శివలీలలు 7

 కలియంబనాయనారుకథ

కలియంబనయనారు అను పేరుగల శివభక్తుడు ఉండెడివాడు. అతడునిరంతరం శివభక్తి పరాయణుడై ఉండెడివాడు. ఈ భక్తుడు నిరంతరం శివభక్తితత్పరుడై ఉన్న మహనీయ శివభక్తులను నిరంతరం తన వాక్‌ భాషా ధురీణతచే నిరంతరం నవ్వించుచుండెడివాడు. శివభక్తులను నిరంతరం నవ్వించుటయే ఇతడు ఒక నియమముగా పెట్టుకొని జీవించుచుండెడివాడు. ఆ శివభక్తులనుద్దేశించి ప్రసంగించుచూ ఓ మహనీయులారా! మీరునవ్వుటచే నేను కృతార్థుడనైతిని. నేనుపుట్టుట వలన బ్రతుకుట వలన కూడా మీ నవ్వు సార్థఖ్యమును కలిగించుచున్నది. శివభక్తులు చెప్పు శివతత్త్వమును మనసారా గ్రోలి పరమానందమును పొందుచూ జీవితమున గడిపెడివాడు. పెద్దల యెడల గౌరవమును కలిగియుండెడివాడు. గౌరవమును ఇచ్చిపుచ్చుకొను పెద్దల యెడల అమితమైన ప్రీతిని పొందెడివాడు. ఈ విధంగా ఆ మహాశివుని తాదాత్మ్యంగా అనుభవించుచూ మోక్షసామ్రాజ్యమును జయించి పరమేశ్వరునిలో తాదాత్మ్యమును పొందెను. ఇటువంటి మహనీయుని చరిత్రను వినుటచే నా మనసు ఆనందమును నొందినదని చెన్నబసవుడు బసవేశ్వరునితో పలికెను ఈ కథాంశమునందు హాస్యమనునది మనమనసులను ప్రశాంతతను నొందుచుటకు సాధనమని చెప్పవచ్చును. కాని హాస్యము వలన ఇతరుల మనస్సును నొచ్చుకొనేటట్లుచేయుటగాని, ఇతరులను వ్యంగ్యంగా నిందించుటకు గాని ఇతరులను వెలితిగా మాట్లాడుటకు గాని హాస్యమను పద్ధతిని ప్రయోగింపరాదు. హాస్యము నిరంతరం శ్రమయందు గడుపు వ్యక్తికి కొంత మనసున ప్రశాంతత చేయుట కొరకు ఉపయోగించవలెను. హాస్యం వలన కొన్ని రోగముల నుంచి ఉపశమనమును పొందవచ్చును. అందుకని కలియంబనాయనారు శివభక్తులకు కర్మఫలముల వలన ప్రాప్తించిన కొన్ని మానసిక రుగ్మతలను తాను చేయు హాస్యవైద్యంచే నివారించుచూ నిరంతరం వారిని పరమేశ్వరుని హృత్కమలములందు తుమ్మెదవోలె నివసించుచూ భక్తి రసాస్వాదమును గ్రోలుచున్న భక్తుల ఆశీర్వచన ప్రభావమును తాను పొందుచున్నాని మహదానందము పొందుటచే కలియంబనాయనీరు యొక్క మహత్త్వ భక్తితత్త్వము మనకు గోచరించునని తెలియుచున్నది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి