగిపోతున్నాయి. కానీ ఒక్కటి తప్ప. ఏవిటో ఆలోచించండి.
ఆలోచించారా...?. తట్టిందా...? తట్టలేదు కదూ. పోనీ తట్టిందే అనుకోండి. నేను చెప్పేది విని సంతోషపడండి. ఇంతకీ అదేమంటే... భరత్ గానీ, పద్మ గానీ... పరంధామయ్య అనేవాడొకడున్నాడని ఏ మాత్రం స్పృహ లేకుండా... ఆఫీసుకి వెళ్ళే హడావుడిలోనే వున్నారు గానీ... 'హాయ్ నాన్నా.!' అని భరత్‌గానీ, 'హాయ్ మావయ్యగారూ...!” అని పద్మగానీ పలకరించకపోవడమే. నిజంగా పరంధామయ్యది ఎంతటి దయనీయ పరిస్థితి. అలాగని కొడుకు, కోడలికి పరంధామయ్యమీద (పేమ, అభిమానం లేవనుకుంటే మీరు పొరబడ్డట్టే.
వాళ్ళిద్దరికీ పరంధామయ్యంటే ఎనలేని అభిమానం. కానీ అక్కడ తప్పు అంతా 'భార్యభర్రలిద్దరి ఉద్యోగాలు”. అవును. మా చిన్నప్పుడు 'మేమిద్దరం-మాకెందరో' అన్నది నేను కొంచెం పెరిగేటప్పటికి.. 'మేమిద్దరం-మాకిద్దరు' అయింది. నాకు పిల్లలు పుట్టేసరికి... అది 'మేమిద్దరు-మాకొకరు'గా మారింది. ఇలా రాన్రాను సంకుచితంగా మారి... చివరికి 'మేమిద్దరు-మాకెవరొద్దు” స్థాయికి వచ్చాం. ఉద్యోగాల విషయంలో 'న స్రీ స్వాతంత్ర్యమర్హసైి' మారిపోయి... ఇప్పుడు 'మేమిద్దరం-మాకిద్దరికీ ఉద్యోగాలు” స్థాయికి... సమాజం ఎదిగిపోయింది. అది ఉమ్మడి కుటుంబాల విషయంలో చాలా సమస్యలకి దారి తీసింది. అయ్యో... అయ్యో... క్షమించండి. కథ చెప్పడం మానేసి... మళ్ళీ సోది చెప్తన్నానని అని అనుకోకండి. ఇక్కడ భరత్, పద్మల విషయంలో ఏ తప్పూ లేదని చెప్పడానికే ఈ సోదంతా. హడావుడిగా అఫీసులకి వెళ్ళడం... ఆఫీసు పనితో అలసి తిరిగి ఇంటికి రావడం... దొరికిన కొద్ది సమయాన్ని సేద దీర్చుకోడానికి వినియోగించడం... ఇలా యాంత్రికంగా మారినందునే... ఇంట్లో పెద్దవాళ్ళ పట్ల... కాస్త నిరాదరణ పెరుగుతోంది అని చెప్పడమే నా ఉద్దేశం. ఇదే పరంధామయ్య విషయంలో జరిగింది. వాళ్ళు వాళ్ళ హడావిడిలో వున్నారు తప్ప.... పరంధామయ్య ని నిరాదరించలేదు.
కానీ పరంధామయ్య అన్యాపదేశంగా నిరాదరించబడ్డాడు. ఆ పరిస్థితిలో వున్న పరంధామయ్య ఇక వుండబట్టలేక... 'ఒరేయ్ అబ్బాయ్” అని యథాలాపంగా పిలుస్తాడు. ఒక్కసారిగా అ జంట ఉలిక్కిపడుతుంది. తాము ఎంత పరధ్యానంలో వున్నారో అర్థమై... ఒక్కసారిగా పరంధామయ్య కాళ్ళమీద పడిపోయి... క్షమించమంటారు. పరంధామయ్య అర్థం చేసుకుంటాడు. “ఏదో పని ఒత్తిడిలో మర్చిపోయామని” చెబుతారు. దానికి పరంధామయ్య... 'పని ఒత్తిడిలో వుంటే... పర్వాలేదురా అబ్బాయ్. కానీ మనసు ఒత్తిడిలో మాత్రం పడకండి. అలా పడితే బంధాలనే మర్చిపోతారు” అని చిన్న చురక వేస్తాడు. వెంటనే నవ్వేస్తాడు. అందరూ అతనితో కలిసి నవ్వేస్తారు. చివరికి వెళ్ళొస్తామని.. బయలుదేరుతుంటారు. పరంధామయ్య దివాను మీద కూర్చుని... ఫోన్‌లో వాట్సాప్ చూసుకుంటూంటాడు. బయలుదేరబోతున్న భరత్, పద్మలిద్దరూ పరంధామయ్యకి 'వై నాన్నా, 'వై మావయ్యగారు” అని మెసేజ్‌లు పెట్టి వెళ్ళబోతుంటారు. అ మెసేజ్‌ల్ని చూసిన పరంధామయ్య...
“ఒరేయ్ మీ కళ్ళ ముందే వున్న నాకు బై చెప్పడం మానేసి... మెసేజులేవిటిరా' అని అడుగుతాడు. “టెక్నాలజీ వుంది కదా అని వాడుకున్నామని” చెబుతారు. దానికి పరంధామయ్య... “టెక్నాలజీ వున్నది ప్రపంచం మధ్య దూరాల్ని తగ్గించడానికి గానీ... ఇలా బంధాల మధ్య దూరాల్ని పెంచడానికి కాదురా.” అంటాడు. 'ఒప్పుకుంటున్నాం” అని అనేసి హడావుడిగా వెళ్ళిపోతారు. ఇదండీ వారి సంసారంలో ఒకానొక రోజు ఇలా గడిచింది.
ఇలా రోజులు గడుస్తూండగా... ఒక రోజు సాయంత్రం పరంధామయ్య నిద్ర లేచాక... ఇల్లంతా అక్కడక్కడ బట్టలతో... చిందరవందరగా వుండడంతో... కొడుకు, కోడలు వచ్చేటప్పటికి ఏ వేళవుంతుందో... ఒకవేళ వచ్చినా, అలసిపోయినవాళ్ళు ఏం సర్దగలరులే అని అనుకుని, తానే ఇంటిని సర్జుతూంటాడు. అంతా సర్దేసేసరికి.. ఎక్కడలేని అలసట, నీరసం కళ్ళు తిరిగి తూలిపడిపోబోతోంటే... అదే సమయానికి భరత్ రావడం, నాన్నని పట్టుకోవడం యాదృచ్చికంగా జరుగుతాయి. ఆ వెనకనే వచ్చిన పద్మ వెంటనే మావయ్య గారికి నీళ్ళు తాగిస్తుంది. పరంధామయ్యని దివాను పడుకోబెడుతూండగా, భరత్ ఓ పక్కకి పోయి తనలో తాను బాధపడుతూంటాడు. పడుకోబెట్టిన తర్వాత... పద్మ, భరత్ మూడ్‌ని గమనించి, 'ఏవైంది భరత్' అని అడుగుతుంది. ఇంక భరత్ చిన్నపిల్లాడిలా ఏద్చేస్తాడు. 'చూసావ్‌గా... నాన్న పరిస్థితి. సమయానికి నేనొచ్చాను కాబట్టి సరిపోయింది. లేకుంటే అ పడిపోవడం, పడిపోవడంలో తలకి ఏదైనా దెబ్బ తగిలి వుంటే... ఓహ్ గాద్..! వూహించుకోలేకపోతున్నాను.? అని బాధపడుతూంటాడు. పద్మ, భరత్‌ని సముదాయిస్తుంది. “మనమేం చేయగలం భరత్..!” అని అడిగితే... భరత్... 'లేదు. ఏదో ఒకటి చేయాలి. నా కోసం ఎన్నో చేసిన నాన్నకు నేను ఏదో ఒకటి చేయాలి. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. అది కఠినమైనా సరే.... జరగాల్సిందే.” అని ధృఢంగా చెబుతాడు. ఆ నిర్ణయమేంటని పద్మ అడుగుతుంది. 'మనిద్దరిలో ఒకరు ఉద్యోగం మానేయడమే” ఆ నిర్ణయం అని భరత్ చెప్పగానే... 'దయజేసి నన్ను ఉద్యోగం మానేయమని అంటావా... ఏంటి” అని పద్మ నిలదీస్తుంది. 'సరే అన్నానే అనుకో. మానేస్తావా..?” అని అడుగుతాడు. మానేదే లేదు అని ఖరాఖండిగా చెప్పేస్తుంది. ఎస్. అగ్రీడ్. సెల్ఫ్ రెస్పెక్ట్. ఇండివిడ్యువాలిటీ. ఒప్పుకుంటాను. అయితే ఇంక నేనే ఉద్యోగం మానేస్తాను" అని భరత్ చెప్పగానే... 'పిచ్చా నీకు. ఇద్దరం సంపాదిస్తున్నా సరే... మనం ఇన్‌స్టాల్‌మెంట్‌లో తీసుకున్న విల్లా డబ్బులు ప్రతినెలా సరిగ్గా కట్టలేకపోతున్నామే... ఈ పరిస్థితిలో నువ్వు మానేస్తే... అ విల్లా పరిస్థితి ఏంటి..? మన భవిష్యత్తు ఏంటి...? రేపు మనకి పిల్లలు పుట్టాక వాళ్ళ భవిష్యత్తు ఏంటి..? అవన్నీ ఇప్పుడే ఆలోచించుకుని... నాలుగు డబ్బులు సంపాదించుకోవాలిగా. అలాంటిది నువ్వు మానేస్తానంటే ఒప్పుకోను” అని పద్మ అంటుంది. అదే సమయానికి పరంధామయ్య నీరసంగా లేచి... వీళ్ళ మాటలు అర్ధమయ్యి అర్థంకాక వింటూంటాడు. ఇది వాళ్ళిద్దరూ గమనించరు. వాళ్ళ చర్చ నడుస్తూనే వుంది. పద్మ ఉద్యోగం మానొద్దని చెప్పగానే... దాదాపు అరిచినంతగా.. ఆవేదనతో... “లేదు. మానేస్తున్నాను. నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోతే... అప్పటికి మా నాన్నకి ఓ నలభై ఏళ్ళు వుంటాయంతే. అయినా సరే.. మా నాన్న నా కోసం పెళ్ళి చేసుకోలేదు. తనకి భార్య వస్తుందేమో గానీ... నాకు అమ్మ రాదేమోనని మథనపడిపోయి పెళ్ళి చేసుకోలేదు. నా భవిష్యత్తు కోసం... తన సుఖాలను త్యాగం చేసిన త్యాగమూర్తి. మరి అలాంటి నాన్నకు నేనేం చేయాలి. ఇలా ఒంటరిగా వదిలేయడమేనా...? లేదు. ఏదో ఒకటి చేయాలి. కాబట్టి ఏదో పార్ట్ టైం ఉద్యోగం గానీ... వర్క్ ఫ్రం హోం ఉద్యోగం గానీ చూసుకుంటాను. నా కోసం తనని తాను మర్చిపోయిన నాన్నకి... తనకి నేనున్నానని గుర్తు చేస్తాను. ధైర్యంగా నిలబడతాను.! అని బాధపడుతుంటాడు.
వెంటనే పరంధామయ్య కొడుకు మాటలకి అనందపడిపోయి... వచ్చి కౌగిలించేసు కుంటాడు. ‘‘ చాలురా. ఈ జన్మకిది చాలు. ఇలాంటి కొడుకు నాకున్నందుకు చాలా గర్వపడుతున్నాను. వచ్చే జన్మలో నేను నీకు కొడుకుగా పుట్టి... నీ బుణాన్ని తీర్చుకోవాలనుందిరా.”అని అంటాడు. దానికి భరత్... “అవేం మాటలు నాన్నా. నువ్వు నాకు బుణం తీర్చుకోవడం ఏంటి..?? అ బాధ్యత మాది. మనిషై పుట్టినవాడు ఎన్నటికీ తీర్చలేనిది మాతృ బుణం. కానీ పితృ బుణం తీర్చగలం. మాకు జన్మనిచ్చావ్. విద్యాబుద్ధులు నేర్పించావ్. సంస్మారాల్ని తెలియజేసావ్. మీరు లేనిదే మేమసలు ఈ ప్రపంచంలోనే లేము. వీటన్నిటికీ మేమే బుణపడివుంటాం. అందుకే 'పితృబుణం” అన్న మాట వచ్చింది. అంతేగానీ పురాణాల్లో ఎక్కడా 'వుత్ర బుణం' గురించి రాయలేదు. దయ జేసి ఈ మాట ఇంకెప్పుడూ అనకండి.” నాన్నకి సర్దిచెబుతాడు. అంతలో పద్మ కూడా వచ్చి... “అవును భరత్..! మావయ్యగారు గురించి నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని నచ్చకపోయినా ఒప్పుకుంటాను. మావయ్యగారే అని కాదు... ఇంట్లో ఈ పరిస్థితిలో వుండే ఏ పిల్లలైనా పెద్దల కోసం ఇలా ఆలోచించాల్సిందే.” అని భరత్‌కి వత్తాసు పలుకుతుంది. ఇంక అంతా సజావుగానే వుందని అనందంగా వున్నారు. అంతలో పద్మ చూపు టేబుల్ మీద పడుతుంది. అక్కడ ఏదో కవర్ వుంటుంది. అది తేగానే... పరంధామయ్య “మధ్యాహ్నం కొరియర్‌వాడు ఇచ్చివెళ్ళాదమ్మా.. ఏదో రియల్ ఎస్టేట్ నుంచి వచ్చింది” అని చెబుతాడు. అంతలోకే కవరు చించేసి... దానిలోని సారాంశం చదివిన పద్మ దిగాలుపడిపోయి...దివాను మీద కూర్చుంటుంది. ఏవైంది అని భరత్, పరంధామయ్యలు అడుగుతారు. దానికి పద్మ.... 'ఇది ఫైనల్ కాల్ లెటర్ మావయ్యగారు. ఏది జరగకూడదనుకున్నామో... అదే జరగబోతోంది. విల్లా ఇన్‌స్టాల్‌మెంట్‌లు సరియైన సమయానికి కట్టలేకపోతున్నామని నోటీసు పంపించాడు. ఈసారి మళ్ళీ వాయిదాలు కట్టడంలో తేడాలు వస్తే... నియమనిబంధనల ప్రకారం... విల్లాని వేలంలోకి పెట్టేస్తామని దాదాపుగా వార్నింగ్ ఇచ్చాడు.' అని బాధపడుతూ చెబ్లుంది. వెంటనే పరంధామయ్య... "నేను ముందే చెప్పాను కదరా. ఈ లోన్లతోనూ...వాయిదాల పద్ధతిలోనూ ఇల్లు కొనడం అంటే... సొంత ఇంటికే అద్దె కట్టడం లాంటిదిరా అని. అన్నీ తీరిపోయి ఇల్లు మన సొంతం అనుకునేసరికి ఓ పది - పదిహేనేళ్ళు పడుతుంది. అప్పటికి అది సెకండ్ హాండ్ ఇల్లులా అయిపోయింది. అమ్మనూ లేము. కొత్తది కొననూ లేము. అందుకే నెలనెలా వాయిదాలంటే... బతికుండగా తన మాసికం తానే పెట్టుకోవడంలాంటిది అన్నాను. విన్చించుకున్నారా...? లేదు..!? అని అంటాడు. దానికి భరత్... 'నాన్నా..! మమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు.” అని అనగానే... పరంధామయ్య... 'నేను కాదురా కన్‌ఫ్యూస్ చేస్తున్నది. మీ తరమే కన్‌ఫ్యూజ్‌లో వుంది. ఒక్క విషయం చెప్పండి.” అని పద్మని అడుగుతాడు. 'ఏమ్మా...! మీ పెళ్ళయి ఎన్నేళ్ళయిందీ...?” అని. 'ఓ ఐదేళ్ళయింది మావయ్యా..!? అంటుంది. “మరి పిల్లలు...?” అని అడుగుతాడు. దానికి భరత్... 'ఓ ఐదేళు ఇ ప్లానింగ్ అని అనుకున్నాం. ఈ సంవత్సరంతో అయిపోయింది.” అని సమాధానమిస్తాడు. వెంటనే పరంధామయ్య... “బావుందిరా. పిల్లల కోసమని ఐదేళ్ళు ష్లానింగ్ వేసినోళ్ళు.... ఇల్లు కోసం ఓ పదేళ్ళు ప్లానింగ్ వేయలేకపోయారా...? లక్షల్లో జీతాలు అనగానే... ఉద్యోగాల్లో చేరిన వెంటనే విల్లాలు కొనేయడమేనా..? లక్షల్లో కార్లు కొనేయడమేనా..? ఏం ఓ పదేళ్ళపాటు ష్లానింగ్‌తో.... పొదుపు చేసి నింపాదిగా కొనుక్కుంటే ఎంత ధీమాగా వుండొచ్చో ఆలోచించారా.?” అని అంటాడు. పద్మ కాస్త చిరాకుగా... 'జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. ఈ పరిస్థితినుండి ఎలా గట్టెకాలీ..?” అని అడుగుతుంది. పరంధామయ్య వాళ్ళిద్దరినీ దగ్గరికి తీసుకుని ఓదారుస్తూ... 'దీని గురించి నేను ఆలోచిస్తాను. నాదీ బాధ్యత" అని భరోసా ఇస్తాడు. ఇద్దరూ అనందపడుతారు. పరంధామయ్య...“అలసిపోయి వచ్చారు. కాస్త విశ్రాంతి తీసుకోండి. రేపు ఎలాగూ వీకెండ్ కదా. హాయిగా పడుకోండి” అని వాళ్ళని లోపలికి పంపించి...దివాను మీద కూర్చుని... ఈ సమస్యకి పరిష్కారం ఏవిటని అలోచిస్తూ... ఆలోచిస్తూ... అలా దివాను మీదే నిద్రలోకి జారుకుంటాడు.
అలా నిద్రపోయి... మరుసటి రోజు ఉదయమయ్యేసరికి ఇంట్లో పద్మ చేస్తున్న హడావుడికి గానీ లేవలేదు. అప్పటికే లేచిన భరత్... కుర్చీలో పేపర్ చదువుకుంటూటాడు. పరంధామయ్య లేచి ఐద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూండగా... పద్మ లాప్‌టాప్ చేతితో పట్టుకుని... హాలులోకి వస్తూ... 'భరత్...! మావయ్యగారూ..!” అని కంగారుగా, ఆందోళనగా వస్తుంది. 'ఏవైంది' అంటూ ఇద్దరూ అడుగుతారు. పద్మ... చెప్పలేక చెప్పలేక చెబుతూ... “ఏది జరగకూడదో అదే జరిగింది. ఒక పక్క విల్లా సమస్య. మరో పక్క భరత్ ఉద్యోగం మానేస్తాననడం. ఈ సమస్యలు చాలవన్నట్టు. మరో పిడుగు నెత్తి మీద పడింది.” అని చెబుతుంది. 'ఏం జరిగిందో సూటిగా చెప్పు అని భరత్ అంటాడు. 'నాకు ముంబయికి ట్రాన్స్‌ఫర్ అయింది” అని అనగానే... భరత్ కుర్చీలోనే కూలబడిపోతాడు. పరంధామయ్య చాలా తేలికగా... 'వచ్చింది ట్రాన్స్‌ఫర్‌నే కదా. దానికి ఇద్దరూ ఇలా అయిపోతారేంటిరా.” అని అంటాడు. వెంటనే పద్మ... 'మీకెలా చెబితే అర్థం అవుతుందో నాకు తెలియడం లేదు. పిల్లలకోసం ఐదేళ్ళు అగుదామనుకున్న ప్లానింగ్ పూర్తయిందనుకుంటే.. ఈ ట్రాన్స్‌ఫర్ వచ్చింది. భరత్ ఇక్కడ. నేను ముంబయి. ఈ పరిస్థితిలో పిల్లల గురించి మళ్ళీ వాయిదా వేయాల్సిందేగా. పోనీ వేసినా... ఈయన ముంబయి రాడు. ఎందుకంటే నాన్న... నాన్న అని మిమ్మల్నే కలవరిస్తూంటాడు. అటు విల్లా సమస్య, ఇటు పిల్లలు. మధ్యలో ట్రాన్స్‌ఫర్. ఓ గాడ్..! నాకు పిచ్చెక్కిపోతోంది. ఏం చేయాలి..? ఏం చేయాలి..?” అని దాదాపుగా పిచ్చిదానిలా ప్రవర్తిస్తూ... చివరికి ఏదో అలోచన వచ్చినదానిలా... పరంధామయ్యని అడుగుతుంది. 'మావయ్యగారూ...! మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. నేను, భరత్ ముంబయి వెళ్ళిపోతాం. మీరు మాతో వస్తారా... లేదా..? చెప్పండి” అని నిలదీస్తుంది. దానికి పరంధామయ్య... 'పుట్టి, పెరిగిన ఊరు... అలా వున్న పళంగా రమ్మంటే ఎలా వస్తానమ్మా..!' అని అంటాడు. దానికి పద్మ. కాస్త కోపంగా... “అదీ... అదే మావయ్యా సమస్య. మీ పెద్దాళ్ళకి మీ సెంటిమెంట్స్ వుంటాయి. మరి మా తరానికి ఏ సెంటిమెంట్స్ వుండవా..? మా దారిన మేం వదిలివెళ్ళిపోతే... మిమ్మల్ని అనాథలా వదిలేసాం అని మా మీద నింద. మిమ్మల్ని రమ్మంటేనేమో మీ చాదస్తాలు మీవే. రానని భీష్టించుకున్నారు. నా పిల్లలు, నా సంసారం, మా ఆయన అన్న స్వార్థం నాకుండవా..? మీ కోసం ప్రమోషన్ పోగొట్టుకోవడం వల్ల నా భవిష్యత్తు నాశనం అవుతోందని అనిపిస్తోంటే...నా మీదే కాదు మీ మీదా కూడా నాకు తెలీని అసహ్యం పుట్టుకొస్తోంది. వెంటనే పరంధామయ్య... “వద్దమ్మా... అంత మాటనకు. మన ఈ చిన్ని గుండెకి... ఇంతటి పెద్ద శరీరాన్ని అవలీలగా బతికించే శక్తివుంటుంది గానీ....ఇలాంటి పెద్ద మాటలకి తట్టుకునే శక్తి వుండదమ్మా..! కాబట్టి అంత పెద్దమాటలు వాడొద్దు.” అని అనగానే... పద్మ చాలా నిష్కర్షగా... 'నేను మొత్తుకునేది అదే. మా ఈ చిన్ని గుండెలకి కూడా... మీలాటి పెద్దవాళ్ల వల్ల వచ్చే సమస్యల్ని తట్టుకునే శక్తి మాకూ వుండదనే చెబ్లున్నా అటు విల్లాయే పోయే పరిస్థితి వున్నపుడు... ఇటు నా ప్రమోషన్ కూడా పోయే పరిస్థితి వున్నపుడు... నేనేం చేస్తానో నాకే తెలీదు. అ పరిస్థితిని నేనూహించుకోలేను. ఎంతకైనా తెగిస్తాను. ఎస్... ఇదే నా నిర్ణయం.” అని చాలా విసురుగా లోపలికి పోతుంది. పరంధామయ్య ఆందోళనగా భరత్ దగ్గరికెళ్ళి... “ఒరేయ్ భరత్..! నువ్వెళ్ళి ఏదోటి చెప్పి... గొడవని తగ్గించరా..! అమ్మాయి ఆవేశంలో ఏ అమాయిత్యమైనా చేసుకుంటుందేమో..?” అని అంటాడు. దానికి భరత్... 'చేసుకోనీ నాన్నా లేకపోతే ఏంటీ... అయినదానికీ... కానిదానికీ దెబ్బలాడే మనిషిని నేనెందుకుట బ్రతిమాలుకోవాలి. తను మొండి అయితే... నేను జగమొండి. ఏం... ఇదే వాళ్ళ నాన్నయితే ఇలాగే మాట్లాడుతుందా తను..? నిజంగా మాలాంటి కొడుకుల బతుకులు నరకం నాన్నా.! ఇటు తల్లిదండ్రుల గురించి క్రొదుకే ఆలోచించాలి. పెళ్ళయ్యాక వచ్చిన కోడలు గురించి కూడా ఆ కొడుకే అలోచించాలి. పిల్లలు పుట్టాక వాళ్ళ గురించి కూడా ఆ కొడుకే ఆలోచించాలి.
“తల్లా... పెళ్ళామా..?”, “నాన్నా. పెళ్ళామా..?% “ధనమా... దైవమా..?” అని ఆ కొడుకే ఆలోచించాలి. అలోచించి... అలోచించి... మథనపడిపోవాలి. ఈ కొడుకుల్నెవరూ అర్థం చేసుకోరు. చివరిదాకా మాతోనే వుండే భార్య కూడా అర్థం చేసుకోదు..?” అవేదన వెలిబుచ్చుతాడు. భరత్‌ని ఓదారుస్తూ... 'తను కాదురా అర్థం చేసుకోవాల్సింది. మేము..! మా స్వేచ్చ... మీ స్వేచ్చకి అడ్డు రాకూడదని మేము... మేమర్థం చేసుకోవాలి. అ విషయం ఇప్పటివరకూ నేనాలోచించలేదు. వీటి గురించి ఆలోచించడం మానేసి... వెళ్ళి అమ్మాయిని కనిపెట్టుకుని వుండు. వెళ్ళరా ఇంక. చూడూ... కాస్త అమ్మాయిని నిదానించాక పడుకో. అంతేగానీ ఎడమొగం, పెడమొగం పెట్టి పడుకోకు. జీవితంలోని ఎన్నో సమస్యలు పడకగదుల్లోనే సెటిలవుతున్నాయని ఎన్నో రీసెర్చ్‌లు చెప్పాయి. అని సలహా కూడా ఇస్తాడు.
దానికి భరత్ కొంచెం ఇబ్బందిగానే నవ్వుతూ... 'ఈ ఫిలాసఫీని పాటిస్తే మా యువతరానికి ఫ్యామిలీ కౌన్సిలింగ్‌తో పనే వుండదు. 'సైకాలజిస్టుల అవసరమే వుండదు నాన్నా..!' అని అంటాడు. భరత్ ఇంకేదో చెప్పబోతోంటే.. తనని దాదాపు బలవంతంగా లోపలికి పంపిస్తాడు. భరత్ బేలగా నాన్నని చూస్తూ తన గదిలోకి వెళతాడు. అ వెంటనే దాదాపు ఓ అరడజను మందికి ఫోన్లు చేసి... అనందంగా నవ్వుతూ... ఏవేవో మాట్లాడి... చాలా రిలాక్స్‌డ్ అయ్యి... తాను కూడా వెళ్ళి పడుకుంటాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకానొక వీకెండ్‌లోని అదివారం... పరంధామయ్య ఒక నిర్ణయంతో రెండు సూటికేస్‌లు పట్టుకుని హాలులోకి వచ్చాడు. భరత్, పద్మ వాళ్ళ వాళ్ళ పనుల్లో వున్నారు. వాళ్ళిద్దరినీ పిలిచి... ఒక సూటికేస్ వాళ్ళకిస్తూ.... “ఇదిగో ఇందులో విల్లా సమస్య తీరే డబ్బు వుంది. దీనితో విల్లాని మీ సొంతం చేసుకోండి.” అని ఇస్తాడు. వాళ్ళు పరమానందపడిపోయి... కాళ్ళ మీద పడిపోతారు. దీర్దాయుష్మాన్‌భవ అని దీవిస్తాడు. ఈలోగా పద్మ ఆ రెండో సూటికేస్‌ని చూసి... అదేంటి మావయ్యా అని అడుగుతుంది.
పరంధామయ్య... “అది మాజీయువకాశ్రమానికి వెళ్ళబోతున్న ఒక మాజీయువకునిది.” అంటాడు. వెంటనే భరత్... 'మాజీ యువకుడేంటి... మాజీ యువకాశ్రమం ఏంటి” అని సందేహం అడుగుతాడు. అ సందేహాన్ని నివృత్తి చేస్తూ... “వృద్ధి అంటే పెరగడం. వృద్ధులు అంటే పెరిగినవాళ్ళని మాత్రమే అర్థం. వయసులోనే కాదు. బుద్ధిలోనూ పెరిగినవాళ్ళు వృద్ధులు. ఒక ఎమ్.ఎల్.ఏ పదవి తర్వాత మాజీ ఎమ్.ఎల్.ఏ అంటాం. క్రికెట్‌కి స్వస్తి పలికాక... మాజీ క్రికెటర్ అంటాం. అలాగే వృద్ధుడైన యువకుడిని “మాజీ యువకుడు” అని అనాలి. వృద్ధుడంటే ముసలాడని కాదు. దేనికీ పనికిరాడని కాదు. జస్ట్ మాజీ యువకుడు అంతే. శారీరకంగా వృద్ధులమే అయినా... మానసికంగా యువ ఆలోచనలున్న మాలాంటి వాళ్లంతా మాజీ యువకులు. అలాంటి... నాలాంటి మాజీయువకులందర్నీ కూడగట్టుకుని. ..కూడబలుక్కుని... ఒక మాజీ యువకాశ్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇంత వరకూ మీరు అనాథశమాలు చూసారు. వృద్ధాశ్రమాలు చూసారు. కానీ వాటికి భిన్నమైన ఆశ్రమం మా మాజీయువకాశ్రమం. ఎవరూ లేని అనాథల కోసం అనాథశ్రమం. అందరూ వుండి ఒంటరి అయిన వృద్ధులు లేదా వదిలించుకున్న వృద్ధుల కోసం వృద్ధాశ్రమం. కానీ మా మాజీ యువకాశ్రమం అలా కాదు. అందరూ వుంటారు. ఎవరూ వదిలించుకోరు. అన్ని ఆప్యాయతలూ, అనురాగాలూ వుంటాయి. తేడా ఒకటే... భార్యాభర్తద్దరి ఉద్యోగాలతో సతమతమయ్యే వారికి పరిష్కారం, సమాధానమే ఈ ఆశ్రమం. మేము మీ దగ్గర వుండం. పవిత్ర ఆశ్రమంలో వుంటూ... మాకు తోచిన రీతిలో సమాజానికి సేవ చేస్తూ... మేమొక చోట వుంటాం. ఏదో పిక్‌నిక్‌కి వెళ్ళినట్టుగా ఆనందిస్తాం. మా దగ్గరికి మీరెప్పుడైనా రావచ్చు. మేమెప్పుడైనా మీ దగ్గరికి రావచ్చు. ఇంక మరి మా మాజీయువకా(శ్రమానికి వెళ్ళి వస్తాను” అని అనగానే... “వద్దు మావయ్యగారూ...! మీరు వెళ్ళొద్దు అని బ్రతిమిలాడుతుంది. భరత్ అయితే దాదాపు ఏద్చేస్తుంటాడు. నాన్నతో మాట్లాడలేక దివాను మీద కూర్చుని అలా ఏడుస్తూనే వుంటాడు. పరంధామయ్య, పద్మని భరత్ దగ్గరికి తీసుకెళ్ళి... భరత్‌ని ఓదార్చి... అతడ్ని లేపి... అతని చెయ్యిని పద్మ చేతిలో పెడుతూ... “అమ్మా పద్మా...! సాధారణంగా పెళ్ళి జరిగాక కూతురిని తండ్రి, అమె భర్తకి అప్పగిస్తూ... అమ్మాయిని మీకప్పగిస్తున్నాం జాగ్రత్త బాబూ... అంటారు. కానీ ఇక్కడ ఓ కొడుకు తండ్రి.. అతని భార్యకి చెబుతున్నాడు.” అని తాను కూడా వడ్వబోయి తమాయించుకుని...
“అమ్మా...! నా కొడుకుని నీ చేతిలో పెడుతున్నా? అని వెనుతిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోతూంటే... నేటి సమస్యకి ఓ కొత్త పరిష్కారాన్ని ఆవిష్కరించిన ఓ సామాజిక శాస్త్రవేత్తని నివ్వెరబోయి చూస్తూ... అలానే బేలగా వుండిపోతారు. కథ కంచికి వెళ్ళలేదు. గానీ సమస్య మాత్రమే కంచికి పోయిందంతే.
👏
రిప్లయితొలగించండిThanks
తొలగించండిNice👍
రిప్లయితొలగించండిThanks
తొలగించండికథలో చరవాణి సంఖ్య తప్పు గా ఉన్నది. దయజేసి 90307 34124 గా సవరించుకొని లేరు
రిప్లయితొలగించండిసవరించుకొనగలరు
రిప్లయితొలగించండిక్రొత్త పరిష్కారం చూపేట్టారు అభినందనలు 💐 ఒక మాజీ యువకుడు
రిప్లయితొలగించండిచాలా బాగుంది Dr శ్రీనివాస్ గారు, ప్రతి ఇంట్లో నేడు జరుగుతున్న పరిస్థితులకు అద్దం పడుతూ , చాలా చక్కగా పరిష్కరాన్ని కూడా సూచించారు. కధను ఆర్ధత, బాధ్యత, మానవ సంబంధాలతో మిళితం చేసిన విధానం excellant.
రిప్లయితొలగించండిWow. Good analysis
తొలగించండిThanks
తొలగించండిచాలా బాగుంది రావు గారు... సామాజికశాస్త్రవేత్త గా మీ సమస్యా-పరిష్కారం బాగుంది
రిప్లయితొలగించండిధన్యవాదాలు
తొలగించండిIt's real middle class story... excellent sir🙏🙏👏👏...in every job holder's family similar story will appear...but ending is different.... hats off for ur different thought sir ..👏👏👏
రిప్లయితొలగించండిThanks.
తొలగించండిప్రస్తుత సమస్యని చాలా చక్కగా అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు
తొలగించండి