6 వ అధ్యాయం
పురాణ ప్రారంభం - 6 వ రోజు
‘‘ నీ ప్రధాన కర్తవ్యం ప్రజోత్పత్తి ! నేను సాగించబోయే నిరంతర సృజనలో అందగత్తెలు ఆవిర్భవిస్తారు. నచ్చిన వనితను సహధర్మచారిణిగా స్వీకరించి , దాంపత్య ధర్మం నిర్వర్తించి , సమృద్ధిగా సంతానాన్ని ఉత్పత్తి చేసి , నీ తండ్రి అయిన నా ఋణం తీర్చుకో ’’
‘‘ నారాయణ ! నారాయణ’’ నారదుడు నవ్వుతూ అన్నాడు.
నారాయణ నామగానమే నా పత్ని. దాని మూలంగా పొందే ఆనందమే నా సంతతి.
కుమారా బ్రహ్మ ఆశ్చర్యంగా అన్నాడు.
జనకా ! నా నారద నామధేయంలోని అర్థం సెలవిస్తారా నారదుడు వినయంగా అడిగాడు.నీకు నేను ప్రసాదించింది ఎన్నిక చేసిన పేరు , కుమారా ! 'పరమాత్మ విషయకమైన జ్ఞానాన్ని ప్రసాదించేవాడు' అనే అర్థం స్ఫురించే నామధేయం అది !"
ధన్యోస్మి నారదుడు వినయంగా అన్నాడు. "జ్ఞానదాత అని నన్ను పేర్కొన్నారు కదా ! అది సార్ధక నామధేయం కావాలి కదా జ్ఞానదాతకు సంతానం మోత ఎందుకు ?
బ్రహ్మ తీక్షణంగా చూశాడు.
ఇది అవిధేయత ! జన్మదాత అయిన నా ఆజ్ఞనే ధిక్కరిస్తున్నావు. నీ ప్రవర్తన శిక్షార్హమైన అపరాధం తెలుసా ?” నారాయణ ! తండ్రి శిక్ష తనయుడికి రక్ష అనుగ్రహించండి నారదుడు చిరునవ్వు నవ్వాడు.
ఆగ్రహం రజోగుణ స్పర్శతో బ్రహ్మదేవుడి ముఖ కమలాన్ని ఎర్రగా చేసింది. అవిధేయతకు శిక్ష అనుభవించు ! నిత్య బ్రహ్మచారిగా , నిరంతర లోక సంచారిగా తపించు .
ధన్యోస్మి ! నా నిత్య బ్రహ్మచర్యానికీ , నిరంతర లోక సంచారానికీ నారాయణ నామ సంకీర్తనను జత చేసి , తదేక ధ్యానంతో తపిస్తాను ; సంకీర్తనా తపస్సు సాగిస్తాను !"
నీకు ఒక చోట నిలకడగా కాలు నిలువదు. ఇది యీ విధి విధింపు బ్రహ్మ కంఠంలో ఆవేశం ధ్వనించింది.
మీ ఆగ్రహం నాకు అనుగ్రహం. ధన్యోస్మి ! ఇప్పుడే నా సంచారం ప్రారంభిస్తాను. సెలవు !" నారదుడు చిరునవ్వుతో నమస్కరించి వెనుదిరిగి వెళ్తున్నాడు.
బ్రహ్మదేవుడు అతన్నే చూస్తున్నాడు. ఆయన ఆవేశం మందహాసంగా మారింది. విష్ణు సంకల్పం ! ఆ విశిష్ట సంకల్పాన్ని తన సంకల్పం వికల్పం చేయలేదు ! ఆయన నారదుడి ఆకారాన్నే చూస్తూ నారాయణార్పణం అన్నాడు తృప్తిగా.
సృష్టికర్త తన మానసాన్ని తన సహజ కార్యక్రమం వైపు మళ్ళిస్తూ , కళ్ళు మూసుకున్నాడు.ఆయన సమ్ముఖంలో ఒక పురుషుడూ , ఒక స్త్రీ ఆవిర్భవించారు. ఇద్దరూ పాల నురగలాంటి తెల్లటి వస్త్రాలు ధరించి వున్నారు. బ్రహ్మ కళ్ళు తెరిచి ఇద్దర్నీ వాత్సల్యంతో చూశాడు.
కుమారా ! నేను సృష్టికర్త బ్రహ్మను. నువ్వు నా సంకల్ప సంజాతుడవు ! నా మానస పుత్రుడవు.. బ్రహ్మ పురుషుడిని చూస్తూ అన్నాడు.
జనకులకు నమస్కారం !" ఆ పురుషుడు చేతులు జోడిస్తూ అన్నాడు.
స్వయంభువుడైన నా సంకల్పంలో - నా అంశతో నువ్వు ఆవిర్భవించావు.. స్వయంభువ సుతుడైన కారణంగా నువ్వు స్వాయంభువుడవు ! 'మనువు' అనే బిరుదాన్ని ప్రసాదిస్తున్నాను. మనువులలో మొదటివాడివైన నువ్వు ఆదిమనువు అని కూడా వ్యవహరించబడతావు. అంటూ బ్రహ్మ స్త్రీ మూర్తి వైపు చూపుల్ని ప్రసరించాడు.
తన్వీ ! నీ నామధేయం 'శతరూప'. చక్కటి సౌష్ఠవంతో జవ్వనిగా ఆవిర్భవించిన నీకు 'యువ' అనీ, 'యువాదేవి' అనీ సార్ధక నామధేయాలు ప్రచారంలోకి వస్తాయి !
ధన్యురాలను శతరూప నమస్కరిస్తూ అంది.
స్వాయంభువా ! యువతి శతరూపను నీ భార్యగా స్వీకరించు. మీ దాంపత్య ఫలాలుగా భూలోక వాసం చేసే నరజాతి ఆవిర్భవించి , వృద్ధి చెందుతుంది మనువు అని సంతతి అయిన కారణంగా ఆ నరజాతి మానవ జాతిగావ్యవహరింపబడుతుంది.ఆమానవజాతికిబాల్యము కౌమారము యవ్వనము ,వృద్ధాప్యము అనేనాలుగు దశలుంటాయి. మృత్యువు తో మానవుని జీవితం పరిసమాప్త మవుతూ వుంటుంది. ఆ కారణంగా మానవులు 'మర్త్యులు' అనీ , వాళ్ళు నివసించే భూలోకం 'మర్త్యలోకం' అనీ వ్యవహరింప బడతాయి...” బ్రహ్మ ఆగి. ఇరువుర్నీ కలియజూశాడు.
మీ ఇద్దరి సంతతితో భూలోకం నిండి పోవాలి . మనువూ , శతరూపా నమస్క రించారు.భార్యాభర్తలుగా మీ జీవితం గురించీ , సంతానలాభం గురించీ , జీవన ధర్మాల గురించి మీకు చక్కని అవగాహన అవసరం. ఆ జీవనవేదం మీకు ధ్యానగోచరం కావాలి. అందువల్ల ప్రశాంత వాతావరణంలో , మనసుకు నచ్చిన ప్రదేశంలో ఇద్దరూ తపోసాధన' సాగించండి. ప్రస్తుతానికి మీ కర్తవ్యం అదే !" అన్నాడు బ్రహ్మ తన ఉపదేశాన్ని ముగిస్తూ.
జనకా... మీరు సెలవిచ్చిన భూలోకం స్వాయంభువ మనువు ఏదో అడిగే ప్రయత్నంలో అన్నాడు. బ్రహ్మ చెయ్యెత్తి వారించాడు. కుమారా ! ముందుగా మానవజాతిని వృద్ధి చేయడానికి అవసరమైన జ్ఞానం నీకు సమకూరాలి. నీ సంతతిగా పుట్టే మానవుల నిత్య జీవనవికాసం కోసం - ఆ జాతి మూల పురుషుడయ్యే నువ్వు - జీవన సూత్రాలను నిర్దేశించవలసి వుంటుంది. దానికి అవసరమైన నేపధ్యం ఇప్పుడు నువ్వు చేసే సాధన ద్వారా లభిస్తుంది.
భూలోకం గురించిన అంశం గురించి సకాలంలో నువ్వు నా సన్నిధికి వస్తావు ! ఇప్పుడు నీ కర్తవ్యం భూలోక విచారం. కాదు ; తపస్సు ! వెళ్ళు ! శతరూపతో కలిసి తపస్సు సాగించు !".
సశేషం...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి