వేరు పురుగు

 

                                                                                వేరు పురుగు

పి.వి.శేషారత్నం
సెల్ : 9492925291

                అధికారుల ప్రత్యేక అనుమతితో  పాతికేళ్ల లోపు యువ ఖైదీల మనస్తత్వాలపై రీసెర్చి చేస్తూ మానవ్ను ఇంటర్వ్యూ చెయ్యడానికి వచ్చిన మమత అతను చెప్పేది వినేందుకు మరింత ఆసక్తిగా ముందుకు వంగింది.

                ప్రేమికురాలిమీద పగతో  ఆమెను నమ్మించి బాంబుపెట్టి పూలబొకేతో హత్యాప్రయత్నం చేసిన నేరానికి అతను జైలుపాలయ్యాడు.

తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చావుబ్రతుకులమధ్య కొట్టుమిట్టాడుతోంది మౌనిక.

                దట్టంగా గడ్డం పెరిగిపోయి బక్కచిక్కిన మానవ్బొంగురుగొంతులో ఏదో తప్పుచేసాననే పశ్చాత్తాపం కంటె నిర్లిప్తతే ఎక్కువగా కనిపిస్తోంది.అతను కళ్లుమూసుకున్నాడు.

                కాలాన్ని వెనక్కి తిప్పింది అతని మనస్సు.

                                                                                                000        

                అరె మానవ్ఇటురా... ’ నెలరోజులుగా ఏడిపిస్తున్న తన అజ్ఞాత ప్రేమిక మౌనిక అన్వేషణలో మళ్లీ విఫలమై బృందావన్హోటల్మెయిన్హాల్లోంచి బయటికొచ్చిన మానవ్ని  అరడజనుమంది మిత్రులతో స్పెషల్సూట్లోకి వెళ్తున్న సుభాష్  పిలిచాడు.సాధారణంగా అక్కడ లేట్నైట్వరకూ మందు పార్టీలు జరుగుతుంటాయి.సుభాష్కు చెయ్యి ఊపి -మానవ్కాస్త ఇబ్బందిగా కదలబోయాడు కానీ సుభాష్వదల్లేదు. ‘ఇది మన మిత్రుడు రవీంద్ర పార్టీయే. నీకిష్టం లేకపోతే మందు వద్దులే ... కూల్డ్రిరక్తాగుదువుగాని...’

                మానవ్తప్పించుకోలేకపోయాడు.నిజానికి అతనికి మందు మీద ఎప్పుడూ ఆసక్తి లేదు.కాని సుభాష్మొహమాటం వల్ల మొదటిసారిగా ఈరోజు తాగకతప్పలేదు.మొదట వాంతి చేసుకున్నా మళ్ళీ తాగాడు. అలా అనేకంటె సుభాష్అతని మిత్రులు తాగేదాకా వదలలేదంటే బాగుంటుంది.                     

                గురూ!మేమంతా చెడిపోయినవాళ్ళం.నువ్వేనా మడిగట్టుకుని కూర్చునేది రా! ఇది అమృతం.’ అక్కడివాళ్ళకప్పటికే నిషా తలకెక్కింది.ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలీదు.నాలిక మొద్దుబారి పోయింది. పార్టీ పేరుతో ఊరికే మందు దొరుకుతోంది -అంతే.తాగినకొద్దీ తాగాలనిపిస్తోంది- అంతే -ఖర్చులేని విలాసం.స్టూడెంట్స్సాధారణంగా  తాగడం అలవాటుపడేది ఇలాగే -బర్త్డే పార్టీలన్నా, పరీక్షలయిపోయాక పార్టీలన్నా , కొత్తగా మోటర్బైక్కొనుక్కున్నా - వాళ్ళకి సంతోషం కలిగించేది ఏం జరిగినా పార్టీ అంటే మందుకొట్టడమే.

                ఊరినుంచి డబ్బులు అందిన రోజు వాళ్ళకి పండగే.పొరుగూళ్ళో చదువుకుంటున్న బిడ్డలు ఇబ్బందిపడకూడదని తల్లిదండ్రులు కడుపుకట్ట్టుకునో, అప్పోసప్పో చేసో అవసరానికి మించే పంపిస్తారు.ధనవంతుల పిల్లలయితే చెప్పనే అవసరం లేదు. కాలేజీలో చేరిన కొత్తలో మధ్యతరగతి యువత బుద్ధిగానే ఖర్చుపెట్టుకుంటున్నా సహవాసం వల్ల కొందరు... ప్రిస్టేజిగా భావించి కొందరు -అందరిలో పార్టీలో కలవకపోతే వెలేస్తారని మరికొందరు...ఎలా వుంటుందో రుచి చూడాలనే ఆసక్తితో కొందరు...ముందు నెమ్మదిగానే పద్మవ్యూహంలో ప్రవేశిస్తారు అభిమన్యుడిలా-

                మొదట ఏదో తిమ్మిరి తిమ్మిరిగా వుంటుంది.వెగటుగా వుంటుంది -కానీ తాగినకొద్దీ  వద్దనిపించనిది మద్యమే -రాత్రంతా తాగి ఎప్పుడో రూం చేరి పడుకుంటే పొద్దుటే లేవగానే తిక్క తిక్కగా వుంటుంది అయినా అదోఆనందం -తామూ పెద్దవాళ్ళమయిపోయాం-స్వతంత్రులమయిపోయాం అనే ఫీలింగ్కుర్రాళ్లలో.

                అందుకే మళ్లీ మళ్లీ పార్టీలకోసం ఎదురుచూపు.అదీకాక ఒకరోజు ఒకరి పార్టీ ఎంజాయ్చేసారంటే వాళ్లవంతు మరోరోజు వస్తుంది.అదీగాక తనచుట్టూ ఎప్పుడూ ఒక గుంపును ఉంచుకోవడంకోసం సుభాష్వంటి బాగా డబ్బులెక్కువయినవాళ్లు వీళ్లకి మందు పోయిస్తుంటారు.ఇక పద్మవ్యూహంలోంచి కావాలన్నా ఎవరూ బయటపడలేరు.దాంతో ఒకోసారి చదువు మూలబడుతుంది.డబ్బు తెప్పించుకోవడం కోసం అబద్ధాలు అలవాటవుతాయి. వేలకి వేలు పోసి చదివించాం అనే తల్లిదండ్రుల మాటల వెనుక వేలల్లో దుర్వినియోగం అయ్యేవి ఎన్నో....ఆదో చక్రవ్యూహం-

                ఆరోజు మత్తులో మానవ్ఏం చెప్పాడోగాని సుభాష్‌‌ మాత్రం మత్తులో లేడు.అతడు చెప్పిందంతా విని హాయిగా నిట్టూర్చాడు. నిజానికి అతనికి కావలసింది అదే. మానవ్నుండి అతనేం కోరు కుంటున్నాడో తెలీని మానవ్మాత్రం అమాయకంగా మత్తులో తేలిపోతే-సుభాష్అనుచర బృందం  అతన్ని ఇంటి దగ్గర దింపేసి వెళ్లిపోయారు.అతని తలుపు బాదుడుకి విసుగ్గా తలుపు తెరిచిన రూమ్మేట్రాహుల్కి గుప్పున వాసన కొట్టింది.

                ‘‘ఏం పనిరా ఇది మానవ్‌! ఊరినుంచొచ్చిన మీ నాన్నగారు ఇప్పటిదాకా నీకోసం ఎదురు చూసి ఇప్పుడే హోటల్రూంకి వెళ్లిపోయారు.’ మానవ్కి తలకెక్కిన మత్తు అంతా దిగిపోయింది.          

                ‘‘ఏంటి మా ఫాదర్వచ్చారా?మైగాడ్‌!’’

                అప్పటిదాకా ఎంతో హాయిగావుందనుకున్న మానవ్కి తలనొప్పితో తక్కిన రాత్రంతా నిద్రలేదు.సుభాష్బృందం కంట బడడం...ఎన్నడూ లేనిది వాళ్ల చేతుల్లో చిక్కి తాగడం...అదృష్టం బావుండి తను రావడం లేటయింది గాని ఆయన దృష్టిలో తన ఇమేజ్ఏమయిపోయివుండేది?అమ్మకి తెలిస్తే ఎంత బాధపడేది? అన్నం నీళ్లు ముట్టకుండా ఉన్నఫళంగా ఇక్కడికి వచ్చేసి వంటయినా మొదలుపెట్టేసి వుండేది.లేదా ఇక్కడ చదువైనా మాన్పించేసి కాళ్లూ చేతులూ కట్టేసి మరీ వెనక్కి తీసుకు పోయేది.పూర్ణిమ అక్కయ్య దృష్టిలో జీవితాంతం తను దోషిగా ఉండేవాడు.      చెల్లాయి అనన్య ఇక రకరకాలుగా ఏడిపించుకుని తినేసేది.

                పొద్దున్న లేవగానే ఇతర రూమ్మేట్లు కల్యాణ్‌, మనోజ్లు కూడా సున్నితంగానే అయినా చివాట్లు పెట్టారు.‘‘ఏరా మానవ్‌! నువ్వు మాఅందరి కంటే బుద్ధిమంతుడివి అనుకున్నాం ఇలా చేసావేంటిరా.’’

                మానవ్కి సిగ్గుతో మనసు చితికిపోయింది.తండ్రి హోటల్కి రమ్మన్న విషయం గుర్తొచ్చి ఒకరకంగా వాళ్లని తప్పించుకుందుకు వెళ్లిపోయాడు...

                ‘‘మనం వాడిని బాధ పెట్టామేమోరా?’’

                ‘‘మనం స్నేహితులంరా. చెప్పకపోతే అదే అలవాటుగా మారితే మానవ్జీవితం పాడయిపోతుంది.’’

                ‘‘అసలు సుభాష్గాడితో మనవాడు తిరగడం ఏం బాగులేదురా!అదొక రౌడీమూక. మానవ్కి ఎన్నిసార్లు చెప్పినా నవ్వేసి ఊరుకుంటాడు తప్ప వినడు.’’

                ‘‘ఎప్పుడో మనవాడిని ముంచేస్తాడు సుభాష్‌...వాడు మన స్టూడెంట్స్కే  డ్రగ్స్అమ్ముతున్నాడని కూడా విన్నాను.ప్చ్‌.. వీడికెప్పుడు తెలుస్తుందో?’’ సుభాష్మీద వాళ్లెవరికీ సదభిప్రాయం లేదు.మానవ్మాత్రం తండ్రిని కలుసుకున్నాక కులాసా అయిపోయాడు.

                ‘‘ఏరా మానవ్‌! కళ్లలా ఉన్నాయేరా! ఒంట్లో బాగాలేదా?’’మానవ్తండ్రి గురుమూర్తిగారు ఆప్యాయంగా అడిగారు.

                మానవ్తడబడ్డాడు.‘‘అబ్బే మా ఫ్రండ్స్తో చాలాసేపు కంబైండ్స్టడీస్చేసాను డాడీ!’’అబద్ధం అవలీలగా నోట్లోంచి జారిపోయింది.

                ‘‘మీ రూమ్మేట్స్చాలా మంచివాళ్లురా.చదువు బాగా సాగుతోందనుకుంటాను- డిగ్రీ అయిపోతే ఫారిన్పోదువు గాని... ’’                గురుమూర్తిగారు కొడుకు చేతిలో డబ్బుపెట్టాడు.

ఇంకా అవసరమైతేఅడుగు.ఇబ్బందిమాత్రం పడకు.’

                రూంకి తిరిగివస్తూ మానవ్తనను తనే తిట్టుకున్నాడు.‘ ...ఇంకెప్పుడూ తాగకూడదు.’’

                యేడు ఎలక్షన్లలో సుభాష్  ప్రెసిడెంట్గా గెలిచాడు.అతని ఫ్రెండ్స్చేసిన హడావుడితో కాలేజి అంతా దద్దరిల్లిపోయింది.సుభాష్చాలా ఆనందంగా వున్నాడు. క్యాంటీన్లోనే అందరికీ పార్టీ అరేంజ్చేసాడు.ఇష్టమున్నవాళ్ళు ఆనందంగా వచ్చారు.ఇష్టంలేని వాళ్ళు భయంతో వచ్చారు.మరికొందరు - ‘అతనిలో గొడవెందుకు?’  అని వచ్చారు. వచ్చినవాళ్ళలో కాన్వాసింగ్లో సుభాష్ను ఎదిరించిన మౌనిక లంచ్టైం కావడంవల్ల వచ్చి కూర్చుంది. హుషారుగా సుభాష్  నవ్వుతూ విష్చేసాడు.ఆమె మొహం తిప్పుకుంది.

                విూరు ఓటు వెయ్యనన్నా నేను ఫుల్మెజారిటీతో గెలిచానని కోపమా?ఇవాళ అందరికీ స్పెషల్లంచ్ఆర్డరిచ్చేసాం.మేనేజర్గారూ చెప్పండి ఇవాళ సుభాష్పార్టీ అని -’

                నేను ఉపవాసమన్నా ఉంటాను గాని నీ లంచ్తినను.’ మౌనిక తల ఎగరేసి  ఓసారి అతనికేసి ఏహ్యంగా చూసి విసురుగా అక్కడ్నించి వెళ్లబోయింది.సుభాష్లో సహనం నశించింది.అంతే...ఒక్క ఉదుటున అతను క్యాంటీన్ద్వారం వద్దకు వెళ్లాడు.

                ‘‘ఏం చూసుకునే నీకంత పొగరు - పోనీ అని ఊరుకుంటే రెచ్చిపోతున్నావ్‌ - నాసంగతి నీకింకా తెలియదు-’

                ఏయ్మాటలు మర్యాదగా రానీ.’

                నీకు మర్యాదేమిటే ...’ సుభాష్నోట అప్రయత్నంగా ఆమెనవమానించే మాట దొర్లింది.అంతే  - ఉగ్ర కాళిలా మౌనిక - చెయ్యెత్తింది -ఒక్క క్షణంలో అతని చెంపపై పెద్ద విస్ఫోటకం జరిగేదే.              

                కానీ ఎక్కడ్నుంచో మానవ్పరుగు వచ్చి ముందు నిలబడ్డాడు - దెబ్బ అతని చెంపపై పడిరది. అంతే బూరెలా ఉబ్బిపోయింది పచ్చని అతని చెంప -ఆమె తలచింది వేరు - జరిగింది మరోటి -ఇంక దెబ్బతో సుభాష్తన జోలికి రాడని ఆమె ఉద్దేశం.కాని అభాగ్యుడికి తగిలింది  దెబ్బ -

                చూసావా ! నాకెంత జన బలమో?నా ఒంటిమీద ఈగ కూడా వాలనివ్వరు -’ సుభాష్వెటకారంగా అని అనుచరులతో వెళ్లిపోయాడు.అయితే మౌనిక బలంగా కోపంగా కొట్టిన దెబ్బకు గుడ్లు గూబకొచ్చినట్లున్నాడు మానవ్‌-ఆమె చప్పున అతని చేతులు పట్టుకుంది.‘అయాం రియల్లీ సారీ మానవ్‌!’

                అప్పటి వరకూ ఊపిరి బిగబెట్టుకుని సుభాష్ఆజ్ఞ లేకుండా అక్కడనుండి కదిలితే ఏం కొంపమీది కొస్తుందోనని బిగుసుకు పోయిన వాళ్లంతా మానవ్కి చెంపదెబ్బ తగలడం ఒకరకంగా వాళ్లంతా తమ అదృష్టంగా భావించారు.

                సుభాష్ఎంత కిరాతకుడో అందరికీ తెలుసు.గత సంవత్సరం పోటీ మానుకోనన్నాడని సర్వారావు అనే ఫైనల్ఇయర్ఆర్ట్స్స్టూడెంటుకి గుట్టు చప్పుడు కాకుండా యాక్సిడెంట్చేసాడు.సర్వారావుకి ప్రాణమయితే పోలేదుగాని అంతకంటే విలువైన చదువు మానేసాడు.పైగా సుభాష్పై ఎటువంటి కేసూ పెట్టలేదు.ఎందుకో అందరికీ తెలుసు.కుటుంబం అంతటినీ చంపేస్తానని బెదిరించి వుంటాడు.సర్వారావుది మధ్య తరగతి కుటుంబం.అందరికీ తలలో నాలుకలాగ వుండేవాడు. సంవత్సరం చదువు అయిపోతే అతను ఏదో ఉద్యోగం చూసుకుని వెళ్లిపోయేవాడు.కాలేజీలో అన్నింటిలో అతనే ఫస్ట్‌. ధైర్యం కూడా ఎక్కువే.అందుకే మిత్రుల ప్రోత్సాహంతో అతనూ పేరిచ్చాడు.కాని  సైలెంట్గా ఇంత జరుగుతుందని తెలిస్తే పోటీల జోలికే వచ్చేవాడు కాదు.తండ్రి లేని సర్వారావుని అతని చెల్లెలిని మేనమామే చదివిస్తున్నాడు. ఆయన ఆతరువాత కాలేజీ యాజమాన్యంతో ఏంమాట్లాడినా సానుభూతిగా మాట్లాడారే తప్ప అరణ్య రోదనే అయింది.అప్పుడప్పుడూ అతని మిత్రులు వెళ్లి కలిసి వస్తుంటారు. కానీ అతను ఎప్పుడూ నోరు విప్పడు.అందుకే సుభాష్అంటే అందరికీ సింహ స్వప్నం.కాలేజి యాజమాన్యంతో సహా అతని ధాట్ఠీకాన్ని పంటి బిగువున భరిస్తున్నారంతా. సంఘటన చాలాకాలం ఎవరూ మర్చిపోలేకపోయారు.ఈరోజు మానవ్కి చెంప వాస్తే వాచింది గాని మౌనికకు పెద్ద ఉపద్రవం తప్పినందుకు అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు.

                లేకపోతే ఎన్ని వందలమంది వున్నా మహాభారతంలోలాగ ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టం పునరావృతం అయ్యేది.                మౌనిక ఏమనుకుందో గాని మానవ్ఆమె మనసులో నిలిచిపోయాడు.  మానవ్కి అనుకోకుండా తన జీవితం మలుపు తిరిగిపోయిందని మరునాడు గానీ తెలియలేదు.

000

                సుభాష్ఆరోజు చికాకు పడిపోతున్నాడు బాగా.అతని దగ్గరకు వెళ్లడానికే క్లోజ్ఫ్రెండ్స్కూడా భయపడుతున్నారు

                కారణం ...నాలుగు రోజుల క్రితం మానవ్కోసం కబురు చేసాడు.ఎప్పుడూ పిలవగానే రెక్కలు కట్టుకుని వాలే మానవ్రాలేదు.నిజానికి ఆరోజు మానవ్  తనను పెద్ద అవమానం నుండి కాపాడినందుకు అతను ఎంతో సంతోషించాడు.ఇన్నేళ్ళూ తిరుగులేని వ్యక్తిగా కాలేజీలో చలామణీ అవుతున్న తనని కుర్రపిల్ల పొగరుగా అవమానించడమేకాక చెయ్యికూడా ఎత్తింది.

                చిన్నప్పటినుంచీ సుభాష్ది ప్రత్యేకమైన మనస్తత్వం.అనుకున్నది ఆరు నూరయినా సాధించి తీరాల్సిందే.అతనికి మొదటినుంచీ చదువు మీద శ్రద్ధ లేదు.చుట్టూ పదిమందిని వెంటేసుకుని తిరగడం అలవాటయింది చిన్నతనంలోనే.

                సుభాష్ప్రతీ ఏడాదీ కాలేజీలో స్టూడెంట్స్యూనియన్ప్రెసిడెంటుగా ఎన్నిక అవుతూంటే అతని తండ్రి బాబూరావు గర్వంగా మీసం మెలేసుకున్నాడు... తన కొడుకు  రాజకీయ వారసుడు కూడా అవుతున్నాడని. సంవత్సరమైనా అతనికి ఎవరైనా బలమైన ప్రత్యర్ధి నిలబడకుండా ఎంత డబ్బు అయినా ఖర్చుపెట్టడం,అవసరమైతే కొందరిని తాగించడం, సామాన్యులను బెదిరించడంలో కూడా తండ్రినే అనుసరిస్తున్నాడు సుభాష్‌.అటువంటి సుభాష్ను ఒక పిచికపిల్లలాంటి కుర్రది ఏదో అంటే ఏమవుతుంది? అతనికి ఏంకాదు.కాని బీజంగా ఉన్నప్పుడే విప్లవాన్ని అరికట్టకపోతే అది మహా తుఫానై తన అధికార మహా వృక్షాన్ని పెకలించివేస్తుంది.

                సుభాష్కి ఎవరిని ఎలా లొంగదీయాలో వెన్నతో పెట్టిన విద్య.అందుకే బాగా కావలసిన స్నేహితుల సాయంతో ఒక ఫార్ములా ఫాలో అవుతున్నాడు. అది ఫలిస్తే మౌనిక మరి తలెత్తుకోలేదు.అతను ముందు ఆమెను సీరియస్గా తీసుకోలేదు.కాని కాన్వాసింగ్లో ఎప్పుడైతే ఖరాఖండీగా మాట్లాడిరదో అప్పటినుంచీ ఫార్ములాను మరింత ధాటీగా అమలు చేస్తున్నాడు.అయితే ఆరోజు క్యాంటీన్లో అనుకోకుండా మానవ్తనకు దెబ్బ తగలకుండా అడ్డుపడడం కాకతాళీయమే అయినా అతని ఫార్ములాను మరింత బలోపేతం చేసేదిగానే వుంది.

                అందుకే మానవ్ని అభినందించడం కోసం కబురుచేసాడు.  మానవ్  తన చెప్పుచేతల్లో మనిషి.తను ఆడిరచినట్టల్లా ఆడతాడనే నమ్మకం తనకుంది. మానవ్కి తనంటే అంత ఆరాధన.

                సుభాష్కి భుజాలు కోపంతో పొంగాయి.       ఆదివారం...అంటే దెబ్బ తిన్న మర్నాడు మానవ్మౌనిక ఇంటికి వెళ్లాడని తెలిసింది.తర్వాత నాలుగు రోజులుగా వాళ్లు క్యాంటీన్లో కబుర్లు చెప్పుకుంటూ కలసి లంచ్చెయ్యడం కాకుండా అక్కడక్కడా హాయిగా నవ్వుకుంటూ కనిపిస్తున్నారు.

                తన ఫార్ములా ముందుకు సాగుతోంది.అది తను ఆనందించ వలసిన విషయమే.          మౌనిక ఉచ్చులో చిక్కుకోవాలి. చిక్కుకుంది కూడా.కాని???మరి తనకెందుకు కోపం వస్తోంది?కొంపదీసి తను మౌనికను ప్రేమిస్తున్నాడా?... తనను ఎదిరించి అవమానించిన మనిషిని ప్రేమించడమా?అతనికీ మధ్య చూసిన సినిమా గుర్తొచ్చింది.అవును అది ప్రేమే. ద్వేషంలోంచి కోపంలోంచి పుట్టిన ప్రేమ.

                మౌనిక పెద్ద అందగత్తె కాదు తను ఇంతకు ముందు చూసిన అమ్మాయిలతో పోల్చి చూస్తే...ఆకర్షణంతా కళ్లలోనే వుంది.అవును మౌనిక తనకు కావాలి.సుభాష్తల ఎగరేసాడు.

                మానవ్‌! బాగున్నావా? నిన్ను చూసి అప్పుడే వారం రోజులవుతోంది.’సుభాష్గొంతులలో ఆప్యాయతకి మానవ్కి చాలా సిగ్గేసింది.             సుభాష్కి ఏవో కొన్ని దురలవాట్లున్నా తనంటే ఎంతో ఆప్యాయత ఉంది.

                బాగున్నాను అన్నా !’మానవ్కంఠంలో అంకితభావానికి నవ్వాడు సుభాష్‌. 

                పిలిపించారట మా రాహుల్మర్చిపోయాడు చెప్పడం ’ -సంజాయిషీ ఇస్తున్నట్టు అన్నాడు మానవ్‌.

                ఫర్వాలేదు కాని బిజీగా వున్నట్టున్నావ్‌ ! ’ అది మామూలుగా అన్నాడో వ్యంగ్యంగానో అర్థం కాలేదు మానవ్కి.సూటిగా విషయంలోకి వస్తూ అన్నాడు సుభాష్‌.     

అతడు మానవ్తో లింక్వదులుకోదల్చుకోలేదు.తన పగ గాని ప్రేమ గాని చల్లార్చేవాడు మానవ్ఒక్కడే.

                నా గౌరవం నిలబెట్టినందుకు...నిజానికి ఆదివారం విూ రూంకి వచ్చి నిన్ను తీసుకెళ్లి పార్టీ ఇద్దామనుకున్నాను.  ఇంతమంది నా చుట్టూ తిరుగుతున్నారు గాని - అసలైన స్నేహితుడివంటే నువ్వేనని నిరూపించావు.’సుభాష్మాటలు  అర్థం కాలేదు మానవ్కి. ఆగు నువ్వేం చెప్పకు. నిజానికి నువ్వే నాకు ఋణపడి వుండాలి.ఎందుకుఅంటే అసలు నిన్నూ మౌనికను కలిపింది నేనేగా.’

                మానవ్ఇబ్బందిగా చూసాడు.‘కాని మా ఇద్దరిదీ  స్నేహం...’

                నా దగ్గర దాచటం ఎందుకు బ్రదర్‌ !  లవ్ఈజ్నాట్ క్రైమ్‌ - ’

                సుభాష్ప్రవాహంలా మాట్లాడుతున్నాడు.మానవ్కి ఆశ్చర్యంగా వుంది. ‘విూ ఇద్దరి ప్రేమకి బీజం వేసేందుకు నేనెంతో కష్టపడ్డాను మానవ్‌! మౌనిక నుండి నీకు ప్రేమ సందేశాలు వచ్చాయా లేదా?’ తన ప్రేమసందేశాలగురించి ఇతనికెలా తెలుసు తనకీ రూమ్మేట్స్కి తప్ప ఎవరికీ తెలీదే - మానవ్విస్తుబోయాడు.

                అవి ఎవరు పంపారనుకున్నావ్‌ ... నేనే ...’ అంటూ అట్టహాసంగా నవ్వాడు సుభాష్‌.

                మానవ్కి మతి పోయింది. ‘నువ్వా .... నిజంగా నువ్వా ..... ఎందుకు  ఎలా ?’

                ఆగు ఒక్కసారి అన్ని ప్రశ్నలా  - ఎందుకు  అంటే మీ ఇద్దరినీ కలపాలని. ఎలా అంటే  ...’

                సుభాష్మరోసారి  గట్టిగా నవ్వాడు.‘హాకర్స్గురించి విన్నావుకదూ? నీ -మెయిల్లోకి తొంగి చూసేవాళ్ళు... నీ వెబ్సైట్లోకి చొచ్చుకు వచ్చేవాళ్ళు ...అలాగే మనం పోన్లు చెయ్యక పోయినా వేలకి వేలు లక్షలకి లక్షలు ఫోన్బిల్లు ఎలా వస్తుందో తెలుసా ? టెలిఫోన్హాకర్స్కారణంగానే ... మనదేశంలో వాళ్లని లైన్మెన్అనో మరేదైనా అనుకో. నీ సెల్నుండి తెలియకుండా యస్సెమ్మెస్లు వెళ్లడం గాని రావడం గాని అలాగే అనుకో - సిద్ధహస్తుడైన నా క్లోజ్ఫ్రెండ్ద్వారా పని చేయించాను.’

                అతనంత తాపీగా చెప్తున్నా మానవ్కి ఒళ్ళెరగనంత కోపం వచ్చింది.ఒక అమాయకురాలైన ఆడపిల్ల నుండి అలాంటి యస్సెమ్మెస్లు వస్తే ఇవతలివాడు నిజంగా ఆమే పంపిందని అల్లరి పెట్టడూ...              తను కూడా అజ్ఞాత ప్రేమిక కోసం ఎంతటి భ్రమలో కొట్టుకున్నాడు?కానీ ఇంత కుత్సితమైన పని ఎందుకు చేసాడితను.

                అదే అడిగాడు సుభాష్ను. అతను కోపం తెచ్చుకోలేదు.‘ఏమో మానవ్‌! నాకు అన్నదమ్ములు లేరు. నువ్వే నా తమ్ముడి వనుకున్నాను.ఎందుకో అలా అనిపించింది. చేసేసాను.ఇప్పుడు నువ్వు ఆనందంగానే వున్నావు కదా! ’

                కాని ..... ’ ఏంచెప్పాలో అర్ధం కాలేదు మానవ్కి.

ఇంకేం చెప్పకు - ఇక మొన్నటి సంఘటనలో కూడా నా ప్రమేయం ఏంటో తెలుసా?నువ్వు నా వెనక ఉన్నావనే నేను మౌనిక దగ్గర రెచ్చిపోయాను.నువ్వు తప్పక అడ్డుకుంటావనీ తెలుసు. అలా మౌనికనూ, నిన్నూ డైరెక్టుగా కలిపేయాలనుకున్నాను. కలిపాను. తరువాత నువ్వు లంచ్కి వెళ్ళడం నాలుగు రోజులూ మనసు విప్పి మాట్లాడుకోవడం అన్నీ నాకు తెలుసు మానవ్‌!’ ఒక్క క్షణం తనెక్కడున్నాడో, ఏం వింటున్నాడో అర్ధం కాలేదు మానవ్కి.

                కానీ మౌనిక పట్ల నాకు స్నేహం మాత్రమే ఉంది అన్నా!’

                పోనీలే నువ్వు బుద్ధిమంతుడివి కనుక అలాగే ఉంటుంది. అదే క్రమేపీ ప్రేమగా మారుతుంది. ఒక అన్నగా నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నాకు కూడా మౌనికపట్ల ఎప్పుడూ కోపంగానీ ద్వేషంగానీ లేవు మానవ్‌! ఇదివరకు ఎప్పుడైనా ఉన్నా ఇప్పుడసలేమీలేవు. ఎందుకంటే నాకు కావలసినవాడివి నువ్వు. నీకు కావలసిన వ్యక్తి మౌనిక.మీ ఇద్దరికీ నా శుభాకాంక్షలు.వస్తాను.’

                                                                                                000

                అక్క పూర్ణిమ పెళ్లికని వెళ్లిన మానవ్ఊరినుండి ఎప్పుడొస్తాడా అని ఎదురుచూసిన రాహుల్‌, కళ్యాణ్‌, మనోజ్‌, అతను వచ్చీ రాగానే పోటీపడి ఎన్నో విశేషాలు చెప్పేశారు. వాటిలో ముఖ్యమైనది సుభాష్ప్రవర్తన.  పెళ్ళికని మానవ్వెళ్ళాక ఒకటిరెండు సార్లు సుభాష్మౌనిక ఎదురెదురు పడ్డారు. సుభాష్తన ప్రవర్తనకు క్షమాపణ అడగడం మరీ విశేషం.

                ఇట్సాల్రైట్‌. కాలేజి మనందరిదీ. మనమంతా ఇక్కడ ఒక్కటే. ఎలక్షన్లూ అవీ తాత్కాలికమైనవే. కాలేెజ్వదిలి వెళ్ళినప్పుడు మధురమైన జ్ఞాపకాలు మన మనసుల్లో పదిలంగా ఉండాలి తప్పా కక్షలూ కార్పణ్యాలూ కాదు.ఇంతవరకూ నాకు ఇలా మీ అంత సౌమ్యంగా చెప్పినవారు ఎవరూ లేరు మౌనికా!ఈరోజు నుంచీ మనం స్నేహితులం. సరేనా

                తేడా వస్తే ముఖం మీదే అడుగుతాను తప్ప నా మనసులో ఏమీ వుండదు. ఎలాగూ ప్రెసిడెంటు అయ్యారు కాబట్టీ మన స్టూడెంట్ల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళండి. మీలా నోరున్న వాళ్ళు అడిగితే తప్పక పనులు జరుగుతాయి.’

                తప్పకుండా మౌనికా! మీ లేడీస్సమస్యలను నాకు రాసివ్వండి. అలాగే మిగిలినవాళ్ళవీ తెలుసుకుంటాను.’

                ఏంటే మౌనికా. వాడు మారాడని నమ్మేస్తున్నావా? మేకవన్నె పులి.’ అప్పటిదాకా దూరంగా ఉండిపోయిన మౌనిక ఫ్రెండ్స్సుభాష్వెళ్ళిపోగానే ఆమెను చుట్టుముట్టేశారు.

                ఆరోజు సాయంకాలం మానవ్సుభాష్ను కలిశాడు. అయితే సుభాష్తన కోపాన్ని బయటపెట్టలేదు. మామూలుగానే పలకరించాడు. ‘అన్నా! మా రూమ్మేట్కల్యాణ్ఫాదర్రావడం వల్ల నిన్ను కలవలేకపోయాను. ఐయామ్వెరీ సారీ.’

                మనలోమనకి సారీలేంటి మానవ్‌. సరే ఎలాగున్నావు? మౌనికేమంటోంది?చాలా సేపే మాట్లాడుకున్నారు. అవునా? ’

                ఎందుకోగానీ మౌనిక పుట్టినరోజుకి తనను ఆహ్వానించిందని చెప్పాలనిపించలేదు మానవ్కి.‘కాలేజీ కబుర్లే అన్నా. ’

                నా దగ్గర దాస్తున్నావంటే నన్ను పరాయి వాడిగా భావిస్తున్నావా మానవ్‌? నీకు మౌనిక అంటే ఇంట్రస్ట్లేదంటే నమ్మమంటావా?’

                మానవ్కి సుభాష్తో మాట్లాడేందుకు చాలా ఇబ్బందిగా వుంది విషయం. ‘నువ్వేమీ ఇబ్బంది పడకు. ఇలాంటి విషయాల్లో పండిపోయాను. నా సలహా తీసుకోవచ్చుగా. ఉదాహరణకి ఆమె బర్త్డేకి....మంచి గిఫ్ట్‌...’

                నీకెలా తెలుసూ!’మానవ్అమాయకత్వానికి సుభాష్నవ్వాడు.

                అది చెప్పాలనే నిన్ను రమ్మన్నాను మొన్న. నాకెలా తెలిసిందీ అంటే కాలేజీలో ఆమె స్కూల్రిజిస్టర్కాపీలో చూశాను. నువ్వు ఆమెను చేరుకోవాలనుకుంటున్నావు. కనుక నీకు చెప్పాలనుకున్నా.’అసలు కాలేజీ ఆఫీసు గదుల్లో ఉండే ఆమె రిజిస్టర్నువ్వెందుకు చూశావు అని మానవ్మనసులోనే అనుకున్నాడు తప్ప పైకి అనలేదు. ‘ఇంతకీ నాకేం సలహా చెప్తావన్నా?’

                మౌనిక చాలా ఆత్మ విశ్వాసం, వ్యక్తిత్వం ఉన్న లేడీ. అందుకే బహుమతులు ఇస్తే కోపం వస్తుంది.’తమ మాటలు పక్కనుండి విన్నట్టుగా మౌనిక హృదయం ఎలా గ్రహించాడు సుభాష్‌?చాలా తెలివైన వాడే. ఇతను నిజంగానే బాగా మారాడు-మనసులోనే అతన్ని మెచ్చుకున్నాడు.

                ఏం మానవ్మాట్లాడవు? ఊళ్ళో హోటల్లో చక్కని పూలబొకేలు ఆర్డరు చేస్తే తయారు చేస్తారు. నీకోసం నేను స్పెషల్గా చేయించి ఇస్తాను. నన్ను తప్పుగా అనుకోవు కదా!’

                ధాంక్స్అన్నా. నా సమస్య చిటికెలో తీర్చేసావు.ఈరోజే ఆర్డర్చేద్దాం. మంచి కళాత్మకంగా ఉండాలి.’

                మన ఇద్దరి ఆలోచనలూ సజెషన్లతో అద్భుతంగా చేయిద్దాం. పదఒక్క క్షణం ఆలస్యం చెయ్యకుండా మెగాకు వెళ్లారు. కలర్రోజా పువ్వులను అక్షరంపై ఉంచాలో - సుభాష్చెప్తుంటే విస్మయంగా విన్నాడు మానవ్‌.ఇక సలహా ఇవ్వడానికి తనకేం అవసరం రాలేదు.              అడుగున మానవ్పేరు కూడ ఎలా వ్రాయాలో సుభాష్చెప్పాడు.

                ఇది నాసంతోషం కోసం నీభవిష్యత్ఆనందంకోసం వేస్తున్న పునాది మానవ్‌!’              

సండే మధ్యాహ్నం వచ్చి కలెక్ట్చేసుకోమని చెప్పాడు హోటల్వాడు.‘నువ్వు రా నవసరం లేదు - బృందావన్దగ్గరికి నేను ఆరు గంటలకల్లా అందజేస్తాను. సరేనా ! నేను లోపలికి రానులే !’

మానవ్వెళ్ళిపోయాక సుభాష్నవ్వుకున్నాడు కసిగా -

                యు విల్డెఫినిట్లీ పే ఫర్ఇట్మౌనికా ! నీలా నన్నవమానించిన వాళ్ళు లేరింతవరకూ.’

                                                                                                000

                గురుమూర్తిగారు శతవిధాలా తనకున్న పరపతినంతా వినియోగించినా మానవ్కి బెయిల్దొరకలేదు.అతనిమీద  హత్యా ప్రయత్న నేరం రిజిస్టర్చేసారు.

                కటకటాల వెనుక మానవ్రెండు మోకాళ్ల మధ్య తల పెట్టుకున్నాడు.స్నేహితులు వచ్చినా తల ఎత్తలేదు.మాట్లాడ లేదు.

అతనిలో కన్నీళ్లు ఇంకి పోయాయి.ఆత్మావలోకనంలోనే కాలం గడచిపోతోంది.

                మహాత్మా సిటీ కాలేజ్కి ఎంతో పేరుందని, ఒక ఆంధ్రుడు స్వాతంత్య్ర సమరయోధుడు స్థాపించిన జూనియర్కాలేజ్క్రమంగా డిగ్రీ, పి.జి స్థాయిని అందుకుందని ఎక్కడెక్కడివాళ్లు కాలేజ్లో సీటుకోసం తపిస్తారు.మానవ్కోరికమీదే గురుమూర్తిగారు అతనిని ఇక్కడ చేర్పించారు.           అందుకాయన పాతికలక్షలు డొనేట్చేసారు కూడా.మహాత్మాసిటీ  కాలేజీ ఎందరో శాసన సభ్యులను, సైంటిస్టులను, ఆర్ధిక శాస్త్రవేత్తలను, రచయితలను దేశానికి అందించింది.అటువంటి ఉత్తమ కాలేజీకి తను చెడ్డపేరు తీసుకు వచ్చాడు.

కాలేజీ విద్యార్ధి ఒక హంతకుడిగా పేపర్లకెక్కాడు.తను చేసిన తప్పేమిటి?తన లక్ష్యాన్ని మరచి సుభాష్చేతిలో ఆటబొమ్మయి మౌనికతో ప్రేమలో పడడమా?

                అది తనంత తానుగా చేసినపని కాదు.         ఎవరినో ఒకరిని ఆట పట్టించాలనే స్వభావం ఉన్న సుభాష్అందుకు తన ఫోన్నెంబరును ఎంచుకున్నాడు.వాడుకున్నాడు. యస్సెమ్మెస్ను సీరియస్గా ఎందుకు తీసుకున్నాడు తను?మౌనిక అనే పేరుగల అమ్మాయి కోసం అన్వేషించాడు.అందులో భాగంగానే విసుగుతో హేట్యూఅంటూ యస్సెమ్మెస్చేసాడు...అదికూడా ....ఆమెనుండి వచ్చినవాటిలో తోచిన నంబరుకు. అన్వేషణ ఫలించకపోగా తనకు విపరీతంగా ఆమె పేరుతో యస్సెమ్మెస్లు వచ్చాయి. కోపంలో విసుగులో తను అదే నంబర్కి హేట్యూ- ’ అని మళ్లీ యస్సెమ్మెస్చేసాడు.కానీ అదే తన కొంపముంచింది.

                బ్యాంకు ఆఫీసరయిన మౌనిక తండ్రి వద్ద సెల్ఉంటుందనిగాని, అది అసలు మౌనిక నంబరనిగాని తనకు తెలీనే తెలీదు.

కాని ఇప్పుడు మౌనికతండ్రికి అదే బలమైన పాయింట్అయింది.అయినాగానీ మౌనిక మీద తను హత్యాయత్నం చెయ్యడమేమిటి?మనసులోనే గాఢంగా ప్రేమించిన ఆమెను ఎందుకు చంపాలనుకుంటాడు?అసలు ఇదంతా ఎందుకు జరిగిందో తనకు అంతు పట్టడం లేదు. అంతా తననే దోషి అంటున్నారు.కాని ఒక పథకం ప్రకారం సుభాష్తనను ఇరికించాడని మాత్రం అర్ధమైపోయింది.కాని అతను పిక్చర్లోకి రావడం లేదు.తనెంత మొత్తుకున్నా పోలీసులు అర్ధం చేసుకోవడం లేదు.

                అసలు ఆరోజున...మౌనిక పుట్టినరోజు అని పార్టీకి తనని మాత్రమే ఆహ్వానించిందని ఎంత సంబరపడిపోయాడు? రాహుల్‌, కల్యాణ్‌, మనోజ్లు తనమీద జోకుల వర్షం కురిపించారు.వాళ్లను పైకి విసుక్కుంటున్నా ఎంతో ఆనందం.

                బృందావన్చేరుకుని ఆమెకు స్పెషల్బొకే ఇవ్వగానే ఆమె కళ్లల్లో మెరుపు.

                అదేరోజు రాత్రి బొకేను పక్కనపెట్టుకుని పడుకున్న మౌనికకు...అర్ధరాత్రి పేలుడుతో ముఖం చిద్రమయిందిట.నాశిక్షగురించి  నాకు బాధ లేదు.నాలాగ ఎందరు అమాయకులు సుభాష్ఉచ్చులో ఇంతవరకు చిక్కుకుని... ఇకముందు చిక్కుకోబోతూ విలవిల్లాడతారోననే...’

                మానవ్కళ్లనుండి స్రవిస్తున్న కన్నీటి ధారలకు తోడుగా రెండు కన్నీటిబొట్లు నేల రాలాయి రీసెర్చి స్కాలర్మమత కళ్లనుండి.

000

                మనిషి మనసు అనే పక్షికి రాగ ద్వేషాలు రెండు రెక్కలు.మమకారం, అహంకారంలాంటివిరాగంఅనే రెక్కలోని ఈకలు. ప్రతీకారం, పగ, కోపంలాంటివిద్వేషంఅనే రెక్కలోని ఈకలు. రాగద్వేషాలు బలపడితే మనసు గతి తప్పుతుంది.’

                తన కొడుకు ఆసిడ్దాడిని చిటికెలో తప్పించుకున్న తమ ఊరిపూజారిగారమ్మాయి మమత  మాటలు సుభాష్తల్లి  సుశీలమ్మ చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి.

                రాగద్వేషాలకు మనిషి బద్ధుడైతే అది బంధం. వాటినుంచి విముక్తుడైతే అది మోక్షం. బందీ అయినవాడు బద్ధుడు. బయట పడినవాడు బుద్ధుడు.తన భర్తలాగే తనూ కొడుకుమీద మమకారానికి బందీ అయిపోయిందా?ఎప్పటికీ తను బద్ధురాలేనా? బుద్ధునిగా మారలేదా?’

                ఒక్క క్షణం మాత్రమే ఆవేశం ఆమాతృమూర్తిని ఆవహించి ఆమె మనసు ఊయలలూగింది.

                పెంచుకుంటున్న మొక్కే కదా అని చీడ పట్టినా అశ్రద్థ చేస్తే మూలంలోకి అది పాకిపోతోంది!అందుకే వేమనగారు అననే అన్నారు. ‘వేరు పురుగుచేరి వృక్షంబు చెరచురాఅని...తను మౌనముద్రవహిస్తే  తోటలోని ఇతర మొక్కల ప్రాణాలకూ ముప్పు తప్పదని గ్రహించింది సుశీలమ్మ.

                ఆరాత్రి బాధతో మర్మస్థానాన్ని పట్టుకుని  విలవిల్ల్లాడుతున్న కొడుకు ముఖం గుర్తొచ్చి  నేలమీదికి జారిపోయింది సుశీలమ్మ. చీడ వదిలిపోయిన మొక్క కొత్త చిగురు వేస్తుందో లేదో కాలమే చెప్పాలి.

                ‘‘మమతగారూ!బాల్యంలో తల్లిదండ్రులు... గురువు... యవ్వనంలో మిత్రులు చెప్పే హితవాక్యాలు పెడచెవినపెడుతున్నామంటే ఒక్కటే కారణం...మనిషిని దుష్టసాంగత్యం ఆకర్షించినంతగా  సత్సాంగత్యం ఆకట్టుకోదు.అయితే మనం ఎంచుకునే సాంగత్యమే మన మొత్తంజీవిత భవిష్యత్తును నిర్దేశిస్తుంది అనేది కఠోరవాస్తవం అనడానికి నన్ను మించిన ఉదాహరణ వేరే లేదు.

                యువత బాగుపడేందుకయినా ...పాడయిపోయేందుకయినా ...కోటి దారులుంటాయి.కొన్ని మిలమిల్లాడుతూ  ఆకర్షణీయంగా ఉంటాయి. కొన్ని ఆదర్శాలతో మబ్బుపట్టినట్టుంటాయి. దారెటుపోతుందో ఎవరికి తెలుసు?అందుకే దారిని చూపించడంలో పెద్దలతోబాటు... దారిని ఎంచుకోవడంలో ప్రతి విద్యార్ధీ... విచక్షణ అనే తారకమంత్రాన్ని ఉపయోగిస్తేనే గమ్యం చేరుకోగలరనేది మాత్రం తథ్యం!!!’’

                 సంచలనం రేపిన కేసులో నెల తర్వాత నిర్దోషిగా విడుదలయిన మానవ్మమతకు మనస్ఫూర్తిగా నమస్కరించాడు.

           00000

               

                                                                               

 

 

 

 

 

 

 

1 కామెంట్‌:

  1. సుభాష్ లాంటి వేరుపురుగులు సమాజం లో చాలా మంది వున్నారు. వారి దుష్కృత్యాలకు ఎందరో బలి అవుతున్నారు. మౌనిక, మానవ్ ల పరిచయం ప్రేమగా మారటానికి వారి స్వభావాలు దోహదపడ్డాయి. కానీ సుభాష్ ని నమ్మటం మానవ్ మానవ తప్పిదం. మమత వలన కథ సుఖాంతం కావటం విశేషం. రచయిత్రి గారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి