హనీ ట్రాప్
నాన్న నాకు ఒక మంచి ఫోన్ కావాలి.మా ఫ్రెండ్స్ అందరి దగ్గర మంచి మంచి ఫోన్స్ ఉన్నాయ్ నాకు ఒక మంచి ఫోన్ కొని ఇవ్వచ్చు కదా నాన్న అని ఎంతో గారంగా అడుగుతుంది ఆద్య.నువ్వు ఇంకా చాలా చిన్నపిల్లవి తల్లి అప్పుడే ఫోన్ నీకు అవసరం ఉండదు అంటారు ఆద్య వాళ్ళ నాన్న గారు.
ఎలానో ఇప్పుడు నేను ఇంటర్ కి వచ్చేసాను నా 10th క్లాస్ కూడా అయిపోయింది.ప్లీజ్ నాన్న అమ్మ కి చేప్తుంటే అమ్మ ఏమో అప్పుడే ఫోన్ ఏంటి అని తిడుతుంది .నువ్వే అమ్మ ని ఒప్పించి నాకు ఒక మంచి ఫోన్ కొని ఇవ్వు నాన్న ప్లీజ్ అని అడుగుతుంది ఆద్య.
అది కాదు రా చిట్టి తల్లి అమ్మ చెప్పేది కూడా నీ మంచి కోసమే కదా.నీకు ఇంటర్ అయిపోయి బీటెక్లో జాయిన్ అవుతావు కదా అప్పుడు నీకు నువ్వు అడిగిన దాని కంటే మంచి ఫోన్ కొని ఇస్తా,పైగా నీకు అప్పుడు లాప్టాప్ కొద కొనిపెడతా ఇప్పుడు ఫోన్అ వద్దురా తల్లి అని బుజ్జగించే ధోరణిలో చెపుతారు ఆద్య వాళ్ళ నాన్న గారు శేఖర్ గారు.
మీరు అంత మంచిగా చేప్తే వినే కూతురు ఎం కాదు మీ కూతురు ..అది ఎన్ని వేషాలు వేసినా దానికి అప్పుడే సెపరేట్ ఫోన్ కొని ఇవ్వడానికి నేను ఒప్పుకోను. దాని వయసు కి అప్పుడే ఫోన్ ఏంటి ..ఎం అక్కర్లేదు. అంతగా కావాలి అంటే మన ఇద్దరి దగ్గర ఫోన్స్ ఉన్నాయ్ కదా ..అవి వాడుకోమనండి అని సీరియస్ గా అంటారు ఆద్య కి అమ్మైన జ్యోతి గారు .
అది కాదు అమ్మ నువ్వు నాన్న పొద్దున్నే వెళ్ళిపోతారు ఆఫీస్కి .మళ్ళి రాత్రి ఎప్పటికో వస్తారు.ఇప్పుడు హాలిడేస్ కాబట్టి నేను ఏమో ఇంట్లోనే ఉండాలి .. ఇంకా మీ ఫోన్స్ నేను ఎలా వాడుకుంటా అమ్మ ..మీ ఇద్దరు ఆఫీస్ కి వెళ్ళిపోతే బోర్ కదా అమ్మ.పోనీ అమ్మమ్మ దగ్గరకి లేదా నాన్నమ్మ దగ్గరకి వెళ్దాం అంటే అక్కడ ఏమో సిగ్నల్ సరిగా ఉండదు..ప్లీజ్ అమ్మ మా ఫ్రెండ్స్ అందరు వాళ్ళ పేరెంట్స్ తో కొనిపించుకుంటున్నారు...
నువ్వు ఎన్ని చెప్పిన నీ మాట ఐతే మేము వినము ఆద్య ..నీకు ఇంట్లో బోర్ అనిపిస్తే మూవీస్ చూడు టీవీ లో ఇప్పుడు అన్ని టీవీ లో వచ్చేస్తున్నాయి కదా ఇంక నీకు ఫోన్ అవసరం ఎం ఉంటుంది అంటారు జ్యోతి గారు.
ఏంటమ్మా ఎం అడిగిన నో అంటావ్
పోనీ మనం ఏమైనా ఫైనాన్సియల్ గా సరిగా లేమా అంటే నువ్వు నాన్న ఇద్దరు జాబ్ చేస్తున్నారు అంటే ఎక్కువే సంపాదిస్తారు కదా ఎందుకు అమ్మ చిన్న చిన్న వాటికీ కూడా ఇంత ఇష్యూ చేస్తావ్ .అసలు నేను అంటే ఇష్టమే ఉండదు నీకు అందుకే నేను ఎం అడిగిన నాకేమి కొని ఇవ్వవు..నాన్న ని కూడా ఏమి కొననివ్వవు అందుకే ఐ హేట్ యు అమ్మ.ఐ హేట్ యు సో మచ్ . మీరు నాకు ఫోన్ కొని ఇస్తా అని చెప్పే వరుకు నేను అసలు మీ ఎవరితో మాట్లాడాను భోజనం కూడా చేయను అని గది లోపలి వెళ్లి డబ్ అని సౌండ్ వచ్చేలా డోర్ వేసింది ఆద్య.
ఆద్య మొండి తనానికి, ఆద్య ప్రవర్తనకి తల పట్టుకుని కూర్చున్నారు ఆద్య తల్లితండ్రులు.
శేఖర్, జ్యోతి ఇద్దరు పెద్ద పెద్ద కంపెనీస్ లో ఉద్యోగం చేస్తున్నారు..వాళ్ళకి వచ్చే నెల జీతం కూడా లక్షల్లో ఉంటుంది. బయట పెరుగుతున్న ఖర్చులకు ఇద్దరు పిల్లలు ఐతే కష్టమని ఆద్య ఒక్కటే చాలు అని అనుకుంటారు..ఆద్యని ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ లో చదివించారు.ఇద్దరు జాబ్ చేయడం ఆద్య తో టైం స్పెండ్ చేయడం కుదరట్లేదు అని సాటర్డే సండే ఆద్య ఎక్కడికి అంటే అక్కడికి తీసుకుని వెళ్లడం తనకి నచ్చినవి కొని ఇవ్వడం అవి చేయడం వల్ల చిన్నప్పటి నుండి మొండితనం పెంకి తనం వచ్చేసాయి ఆద్యకి.ఆద్య తల్లితండ్రులు ఇద్దరు ఆద్య ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వకూడదు అని వాళ్ళకి ఉన్న టైం అంత ఆద్యతోనే గడపడానికి ప్రయత్నిస్తారు ...
ఇప్పుడు అదే వీళ్ళకి పెద్ద సమస్య గా తయారైంది.
పోనిలే జ్యోతి ఇప్పుడు చిన్న పిల్లల చేతిలో కూడా స్మార్ట్ ఫోన్స్ వుంటున్నాయి.మన ఆద్య కూడా మరి చిన్న పిల్ల ఎం కాదు కదా జనరేషన్ చేంజ్ అవుతుంది మనం కూడా చేంజ్ అవ్వాలి అది అడిగిన ఫోన్ కొని ఇచ్చేద్దాం అని జ్యోతి గారితో అంటారు శేఖర్ గారు కూతురు నిజం గానే ఆకలితో పడుకుంటుంది ఏమో అనే బాధ తో..
ఇద్దరు గారాబం చేస్తే అది ఎక్కడ ఇంకా మొండిగా తయారైపోతుందో అనే భయంతో నేను స్ట్రిక్ట్ గా ఉంటె అది ఏమో నన్ను దెయ్యం చూసినట్టు చూస్తుంది అండి చూసారా ఐ హేట్ యు అమ్మ అని ఎలా డోర్ వేసేసుకుందో ..నేను ఎం చేసిన దాని మంచి గురించే అని దానికి ఎప్పటికి అర్ధం అవుతుండి అంది నాకు అది అంటే ప్రాణం అని ఎప్పటికి తెలుసుకుంటుంది అని బాధ పడతారు జ్యోతి గారు
శేఖర్ గారు జ్యోతిగారి భుజం చుట్టి చేయి వేసి ఆమెని దగ్గరకి తీసుకుని నీ జాగ్రత్త వెనుక ఉన్న ప్రేమని అర్ధం చేసుకునే అంత తెలివి దానికి ఇంకా రాలేదు జ్యోతి నువ్వు బాధ పడకు ..నీ ప్రేమ అర్ధం అయినపుడు అదే అమ్మ అమ్మ అంటూ నీ వెనుక తిరుగుతుంది.అప్పుడు మీ ఇద్దరు ఒక పార్టీ అయిపోయి నన్ను సైడ్ చేసేస్తారు చూడు అని ఓదారుస్తారు..
హ్మ్మ్ సరే అండి నాకు ఆకలి వేయట్లేదు.ఆద్య ఆకలితో ఉండలేదు అది అడిగిన ఫోన్ ఎదో కొనిపెడతా అని చెప్పి భోజనానికి పిలవండి అని చెప్పి లోపలికి వెళ్లి పోతారు జ్యోతి గారు..
ఫోన్ కొనిపెడతా అని తండ్రి చెప్పడం తో ఫుల్ గా తినేసి హాయి గా పడుకుంటుంది ఆద్య.మరుసటి రోజు తండ్రి తో తనకి నచ్చిన ఫోన్ కొనిపించుకుని సంతోషం గా ఇంటికి వస్తుంది ఆద్య.
ఫోన్ ఉంది కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తె తోలు తీసేస్తా అని తల్లి స్ట్రాంగ్ గా ఇచ్చిన వార్నింగ్ ని ఫోన్ చూసి మురిసిపోతూ మా అమ్మ అసలు ఈ జెనెరేషన్లో ఉన్న అమ్మ లనే ఉండదు అనుకుంటూ పెడచెవిన పెడుతుంది ఆద్య.
మరుసటి రోజు తల్లి తండ్రి ఆఫీస్ కి వెళ్ళిపోయాక వాట్సాప్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్,స్నాప్ఛాట్ అప్స్ ఇన్స్టాల్ చేసి ఫ్రెండ్స్ అందరికి నెంబర్ ఇచ్చి వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ ఎలా యూస్ చేయాలో తెలుసుకుంటుంది.
తరువాతి రోజు నుండి ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ వంటి అప్స్ లని అదే పనిగా యూస్ చేయడం మొదలు పెడుతుంది ఆద్య ..తన ఫొటోస్ ను పోస్ట్ చేస్తూ ఫాలోయర్స్ పెంచుకోవాలి అని పోస్ట్స్ చేస్తూనే ఉంటుంది .ఇంస్టాగ్రామ్ లో ఎవరు ఎవరో ఫాలో అవుతున్నవాళ్ళు అందరు తన అందం చూసే ఫాలో అవుతున్నారు అని చాల గొప్పగా ఫీల్ అవుతూ వాళ్ళతో కూడా చాట్ చేస్తూ చాటింగ్ లో ఎం కాదులే అనే మొండి ధైర్యంతో తెలియని వాళ్ళతో చాట్ చేసి కొత్త పరిచయాలు పెంచుకుని అవి అన్ని ఫ్రెండ్స్ కి చెపుతూ రోజు అంత గడిపేసేది.
ఒక రోజు ఫోన్లో మాట్లాడుతూ ఉండగా నువ్వు చాలా అందం గా ఉంటావ్ కదా ఆద్య పోస్ట్స్ తో పాటు నువ్వు కూడా అందరిలా ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తే నీ ఫాలోయర్స్ను ఇంకా పెరిగి నువ్వు కూడా చాలా ఫేమస్ అయిపోతావ్ అని చెపుతారు ఆద్య వాళ్ళ ఫ్రెండ్స్. అసలే టీనేజ్ లో ఉన్న ఆద్య ఆ మాటలకూ చాలా అట్ట్రాక్ట్ అయిపోయి అప్పటి నుండి రీల్స్ కూడా చేయడం మొదలు పెట్టింది ...
ఆ రీల్స్ కింద వచ్చే కామెంట్స్ కి వయసు తో వచ్చిన చంచెలస్వభావం తో ఆ కామెంట్స్ కి మురిసిపోయి అబ్బాయిలు తన అందాన్ని పొగుడుతుంటే గొప్ప గా ఫీల్ అయ్యి అబ్బాయిలతో చాట్ చేయడం లేదా రీల్స్ చేయడం తో రోజు అంత గడిపేసేది..
జ్యోతి ,శేఖర్ గార్లకు వల్ల ఆఫీస్ వర్కులో పడిపోయి ఇవి అన్ని పట్టించుకునే సమయం ఉండేది కాదు.ఆద్య కూడా వాళ్ళు ఉన్నపుడు అసలు ఫోన్ యూస్ చేయకుండా ఎదో అవసరానికి మాత్రమే ఫోన్ వాడుతున్నట్టు వాళ్ళ ముందు నటించేది.వాళ్ళు కూడా ఆద్య అందరిలా కాకుండా ఫోన్ చాల తక్కువ వాడుతుంది అని ఎంతో సంతోసించేవారు.
ఇంతే కాకుండా ఎవరైనా అబ్బాయిలు తనతో మంచి గా మాట్లాడి తనని పొగిడితే వాళ్ళకి తన ఫోన్ నెంబర్ ఇచ్చేసి వాళ్ళతో మాములు ఫోన్ కాల్ కాకుండా వీడియో కాల్స్ కూడా మాట్లాడేది.కానీ ఇలా అబ్బాయిలతో వీడియో కాల్ మాట్లాడుతున్నట్టు తన ఫ్రెండ్స్ కి కూడా చెప్పలేదు.దానికి గల కారణం ఎక్కడ తన ఫ్రెండ్స్ ఆద్య ఫాలోయింగ్ ని చూసి కుళ్ళుకుంటారో అని ఆద్య అనుకోవడమే.
ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒక రోజు ఎప్పట్లానే ఆద్య కి తెలియని నెంబర్ నుండి వీడియో కాల్ వస్తుంది.ఆద్య కూడా తనకి చాలా మంది ఫాన్స్ ఉన్నారు కదా వాళ్లలో ఎవరైనా అయ్యి ఉంటారులే అని ఆన్సర్ చేస్తుంది..ఆద్య ఆన్సర్ చేసిన కొన్ని సెకండ్స్ కి ఆ కాల్ కట్ అయ్యి పోతుంది ..ఎవరో అనుకుని మళ్ళి ఆద్య వాళ్ళకి వీడియో కాల్ చేస్తుంది కానీ అవతల వాళ్ళు ఎవరు కూడా లిఫ్ట్ చేయరు.ఎవరు చేసారో ఏంటో అనుకుంటూ అవసరం ఐతే వల్లే మల్లి చేస్తారులే అని ఆద్య కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోదు.
ఈ ఇన్సిడెంట్ జరిగిన రెండు రోజులకి ఆద్య ఫోన్ కి ఆద్య న్యూడ్ ఫొటోస్ వస్తాయి.ఆ న్యూడ్ ఫొటోస్ తో పాటు ఒక నెంబర్ పెట్టి ఆ నెంబర్ కు వాళ్ళకి 5 లక్షలు పంపాలి అని లేదా ఆద్య న్యూడ్ ఫొటోస్ తన కాంటాక్ట్స్ లో ఉన్నవాళ్ళ అందరికి పంపుతాం అని ఆ మెసేజ్ సారాంశం.ఆద్య తన న్యూడ్ ఫొటోస్ ఇంకా ఆ మెసేజెస్ చదివి భయంతో వణికిపోయింది.అసలు తన న్యూడ్ ఫొటోస్ వాళ్ళ దగ్గరకి ఎలా వెళ్ళాయో అర్ధం కాలేదు ఆద్యకి.
ఒక్క సరిగా మైండ్ పనిచేయడం ఆగిపోయింది.ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు ఆమెకి
తండ్రికి చెప్పుకోలేదు.తల్లి కి చెప్పాలి అంటే తల్లి చంపేస్తుంది ఏమో అని భయం.తన ఫ్రెండ్స్ కి చెప్పాలి అనుకుంటుంది కానీ వాళ్ళు కూడా తనని తప్పుగా తీసుకుంటారు ఎవరికి ఏమి చెప్పదు.
తన గదిలోకి వెళ్లి భయం తో చాలా సేపు ఏడుస్తుంది ఆద్య.ఆ భయం తో ఎం చేయాలో అర్ధం అవ్వక కిచెన్ లోకి వెళ్లి చాకు తో చెయ్యి కోసేస్కుని సూసైడ్ అట్టెంప్ట్ చేస్తుంది.
ఆఫీస్ నుండి ముందు గా ఇంటికి వచ్చిన జ్యోతిగారు ఆద్య ఎం చేస్తుందా చూద్దాం అని ఆద్య ని పిలుస్తూ ఆద్య రూమ్ కి వెళతారు.కానీ రూమ్ లో ఆద్య ఉండదు . ఎక్కడికి వెళ్లి అనుకుంటూ "ఆద్య ఆద్య" అని పిలుస్తూ కిచెన్ లో చుస్తే చేతి నుండి రక్తం కారుతూ నేల మీద అచేతనం గా పడి ఉన్న ఆద్య కనిపిస్తుంది.ఆద్యని ఆలా చూసినా జ్యోతి గారు హడలిపోయారు .జరిగింది చూసింది అర్ధం చేసుకోవడానికి జ్యోతి గారికి రెండు నిముషాలు పట్టింది .తరువాత వెంటనె తేరుకున్న జ్యోతి గారు శేఖర్ గారికి విషయం చెప్పి ఆద్య ను హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు.
కాసేపటికి శేఖర్ గారు హాస్పిటల్ కి చేరుకున్నారు..శేఖర్ గారు ఐతే ఆద్య ని చూసి చిన్న పిల్లాడిలా ఏడుస్తారు .
ఎంత ఆలోచించిన ఇద్దరికీ ఆద్య సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఎం వచ్చింది అనేది అర్ధం కాలేదు.
ఈ లోపు డాక్టర్ గారు వచ్చి బ్లడ్ ఎక్కువ గా పోయింది అని కాసేపటికి సృహ లోకి వస్తుంది అని చెప్పి ప్రాణానికి ఏమి ప్రమాదం లేదు అని చెప్పి వెళ్ళిపోతారు.డాక్టర్ గారు చెప్పినట్టుగానే ఆద్యకి రెండు గంటలకి స్పృహ వస్తుంది
సృహ వచ్చిన ఆద్య ఎదురుగా ఉన్న తల్లితండ్రుల్ని చూసి బయపడిపోతుంది .కూతురి భయాన్ని అర్ధం చేసుకున్న జ్యోతి గారు ఎం జరిగిందో చెప్పు తల్లి నిన్ను నేను నాన్న ఒక్క మాట కూడా అనం ఎం జరిగిందో తెలుసుకుని నీకు సపోర్ట్ ఇష్టం అని లాలన గా అడుగుతారు.
అప్పుడు ఆద్య ఏడుస్తూ నేను ఏ తప్పు చేయలేదు అమ్మ అని జరిగిన విషయం మొత్తం చెపుతుంది.
విషయం విన్న జ్యోతి గారు ఎం కాదు నువేం బయపడకు తల్లి నేను నాన్న చూసుకుంటాం అని నుదిటి మీద ప్రేమ గా ముద్దు పెట్టి రెస్ట్ తీసుకో అని చెప్పి బయటకి వచ్చేస్తారు.
సూసైడ్ కేసు కాబట్టి ఎం జరిగిందో తెలుసుకుని FIR రాసుకుందాం అని బయట ఉన్న పోలీస్ కి జరిగిన విషయం చెపుతారు జ్యోతి ,శేఖర్ గారు
విషయం మొత్తం విన్న ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు మీ అమ్మాయి కి జరిగిన ఇన్సిడెంట్ ని హనీ ట్రాప్ అంటారు..ఇప్పుడు ఇలాంటి కేసెస్ చాలా ఎక్కువ గా జరుగుతున్నాయి .కొంత మందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి వీడియో కాల్ చేసి వాళ్ళు ఆన్సర్ చేయగానే వాళ్ళని ఫొటోస్ తీసి అవి న్యూడ్ ఫొటోస్ ఇంకా వీడియోస్ గా మార్చి బ్లాక్మెయిల్ చేస్తారు.ఇలానే కాకుండా ఫేక్ అకౌంట్స్ తో మంచిగా మాట్లాడుతూ వాళ్ళ నుండి డబ్బు దోచేయడం లాంటివి జరుగుతున్నాయి.
భయపడాల్సిన అవసరం ఎం లేదు మీ పాప కి ఎం కాదు మేము చుసుకుంటాం. మీరు కూడా cybercrime.gov.in అనే వెబ్సైటు లో కంప్లైంట్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతారు.
జరిగిన విషయం అంత ఆద్యకి చెప్పి దైర్యం గా ఉండమని చెపుతారు.
ఆద్య జ్యోతి గారి పట్ల తాను ప్రవర్తించిన తీరుకి సారీ చెప్పి ఫోన్ జ్యోతిగారికి ఇచ్చేసి ఇంటర్ కంప్లీట్ అయ్యాక తీసుకుంటాను అని ఈ లోపు అవసరం ఐతే వాళ్ళ ఫోన్ తీసుకుంటాను అని చెపుతుంది.ఆద్యలో వచ్చిన మార్పుకు ఎంతగానో సంతోషిస్తారు ఆద్య తల్లితండ్రులు.
సెల్ ఫోన్ వలన జరిగే అనర్థాలు, ముఖ్యంగా యువత చెడిపోయె అవకాశాలు ఎక్కువ అయ్యాయి. ఆ క్రమంలో వచ్చిన కథ హనీట్రాప్ ’ ఆలోచింపజేసేదిగా వుంది. తల్లిదండ్రులు ఎంత బిజీ అయినా కూడా పిల్లల ప్రవర్తనను, కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలి. అవాంఛనీయ విషయాల పట్ల జాగ్రత వహించాలి.
రిప్లయితొలగించండికథ నేటి పరిస్థితులకు అద్దం పడుతుంది.
Tqq andi😊😊
రిప్లయితొలగించండి