శివలీలలు 2

ఆమె అందచందాలకు ముగ్గుడైన మహర్షి “రాజా! నీకు అభ్యంతరం లేకపాతే నీ కుమార్తెను నేను వివాహం చేనుకుంటాను". అన్నాడు.

 ఆ మాటలు విన్న రాజు “మునీంద్రా! అంతకన్నా నాకు అదృష్టం ఇంకేదైనా ఉంటుందా? నీ కోరిక తప్పక మన్నించాలి. కాని నా కుమార్తె "శ్రీహరిని తప్ప వేరివరినీ వివాహమాడను అంటోంది. అంతా భగవదేచ్చ. రేపే కదా స్వయంవరము? మీరు కూడా స్వయంవరానికి విచ్చేయండి” అన్నాడు, 

నారదుడు సంతోషముగా సరే అన్నాడు.

వెంటనే నారదుడు వైకుంఠానికి బయలుదేరాడు.

వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శేషపాన్పుపై శయనించి ఉన్నాడు. 

నారదుడు వైకుంఠం చేరి శ్రీహరిని చూసి “మహాప్రభో! సుఖాలు, భోగాలు అనుభవించటంలో నీకు మించినవాడు ఈ జగత్తులో మరెవరూ లేరు, నేను సన్యాసిని, ఏకాకిని. “స్వామీ! కళత్ర సుఖము, స్వర్గసుఖము కన్నా కూడా మిన్న’' అంటారు, భూలోకంలో కళ్యాణపురాధీసుడు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. ఆమె ఆందాల రాశి, అపరంజి బొమ్మ, నేను ఆమెను వివాహ మాడాలనుకుంటున్నాను. కానీ ఆమె శ్రీహరిని తప్ప మరెవ్వరినీ వివాహమాడను అంటున్నది. కాబట్టి ఓ జగన్నాధా! నీ హరి రూపము నాకు ప్రసాదించి నన్ను ఒక ఇంటి వాణ్ణి చేసి పుణ్యం కట్టుకో!” అంటూ అనేక విధాల ప్రార్గించాడు. 

ఆ మాటలు విన్న విష్ణుమూర్తి “నారదా! వివాహము అంటే ఒక స్రీని కట్టుకుని ఆమెతో కాపురం చెయ్యటమే కదా? మాయలో పడ్డవాడు ఆ మూయ నుండి బయటపడే మార్గమున్నది కాని సంసారంలో పడ్డవాడికి దానిలోనుంచి బయటవడే మార్గమే లేదు. “సారము లేనిది సంసారము" అని పండితులు చెబుతారు. సంసారివై మాయలో పడితే నిన్ను రక్షించేవారెవరు? ఒక్కసారి ఆలోచించు" అన్నాడు. ఆ మాటలకు కోపించిన నారదుడు "తాతా! వివాహం చేసుకున్నంత మాత్రం చేతనే మాయలో పడిపోతానా? శివమాయ, విష్ణు మాయలను జయించిన వాణ్ణి. ఇప్పటివరకూ నిన్ను ఏమీ అడగలేదు. ఈ ఒక్కటీ అడుగుతున్నాను. నీ హరి రూపాన్ని నాకు ప్రసాదించు” అన్నాడు. 

‘‘తధాస్తు’’ అన్నాడు శ్రీహరి.

భూలోకంలో కళ్యాణపురం పెళ్ళిసందడితో కోలాహలంగా ఉంది. దేశవిదేశాల నుండి రాజులు, మహారాజులు, రారాజులు, లెక్కలేనంత మంది న్వయంవర మంటపానికి విచ్చేశారు. వారందరూ రతనాల హారాలు ధరించారు. వజ్రాలు పొదిగిన కిరీటాలు ధరించారు. వారు ధరించిన వజ్రవైడూర్యముల కాంతులతో స్వయంవర మంటపము కొత్త కాంతులీనుతోంది. స్వయంవర మంటపం ప్రవేశించాడు నారదుడు. రాకుమారి కోరినట్లుగానే తను హరిరూపము ధరించి వచ్చాడు. అందాల రాశి తప్పక తననే వరిస్తుంది ఆని ఆలోవిస్తూ ఒకచోట ఆసీనుడైనాడు.

రాజకుమారి వరమాలను చేత ధరించి వరాన్వేషణలో బయల్దేరింది. ఆమెతోపాటు చెలికత్తెలు ముందు నడుస్తూ అక్కడ ఆసీనులైన రాజుల వివరాలు చెప్తున్నారు. రాజకుమారి మౌనంగా ముందుకు సాగిపోతుంది. రాజకుమారి దగ్గరకు రాగానే కూర్చున్న రాజులు మెడలు ముందుకు సాచుతున్నారు. మందంగా నడిచిపోతోంది రాకుమారి. అలా నడిచి నడిచి నారదుని వద్దకు వచ్చింది. చెలికత్తెలు రాకుమారితో ఏదో చెప్పారు. నారదుడు మెడను ముందుకు వంచాడు. 

చిరునవ్వు నవ్వింది రాకుమారి. ఘొల్లుమన్నారు చెలికత్తెలు. ఆ కోలాహలానికి అటువైపు చూసిన రాజులు కూడ పగలబడి నవ్వారు. ఏం జరుగుతుందో .. అందరూ ఎందుకు నవ్వుతున్నారో నారదునికి అర్ధంకాలేదు.. (సశేషం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి