త్వమేవాహం..

త్వమేవాహం..

శైలజామిత్ర
ఫోన్‌: 9290900879

                ఇద్దరు శతృవులు అనుకోకుండా ఎదురెదురు పడ్డారు. ఇద్దరి చేతుల్లోనూ గన్స్‌. ఇద్దరి హృదయాలలో ద్వేషం, ఎవరికి వీలయితే మరొకర్ని అంతమొందించాలనే ఒక జీవితకాలపు కోరిక ఉండటంతో ఆవేశంగా ఒకరినొకరు చూసుకుంటున్నారు. అయితే ఒకరినొకరు చంపేసుకోవచ్చు కదా అనుకోవచ్చు కానీ నాగరిక ప్రపంచంలో ఎదుటి వ్యక్తిని అంతమొందించేటప్పుడు ఒకే ఒక్క మాటయినా మాట్లాడకుండా ఉండటం ఆనవాయితీ కాబట్టి తనలోని ద్వేష పదాల్ని చెప్పడానికి ఇద్దరూ తడుముకోవడంలో ఆలస్యం చేస్తున్నారు. వారు తీసుకున్న సమయానికి కూడా విసుగు వచ్చిందేమో.. తర తరాలనుండి వీరిలా కొర కొరా చూసుకుంటారే తప్ప ఒకరినొకరు సరదాగానైనా చంపుకోరేమి అనేంత విసుగు ప్రకృతికే వచ్చిందేమో ఉన్నట్లుండి పెద్ద గాలి భీభత్సంగా వీచింది. కాస్సేపటికి చినుకులు పడి, మరి కాస్సేపటికి ఉరుములు, మెరుపులతో కుంభవృష్టిగా మారింది. ఇద్దరు శతృవులూ తలదాచుకోవడానికి తగిన ప్రాంతానికై వెదుక్కున్నారు. అప్పటికే హరి తన స్నేహితులతో వేసుకున్న చిన్న టెంట్ఇద్దరికీ ఆశ్రయం అయ్యింది. పరుగులాంటి నడకతో ఇద్దరూ అక్కడ చేరారు. ఇక్కడకి రావడానికి నువ్వెవరివి రా అంటున్నా బయటకు వెళ్ళలేక అక్కడే కూలబడిపోయాడు శరత్‌.  అక్కడితో ఆగకుండా ‘‘హు.. బతికిపోయావురా వర్షం వచ్చి. లేకుంటే పాటికి నా చేతిలో శవంగా మారేవాడివి‘‘ అన్నాడు వికృతంగా నవ్వుతూ

                ‘‘నాదీ అదే మాటరా! నీ చేతిలో గన్ఉంది. నా చేతిలో గన్ఉంది. చిటికెలో ఫోన్చేస్తే చిటికెలో నా స్నేహితులు నా కళ్ళముందుంటారు. చంపడం నీకెంత తేలికో నాకూ అంతే తేలిక. గుర్తుంచుకో’’ అన్నాడు మరింత గట్టిగా హరి పళ్ళు నూరుతూ 

                మాటకి మరింత గట్టిగా నవ్వాడు. స్నేహితులా? ఎవరు? ఒకప్పుడు నువ్వు కూడా నాకు స్నేహితుడవే .. కానీ రోజు బద్ద శతృవువి. అవకాశం వచ్చేంత వరకే రా స్నేహితులు మన వెంట తిరుగుతారు. అదే అవకాశం వచ్చిందనుకో వారే నీలాగే రాక్షసులుగా మారుతారు. గుర్తుంచుకో’’ అన్నాడు శరత్

                ‘‘ఏంట్రా మాట్లాడుతున్నావు? నా.. కా అనే ఒక మాట వాడి అమాంతం శరత్వైపు దూకాడు హరి. శరత్ఏమయినా తక్కువ తిన్నాడా? తన చేతుల్ని మరింత గట్టిగా హరి మెడకు చుట్టాడు. హరికి ఊపిరి ఆడటం లేదు. ప్రమాదం గ్రహించిన హరి వెంటనే కింద పడి అక్కడున్న ఇటుకతో శరత్తలపై ఒక్క దెబ్బ వేసాడు. అంతే. శరత్చేతి పట్టు సడలింది. శరత్తలకు తీవ్ర గాయమయింది. అబ్బా! అంటూ గట్టిగా అరిచాడు. అప్పటిదాకా గొంతును బిగించిన కారణంగా హరికి ఊపిరి ఆడటం లేదు. అయినా పట్టు వదలకుండా ఒకరినొకరు కొట్టుకున్నారు. దుర్భాషలాడుకున్నారు. చేతికందిన వాటితో ఒకరినొకరు తీవ్రంగా గాయపరచుకున్నారు.

                శరత్కు తల తీవ్రంగా నొప్పి పుడుతోంది. దానికి తోడు గాలి చేస్తున్న శబ్ధం మరింత భయాన్ని కలిగిస్తోంది. ఇద్దరూ ఒకరిని మించి బాధతో అరుచుకుంటున్నారు. ఒకరి బాధ మరొకరికి ఆనందం కలిగిస్తున్నా, నెప్పిని భరించలేనితనం అంత ఆనందాన్ని ఇవ్వలేకపోతోంది. ఇద్దరిలోనూ బతకాలని, బయటపడాలని ఉంది. భరించరాని బాధకేమో మెల్లమెల్లగా ఒకరిపై మరొకరికి ద్వేషం తాలూకు భావాలు సమసిపోతున్నాయి.

                కాస్సేపు వరకు బాధగా అరచిన హరి గొంతు వినిపించడం మానేసింది. దాంతో శరత్కంగారు కలిగింది. అయినా బింకాన్ని పోనివ్వకుండా ‘‘ఏరా! హరీ.. బతికేవున్నావా? లేక హరీమన్నావా? నీనుండి శబ్ధం లేదు’’ అన్నాడు బాధలో కూడా నవ్వుతూ శరత్

                అదే భావం కలిగి కంగారు పడుతున్న హరి కూడా లేని ఓపికను తెచ్చుకుని ‘‘నేనెందుకు హరీ మంటానురా! నువ్వు పోయాకే నేను పోతాను. అంటే నిన్ను చంపి గానీ నేను పోను. గుర్తుంచుకో’’ అన్నాడు ఓపిక తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ..

                ‘‘ఆగు ఆగు! నీ పొగరు అణిగేది ఇప్పుడు కాదు. నా అనుచరులను పిలిచాను. కాస్సేపటికి వస్తారు. నీ అంతు చూస్తారు’’ అన్నాడు శరత్

                ‘‘నీకేనా అనుచరులు ఉండేది. నాకూ ఉన్నారు. నేనూ పిలిచాను. మీ వారికంటే మా వాళ్ళే ముందుంటారు. చూద్దాం ఎవరి అంతు ఎవరు చూస్తారో?’’అన్నాడు హరి బలవంతంగా లేవడానికి ప్రయత్నిస్తూ

                ‘‘ఇందాక స్నేహితులు అన్నావు.’’ అన్నాడు నవ్వుతూ అక్కడున్న చెట్టుకు ఆనుకుని శరత్

                ‘‘నువ్వు అనుచరులు అన్నావని నేనూ అన్నాను’’ ఏం నాకేం తక్కువ’’ అన్నాడు హరి

                నొప్పితో చేతిని వేల్లాడేస్తున్న తీరును చూసి ‘‘ఏం నీ చెయ్యి గోవిందానా’’ అన్నాడు శరత్

                ‘‘! నీ తల కూడా గోవిందానే కదా’’ అన్నాడు మరింత శక్తిని కూడదీసుకుని హరి

                ‘‘కాస్సేపు మౌనం.’’ ఇద్దరూ ఎంతో కష్టపడి హరి నిర్మించుకున్న చోటుకు వచ్చి చేరారు. అక్కడే ఉన్న నీటితో కాళ్ళు చేతులు కడుక్కున్నారు. అక్కడే జారగిలపడ్డారు.  శరత్ఉన్నట్లుండి స్పృహ తప్పినట్లుగా పడిపోయాడు.

                అది గమనించిన హరి ‘‘శరత్‌.. శరత్‌..’’ అని తట్టి లేపాడు

                 బలవంతంగా కళ్ళు తెరచిన శరత్‌. ఏరా! మీ అనుచరులు వచ్చారా? నన్ను చంపేయాలను కుంటున్నారా?’’ అన్నాడు నీరసంగా నవ్వుతూ..

                ‘‘లేదు. రాలేదు. బహుశా వర్షం రావడంతో ఎక్కడైనా ఆగారేమో!’’ అన్నాడు చేతికి టీ అందిస్తూ ..

                ‘‘ఎంతో నీరసంగా ఉన్నా కూడా తాను తెచ్చుకున్న సరుకులతో టీ చేసి ఇచ్చినందుకు ‘‘థ్యాంక్స్అన్నాడు శరత్అందుకుంటూ..

                ‘‘నేను నీ శతృవునిరా. మరచిపోయావా? సేవలు చేస్తున్నావు?’’ అన్నాడు వెటకారంగా శరత్ 

                ‘‘నేను కూడా నీ శతృవునే కదారా’’ అన్నాడు సమాధానంగా హరి

                ‘‘ఇంతకీ మనం ఎందుకు శతృవులమయ్యాము?నీకేమయినా గుర్తుందా? చిన్నప్పుడు మనిద్దరం ఎంత మంచి స్నేహితులం? ఇలా ఎలా మారాము?’’ అన్నాడు శరత్మెల్లగా ఆలోచిస్తూ 

                ‘‘ నేలకోసం. ఇప్పుడు నువ్వు నేను కూర్చున్నామే నేల నాది. తాతల నుండి మీరంతా మా మీద పడి స్థలం కోసం పీడిస్తూనే ఉన్నారు. మా తాత కష్టపడి సంపాదించుకున్న నేల ఇది. మీ తాత అన్యాయంగా నాది అనడంతోనే వచ్చింది శతృత్వం.’’ అన్నాడు హరి కోపంగా

                ‘‘మరి మా తాతకు ఎవరు అమ్మారు? మరి’’

                ‘‘ఎవరో తప్పుడు డాక్యుమెంట్స్సృష్టించి డబ్బుకోసం అమ్మేసినట్లు చూపాడు. నిజానికి మీ తాత దగ్గర ఉన్నవి డూప్లికేట్డాక్యుమెంట్స్‌. కానీ అక్కడున్న లాయర్లను, పోలీసులను కొనేసి మీదిగా చేసుకుని ఏడాదిలో వచ్చే మామిడి పంటనంతా అమ్ముకుంటున్నారు. అప్పట్లో మాకు నేల, పంటే ఆధారం. అది ఒక్కటి పోయే సరికి మా వాళ్ళంతా తిండికి కూడా లేకుండా నరకం అనుభవించారట. మా నాన్న కూడా ఏదో ఉద్యోగం చేస్తే ఏదో బతుకు వెళ్లదీసాం. నేను చదువుకున్నాను కనుక నాకంటూ ఒక మంచి ఉద్యోగమే ఉంది, నా అంతట నేను బతకగలను. కానీ అయాచితంగా మా నేలను కాజేసిన మిమ్మల్ని వదలను. నేల మాది అని ఒప్పుకునేదాకా నా పోరాటం ఆగదు అన్నాడు ఆవేశంగా హరి

                అంతా విన్న శరత్ఒకింత ఓపిక తెచ్చుకుని ‘‘హరీ! రెండు తరాలుగా మనం ఇలా కొట్టుకుంటూనే ఉన్నాం.మన మధ్య ఉన్న ఘర్షణ వాతావరణానికి భయపడో ఏమో ఎప్పుడూ చెట్లకు కాయలు కాయవు. కనీసం ఒక లారీ లోడు కూడా రాదు. అయినా.. నిజానికి ఇంతటి ప్రశాంతమయిన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని రణరంగంగా మార్చేస్తున్నాం. ఇక్కడున్న ప్రకృతి సాక్షిగా శతృత్వాన్ని శాశ్వతంగా పాతిపెట్టేద్దామా?’’ అన్నాడు హరి ముఖంలోకి చూస్తూ

                హరి మౌనంగా ఉండేసరికి శరత్కి అనుమానం కలిగింది. అతను నొప్పితో మూర్చపడిపోయాడా? అసలు నన్ను నమ్ముతున్నాడా? అనుకుని ఓపిక తెచ్చుకుని ‘‘హరీ’’ అని కాస్తంత గట్టిగా పిలిచాడు.

                ‘‘! చెప్పు ఏదో చెబుతున్నావు కదా? కొత్త కథలు’’ అన్నాడు నొప్పి ఉన్న ప్రాంతాన్ని అక్కడున్న బట్టతో తుడుచుకుంటూ హరి

                ‘‘హమ్మయ్య దారిలోకి వచ్చాడు అని గ్రహించిన శరత్‌.. కాస్త ఆగి ‘‘ ఇప్పటికే గ్రామమంతా మన తరతరాల కుటుంబాల తగాదాల గురించే మాట్లాడుకుంటున్నారు. మనమీదే జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు. ఒకప్పుడు తాతలు, తర్వాత నాన్నలు. తర్వాత మనం, రేపు మన పిల్లలు.. ఇది అవసరమా? ఆలోచించు.’’

                ‘‘అయితే ఇపుడేం చెయ్యాలంటావు? పొలాన్ని నీకు అప్పజెప్పి నోరు మూసుకుని వెళ్ళమంటావా? ఇది మా తాత కష్టార్జితం’’ అన్నాడు మరింత గట్టిగా.. హరి.

                ‘‘ఇదిగో ఆదే మాట. మీ తాత కష్టార్జితం. మాతాత కష్టార్జితం. మోసగించాడు మోసగించాడు అంటున్నావే. మా తాత డబ్బులు ఖర్చుపెట్టకుండా నేల నాది అన్నాడా? కాకుంటే మీది అని తెలియక మధ్యవర్తి ద్వారా కొన్నాడు. ఇప్పుడు తప్పు ఎవరిది? మీది కాదు. మాది కాదు.కదా? గొడవలకి ఫుల్స్టాప్పెట్టేదాం! ఏమంటావు? అన్నాడు శరత్

                ‘‘నిజమే! అయితే నువ్వు మాకేం న్యాయం చేస్తావు? అది చెప్పు?’’

                ‘‘ రోజు నుండి నేల నీది నాది. నువ్వు ఎప్పుడైనా ఇక్కడకి రావచ్చు. నేను వస్తాను. వచ్చిన పంటను అమ్ముకుని సగం సగం తీసుకుందాం’’ ఏమంటావు?

                ‘‘మరి మా తాత’’ మళ్ళీ హరి అనేలోగానే ఆపుతూ

                ‘‘సరే మీతాత కష్టార్జితమే. నేను ఒప్పుకుంటాను. పోనీ పంట తాలూకు డబ్బు అంతా నువ్వే తీసుకో. అలాగని నీకు రాసిచ్చేస్తాను. కానీ మా తాత కూడా కొన్నాడని ఒక్క కారణంతో నన్ను నా కుటుంబాన్ని ఇక్కడకు రానీయి. అదీ ఎందుకంటే మళ్ళీ నువ్వేదో మాకు మోసం చేసావని మన తర్వాత తరం కూడా ఇలాగే కొట్టుకుంటారు. ఇక్కడికి ఆపేద్దాం!  మనం ఒక నిర్ణయానికి రాకపోతే ఇలాగే కొట్టుకుంటూ  జీవితకాలం గడిపేస్తాం. జీవితం చాలా చిన్నది. దాన్ని సంతోషంగా గడిపేద్దాం హరీ’’ ఆలోచించు అన్నాడు శరత్‌.

                ‘‘అయితే నా ఆలోచన కూడా విను. ఇప్పటివరకు నేల వల్ల మనం సుఖపడిరది లేదు. సగం సగం తంతు మళ్ళీ ఎక్కడికి దారితీస్తుందో ఏమో! ఇప్పుడు మనతో పాటు మన భార్యలు కూడా ఉన్నారుగా. వారినుండి గొడవ అస్సలు ఒక కొలిక్కి రాదు. అందుకే మనం నేలను అమ్మేద్దాం! మనమెలాగూ  ఇక్కడ ఉండేది లేదు కదా! ఎపుడో ఒకసారి వచ్చేనాటికి అవసరమా? అందుకే సగం సగం తీసుకుని వెళ్ళిపోదాం. ఏమంటావు? అన్నాడు ఆలోచిస్తూ హరి

                ‘‘ఆలోచన బాగానే ఉంది. మనం ఉండేది మెట్రోపాలిటన్సిటీస్లో. పంట కోసం ఇలా రావడం అవసరమా నాకూ అనిపిస్తోంది. కానీ ఉన్నట్లుండి మన మధ్య వైరం పోయిందంటే ఊరి ప్రజల రియాక్షన్ఎలా ఉంటుందో ఏమో! మన మధ్య ఒప్పందం కుదిరిందన్నా మన ఊరివాళ్ళు ఊరుకోరు. కాబట్టి నువ్వన్నట్లు నేలను అమ్మేద్దాం!  ఇప్పటికే మన జీవితాలను మన ఊరికి కాలక్షేపంగా మార్చేసాం. ఇప్పుడు మనమేం నిర్ణయం తీసుకున్నా అందరికీ ఆమోద యోగ్యం కావాలి. మన తాతలకు, తండ్రులకు సంపాదనకు వేరే మార్గం లేదు కనుక ఉన్న నేలనే నమ్ముకుని బతికారు. కొట్టుకుని మరీ సాధించుకున్నారు.  కానీ మనం అలా కాదు కదా? నెలకి లక్షల జీతాలు తీసుకుని దర్జాగా బతుకుతున్నవారం. రానున్న రోజుల్లో మన పిల్లలు కూడా ఇలా పగలు, ప్రతీకారాలు అంటూ బతకడం ఛీ ఛీ తలుచుకుంటూంటేనే అవమానంగా ఉంది.’’ అన్నాడు శరత్చిరాకుగా ముఖం పెట్టి.

                ‘‘నిజమే శరత్‌.. ఇపుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అనేంతలోనే  దూరం నుండి ఏదో అలికిడి.. వినబడుతోంది. మనుషుల నీడలు కదులుతూ దగ్గరవుతున్నట్లుంది.

                ‘‘శరత్ఎవరో వస్తున్నట్లున్నారు. నీ అనుచరులేమో...నన్ను చంపేస్తారేమో’’ అన్నాడు భయంగా

                ‘‘ఒకవేళ నీ అనుచరులేమో హరీ! వాళ్ళు నన్ను చంపేస్తారేమో’’ అన్నాడు మరింత భయంగా

                ‘‘ఏం చేద్దాం?’’ అని ఇద్దరిలో ఆలోచన వచ్చింది. ఉన్నట్లుండి ‘‘లే! శరత్‌ .. నిలబడు. అన్నాడు హరి.

                ‘‘ఏం చేద్దాం? కలిసిపోయినట్లు కనిపించవద్దు. కాస్త దూరం దూరంగానే ఉందాం అన్నాడు శరత్

                ‘‘అరేయ్‌.. అలా వుంటే నీ అనుచరులు నన్ను, నా అనుచరులు నిన్న చంపేస్తారు. అలాంటి పిచ్చిపని ఏమీ చేయకు. ఎవరేమనుకున్నా ఒకటిగానే నిలబడదాం. ఎందుకంటే మనం చదువుకున్నవారం. కాస్తయినా ఆలోచించకపోతే ఇదిలాగే కొనసాగుతుంది హరి’’ అంటుండగానే ఆయుధాలతో కొంతమంది ఆత్రంగా ఇద్దరినీ మరింత విడదీయడానికి ఎంతో ఉత్సాహంగా వస్తుండటం కనిపిస్తోంది.

                అయినా ధైర్యం చేసి, వారు వచ్చేసరికి ఒక్కో మూల ఇద్దరూ శిలాప్రతిమల్లా నిలబడిపోయారు.

                అనుచరులు ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడిపోయారు. అందరికీ కనిపించేలా మాత్రం నీ సంగతి ఇప్పుడు కాదురా! నీ సంగతి ఇప్పుడు కాదురా! అని ఒకరినొకరు అనుకుంటూ పగను కొనసాగిస్తున్నట్లుగా నమ్మిస్తూ వారి అనుచరులను వారిస్తూ వెళ్ళిపోయారు.

                                                                                                        

                కొన్నాళ్ళ తర్వాత దెబ్బకి శరత్కుటంబం కాళ్ళబేరానికి వచ్చిందని హరి వాళ్ళు, లేదు  లేదు హరి కుటుంబం వారే తోకముడిచారని శరత్వాళ్ళు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసారు. శతృత్వానికి స్వస్తి చెబుతూ శరత్‌, హరి కుటుంబాలు రెండూ కలిసి మాట్లాడుకుంటున్నాయి. ఇకపై మాట్లాడుకుంటాయి కూడా..


1 కామెంట్‌:

  1. తాతలనాటి పొలం తగాదా తో బద్ధ శత్రువులు గా మారిన హరి, శరత్ లు కొట్టుకు చావబోతూ చివరి నిమిషంలో విజ్ఞతతో స్నేహితులుగా మారి సమస్యను పరిష్కరించుకున్న తీరు - పోరు నష్టం పొందు లాభం సూక్తిని స్ఫురింపించింది.
    త్వమేవాహం’ శీర్షిక చాలా బాగుంది. శైలజామిత్ర గారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి