నిజ నాయకుడు

 నిజ నాయకుడు

- సూర్యనారాయణ

అది డిగ్రీ కాలేజీ క్యాంటీన్. కాలేజీలోని విద్యార్థులైన, లెక్చరర్లయిన సేద తీర్చుకోవడానికి క్యాంటీన్ లో అడుగు పెట్టాల్సిందే. దాన్ని కొంతమంది కోటిగాడి క్యాంటీన్ అని పిలుస్తూ ఉంటారు. కోటి అను పేరు గల వ్యక్తి క్యాంటీన్ ను నడుపుతుండడం వలన అందరూ అలా పిలుస్తూ ఉంటారు. అది పేరుకు క్యాంటీన్, కాలేజీ స్టాప్ కు మాత్రము అది ఒక చర్చా వేదిక. క్యాంటీన్ లో స్వేచ్ఛగా ఆసీనులై, టీ సేవిస్తూ మాట్లాడుకోవడం లో వుండే ఆనందమే వేరు. స్టూడెంట్సుకైతే చెప్పనక్కర్లేదు. కాలేజీ నియమ నిబంధన బద్దులై నోటికి తాళం వేసుకున్న వారు సైతము, క్యాంటీన్ లోకి ప్రవేశించగానే, స్వేచ్ఛా జీవులై విచ్చలవిడిగా మాట్లాడు కుంటారు. ప్రపంచ విషయాలన్నీ క్యాంటీన్ లోనే తెలుస్తాయి. ఆహార వడ్డనే కాదు, ఆహార్య ప్రదర్శనలు కూడా జరుగుతుంటాయి.

ఆరోజు సోమవారం. కేరింతలుతో కేకలుతో ఒక స్టూడెంట్ గుంపు క్యాంటీన్ లోకి ప్రవేశించింది. గుంపులో అందరి ముఖాలు ఆనంద తాండవం చేస్తున్నాయి.

"ఒరేయ్ కోటిగా, వీళ్ళందరికీ టీలు, టిఫిన్ లు ఇవ్వరా, అమౌంట్ నేను ఫే చేస్తాను. రోజు అదిరిపోవాలి" విజయ గర్వముతో ఆర్డరేసాడు ఒక విద్యార్థి. గుంపు నాయకుడు లాగున్నాడు. ప్రపంచాన్ని జయించిన సంతోషము వారి కళ్ళల్లో కనిపిస్తుంది.

"ఏమిటి సార్ విశేషం? ఇంత ఆనందంగా ఉన్నారు. కస్టమర్లు తో మాటమాట కలిపితే, వ్యాపారం బాగా సాగుతుంది. అందుకే కోటి అందరినీ ప్రశ్నిస్తూ, వాళ్ళల్లో కలసిపోతూ ఉంటాడు.

" అవునురా కోటి, ఇవ్వాళ మా అభిమాన హీరో సినిమా రిలీజైెంది. పిచ్చపిచ్చగా ఉంది. హండ్రెడ్ డేస్ గ్యారంటీ. ఫైట్సు గురించి చెప్పనక్కర్లేదు. విలన్సు నందరిని ఉతికి పారేసాడు. తిరిగి లేని హీరో అంటే వాడేరా "మాటల్లోనే ఆనందోత్సాహాలు పెల్లుబికుతున్నాయి.

" మీ ఆనందం చూస్తుంటే నాకూ ఎగిరి గంతులేయాలనిపిస్తుంది సార్. "ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని కోటి అలా అన్నాడు.

" నువ్వెగిరి గంతులెయ్యడమేమిటిరా? సొట్ట వెధవ్వి. నడవడానికే కాళ్ళీడ్చుకొని నడుస్తావ్, ఎలా ఎగిరి గంతులేస్తావ్ రా? "ఎవరన్నారో తెలియదు కాని స్టూడెంట్ గుంపులో నుండి వ్యంగ్యాస్త్రాలు విసరబడ్డాయి

అవును కోటికి ఒక కాలు సరిగా పనిచేయదు. నడిచి నప్పుడు ఈడ్చుకొని నడుస్తాడు.

గొల్లున నవ్వుతున్నారు స్టూడెంట్ లు. నవ్వులు కోటికి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి. భరించక తప్పదు. బాధను అణుచుకుంటూనే, నవ్వుల్లో తన నవ్వును కలిపేసాడు కోటి. అక్కడుంటే మంచిది కాదనుకున్నాడేమో, మెల్లగా కాళ్లీడ్చుకుంటూ క్యాంటీన్ వంట గదిలోకి వెళ్లి పోయాడు.

అక్కడ నవ్వుల కోలాహలము మాత్రము ఆగలేదు. తమ అభిమాన హీరో తెరపై చేసిన విన్యాసాల కూర్పుతో మొత్తం సినిమా కథను చెప్పేస్తున్నాడు ఒక వీరాభిమాని. కొంతమంది చప్పట్లు కొడుతున్నారు, కొంతమంది ప్రోత్సాహిస్తున్నారు. కొంతమంది పొంగి పోతున్నారు. కొంతమంది మరచిపోయిన సినీ ఘటనలును అందిస్తున్నారు. ఉబ్బి తబ్బిబ్బయిపోతుంది ఆనంద తన్మయ విద్యార్థి గణము, తమ అభిమాన హీరో గొప్ప తనమును ప్రస్తుతిస్తూ.

అరిచే వారికి ఆనందము అవధులు దాటుతున్న, వినే వారికి శబ్దకాలుష్యము ఇబ్బంది పెట్టక మానదు కదా. అయినా క్యాంటీన్ లో కూర్చున్న మిగతా కస్టమర్లు స్టూడెంట్ లు ను, ఇదేమటని ప్రశ్నించడానికి సాహసించలేకపోతున్నారు. విర్రవీగుతున్న విద్యార్థి బృందానికి ఎదురు లేనట్లున్న సమయంలో.

ఏమిటి బాబూ ఇదంతా? "ప్రశ్నించింది బల్లలు పై నున్న ఫ్లేటులు తీస్తున్న వృద్ధగొంతు.

" ఒరేయ్ తాత మాట్లాడుతున్నాడురోయ్ "వెటకారపు బాణాలు షరా మామూలే.

" మీ అభిమాన హీరో మీకిదే చెప్పాడా? ఇలాగే ప్రవర్తించమన్నాడా? "వాళ్లను మార్చాలని తాత ప్రయత్నం లాగుంది

" మా హీరో సినిమా చూస్తే నువ్వలాగ మాట్లాడవ్ తాత, నవ్వొకసారి చూడు మాలాగే ఎగిరి గంతులేస్తావ్"మరొక విద్యార్థి ప్రతిస్పందన.

" వయస్సులో తాత సినిమా ఏం చూస్తాడు? మనం చెబుతున్న కథను వింటాడులే" ఇంకొక విద్యార్థి ఉచిత సలహా.

తాత ఏమీ తగ్గలేదు. మరికొంచెం ముందుకు వచ్చాడు.

చూడండి బాబూ, మీరేమీ అనుకోనంటే, నేనే మీకొక కథ చెబుతాను "వాళ్లకు దగ్గరగా వచ్చాడు తాత.

విద్యార్థులందరూ వింతగా చూసారు తాత వైపు. ఏదో కట్టుకథ చెబుతాడు, దొరక్కపోతాడా? అని భావించినట్టున్నారు.

" చెప్పు తాత చెప్పు, తాత కథ చెబుతాడటరో, అందరూ దగ్గరగా రండి "ఒక విద్యార్థి హడావుడి చేయడం, అందరూ చుట్టూ మూగడం క్షణంలో జరిగిపోయింది.

తాత తన పద్ధతిలో చెప్పడం మొదలు పెట్టాడు. " అది పందొమ్మిది వందల తొంభై తొమ్మిది. భారత దేశ సరహద్దుల్లో యుద్ధము జరుగు తుంది "

తాత ప్రారంభించిన తీరు ఆకర్షితులును చేసినట్టుంది. నిశ్శబ్దం చోటు చేసుకుంది.

"కాశ్మీర్ లోని కార్గిల్ ప్రాంతాన్ని ఆక్రమించాలని, పాకిస్థాన్ చొరబాటుదారులు ఒక కొండమీద నుండి కాల్పులు జరుపుతున్నారు. వారిని భారత సైనికులు సాహసోపేతంగా ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో నియంత్రణ రేఖ దాటి భారత దేశంలోకి చొరబడడానికి, ప్రయత్నిస్తున్న తీవ్రవాదులను అడ్డుకోవడానికి, ఒక భారతీయ సైనికుడు, ఎంతో ధైర్యసాహసాలు చూపించాడు. గుండె ధైర్యముతో పోరాడాడు. "

కథాంశం ఆసక్తికరముగా ఉండడముచే, విద్యార్థులందరూ కథ వినడంలో లీనమైపోయారు.

"పాకిస్థాన్ సైనికులకు, ఎదురుగా కాల్పులు జరుపుకుంటూ, వారిని వెనుకకు తరుముతూ, దూసుకుపోతున్నాడతడు. భారత దేశానికి విజయాన్నందించడానికి. కానీ............. " చెప్పడానికి ఎందుకో ఇబ్బంది పడుతున్నాడు తాత. గొంతు బొంగురుపోయింది. మాట రావడం లేదు. కళ్ళు చెమ్మగిల్లాయి. కొంచెము ఆగాడు తాత

ఉత్సుకతతో వింటున్న విద్యార్థులకు ఆపడం ఇష్టము లేనట్టుంది.

"తరువాత ఏం జరిగింది? " ఆతృతగా అడిగారు విద్యార్థులందరూ.

తాత భుజముమీద గుడ్డ తీసి కళ్ళొత్తుకొని, "పాక్ జరిపిన కాల్పుల్లో అతని కుడుకాలు నుజ్జునుజ్జు అయిపోయింది. "

విద్యార్థులందరూ మౌనం వహించారు. ఒక్క నిమిషము నిశ్శబ్దం చోటు చేసుకుంది.

"ఇదంతా నీకెవరు చెప్పారు. " నిశ్శబ్దాన్ని తొలగిస్తూ ఒక విద్యార్థి ప్రశ్నించాడు.

" కాలు పోగొట్టుకున్న వ్యక్తి ఎవరో కాదు బాబు. నా కన్న కొడుకు. " తాత మాటల్లో గర్వము తొణికసలాడింది

విద్యార్థులలో ముఖ కవళికలన్నీ మారిపోయాయి. వారి మానస ప్రాంగణాలన్ని కరుణా రసంతో నిండిపోయాయి. ఇప్పుడు విద్యార్థుల నోట మాట రావడం లేదు. ఒకరి ముఖాలొకరు చూసుకుంటున్నారు.

"ఇప్పుడు నీ కొడుకు ఎక్కడున్నాడు తాత" జాలిగా అడిగాడు ఒక విద్యార్థి.

"ఇక్కడే ఉన్నాడు బాబూ, అతనెవరో కాదు, క్యాంటీన్ నడుపుతున్న భారత దేశ మాజీ సిపాయి మిస్టర్ కోటేశ్వరరావు.

విద్యార్థుల హృదయాలు ధ్రవించాయి. ప్రశ్చాత్తాపము పరిమళించింది. అందరూ ఒకే సారి క్యాంటీన్ వంటగది ద్వారము వైపు చూసారు. అప్పుడే బయటికి వస్తున్న కోటి, ఇప్పుడు కోటిగాడిగా కనిపించడం లేదు. భారత మాత ఎత్తుకొని ముద్దాడుతున్న నిజ నాయకుడులా కనిపిస్తున్నాడు

విద్యార్థులందరికీ అర్థమైంది, నిజ నాయకుడెవరో?. తరువాత ఎప్పుడూ కోటిని విద్యార్థులెవరూ కోటిగాడని పిలవలేనిజ నాయకుడు

విద్యార్థులందరికీ అర్థమైంది, నిజ నాయకుడెవరో?. తరువాత ఎప్పుడూ కోటిని విద్యార్థులెవరూ కోటిగాడని పిలవలేదు. కోటేశ్వరరావు గారని గౌరవించడం మొదలు పెట్టారుదు. కోటేశ్వరరావు గారని గౌరవించడం మొదలు పెట్టారు

 ------------- 

48 కామెంట్‌లు:

  1. వందేమాతరం. నేటి యువతరం లో అస్సలు కనిపించని దేశభక్తిని తట్టిలేపే మీ ప్రయత్నం అభినందనీయం

    రిప్లయితొలగించండి
  2. ఈతరం అంతస్పందిస్తారా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజ నాయకుడు, కథ యువతలో బాధ్యతను, సంస్కారాన్ని, దేశభక్తిని పెంపొందింప జేసేవిధంగా చక్కగా ఉంది, ఇలాంటి కధలు ప్రస్తుత సమాజానికి చాలా అవసరం !రచయితకు అభినందనలతో పాటుగా హార్దిక శుభాకాంక్షలు !.. కోరాడ నరసింహా రావు, కవి, రచయిత, రంగస్థల కళాకారులు, విశాఖపట్నం.

      తొలగించండి
  3. దేశ రక్షణ కోసం జీవితాలను త్యాగం చేస్తున్న సైనికులే నిజమైన హీరోలని తెలియజెప్పిన నిజనాయకుడు కథ స్ఫూర్తిదాయకమైంది.
    కథ ఎత్తుగడ, ముగింపు రెండూ చాలా బాగున్నాయి. రచయిత గారు అభినందనీయులు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కథ సందేశాత్మకంగా ఉంది.ఈ తరం పిల్లలకు కనువిప్పు కలిగి మనమధ్యే మహాత్ములుంటారని తెలుసు కుంటారు..డా.బాబూరావు

      తొలగించండి
  4. Social awareness and patriotic fervour is lacking in contemporary youth.This story shall be an eye opener for many of such youth.

    రిప్లయితొలగించండి
  5. Nice sir,I will explain this story to my child

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. మంచి స్ఫూర్తిదాయకమైన కథ. మీ అనుమతితో డైట్ మ్యాగజైన్లో ప్రచురిస్తాం. అభినందనలు, ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  8. Nice narration.
    Story line is good.
    Value based
    Patriotic
    Respect dignity of labour
    Differentiate Real hero & Reel hero
    &
    Many more
    Thank you Sir

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రచురించదగిన అంశం. పూర్వం ఆంధ్ర భూమి వంటి పత్రికలలో ఇటువంటి కధానికలే వచ్చేవి, శుభం భూయాత్. .విశ్వనాథ శర్మ, ప్రధమశ్రేణి తెలుగు పండితుడు

      తొలగించండి
  9. చాలా బాగుంది. ఇలాంటి కథలు ఈతరం వారికి చాలా అవసరము

    రిప్లయితొలగించండి
  10. కథ మరియు కథనం రెండూ సహజసిద్ధంగా ఉండి‌ చాలా బాగుంది

    రిప్లయితొలగించండి
  11. దేశభక్తి పూరితమై సమాజహితమైన 👍మంచి కథ. హృదయపూర్వక అభినందనలు

    రిప్లయితొలగించండి
  12. చక్కని సందేశాత్మక కథ! 💐💐💐💐

    రిప్లయితొలగించండి
  13. చాలా మంచి సందేశం. ఈ తరం వారు తెలుసుకోవలసిన విషయం చాలా చక్కగా చెప్పారు.

    రిప్లయితొలగించండి
  14. స్ఫూర్తిదాయక కథ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క9థ కథ చాలా బాగుంది. మంచి సందేశాన్ని అందించారు.👌👌👍

      తొలగించండి
  15. కాలేజీ కుర్రకారు కేంటీన్ లో కాలక్షేపం తో
    మొదలు పెట్టి కార్గిల్ యుద్దానికి తీసుకు వెళ్ళడం.
    ఎంతైనా బాగుంది. ఎత్తుగడ, కథ నడిపించు తీరు
    బాగున్నాయి. మినీ కథయైనా మంచి కథ.
    రచయితకు అభినందనలు
    —- పి. యల్. వి. ప్రసాద్

    రిప్లయితొలగించండి
  16. Very nice story sir. It explains dignity of labour, patriotism, social awareness etc., It is best to keep as Telugu lesson in secondary level students 💐💐

    రిప్లయితొలగించండి
  17. రిప్లయిలు
    1. యువత తెలుసుకోవలసిన విధంగా వుంది
      కథలాంటి పాఠం.

      తొలగించండి
  18. వెర్రి కుర్రకారుని సహితం ఆలోచింపజేసింది తమ కథ. మార్పికి ఇలాంటి కథలు అత్యవసరం. కథనం తీరుతెన్నులే కవి సుమనస్సుని ఆవిష్కరిస్తాయి. చిన సూరి మాష్టారి పెద్ద నస్సుకి ఇది నిదర్శనం.

    రిప్లయితొలగించండి
  19. ఈ కథ చాలా సందేశత్మాకంగా వుంది .

    రిప్లయితొలగించండి
  20. కథ కథనం చాలాబాగుంది.సందేశాతమకం గా ఉంది. ఇట్లు V. NageswaraRao. Pendurthi.

    రిప్లయితొలగించండి
  21. గొప్ప కధ. దేశ భక్తి, పరస్పర గౌరవం, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేక విషయాలు వందరి మనసులను తాకుతాయి.

    రిప్లయితొలగించండి
  22. చాలా మంచిది. వికలాంగులను అవమానించవద్దని రచయిత ప్రజలకు అద్భుతమైన సందేశం ఇచ్చారు

    రిప్లయితొలగించండి