![]() |
విద్యాధర్ మునిపల్లె |
తెల్లగా తెల్లవారింది..
విశ్వనాధుడు ఆమెను పరామర్శించటానికి గదిలోకి వెళ్ళాడు.
విశ్వనాధుని రాకను అతని అడుగుల చప్పుడుతోనే గమనించిన తులసి కళ్ళుమూసుకుని బాధతో కూడిన మూలుగు నటిస్తోంది.
విశ్వనాధశాస్త్రి ఆమె దగ్గరికి వెళ్ళాడు.
మొహంలో మొహం పెట్టి చూశాడు.
రాత్రిపూట లాంతరు కాంతిలో అంతంత మాత్రంగానే కనిపించిన తులసి సుందరవదనం ఇప్పుడు సూర్యుని కాంతితో స్పష్టంగా విశ్వనాధునికి కనిపించింది.
విశ్వనాధుడు తన మనసులో ‘‘ ఈ అమ్మాయికి భగవంతుడు ఏవేవి ఎక్కడెక్కడ ఎలా ఎలా పెట్టాలో అలానే పెట్టాడు. ఏమిటీ సౌందర్యం. కాళిదాసుని అభిజ్ఞాన శాకుంతలంలో శకుంతలని వర్ణించిన తీరును చూసి ఆహా ఈ సృష్ఠిలో శకుంతలని మించిన సౌందర్యరాశి లేదని అనుకున్నాను. కానీ కాళిదాసు ఈ తులసిని చూసి వుంటే ఈమె అందాలను ఆ శకుంతలకి ఆపాదించేందుకు ఎన్నివేల శ్లోకాలు రాయవలసి వచ్చేదో కదా’’ అని మనసులో అనుకున్నాడు.
రోగ లక్షణాన్ని నటిస్తూ ఆమె మూలిగే మూలుగు వింటూ ‘‘ గత జన్మలో ఈమె చైత్రగంధర్వి (కోకిల) అయి వుంటుంది. ఆ కోకిల చైత్రమాసంలోనే గంధర్వగానం చేస్తుంది. ఈ తులసి అపస్మారకంలో రోగంతో బాధపడుతూ మూలిగే మూలుగు కూడా గంధర్వగానాన్ని పోలివుంది కదా..’’ అని అనుకుంటూ వున్నాడు.
అసలే సరస కవితలు చెప్పే విశ్వనాధుడు భార్యావియోగతో వైరాగ్యపు జీవితం గడుపుతూ కఠోర బ్రహ్మచర్యాన్ని పాఠిస్తున్నాడు.
తులసి సౌందర్యాన్ని చూస్తూ తనను తాను మర్చిపోయి ఆమె శరీరాన్ని ఎలాగైనా తాకాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది.
రాత్రి ఆమెకి దుస్తులు మార్చేప్పుడు తాకాను కదా.. అది చాలదా అని విశ్వనాధుని ఆలోచన చెబుతుంటే.. మనసు మాత్రం చీకటిలో లాంతరు వెలుగులో కనిపించీ కనిపించని అందాలను తాకీతాకనట్లుగా తాకటం కూడా తాకినట్లేనా.. ఏది ఏమైనా స్పృహలో లేని ఈమెని ఒక్కసారి ఎలాగైనా తాకితే ’’ అన్న ఆలోచన మనసు లో మెదిలింది.
అంతలనో బుద్ధి మేల్కొని.. ‘‘ తప్పు.. సాయం కోరి వచ్చిన స్త్రీ.. కనీసం తాను ప్రతిఘటించే స్థితిలో కూడా లేని నిస్సహాయ స్థితిలో వున్న స్త్రీని కేవలం కామవికారాలను తీర్చుకోవటానికి అలా తాకటం తప్పు. ఆమె గురించి ఇలా చెడుగా ఆలోచించటమూ తప్పే.. ఎందుకంటే నిత్యం తాను నాట్యరాజైన నటరాజుని తన నృత్యంతో అర్చిస్తుంది. పరమేశ్వర సేవలో పునీతమైన ఈమె గురించి అలా ఆలోచించటం తప్పు..’’ అన్నది.
అతని మనసు బుద్ధి ఆలోచనలను కొట్టిపారేస్తూ... ‘‘ ఆమె నాట్యనీరాజనం చేస్తుంటే నీవు సాహితీ నీరాజనం చేస్తున్నావు. ఆమె పూజించేది శివుడిని. నీపేరు విశ్వనాధశాస్త్రి.. అంటే నువ్వుకూడా ఈశ్వరునివే.. కనుక ఆమెని అలా చూడటం తప్పేకాదు. శరీరంలోని చైతన్యమే శివం. చైతన్య రహితం శవం. అలా చూసినా ఇప్పుడు నువ్వు శివుడివే.. నాట్యభారతి తనైతే, నాదభారతివి నువ్వు.. తన నాట్యానికి కావాలసింది నాదం.. నీ నాదానికి ఆమె నాట్యం సమ్మిళతమైతే ఆంధ్రసాహితీ సుక్షేత్రంలో కాంచన కవితలు సిరులై వెల్లివిరుస్తాయి.’’ అని ప్రభోదించింది.
విశ్వనాధునికి ఆమెని తాకే ధైర్యం చాలటంలేదు.
భయంతో వణుకుతున్న చేతులను మెల్లిగా ఆమె కంఠం వద్దకు తీసుకెళ్ళాడు.
విశ్వనాధుని చర్యలను కళ్ళుమూసుకునే గమనిస్తూ.. అనుభూతి చెందుతున్న తులసి శరీరంలోకూడా కామవికారాలు చెలరేగి విరహం ఉప్పెనలా శరీరంలోంచి సెగలరూపంలో పెల్లుబికింది.
ఏదోలా ధైర్యం తెచ్చుకొని ఆమె గళసీమని తాకేప్రయత్నం చేస్తున్నాడు విశ్వనాధుడు.
ఎప్పుడెప్పుడు విశ్వనాధుడు తనను తాకుతాడా అని కళ్ళుమూసుకొని ఎదురుచూస్తోంది తులసి.
ఎలాగైతేనేం విశ్వనాధుడు తులసి గళసీమని తాకాడు విశ్వనాధుడు.
ఆమె శరీరంలోని విరహాగ్ని సెగరూపంలో భయంతో చల్లబడిపోయిన విశ్వనాధుని చేతిని స్పృశించింది.
ఆమె శరీరంలోని వేడి విశ్వనాధునికి వేలవిద్యుథ్ ఘాతాలు ఒకేసారి తగిలినట్లుగా అయిపోయి సంవత్సరంగా నిగ్రహించుకున్న అతని బ్రహ్మచర్యం వీడిపోయింది. ముమ్మార్లు అతని శరీరం కొత్తఅనుభూతితో కూడిన ప్రకంపనాలు పొందింది. అంతే తులసిలోనూ అదే విధంగా జరిగింది.
సానివృత్తిలో విఠులతో సరాగాలు పలికే తులసికి తొలిసారి ఇటువంటి అనుభూతి కలగటం ఆమెకే ఆశ్చర్యంగా అనిపించింది.
ఆమెలో కలిగిన ప్రకంపనల ప్రభావం వల్ల తన్మయత్వంతో మూలుగుతూ మరోవైపు ఒత్తిగిలి పడుకుంది. అలా ఒత్తిగిలి పడుకునే క్రమంలో విశ్వనాధుడు ఆమె గళసీమలో వుంచిన చెయ్యి జారి ఆమె యెదసంపదపై పడింది.
ఊహించని ఈ చర్య విశ్వనాధుని ఆశ్చర్యంతోపాటు ఆనంద పరవశానికీ గురిచేసింది. కానీ అంతలోనే ఎవరైనా చూస్తారనే భయాన్నీ కలుగచేసింది.
తన చేయిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశాడు విశ్వనాధుడు.. కానీ అందుకు తులసి వీలు కల్పించకుండా ఒత్తిగిలి పడుకుంది.. విశ్వనాధుని చెయ్యి ఆమె యదసంపదను వీడి రాకుండా తులసి ఆ చేతిమీద పడుకుండి పోయింది. ఇప్పుడు విశ్వనాధుని మొహం తులసి మొహానికి మరింతగా దగ్గరయింది.
జరిగిందీ.. జరిగేదీ అంతా కలలా అనిపిస్తుంది విశ్వనాధునికి..
ఇంతలో విశ్వనాధుని గది వద్దకు ముకుందుని అడుగుల చప్పుడు దగ్గరవ్వసాగాయి.
విశ్వనాధునిలో తెలియని ఆందోళన, సిగ్గు, బిడియం వంటివి చోటు చేసుకున్నాయి.
ఎలాగైనా తులసి నుండి విడివడాలని గట్టి ప్రయత్నమే చేశాడు విశ్వనాధుడు..
ముకుందుని అడుగులు విశ్వనాధుని గది బయట గడపదగ్గరికి వచ్చి ఆగాయి.. తులసి విశ్వనాధుని చెయ్యి విడిపించుకునే వీలు కల్పిస్తూ.. మరోవైపు ఒత్తిగిలింది. దాంతో విశ్వనాధుడు బ్రతుకు జీవుడా అనుకుంటూ తన చేతిని తీసుకొని బయటికి వచ్చాడు.
ముకుందుడు తన బావ విశ్వనాధుని వంక ఒకరకమైన అనుమానంతో కూడిన చూపు చూసినట్లు విశ్వనాధునికి అనిపించింది.
దాంతో విశ్వనాధుడు కంగుతింటూ... ‘‘ అతిధి కద ముకుందా.. ఎలా వుందో పలకరించి.. క్షేమం కనుక్కుందామని వెళ్ళాను’’ అంటూ నేల చూపులు చూశాడు.
‘‘ తనకెలా వుంది బావా’’ అన్నాడు గంభీరంగానే ముకుందుడు.
‘‘ జ్వరంతో ఒళ్ళు కాలిపోతోంది. మందులిచ్చే ఆచారి గారికి కబురుచెయ్యి. ఎంతైనా అతిధికదా.. తనకేమైనా అయితే మనకే కదా అప్రదిష్ఠ’’ అంటూ సమాధాన పరచాననుకున్నాడు.
‘‘ సరే బావా.. ఆచారిగారింటి వైపు ఎవరైనా వెల్తారేమో.. చూసి వారితో కబురు చేస్తాలే..’’ అన్నాడు ముకుందుడు ముభావంగా..
నిజానికి బావగారు ఆమె పట్ల చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ అతనికి నచ్చట్లేదు..
ముక్కూమొహం తెలియని ఒక దేవదాసిని తను పడుకునే మంచంపై పడుకోబెట్టటం.. ఆమెకు తానే దుస్తులు మార్చటం.. ఇప్పుడు ఆమె ఆరోగ్యం కోసం ఆచారిని పిలవమని తనకి చెప్పటం ఇవేవీ ముకుందుడికి నచ్చటంలేదు.
అయినా సరే బావగారి మాట జవదాటలేని ముకుందుడు మరోమాట మాట్లాడకుండా మౌనంగా వీధి అరుగుమీద కూర్చుంటానికి వెళ్ళాడు.
విశ్వనాధుని చేతికి మరోసారి ఆమె కుచకుంభాల స్పర్శపొందాలని మనసు ఉవ్విళ్ళూరుతోంది.
వీధిలోకి చూశాడు విశ్వనాధుడు.
ముకుందుడు వీధి అరుగుమీద కూర్చొని ఆచారిగారింటి వైపు వెళ్ళేవారికోసం ఎదురుచూస్తున్నాడు.
విశ్వనాధుడు తన పడక గదివైపు వెళ్ళాడు.
తులసి అటూ ఇటూ పొర్లుతూ వున్న క్రమంలో ఆమె రవికె నుంచి కొంతభాగం కుచకుంభాలు బయటికి కనిపిస్తున్నాయి.
వేసిన పైట ఎటుపోయిందో కూడా అర్ధంకాలేదు విశ్వనాధునికి.
ఆమె అందాలు విశ్వనాధుని వివశుణ్ణి చేస్తూ రారమ్మని ఆహ్వానిస్తున్నాయి.
రెండడుగులు గదిలోకి వేశాడు విశ్వనాధుడు.
వీధివైపు చూశాడు .. ముకుందుడు వీధి అరుగుమీదే కూర్చొని వున్నాడు.
ఏదైతే అది అయిందని తలుపులు రెండూ మెల్లిగా వేశాడు విశ్వనాధుడు.
కళ్ళుకొద్దిపాటి మూసుకొని విశ్వనాధుని పాట్లు గమనిస్తున్న తులసి మనసులో నవ్వుకుంటోంది.
(సశేషం)
కృష్ణపక్షం చాలా అద్భుతంగా రాస్తున్నారు. పాత్రలు.. వాటి మనోభావాలు... అన్నీ కళ్ళకు కట్టినట్లుగా వున్నాయి..
రిప్లయితొలగించండిఏంటిసార్.. అనుభవంతో రాశారా? అనుభవిస్తూ రాశారా.? చాలా బాగుంది.. పాత్రలు కళ్ళముందు కదులుతున్నాయి.
రిప్లయితొలగించండి