శంకరదాసికథ
శివవ్రతాచార పరాయణులలో ప్రసిద్ధులు శంకరదాసి అను భక్తుడు ప్రసిద్ధుడు. ఈ మహానీయుడు కాలం యొక్క కర్మాకర్మల మహేంద్రజాలాన్ని నిర్మూలించగల సమర్ధుడు ఆయన. పరమేశ్వర భక్తులను నిరంతరము సేవించుచూ వారికి కావలసిన సదుపాయ సహకారములన్నింటిని కల్పించుచూ పరమేశ్వర సేవయందు నిమగ్నుడయ్యెడివాడు.ఈ విధంగా భక్తుల సహాయ సహకారములనెడి సేవాతత్పరతా బుద్ధితో నిరంతరం పరమేష్ఠియందే మనస్సును లగ్నము చేసుకొనెను. ఈ మహాత్ముని దర్శించగోరి తేడరదానయ్య అను శివవ్రతాచారసంపన్నుడు వచ్చెను. దానయ్యగారు శంకరదాసితో కొతసమయం మాట్లాడి మఠమునకు వెళ్ళెను.
దాసయ్య శంకరదాసిగారి పరమేశ్వర వ్రతాచార చిత్తమును గూర్చి పరిపరి విధముల మనసున ప్రశంసించెను. ఈ మహోన్నత భక్తునకు నిరుపేదతనము అనునది కష్టతరమైనను ఈశ్వరునిపై భారము వేసి సుఖముగా అనుభవించుచుండెడివాడు. ఒకరోజు దుగ్గలవ్వకు చెప్పి గంపనిండా కూరినట్లు ధాన్యమును పోసి ఆమెను శంకరదాసికి అందచేయవలసినదని ఇచ్చి పంపినాడు. (ఆమె వచ్చి గంపెడు ధాన్యమును పోసి ఆమెను శంకరదాసికి అందజేయవలసిందని ఇచ్చిపంపినాడు. ఆమె వచ్చి గంపెడు ధాన్యమును శంకరదాసికి అందజేసినది) అప్పుడాశంకరదాసి మహిమాన్వితయగు దాసయ్యగారి దాన వైశిష్ట్యమును గూర్చి ప్రశంసించెను. అప్పుడు తెచ్చిన ధాన్యపు గంపను తనకివ్వమని కోరెను. తెచ్చిన ఆ గంపలోచేయిపెట్టి మొత్తము ధాన్యమును పిడికిటితో తీసెను. అప్పుడా ధాన్యము పిడికిటిలోనికి కూడా రాలేదు. అప్పుడు దాసయ్య పంపిన అక్షయధాన్యం అందులో మాయమైపోయింది. తొత్తడి సంపద తొలగిపోయింది. ఎప్పుడు ధాన్యమును తన చేతిలో శంకరదాసి ముట్టెనో అప్పుడు తాడరదాసయ్యగారి ధాన్యమంతా హరించుకొని పోయినది. అప్పుడు దాసయ్యగారికి తెలిసివచ్చినది. ఆయన అణచుకోలేని దు:ఖమును అనుభవించవలసివచ్చినది. ఒళ్ళు తెలియని శోక సముద్రములో కూరుకొని పోయినది. ఏదో మాయ తనను వశం చేసుకున్నట్లుగా తల్లడిల్లెను. అప్పుడు తేడరదాసయ్యకు దుగ్గలవ్వ ఇట్లు హితబోధచేసినది.
నీవేమో మహదైశ్వర్యవంతుడవలె పట్టరాని గర్వముతో ఆయనకు ధాన్యమును పంపినావు. ఇది అట్లా ఏనుగుపండ్లను పరీక్షించే మానవుడు ఎట్లో నిన్ను చూచిన అట్లే అనిపించుచున్నది. పరమేశ్వరుని శరణుకోరిన మహాత్ముల యొక్క మహత్మ్యం తెలుసుకొనుట ఎవరితరమైనా అగునా! ఆ మహాభక్తుని సామర్థ్యం తెలుసుకొనుట కష్టసాధ్యం. ఎందుకనగా నీవు పంపిన ధాన్యమెంత? నీశక్తి పరాక్రమములు ఎంత? మహాత్ముడు నిత్యాన్న సంతర్పణలో నిరంతరం అన్నదానం చేయుచూ సకల భక్తశ్రేణిలో అగ్రగణ్యుడయి లోకమునకు కల్పవృక్షమువలె ఉండును. ప్రతిరోజూ అతనికి వచ్చునది ఐదు మానికల ధాన్యము. అవి పెరగవు తరగవు. గుంపులు గుంపులుగా వచ్చు జంగములకు నిరంతరం అన్నదానం చేయుచూ లేవు అన్న మాటలేకుండా నిత్య భోజనసేవను భక్త పరాయణులైన పరమేశ్వర భక్తులను నిరంతరం సేవించెడివాడు. శంకరదాసి నిరంతరం శివధ్యాస పరాయణుడగుటచే చివరకు శివునకు శంకరదాసికిని బేధము లేకుండా ఉండి శివభక్తులను రక్షించుట అను మహత్కార్యమును శివుని వలె నిర్వర్తించుచూ లోకమునకు మొత్తమునకు ఇతడే ఆశ్రితుడైనాడా అనిపంచునట్లు శంకరదాసి యొక్క తత్త్వము తెలుపబడుచున్నది. మిగిలిన దేవతలు, శంకరదాసి ఇంటియందు నిరంతర సేవాతత్పరులై పరమేశ్వరుని శంకరదాసి యందు చూచుకొనుచూ ఉండునట్లు, ఆమె సేవకులుగా ఉన్న దేవతలు చూపించెడివాడు. దేవతలు ఆ ఇంటిలో చేయు ఊడిగమును చూసి తట్టుకొనలేక జగదేశమల్లుడు బాధపడెను. మరియు శమించలేకపోయెను. విష్ణుమూర్తియొక్క విగ్రహమును కళ్యాణ కటకమునందు ప్రతిష్టించగా పోతపోసిన ఆ లోహం అంతా శంకరదాసయ్యకు పాదాక్రాంతమయ్యెను. దీనిని చూసి దేవతారాధన సంప్రదాయ పరులందరూ భయభ్రాంతులైరి.
ఒకమారు మఠములో ఒక పొరభూమిని త్రవ్వించగా అక్కడ బంగారుఅచ్చులు పేర్చి ఉన్న వయనము కనిపించినది. దుగ్గిళ్లవ్వకు దేడర దాసయ్యకు విస్మయము కలిగి శంకరదాసి పాదములు పట్టుకొనెను. అప్పుడు అన్యాపదేశంగా శంకరదాసయ్యగారు ఇట్లు పలికిరి. నూలికి పెట్టువడి, నేసినందుకు కూలి, ధరకు సరిపడ ధాన్యమునిచ్చి కోకకి నీవు తీర్చవలసిన తాకట్టు ఇట్లు ప్రతిహారంగా ఏదైనా ఇవ్వగలవు. అంతేకాని మావంటి దరిద్రుల కాళ్ళపై పడితేఏలాభం.? తిండికి, బట్టకు, దాచటానికి మాదగ్గర ఏమున్నది? మేము నీకేమి ఇవ్వగలము? మాదగ్గర ఏమున్నది? నీవింత రాద్ధాంతం చేయుటయందుకు. ఈపచ్చమట్టి అయిన కొన్ని పెళ్లలను తీసుకొని పొండి. మీకు మేము పడిఉన్న ఋణము తీరుతుందేమోనని శంకరదాసయ్య ఎత్తి పొడుపుగా పలికినాడు. అపుడు తేడరదాసయ్య చాలా పశ్చాత్తాపమును పొందెను. దురహంకార తిమిరంలో ఆయన కళ్లు మూసుకొని పోయినవి. అపరాధ శతసహస్రము నన్ను చుట్టుముట్టినది. నావంటి అతిగర్వి ఎక్కడా ఉండడు. నేచేసిన తప్పులన్నింటిని క్షమించి నన్ను రక్షించమని శరణు వేడుచున్నానని శంకరదాసితో పలికెను. అపుడు శంకరదాసి ఈ విధముగా పలికెను. ఆత్మార్పణ అను గుణముచే నీవు నా మనసుని హరించితివి అని.
‘‘శంకరదాసికిత ఆయనపై దయకలిగినది. అప్పుడు భక్త సమూహములు కీర్తించగా పూర్వము కంటే పుష్కలంగా ధాన్య సంపద దాసయ్యకు లభించినది. కనుక అతి గర్వము వల్ల భక్తి సద్భక్తి వర్థిల్లదు అని మాచయ్యగారు హితబోధ చేసెను.
ఈ కథయందు భగవంతుని సద్భుద్ధితో నమ్మిన సమస్తము తనకు వశమగునని నిరూపించ బడినది. భక్తిభావము సమాజహితమునకు ఉపయోగపడునని నిరూపించబడినది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి