అదుపు లేని ఆకర్షణ

అదుపు లేని ఆకర్షణ

ఓ నూతన పయనం  

సుగుణ [ అక్షర]
సెల్ : 7829563317

    కర్షణ అనే  భావానికి  వయసు, రంగు, రూపం,జాతి ,రాష్ట్ర భేదాల ఇత్యాదులుతో   నిమిత్తం లేదనే నా నమ్మకం. కొన్ని సందర్భాల్లో ఆ ఆకర్షణకి సామాజిక అంగీకారం ఉండవచ్చు కొన్ని సందర్భాలో లేకను పోవచ్చు.  ఆ రెండో కోవ కి చెందినదే ప్రస్తుత కథ కి కథావస్తువ.

        మా అమ్మాయలు ఇద్దరు  నీరజ, సరోజ  వివాహాలు అయ విదేశాలలో స్థిర పడ్డారు . మా వారు గతించి అప్పటికే పదేళ్ళు గడిచాయి.  అమ్మాయిలు ఇద్దరూ తమ జీవితాల్లో  స్థిర పడ్డాక నా మిగతా జీవితం ఎప్పటినుంచో ఆగి పోయిన నాట్యాభిరుచి కి అంకితం చేద్దామన్న సంకల్పం ఉండింది. ఇప్పటికీ ఆ సమయం వచ్చింది. ఇప్పటికే నాకు యాభై ఐదు దాటింది. అందుకని త్వరపడకుండా మెల్లగా నా నృత్యాభినయం అభ్యాసం ప్రారం భించాను.  కొన్ని ఏళ్ల అంతరాయం కలిగింది ఏమో నా ఒళ్ళు మునపటిలా వంగటం మానేసింది. అయినా పట్టు విడవని విక్రమార్కుడిలా మెల్ల మెల్ల గా ఒంటిని అదుపులోకి తెచ్చుకున్నాను. ఏమైనా అభ్యాసం తగ్గినందు వల్ల ఈడు మించి నందు వల్ల నా నాట్యం లో సొగసు , వయ్యారం కొంచెం తక్కువే అయింది . చేయగా చేయగా ఆ ముడి కూడా విడుతుంది అనుకున్నాను. వయసుతో పాటూ వంటి కివచ్చే కొని బలహీనతలని మనసులో పెట్టుకునే నా ప్రస్తుత దేహానికి తగ్గ పాత్ర పోషించాలంటేనే నేను వేదిక మీదకు వెళ్తున్నాను. లేక పోతే ఎక్కువగా తెర వెనక ఉండి  దర్శకత్వమే వహిస్తున్నాను. నా పాత్ర పోషణలో ఎక్కువ అభినయ పాళునాట్యం అంటే అడుగులు తక్కువగా ఉండే ట్టు చూసుకుంటాను. మా ఇంట్లోనే డాన్సు ఏకాడమి మొదలెట్టాను. ఒకరిద్దరి తో మొదలయిన నా సంస్థ లో పది మంది శిష్యులు ఉన్నారు ఇప్పుడు. నాట్యాభినయంలో కొత్త ప్రయోగాలు చేస్తూ సంస్థ నడుపుతున్నాను.

              ఆ రోజుసాయత్రమ్ విశాఖ పట్నం కళాభారతి లో  రామాయణంలో నవరసాలు ఆన్న అంశం పై నృ త్య నాటిక ప్రదర్శిస్తున్నాము. ప్రదర్శన మంచి పట్టు లో ఉన్నది. అభినయములో పూర్తిగా లీనమైన నేను కాలు అకస్మాతు గా వెనక తెర పై పడి తడ బడే లోపునే ఎవరో  కింద నుంచి చేయ పెట్టి ఆధారం ఇచ్చారు.. కాస్త లో ప్రమాదం తప్పిప్రదర్శన భంగం కాకుండా తప్పి పోయింది. ప్రదర్శన పూర్తి అయ్యాక అంతసమయ స్ఫూర్తిగా  నాకు ఆసరా ఇచ్చింది ఎవరో అన్నది మాత్రం నేను ఎంత మంది ని అడిగినా తెలీలేదు,  కలిసి మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుందామంటే. వేదిక పై ఉన్నంత సేపూ తెలీలేదు కానీ పాదం మడత పడినందు వల్ల వాపూ నొప్పి ఎక్కువ అయినాయి. కమిటీ కారు ఇంటి దగ్గర దిగపెట్టేసి వెళి పోయింది కానీ ఇంట్లో ఎలాంటి హెల్ప్ దొరక్క రెండు బిస్కట్టులు తిని పాలు తాగి దొరికిన పెన్ కిల్లర్ ఏదో వేసు కుని పడుకున్నాను. మర్నాడు పొద్దున తొమ్మిదింటికి మెళుకువచ్చి అలవాటు గా కాలు కింద పెట్ట పోయి చూసుకుంటే ఇంత ఎత్తున పాదం పొంగి పోయి  ఉంది. ఇక లాభం లేదని నాకు బాగా దగ్గర అయిన స్నేహితురాలు నమ్రత ని సాయం పిలిచాను. తను వచ్చి దగ్గర్లోనే ఉన్న ఆస్పత్రి లో ఒర్తోపాడ్ దగ్గరకు తీసుకు వెళ్లింది. లోపల్కి అడుగు పెట్టంగానే  పరిచయస్తుల్ని చూసి పలకరించి నట్టు నవ్వుతూ పలకరించాడు డాక్టర్ నితిన్. కాలు పరీక్ష చేసి హెర్ లైన్  ఫ్రాక్చర్ లా  ఉన్నది. ఐనా ఎక్స్రే తీసి చూద్దాం అని చెప్పి వెంటనే ఎక్స్రే తీయించి హెర్లైన్  ఫ్రాక్చరని నిర్ధారణ చేసి తానే ప్లాస్టర్ కట్టి, “కొన్నాళు మీరు మీ నాట్యానికి పూర్తిగా విరామం ఇవ్వవలసి ఉంటుంది. “ అన్నారు. నేను నమ్రత విస్తుపోయి అతని వైపు చూస్తే అలా చూడకండి నా వైపు. నిన్న మీ కాలు తెర మీద పడ్డప్పుడు కాలీ కింద చేయి పెట్టి ఆపిన వాడిని నేనే.బై ది వే   ఈ వయసు లో కూడా  మీ నృత్యాభినయం ప్రేక్షకులని  చాలా ఆకట్టుకునేలా ఉన్నది అండి. వైద్య_వృత్తి అయినా ఏ కళ అయినా, ఆ కళాపోషణ అన్నా నా అభిరుచి.” అంటూ తన పూర్తి పరిచయం ఇచ్చాడు డాక్టర్ నితిన్. ముప్పై ఏళు ఉంటాయేమొ అతనికి. మంచి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం. ఒక సారి చూస్తే మళ్ళీ చూడాలి అనిపించేలా ఉంటాడు. గట్టిగా మాట్లాడితే నా కొడుకు ఉంటే ఆ వయసు ఉండేదేమో.అతని నుంచి నాకు మెప్పు, అభినందనలు రావటం నాకు చాలా సరదా  వేసింది.

  “ నిజంగానా? ఆ నాటికలో వయసులో ఉన్న అందమైన అమ్మయలు ఉండగా  అందరినీ వదిలేసి మీరు నన్ను పొగడటం నాకు వింతగా ఉంది. “

అందులో వింతే ముంది! నిజమే అందమయిన అమ్మయాలే ఉన్నారు మీ వయసు కి ఇంత చక్కగా ప్రేక్షకుల్ని సమ్మోహించారంటే వయసులో ఎలా ఉండేవారో అనిపిస్తునది. డాక్టర్ నితిన్ మాటలకి నా మనసు పురి విప్పిన నెమలి లా ఒక కన్నె పిల్ల లా స్పందించటం మొదలెట్టింది. నా వయసుకి తగని భావాలు నన్ను ఉద్రిప్తురాల్ని చేస్తున్నాయి. “ ఇంట్లో సాయం ఎవరైనా ఉన్నారా? ఏమంటే కొన్నాళు వీలైనంత వరకు మంచం దిగ కుండా చూసుకోవాలి. “ “ప్రస్తుతం లేరు ఎవరును. కానీ మా పనమ్మాయిని ఉండ మంటే ఉంటుంది . పర్వాలేదు .థాంక్ యు డాక్టర్ అని చెప్పి బయిల్ఫెరాము అక్కడి నుంచి. నమ్రత నన్ను ఇంటి దగ్గర దిగ పెట్టి “ ఎలాటి సాయం కావాలన్న చెప్పు . పని పిల్ల రాకపోతే చెప్పు. నేను వచ్చి పడుకుంటా. అన్నట్లు నేను ఒకటి గమనించాను చెప్పేదా అని అడిగింది నమ్రత స్కూటర్ స్టార్ట్ చేస్తూ. ఆ డాక్టర్ నితిన్ నిన్ను ఎంత ఆరాధనా పూర్వకంగా చూశాడో గమనించవా? “అని అడిగింది ఒక కొంటె  నవ్వునవ్వుతూ. “ పోవే మరీ చెపుతావు నువు గమనించావుగా చాలులే.అని మెల్లగా కుంటు కుంటూ ఇంట్లోకి నడిచాను.

                పదిరోజుల తరువాత  మళ్ళీ కలవ మన్నాడు. ఒక రక మైన తియ్యటి భావం తో నిండిన మనసుకి ఆకలి కూడా తెలీలేదు. రెండు బిస్కెట్లు తిని హాయిగా నిద్ర పోయాను. సాయంత్రం పని అమ్మాయి వస్తే , పొద్దునే వచ్చి సాయంత్రం ఏడు గంటల వరకు సాయం ఉంటావా అంటే సరే అంది. తన చేత ఏదో వంట చేయించుకుని తిన్నాను. మర్నాటి నుంచే పదో రోజు ఎప్పుడు వస్తుందా  అని ఎదురు చూడటం మొదలెట్టాను. నా వివాహానికి ముందూ తరువాత ఎందరోమగవారిని కలిసాను కానీ నితిన్ ని కలిసినప్పటి మనసు కి కలిగిన స్పందన  మునుపు ఎప్పుడూ కలుగ లేదు. తనతో పాటు నన్ను బలంగా ఎక్కడికో లాక్కు పోతున్న భావన. ఈ ఆకర్షణ నాకేనా లేక తనికి కూడా అలాగే ఉందా!! ఎలా తెస్తుంది !! తన కళ్ళలో నా కోసం కనిపించిన ప్రశంస మరువ లేనిది . అది ప్రశంస ఒక్కటే నా లేక నా లాగానే తను కూడా ఆకర్షణ కి గురి అవుతున్నాడా? అదేదో కాలమేచెపుతుంది..

            నేను వయసు లో ఉన్నప్పుడూ కూడా ఎప్పుడూ ఇలాంటి అనుభవం కలుగ లేదు నిజానికి ఆ రోజుల్లో ఇటువంటి అనుభవం కలిగి ఉంటే అంతా తేలిగ్గా పరిష్కారం అయ్యేది.  ఆ రోజుల్లో కూడా బోలెడు ప్రదర్శనలు ఇచ్చాను కానీ ఇటువంటి అనుభవం ఎప్పుడూ కలగ లేదు . ఒక్కా సారి నా కాలేజు రోజుల్లో మా ఇంగ్లీష్ లెక్చరర్ పట్ల నాకు ఇటువంటి బలమైన ఆకర్షణ కలిగింది. కానీ అది నా వైపు నుంచే కాబట్టి అది మొగ్గలా ఉన్నప్పుడే త్రుంచేసుకున్నాను. దానికి భవిష్యత్తు లేదని అప్పుడే తెలుసుకున్నాను. అప్పుడు నా కంటే ఇరవయెళు పెద్ద వారి పట్ల ఆకర్షణ కలిగితే ఇప్పుడు నా కొడుకు లాంటి వయసు లో ఉన్న వారి పట్ల మళ్ళీ అటువంటి బలమైన కోరిక కలుగుతోంది. ఆశ్చర్యంగా నాకు మా వారి పట్ల కూడా ఎప్పుడూ ఇటువంటి  భావన కలగ లేదు.  ఇన్నే ళ్ళు ఆయనతో వివాహం కాలం అంతా  యాంత్రికంగా పిల్లలు సంసారం తో గడిచి పోయింది కానీ మా వారి పట్ల నాకు ఇటువంటి ఆకర్షణ కలుగ లేదు. ఆకర్శన  తో పాటు ప్రేమించిన వారి వివాహం చేసుకోకలగటం ఎంత అదృష్టమో కదానుకున్నాను. నా భావాలు ఎవరితో పంచుకోవటానికి ధైర్యం లేదు నమ్రత నాకు మంచి స్నేహితురాలు. ఆరోజు ఏదో నన్ను తమాషా చేసింది కానినేను  నిజంగా  అతని పట్ల లొంగి పోతున్నాను అని చెప్తే  హర్షిస్తుందని అనుకొను. ఇంకా నయం నా పిల్లలు ఇద్దరూ పెళ్లిలు అయి విదేశాల్లో ఉన్నారు. సరే ఎదైతే అదవుంది, కాలానికి వదిలేస్తే సరి అని మనసుని ఊరుకో పెట్టాను.

           భార్యగా తల్లిగా నా విధులన్నీ నెరవేర్చుకుని హాయిగా నాట్యానికి నా జీవితం అంకితం చేదామ్మనుకుంటన ప్రాయంలో నా మనసుని ఇంత కలవర పెడుతూ దేముడు నితిన్ని పంపించాడు ఏమిటి? దేముడికి కూడా నన్ను ఆట పట్టించాలని చూస్తున్నాడా!! నా నిగ్రహ శక్తి పరీక్షిస్తున్నాడా!!

నా మనసు తో చెలగాటం ఆడుతున్నాడా?అయినా తన కంటే ఇరవయెళు చిన్న అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నా సహించే సమాజం తన కంటే ఇరవయేళ్లు చిన్న వారిని ఒక స్త్రీ ఆకర్షింది అంటే ఎందుకు దూషించాలిట????సమాజం దాకా ఎందుకు ముందు మన పిల్లలే ఒప్పుకోరు. తల్లి స్థానంలోమారు తల్లి ని ఎలాగయినా సాహిస్తారు కానీ తండ్రి స్థానంలోమారు పురుషుడ్ని అస్సలు స్వీకరించరు. ఎందుకు స్త్రీ కి ఇన్ని ఆంక్షలు ??? తమ పెళ్లిలు అయిపోయి  తండ్రి ఒంటరి వాడైపోతే పిల్లలే ముందుకు వచ్చి తండ్రిని మరో వివాహం చేసుకోమని సలహా ఇవ్వటం చూశాను మరి అటువంటి సహృదయత తల్లి పట్ల ఎందుకు చూపలేదు సంతానం!!

           తన విషయం లో నీరాజ అర్థం చేసుకుంటుందని కొంతైనా ఆశించ వచ్చు కానీ సరోజ  దురుసు స్వభావం కలది. కొడుకు తో సమాన మైన వయస్సు గల పర పురుషుడి పక్క తన తల్లి ని అంగీకరస్తుందని ఆశించలేను.  సమాజం పురోగమీచిందని మనల్ని ఎంత ముభ్య పెట్టు కున్నా ఇటువంటి వివాహాలకి ఎంత దగ్గర స్నితులైనా కూడా వ్యతిరేకిస్టారు,సహకరించటానికి జంకుతారు. నాలో చెల రేగుతున్న భావా లతో నిమిత్తం లేకుండా నితిన్ శ్రద్ధగా చేసిన వైద్యానికి నే త్వరలోనే మునపటిలా  నడవ కలిగాను.

          నేను మళ్ళీ నా న్తృత్య సంస్థ ప్రారంభించాను. మా గ్రూప్ ప్రదర్శనఎక్కడ ఉన్నదన్నా నితిన్ వీలు చేసుకుని వచ్చి అభినందించి వెళ్ళేవాడు. కళా భారతి లో నెలకి ఒకసారి అయ్యే మీటింగ్స్ ఊన్నా తప్ప్కుండా కలుసుకుని ఒక దగ్గరే కూర్చునే వాళ్ళం. కన్నె పడుచులా  డాక్టర్ నితిన్ని కలిసే అవకాశం కోసం ఎదురు చూసేదాన్ని . తన కోసం ప్రత్యేకంగా తయారయ్యేదాన్ని. తనతో కలిసి ఉన్నపుడు ఎవరు ఏమనుకుంటారో అన్న జంకు కూడా మమ్మల్ని అడ్డగించేది కాదు .

         నితిన్ కుటుంబం, పెళ్లి గురించి  కుతూహలం ఉండేది కానీ ఎప్పుడూ నేను అడగలేదు . తోచినప్పుడు తానే చెపుతాడులే అని ఊరుకున్నాను. తను చేస్తునది తనకి తెలియక పోదు కదా . మా పరిచయం స్నేహం కళాభారతి వరకే పరిమితం చేసుకున్నాము . అంతకు మించి ఎక్కడా కలుసుకునే ధైర్యం ఇద్దరికీ లేక పోయింది. వారానికి ఒకసారి చూడక పోయినా తోచేది కాదు. ఫోనులో మాట్లాడుకుంటే తృప్తిగా ఉండేదికాదు. అలా ఏడాది గడిచి పోయింది. అలా కలుసుకున్నప్పుడే నితిన్ మొదటి సారి డిన్నర్  కి బయటకి వెళ్దామా మీతో మాట్లాడాలి.”అడిగాడు. నా గుండె లయ తప్పింది. సరే అన్నాను. వెళ్ళి ఒక రెస్టోరెంట్లో కూర్చుని భోజనం ఆర్డర్ చేశాక నితిన్ “మీకు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరూ పెళ్లిలు అయి, అమెరికా లో .స్థిర పడ్డారని తెలుసు. అంతకు మించి ఏమీ తెలియదు. మా అమ్మానాన్నా ఇద్దరు నా దురదృష్టం కొద్దీ కోవిడ్ కి గురి అయి పోయారు. దగ్గర బంధువులు ఉన్నారు . కానీ నేను చేసే ఏ చర్య కి అయినా  వారిని విచారణ్ లోకి తీసుకోవాల్సిన అవసరంలేదు. మీ సంగతి ఏమిటి? మీ వారు లేరని తెలుసు.మరి మీ అత్తా మావగారు, మిగతా దగ్గర బంధువులు ఉన్నారా? నితిన్ ఈ విషయాలు ఎత్తేడు అంటే ఈ సంభాషణ ఎటు దారి తీస్తుందో ఊహించగలను. చెప్పాను” మా వారు పోయాక ఆ బాధ తట్టుకో లేక మా అత్తా మావగారు కూడా మూడేళ వ్యవధిలో పోయారు. బంధువులు ఉన్నారు. కానివారెవరు మా స్వ విషయాలు పట్టించుకోలేదు ఎప్పుడు. అమ్మయల ఇద్దరి పిల్లల పెళ్లిలకి  వచ్చి వెళ్లారు. ఆతరువాత వారితో పెద్దగా సంబంధం లేదు. “

  మొదటి సారి మృదువుగా నా చేయ మీద చేయి వేసి ,నేను యిక్కడి సమాజం  విమర్శన కి  దొరక్కుండా ఆస్ట్రేలియా వెళ్ళి సెట్టేల్ అయ్యే ప్రయత్నం లో ఉన్నాను. మీరూ నాతో వస్తారా? అంటూ నా కళ్లలోకి చూశాడు. నేను సంభ్రమాశ్చర్యాలతో నిండి పోయాను. మనసు లో లేస్తున్న ప్రశ్నలు కళ్ళలో కనిపిస్తున్నాయి.

          “ నిజమే కావాలంటే నా వయసుకు తగ్గ చకటి అమ్మాయిలు నాకు దొరుకుతారు. కానీ వారెవరూ కూడా మీలా నన్ను ఆకర్షించలేదు. ఆఖర్కి  నా మిత్రులకి నా పై అనుమానం కూడా వేసింది. నాకు అమ్మయలు పనికి రారేమో ఆని.” మీరు కలిసే వరకు నా మనసు ఏం కోరుకుంటోందో నాకే తెలీదు. మీ పట్ల నాకు పెరుగుతున్న ఆకర్షణ మీ నుంచి జవాబుగా దొరికిన స్పందన నాకు జీవితం లో ఎవరుకావాలో తేల్చి చెప్పింది. కానీ మన  కలయకని  స్వీకురించేట మన సమాజం పెరగ లేదని  తెలుసు. నాకు అడ్డు చెప్పి విమర్శించేవారు ఎవరూ లేరు కాని మికు మీ అమ్మాయిలన్నారు.  మీరు అంగీకరిస్తే కనుక కొన్నాళు మీ నృత్య సంస్థ మూయ పడుతుంది. కానీ అక్కడ స్థిరపడిన  నాస్నేహితులు చెప్పారు అక్కడ కూడా మీకు  శిష్యులకి కొరత ఉండదని.  ఏమంటారు?” అని ప్రశ్నార్థకంగా చూశాడు నీతిన్.

“ తెలీదు  నితిన్. ఆలోచించి చెప్తాను.  ఆ తరువాత ఎక్కువ మాట్లాడలేదు. ఎవరి ఆలోచన్ల లో వారు ఉండి  పోయాము.  డిన్నర్ చేసుకుని లేచాము. పదండి ఇంటికి దిగ పెడతాను. చాలా రాత్రి అయిపోయింది.” ఇన్నాళ స్నేహం లో  అది మొదటి సారి అలా నితిన్ ఆఫర్ చేయటం.

“పరవాలేదు వెళిపోతా. నాకు అలవాటేగా నా టు వ్హీలర.”అన్నా.

ఆఖరిగా మరో మాట. ఒకవేళ విమర్శలకి భయపడి మీ జాబు నెగెటివ్  అయితే ,నేను తప్పకుండా బాధ పడతాను కానీ మిమ్మల్ని తప్పు పట్టను. మీ నిర్ణయం ఏదైనా సరే మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను. “ నితిన్ వెళి పోయాడు.

నేను ఆలోచనలో పడ్డాను. నితిన్ పట్ల బలమైన ఆకర్షణ ఉన్న నేను తను నాకు దూరం అవుతాడంటే తట్టుకొ లేని స్థితికి వచ్చాను నెను. మా అమ్మాయిలు ఎదురు చెప్తారాన్న జంకు నన్ను వేనక్కి  లాగు తున్నది.

            తల్లిగా ,గృహిణిగా నా బాధ్యతలు నెరవేర్చుకున్నా కూడా నేను నా మనసుకి నచ్చిన పని ఎందుకు చేయ కూడదు. విషయం ఉన్నది ఉన్నట్లు పిల్లలకి చెపుతాను . ఆ తరవాత వాళ  ప్రతిక్రియ ఎలా ఉన్నాసరే నా మనసు కోరుకున్నది నేను చేయటంలో నాకు ఏ తప్పు కనిపించ లేదు. వెంటనే నీరజ, సరోజ కి మెసేజ్ పెట్టెను. నీరు మెసేజ్  చూసింది కానీ జాబు ఏమి రాయలేదు. కానీ సరోజ  వెంటనే ఫోను చేసి నువు ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు మా విషయం ఒక్క సారైనా ఆలోచించావా? మా అత్తవారికీ తెలిస్తే నన్ను ఎంతలా దేప్పుతారో తెలుసా? ...... “ఇంకా ఏదేదో అంది. తను అనాల్సినవన్నీ అన్నాక అడిగాను అయిందా? ఇంకా ఏమైనా ఉందా? “ అన్నాను ప్రశాంతగా.

         మీ అత్తవారు ఎలా రిఎక్ట్ అవుతారో నాకు ఎందుకే? అసలు వారికి నేను ఆస్ట్రేలియా ఎవరితో వెళ్తున్నానో చెప్పాల్సిన అవసరం ఏముంది?? ఏదో డాన్స్ ప్రొజెక్ట్  మీద వేలూన్నానని చెప్పు అది కూడా అడిగితే. ముందు నువ్వే తిరగ పడతావని నాకు బాగా తెలుసు. సరు, అయినా నా బాధ్యతలు అన్నీ నెరవేర్చుకుని నాకు అడ్డంకులు ఏమీ లేని సమయము లో  నా మనసుకి నచ్చిన పని చేయటం లో తప్పు ఏమీ లేదని నేను నమ్ము తాను.

మీకే కాదు చాలా మంది నేను చేస్తున్న పని చాలా  ఏహ్యంగా భావిస్తారు. వారికి జవాబు చేప్కోవాల్సిన అవసరం నాకు లేదు. మీరు నా పిల్లలు కాబట్టి చెపున్నా.నా పై కోపం తగ్గి మీకు భవిష్యత్తులో నా అవసరం ఎప్పుడు కలిగినా మీ వెంట నేను ఉంటాను. నితిన్ని మీరు స్వీకరించి లేక పోయినా  నేను మాట ఇస్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం .నేను మాత్రం నా నిర్ణయం మార్చుకొను. “ కోపంగా ఫోను పెట్టేసింది సరోజ . నేను నితిన్ని కాల్ చేసి నాకు వీసా ప్రయత్నం చేయమని చెప్పి  హాయిగా నిద్ర పోయాను. తెల్లవారి రిటర్న్ మెసేజెస్ చూసుకుంటే నీరజ మెసేజ్ కనిపించింది. “ ఈ వయస్సులో నిన్ను అంతలా ఆకర్శించిన  ఆ నితిన్నిత్వరలో   కలవాలని ఉన్నది అమ్మా”.  “ అమ్మయ్య , కనీసం ఒకరు ఖారాలు మిరియాలు నూర కుండ కొంచెం మర్యాద చూపించారు అని అనుకుని “తప్పకుండా నీరూ, మేము అక్కడ సెటిల్  అయ్యాక వద్దువుగాని. నీకు కూడా నితిన్ ఒక స్నేహితుడిగా తప్పకుండా నచ్చు తాడని నా నమ్మకం .ఒక నిర్ణయానికి వచ్చాక మిగతా పనులన్ని త్వరత్వరగా అయిపోయినాయి.  నా నృత్య సంస్థ మూసి వేయ టానికి చాలా బాధ అనిపించింది. అసలు విషయం నమ్రత కి కూడా చెప్పలేదు. డాన్స్ టీచర్ గా నా ఫ్రెండ్స్ ఆస్టేలియా నుంచి  ఆఫర్ ఇచ్చింది వెళుతున్నాని చెప్పాను. అంతా వైండప్ చేసుకునీ ఇంటి గల వారికి   తాళాలు అప్పగించి  సమయానికి ఎర్ పోర్ట్  చేరే సరికి నితిన్ ఎదురు చూస్తూ కనిపించాడు. నేను కేబ్ దిగిన వెంటనే ఒక చేయి అందించి మరో చేయ నా భుజం చుట్టూ వేసే సరికి అంతా మర్చి పొయ్ ఒక కన్నె పిల్ల లా అనుభూతి చెన్దిన  మధురాను భూతి మాటల్లో వ్యక్తం చేయలేనిది.

                 ________________         


3 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. ఇటువంటి సంఘటనలు అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం. సమాజం నిర్దేశించిన సూత్రాలకు విరుద్ధంగా, వయసు నిమిత్తం లేకుండా, రెండు హృదయాలు ఒకే విధంగా స్పందించడం సాధ్యమయ్యే విషయమే. ఇలాంటి సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవడం వ్యక్తిగతం అవుతుంది. తప్పొప్పుల గురించి తీర్పులిచ్చే అధికారం ఎవరికీ లేదు.

      తొలగించండి
  2. ఆకర్షణ అనేది ఎప్పుడు,ఎవరిమీద,ఎలా పుడుతుందో తెలియదు.
    మగవాళ్ళు ఎంత చిన్న అమ్మాయిని వివాహం చేసుకున్నా ఒప్పుకునే సమాజం, ఆడవాళ్ళ పట్ల వివక్ష చూపించటం ఎందుకనే కథానాయిక భావం ఆలోచింపదగ్గది.
    చలం గారి కథ ’ చదువుతున్నట్లు అన్పించిన ఈ కథలో విషయం సమగ్రంగానూ,అందంగానూ , ఆకర్షణీయంగానూ వుండటం విశేషం.
    రచయిత్రి గారు ఒక వైవిధ్యమైన కథాంశాన్ని అక్షరీకరించిన తీరు అద్భుతం.
    అభినందనీయులు.

    రిప్లయితొలగించండి