బసవ పురాణం 4

బసవేశ్వరుని మహిమలు

  • వంకాయలు ప్రాణలింగాలవ్వటం : బసవేశ్వరుని ఇంటి వద్ద చాలా ధనముందని తెలుసుకున్నాకదా.. ఈవిషయం తెలుసుకున దొంగలు వాటిని దోచుకోవా లనుకున్నారు. లింగములేకయే అతనింటిలోకి ప్రవేశించలేరు. కనుక వంకాయలను లింగంగా కట్టుకొని లోపలికి ప్రవేశించారు. బసవేశ్వరుడు వారితో ఈశ్వరార్చన చేయండని చెప్పాడు. అంతే దొంగలు కట్టుకున్న వంకాయలే ప్రాణలింగాలనాయి. దోచుకోటానికి వచ్చిన దొంగలు బసవేశ్వరుని మహిమను పొగుడుతూ వెళ్ళిపోయారు.
  • జొన్నలు ముత్యాలుగా మార్చటం : ఒక జంగము వచ్చి బసవేశ్వరునితో ముగ్గులు పెట్టుటకై ముత్యాల పొడి మూడుపుట్లు కావాలన్నాడు. బసవేశ్వరుడు అక్కడున్న జొన్నల రాశిని తన చేతితో తాకగానే అవి ముత్యాలయ్యాయి. అది చూసిన బిజ్జలుడు విభ్రాంతి చెందాడు.
  • సంగమేశ్వరుడు బసవనికి మూడవకన్నవ్వటం : జొన్నలు ముత్యాలుగా మార్చిన తర్వాత బసవేశ్వరుని దాననిరతిని పరీక్షించటానికి కప్పడి సంగమేశ్వరుడు జంగమ రూపంలో వచ్చి నాకు మూడవ కన్ను కావాలని వేడాడు. అంతట బసవేశ్వరుడు శివుని మాయ తెలిసినవాడై అద్దమును తెప్పించి అతనికి చూపగా అందులో అతనికి మూడవ నేత్రము కనిపించింది. దీంతో సంగమేశ్వరుడు సిగ్గుతో నిరాకారుడయ్యాడు.
  • గొల్లెత చల్ల కడవతో పడిపోకుండా చేయటం : ఒకనాడు బిజ్జలుడు రాజకార్యంపై సమావేశము చేయగా బసవేశ్వరుడు, ఆ సభలో పెద్ద ధ్వనితో ‘‘ ఇదిగో వచ్చుచున్నాను, నీకు చేయూత నిచ్చుచున్నాను’’ అని బిగ్గరగా పలికాడు.  బిజ్జలుడు అది చూసి ‘‘బసవన మంత్రీ..! ఇది రాజసభ, ఇట్లు మతిలేక ఎందుకు మాట్లాడుతున్నారు’’ అని అడిగాడు. బసవేశ్వరుడు బిజ్జలుడుతో ‘‘రాజా! వినుము. ఇచ్చటికి కొద్ది దూరంలో ఒక గొల్లెత కాలుజారి చల్లకడవతో పడబోతూ ‘బసవేశ్వరా చూయూత యిమ్ము’ అని కోరింది. నేనది విని ఆమె చల్లకడవతో పడిపోకుండా చేసితిని. నీవు ఈ క్షణమునే నీ మనుషులను పంపు. నిజము తెలియగలదు.’’ అని చెప్పాడు. బిజ్జలుడు తన సేవకలును అక్కడికి పంపి గొల్లెతను సభాస్థలికి తెప్పించాడు. ఆమె ఒరిగిన చేతిరొంపి, జారిన కాలిరొంపి చూపెను. 

      ఇలాంటి మహిమలు అనేకం బసవడు ప్రదర్శిస్తుండేవాడు. 

      అభినవ శ్రీగిరియని పేరెన్నిక కల సొన్నలికపురంలో సిద్ధరాముడనే శివయోగివున్నాడు. శ్రీగిరిలోని మల్లికార్జున లింగాన్ని తెచ్చి ప్రతిష్ఠించుటే కాక లక్షాతొంభైవేల శివలింగాలను స్థాపించాడు. సహజమకుటము, నొసలి కన్ను కలిగి మహిత యోగానంద మహీనీయలీల నుండుచు ప్రమథ లోకమున కేగుచు వచ్చచుండేవాడు. ఒకనాడు శివభక్త సమూహము ప్రమథలోకన బసవుడున్నాడో లేడో తెల్పమని అడగ్గా సిద్ధరాముడు ప్రమథలోకానికి వెళ్ళి అందున్న శఇవుని చూసి బసవేశ్వరుని చూపమని వేడగా శివుడు తన హృదయాన్ని తెరిచి కరస్థళ లింగసమేతుడను, తదేక ధ్యాన నిష్టాపరుడై హరుమీది దృష్టి మరలింపని వాడుగా బసవన సిద్ధరామునికి కనపడ్డాడు. ఆలోక మీలోక మననేల యెల్లలోకాలలో బసవడు కలడని శివుడు సిద్ధరామునకు తెలియజేశాడు. భూలోకమునకు సిద్దరామయ్య వచ్చి బసవయ్య మహిమను శివభక్త లోకానికి చాటాడు. 

    దీంతో బసవని శక్తికి బిజ్జలుడు చాలా సంతోషించాడు. 

·        బసవనిపై బిజ్జలునికి ఫిర్యాదు

ఒక మిండజంగమునకు బసవన్న రాజబొక్కసమున నున్న ధనంమంతా కూడా ఇచ్చేశాడు. అది విని మంత్రివర్గంలోని వారు బిజ్జలుడికి ఫిర్యాదు చేశారు. బిజ్జలుడు బసవని పిలిపించి ‘‘ మాధనముతెమ్ము, నీ ప్రధానితనము చాలు ’’ అని దట్టించి అడిగాడు. అంత బసవన ‘‘భక్తుల ధనము భక్తులకే ఇచ్చితిని. మీధనంబునకు చేసాప’’నని మారుపలికాడు. వెంటనే పెట్టెలను తెప్పించి చూడగా అందులో ధనము మొదట ఎలా వున్నదో అలాగే వున్నది.

శివభక్తుల మహిమలు

బల్లేశు మల్లయ్య కథ

బల్లేశుమల్లయ్య అనే శివభక్తుడు లింగము పూజించటానికి లేకపోవటంతో ఒక కుంచము గుడిగా చేసి దానినే లింగంగా కొండ గోగులతో పూజించేవాడు. తక్కిన వారంతా అది చూసి, ఇక్కడి శివాలయము లింగములేదే, నీవెలా పూజచేస్తున్నావని అడిగారు. బల్లేశు మల్లయ్య వెంటనే స్వర్ణశిఖరము గల శివాలయాన్ని నిర్మించి అందులో లింగమును వారికి చూపించాడు. వారంతా ఆశ్చర్యపడ్డారు.

కాటకోటయ్య

కాటకోటయ్య ఏట పెంట్రిక లింగముగా పూజించుచుండెను. దానికి నభిషేకము చేయుచుండగా తండ్రి అదిచూసి అతని అపహసించి దానిని కాలితో తన్నాడు. కాటకోటయ్య తండ్రి తల నరికేశాడు. ఏటపెంట్రిక లింగమైంది. శివుడునుకైలాసమున కాటకోటయ్య తండ్రిని తలుపు తెరచి చేకొన్నాడు. అతడు ప్రమధగణములతో వుండిపోయాడు.

(సశేషం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి