నా అంతరంగం
‘‘ ఏమ్మా! సుధా ! ఉగాది పండుక్కేనా నీ కొడుకు, కోడలు ఇంట్లో
వుంటారా లేక వాడి అత్తవారింటికి వెళ్ళిపోతారా?’’ నీ కొడుకు అన్న పదాన్ని ఇత్తి
పలుకుతూ అడిగారు మా అత్తగారు రాజ్యలక్ష్మి.
మా అత్తగారికి, మావగారికి మా వారు ఒక్కరే సంతానం. మాకు కూడా మా
అబ్బాయి రక్షిత్ కూడా ఒక్కడే కొడుకు కావటం వలన మా నలుగురి ప్రేమాభిమానాలు వాడిమీద
ఎక్కువగా వున్నా మా అందరికన్నా వాళ్ళ నాయనమ్మ ప్రేమ ఒక పాలు ఎక్కువగా వుంటుందని
చెప్పుకోవాలి. చిన్నప్పటి నుండి వాడు ఏ పొరపాటు పనులు చేసినా మనవడ్ని మా అత్తగారు
బాగానే సపోర్టు చేసేవారు. అందుకే వాడికి కూడా వాళ్ళ నాయనమ్మ అంటే దగ్గర బాగానే
గారాలు పోయేవాడు.
మా అందరి ముద్దు ముచ్చట్ల మధ్య మా అబ్బాయి రక్షిత్ చదువు పూర్తి
చేసుకుని అమెరికా వెళ్ళఇ అక్కడ ఎమ్ఎస్ చేసినా మమ్మల్ని విడిచి వుండలేక తిరిగి
ఇండాయా వచ్చి ఇక్కడ హైదరాబాద్ లోనే ఉద్యోగంలో చేరి నాయనమ్మ, తాతయ్యల రిక తీర్చాడు.
ఉద్యోగంలో చేరిన ఆరునెలల తరువాత నుండి మనవడి పెళ్ళి చూడాలని పోరుపెట్టి మొత్తానికి
మా వాడ్ని పెళ్ళకి ఒప్పించారు మా అత్తగారు.
పెద్దలు కదుర్చిన సంబంధాన్ని చేసుకోడానికి ఒప్పుకున్నా తనక్కాబోయే
భార్య ఉద్యోగం చెయ్యాలని షరతు పెట్టాడు. చదువుకోని ఇంట్లో కూర్చోవటం అన్నది ఈ కాలం
పిల్లలు ఇష్టపడరని నాకు మావారికి తెల్సినా మా అత్తగారు మావగారు మాత్రం అమ్మాయి
ఉద్యోగం చేయ్యడానికి అభ్యంతరం పెట్టారు.
‘‘ తాతగారు సంపాదించిన భూములు, పొలాలు, తండ్రి ఉద్యోగం చేసి
సంపాదించిన డబ్బు మొత్తం వాడివే అయినప్పుడు మళ్ళీ పెళ్ళాం సంపాదన నీకెందుకని’’
మనవడ్ని నిలదీశారు.
చిన్నప్పటి నుండి తాతయ్యని అన్ని విషయాల్లోనూ తేలిగ్గా
ఒప్పించుకోగలిగినా నాయనమ్మని ఒప్పించటానిక మాత్రం బాగానే కాకా పట్టి మొత్తానికి
వాడి కోరిక ప్రకారం ఉద్యోగం చేస్తున్న అమ్మాయినే పెళ్ళి చేసుకున్నాడు.
అయితే మా అబ్బాయి పెళ్ళి కుదిరిన దగ్గరనుండి పెళ్ళి తర్వాత నాలో
అంతర్మధనం మొదలైంది. కారణం మా అత్తగారి మనస్తత్వం. నాకు పెళ్ళైన దగ్గర నుండి బాగా
తెలుసుకాబట్టి ఇంట్లో తన పెద్దరికం మాత్రమే వుండాలనుకునే ఆవిడ పెద్దరికంలో ఇంట్లో
వచ్చే మార్పులను ఎలా తట్టుకుంటారో నన్ను సందేహం పట్టుకుంది.
ఉమ్మడి కుటుంబంలో నుండి వచ్చిన పిల్ల అయితే నలుగురితో బాగా
కల్సిపోతుందని ముందు చూపులో అలాంటి అమ్మాయినే వెతికి పట్టుకొని మనవడి పెళ్ళి
చేసేరు కాబట్టి మా కోడలు స్పందన ఆవిడ వూహించిన విధంగా మా ఇంట్లో, బయట మా చుట్టాలు
అందకితొ బాగా కల్సిపోగలిగినా ఇంకా తనకి మడి, తడి అంతగా తెలియలేదంటూ మా అత్త
విసుర్లు అప్పుడప్పుడూ బాగానే విన్పిస్తూ వుండేవి. ఈ కాలం పిల్లలు చీరలు
కట్టుకోవాలన్నా, బరువైన నగలు వేసుకోవాలన్నా ఇష్టపడరని తెలిసిన నేను పెళ్ళికి ముందు
స్పందనకి పెద్ద ఖరీదైన పట్టుచీరెలు, నగలు కొనటానికి ఇష్టపడలేదు. కానీ మా అత్తగారు
మాత్రం ఒక్కగానొక్క కోడలుకి ఆ మాత్రం ఖరీదుపెట్టి చీరలు, నగలు కొనకపోతే నలుగురు నవ్విపోతారంటూ
అన్నీ ఖరీదైనవే కొనిపించారు. అక్కడితో ఆవిడ కోరిక తీరిపోలేదు. పెళ్ళైన తర్వాత ఏ
పండుగ వచ్చినా ఆ నగలు పెట్టుకొని, చీర కట్టుకొని గుడికి వెళ్ళమని, ఎవరు ఏ
పేరంటానికి పిల్చినా అవి వేసుకెళ్ళమని స్పందనని అడగటం కాదు ఒక విధంగా
ఆజ్ఞాపించినట్లే చెప్పేవారు.
కానీ స్పందన అసలు ఇష్టపడేది కాదు. ‘‘ అమ్మో, ఆ చీరలు కట్టుకోవటం
నాకసలు చేతకాదత్తయ్యా. ఇంక పండుగ పూట గుడికి వెల్తే దేవుడి దర్శనం మాట అటుంచి
గంటలు, గంటలు ఆ క్యూలో నిల్చునేసరికి మాకు దొరికిన ఒక్క రోజు శలవు కూడా వేస్టు
అయిపోతుంది.’’ అన్న ఆ అమ్మాయి మాటల్లో నిజాన్ని గ్రహించినా అత్తగారు
విసుక్కుంటున్నాఆ అమ్మాయిని బలవంతం పెట్టేదాన్ని కాదు. కొత్తగా పెళ్ళంది కాబట్టి
పండుగలకే శలవులు దొరుకుతాయి కాబట్టి కొడుకు ,కోడలు వాళ్ళ ఊరికి వెళ్ళటానికి
రిజర్వేషను చేయించుకున్న రోజు నుండి ఇంట్లో అత్తగారి మూలుగులు మొదలైపోయేవి.
‘‘ ఏం మనింట్లో మాత్రం పండుగలు చేసుకోమా ఏంటి, ప్రతీ పండుక్కి నీ
కొడుకు, కోడలు వాళ్ళ వూరికి వుడాయిస్తారంటూ’’ మొదలు పెట్టేవారు.
‘‘ పోన్లెండి అత్తయ్యా, పెళ్ళైన కొత్తకదా, మళ్ళీ పిల్లలు పుడితే
ప్రయాణాలు అవీ చెయ్యలేరు కదా!!’’ అని నేను సర్ది చెప్పబోతే ‘‘అలాగే కోడల్ని ముద్దుచేసి
నెత్తికెక్కించుకో, రేప్పొద్దున అది ముద్దపెట్టకపోతే బాధపడేది నువ్వే’’
భవిష్యత్తుని ముందుగానే ఊహించుకుని మాట్లాడే ఆవిడ మాటలకి విస్తుపోవటమే తప్ప
ఎదురించి వాదించే స్వభావం మొదటి నుండి నాకు లేదు కాబట్టి ‘‘మౌనమే నీ భాష ఓ
మూగమనసా’’ అని అన్నట్లుగా మౌనంగానే వుండి పోయేదాన్ని.
నేను కాపరానికి వచ్చిన దగ్గర నుండి ఉదయం పూట మడిగా వంట మా అత్తగారే
చేస్తుండేవారు. ‘‘ఇంక మనవడి పెళ్ళి కూడా అయిపోయిం కాబట్టి హాయిగా ఈ వంటలు,
వార్పులు మానేసి రెస్టుతీసుకోవే అమ్మా’’ అని మావారు ఒకనాడు సరదాగా అన్నమాటలకి ఆవిడ
కోపం తెచ్చుకోని ‘‘నావంట తిని, తిని మొహం మొత్తిందని నేరుగా చెప్పకుండా ఇలా
డొంకతిరుగుడు మాటలెందుకురా’’ అని తిరగి ప్రశ్నించిన ఆవిడ మాటలకి మళ్ళీ మా ఆయనగారు
ఆ ఊసెత్తటం మానేశారు.
పోనీ ఆవిడకి ఓపిక, శక్తి వున్నన్నాళ్ళూ చేసుకున్నా ఫర్వాలేదు అని
సరిపెట్టుకుందామంటే వారం రోజులూ అది చేసిన రపసాదాలు తినాల్సిందే! ఆదివారం
సూర్యనారాయణ మూర్తికి మొదలుపెట్టి మళ్ళీ శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రసాదాలు
నైవేద్యాలు పెట్టి ఎలాగూ మీరు టిఫిన్లు తినాలిగా ఈ ప్రసాదాలు టిఫిన్లు క్రింద
తింటే పుణ్యం, పురుషార్ధం కూడా వస్తాయని మభ్యపెట్టి అందరిచేత తినిపించేవారు.
వాళ్ళ పెళ్ళైన దగ్గర నుండి అలవాటై పోయిన మా మావగారు, తనకి జ్ఞానం
వచ్చిన దగ్గర నుండి తల్లి చేసిన ప్రసాదాలకు అలవాటైపోయిన మావు, ఈ ఇంటికి వచ్చిన
తర్వాత నేను కూడా దేవుడికి నివేదించిన ప్రసాదాలు దేవుడు ఎలాగూ ఆరగించడు కాబట్టి
మేమే ఆరగించేవాళ్ళం. ప్రసాదాలు తింటే బాగా చదువు వస్తుంది, పెద్ద అయ్యేక మంచి ఉద్యోగం
వస్తుంది, డబ్బులు వస్తాయంటూ చిన్నప్పటి నుండి మనవడికి కబర్లు, కథలు చెప్పి ఆవిడ
చేసిన ప్రసాదాలు చిన్నప్పుడు తినిపించినా రాను, రాను వాడుకా ఏదోవిధంగా తినకుండా
తప్పించుకునేవాడు.
వాడి పెళ్ళి అయ్యేక మొదటిసారిగా ఆవిడ చేసిన ప్రసాదాలు మీద చర్చలు
ప్రారంభయ్యేయి. మా కోడలు ఇంటికి వచ్చిన వెంటనే ఎప్పటిలా ఆవిడ సత్యన్నారాయణమూర్తికంటూ
హల్వా ప్రసాదం చేసి పొద్దుటే మావాడు, కోడలు ఆఫీసుకి బయల్దేరుతుంటే ప్రసాదం తినమంటూ
బలవంతం చేశారు. అందులో ఆవిడ వేసిన జీడిపలుకులు, తేలుతున్న నెయ్యి చూసిన మా కోడలు ఒక్కసారిగా
వులిక్కిపడి ‘‘ అమ్మో! ఇలాంటివి టిఫిన్లు క్రింద తినటం నావల్ల కాదు, కావలస్తే
ప్రసాదంలాగా ఒక స్పూను తినగలను. నిన్ననే కదా ప్రసాదం అంటూ వడలు చేసి మాచేత
తినిపించారు. ఇ రోజూ ఇలాంటి ప్రసాదాలు తింటూ వుంటే మరో వారం రోజుల్లో నా బరువు
రెండురెట్లు పెరిగిపోయి నేను చేసిన వాకింగులు, చేసిన ఎక్సర్ సైజులు అన్నీ పనికిరాకుండా
పోతాయంటూ ఖచ్చితంగా చెప్పేసరికి ‘‘తప్పమ్మా, ప్రసాదం తిననని చెప్పకూడదు. అయినా మరీ
అలా పూచిక పుల్లలా వుండి గట్టిగా తుమ్మితే ఎగిరిపోయేలా వుంటే రేప్పొద్దున
పిల్లల్ని ఎలా కంటావు. ఎలా పెంచుతావంట క్లాసు తీసుకున్నారు. పెళ్ళికి ముందు మా
మనవడి పెళ్ళాం సన్నగ, నాజూగ్గా, మెరుపుతీగలా వుంటుందన్న ఆవిడ డైలాగులు హఠాత్తుగా
మారిపోవటమే కాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా ఇంట్లో విసురుమాటలు, సాధింపులు. ఆవిడ
స్పందన మీద అనటం మొదలు పెట్టారు. ప్రతి శని, ఆదివారాలు ఇంట్లో వుండకుండా బయట
సినిమాలకి, షికార్లకి తిరుగుతారని, రోజు పొద్దుట నిద్ర ఎనిమిది గంటల వరకూ లేవరని ఇలా
మాముందే కాదు ఇంటికి ఎవరొచ్చినా ఇవేమాటలు మొదలు పెట్టేవారు. పిల్లల్ని గారంగా
పెంచటమే కాదు, వాళ్ళకి పెళ్ళై అత్తారింటికి వెళ్ళేక ఎలా మసలు కోవాలో బుద్ధులు కూడా
చెప్పి పంపించాలంటూ స్పందన తల్లిదండ్రులను కూడా మాటలనేసరికి మా కోడలు
చిన్నపుచ్చుకునేసరికి మావాడు సర్ది చెప్పుకునేవాడు. కానీ ఇలా చిలికి, చిలికి
గాలివాన అయేటట్టు ఇవన్నీ దేనికి దారితీస్తాయోనని నాకు భయం పట్టుకుంది. నా ఆలోచనలను,
బయాల్ని పసిగట్టిన మావారు ‘‘ సుధా! నీ భయం నాకర్థమైంది. మా అమ్మ చాదస్థం నాకు
తెల్సు, మన పెళ్ళైన కొత్తలో నీకు ఇలాంటి అనుభవాలు ఎదరైనా నాకోసం ఓర్చుకున్నావు. ఇప్పుడు
మన పిల్లలు కూడా ఆవిడ కంట్రోల్లో వుండాలన్న ఆవిడ అభిప్రాయం తప్పని నాకు తెల్సినా ఆవిడని
ఒప్పించలేకపోవటం నా బలహీనత. ఈ సమస్య ఒకటి, రెండు రోజుల్లో తేలేదికాదు. ఈ సమస్యకి
పరిష్కారం మన కొడుకు, కోడలు వేరే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ పెట్టుకోవటం. ఈ విషయం
నీకు, వాడికి కూడా బాధ కల్గించినా ఏరోజు ఏగొడవలు వస్తాయోనని నువ్వు టెన్షన్
పడేకన్నా అదే నయం. రాత్రి వాళ్ళు ఆఫీసు నుండి రాగానే నేనే చెప్పి వాళ్ళను ట్రాన్స్ఫర్
కి ఒప్పిస్తాను.’’ అంటున్న మావారి మాటలు విని నాకు దుఃఖం ఆగలేదు.
రాత్రి పిల్లలిద్దర్నీ పిలిచి విషయమంతా చెప్పి ‘‘ మీ నాయనమ్మ
చాదస్తురాలేగానీ చెడ్డదిగాదు. ఇప్పుడు ఈ వయస్సులో ‘ఇది మంచిదికాదు, ఇలా
మాట్లాడకూడదు’ అని చెప్తే ఆవిడ పెద్దరికాన్ని దెబ్బతీసినట్లే వుంటుంది. మీ అమ్మ
ప్రతిరోజూ మీ అందరి మధ్య నలిగిపోయేకన్నా కొన్నాళ్ళు మీరు వేరే వూరికి ట్రాన్స్ఫర్
పెట్టుకుంటేనే మంచిదని నాకు అన్పిస్తున్నది. వీలున్నప్పుడల్లా మీరు వస్తూ వుండండి.
మధ్యమధ్యలో అమ్మ మీదగ్గరికి వస్తుంటుంది.’’ అని నచ్చచెప్తుంటే ఆయన గొంతు వణకటం
నేను గమనించాను.
మావాడు ఏదో చెప్పబోతుంటే మధ్యలో స్పందన కలుగ చేసుకొని ‘‘ సారీ
మావయ్య, మేమెక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకోని మీకు దూరంగా వెళ్ళదలచుకోవటం లేదు. అటు
పెద్దవారైన అమ్మమ్మగారికి, చిన్న వాళ్ళమైన మాకు సర్దిచెప్పలేక అత్తయ్యగారు
పడుతున్న ఆవేదనను మేము ముఖ్యంగా మీ అబ్బాయి చూడలేక బాధపడుతున్నారు. నేను కూడా ఒక ఉమ్మడి
కుటుంబం నుండే వచ్చిన దాన్ని కాబట్టి ఇలాంటి సమస్యల్ని అర్ధంచేసుకోగలను.
మిమ్మల్నందరినీ విడిచిపెట్టి ఆయన ఎక్కడా వుండలేరని నాకు తెల్సు. అసలు తప్పు నాదే
కాబట్టి అమ్మమమగారు చెప్పినట్లు వింటే సరిపోతుంది. మా అమ్మమ్మ బ్రతికే వుంటే
తనుకూడా నాకు ఇలాగే బుద్ధులు చెప్పేదేమోనని నేను సర్దుకుపోయి వుంటే ఈ గొడవలు
వచ్చేవి కావేమో! మిమ్మల్ని బాధపెట్టినందుకు నిజంగా సారీ చెప్తున్నా’’ అంటున్న
స్పందన మాటలు పూర్తిగాకుండానే
‘‘ నువ్వు కాదమ్మా సారీ చెప్పాల్సింది. నేనే మిమ్మల్నందరినీ ఆ
ముక్క అడగాలి. పొద్దుట గుడికి వెళ్ళినప్పుడు మీ తాతయ్యగారు నాకంతా బోధపరిచారు.
వయస్సు అయిపోయిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్న ఈ రోజుల్లో నాకింత
వయస్సు వచ్చినా అందరూ నామాటే వినాలి, ఇంట్లో నా పెద్దరికమే నిలబడాలన్న పట్టుదలతో
మిమ్మల్నందరినీ బాధపెట్టేను. నా కొడుకు చెప్పినట్లు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ కృష్ణారామా
అనుకుంటూ హాయిగా ఇంక కాలక్షేపం చేస్తాను. నువ్వు, నా మనవడు ఎక్కడికి వెళ్ళనవసరంలేదు.
ముచ్చటగా మూడు తరాల వాళ్ళం కల్సి ఒకే ఇంట్లో వుంటూ అందరికీ ఆదర్శంగా నిలుద్దాం.
అయితే దీనికి ముందు నువ్వు, నామనవడు నా కోరికఒకటి తర్చాలి’’ అని చెప్తున్న ఆవిడ
మాటలకి
‘‘ తప్పకుండా నాయనమ్మా. అర్జంటుగా నీ కోరిక చెప్తే నేను, నీ
మనవరాలు వెంటనే దాన్ని కొని తెస్తాము’’ అంటున్న మనవడితో ‘‘ కొని తేవటం కాదురా మనవడా, అర్జంటుగా మీ ఆవిడ్ని
నాకోసం ఒక మనవరాల్ని కనిపెట్టమని అడుగుతున్నా.’’ అన్న ఆవడ మాటలకి అందరం హాయిగా
నవ్వుకున్నాం.
-----------
Chaalaa chaalaa baagundi.
రిప్లయితొలగించండిSuper ga undi. Reay reflects on today's generatio , and also how to adjust and have best of family support
రిప్లయితొలగించండిAmazing 👏 love ❤️ it. Good story
తొలగించండిVery nice story
తొలగించండిచాలా బావుందండీ కథ. చక్కగా రాశారు. అభినందనలు రమాదేవి గారూ...
రిప్లయితొలగించండికథ చదువుతున్నంతసేపూ పాత్రలు కళ్ళముందు కదిలాయి. అద్భుతంగా రాశారు రమాదేవి గారు. మీకు నా అభినందనలు.
రిప్లయితొలగించండికథకు ముగింపు బాగా ఇచ్చారు👌👌 కథ చాలా బాగుంది
రిప్లయితొలగించండిKadha chaala bagundi
రిప్లయితొలగించండిChala Baga raseru ,
రిప్లయితొలగించండిVery nice story...well written...reflects the dilemma in present day hous
రిప్లయితొలగించండిeholds
చాలా చక్కటి కథ!! చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటే అందరూ సంతోషం గా కలిసి ఉండవచ్చునని తెలియచేసే మంచి కథ,
రిప్లయితొలగించండిChala baga raseru. Ila okari kosam okaru saddukupothe aa illu swargam. Manchi message icheru ee kathalo.
రిప్లయితొలగించండికథ ముగింపు పాజిటివ్ గా వుండి ఆహ్లాదపరిచింది. స్పందన స్పందించిన తీరు చాలా బాగుంది. నాయనమ్మ గారు ఎట్టకేలకు పిల్లల అభిరుచులను మన్నించటం మరింత ముదావహం. మరి ఆమె కోరిక తీరాలి సత్వరం.
రిప్లయితొలగించండిరచయిత్రి రమాదేవి గార్కి అభినందనలు!