మా మాట
మా తండ్రిగారైన సూర్యనారాయణగారు ఈ పద్యములు కబీరు దోహాల స్ఫూర్తితో ఆటవెలది ఛందస్సులో రచించినారు. ఆయన జ్ఞాపకాలు ఎన్నో ఈ భూమి మీద వదిలి వెళ్ళారు. అందులో కొన్ని ఎందరికో తెలిసినవి. మరికొన్ని కొందరికి మాత్రమే తెలిసినవి. ఆ కొన్నిటిలో ఒకటైన కబీరు దోహాల తెలుగు పద్య అనువాదాన్ని మీకు అందించాలన్న తపనతో ఈ ప్రయత్నం.
సరళమైన తెలుగులో ఈ పద్యాలు వుండటం ఈ పద్యముల ప్రాముఖ్యత. ఈ పద్యములలో ప్రపంచ సారముంది. ఈ పద్యములలో ప్రతి ఒక్కరి మనస్థత్వం ఇమిడి వుంది. ఈ పద్యములలో ఎవరి ఊహలకు అందని భావసారూప్యత వుంది. ఈ పద్యములలో ప్రపంచ సందేశం వుంది. అందుకే ఆయన కబీరు దోహాలను పదిమందికీ పంచుదామనే తలంపుతో ఆయన కుమారుడైన నేను (విద్యాధర్ మునిపల్లె) మరియు మా కుటుంబ సభ్యులం అందరం కలిసి చిరుపుస్తకరూపంలో దీనిని మీ ముందు వుంచే ప్రయత్నం చేస్తున్నాం..
మా ఈ ప్రయత్నాన్ని సహృదయంతో ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తున్నాం.
కీ.శే. మునిపల్లె సూర్యనారాయణ
కుటుంబసభ్యులు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి