పరిణీత
“ మీకు డ్రింక్ చేసే అలవాటుందా ? ”
అక్కడ చేరిన తరువాత ఈ ప్రశ్న వినటం ఎన్నోసారో !
న్యూట్రీషియన్ దగ్గర్నుంచీ చిన్నా పెద్దా డాక్టర్ల వరకూ అందరిదీ ఇదే ప్రశ్న !!
“ అప్పుడప్పుడు ”
“ అంటే ”
“ వారానికి ఒక్కసారో రెండు సార్లో ! ”
నిజానికి ఇది అబద్దం ! ఆ ఒకసారో
రెండుసార్లో అన్నది పొరపాటున తాగని రోజులు-
ఒక ప్రయివేట్ కంపెనీలో సీనియర్ మోస్ట్ సూపర్వైజర్ గా పని చేస్తున్న రాజశేఖరం కు ఈ సీ జీ కొంచెం తేడా అనిపించటం తో రిఫరల్ హాస్పిటల్ కు డైరెక్ట్ చేశారు కంపెనీ డిస్పెన్సరీ డాక్టర్.
అక్కడ డాక్టర్లు ఏంజియోగ్రాం చేయాలన్నారు. ఒక రోజు ముందే అడ్మిట్ కావాలని చెప్పటంతో రేపు ఏంజియోగ్రాం అనగా ఈ రోజు అడ్మిట్ అయ్యాడు రాజశేఖరం.
అదిగో అప్పట్నుంచీ గంటకొకరు వచ్చి బి. పి. చెక్ చేయటం – పై ప్రశ్నలు వేయటం పరిపాటి అయ్యింది. పేషెంట్ కు వేసే డ్రెస్ లో తను అందంగానే వున్నాన’ని ముచ్చట పడిన రాజశేఖరం వారి కేరింగ్ కు కూడా తెగ ముచ్చట పడిపోయాడు.
రోజువారీ బిజీ లైఫ్ లో ఏమాత్రం ఖాళీ దొరకని రాజశేఖరం కు ఈ బోలెడు ఖాళీ ఒక మంచి పుస్తకం పూర్తిగా చదివేందుకు అవకాశం ఇచ్చింది. కంపెనీ పనిలో నిమగ్నం కావటం, సాయంత్రం స్నేహితులతో వినోదాలు మధ్య కొంచెం సాహిత్యాభిలాష వున్న రాజశేఖరం కథలూ కవితలూ గట్రా వ్రాసి భార్య ని, పిల్లాడిని యధేచ్చగా హింసించుతాడు.
హాస్పిటల్ బెడ్ మీద ‘ మోరీ తో మంగళవారాలు’ పుస్తకం చదువుతున్న రాజశేఖరంకు భార్య పరిణీత ఫోన్ చేసింది. శాంతి నికేతన్ స్కూల్లో లైబ్రేరియన్ గా పని చేస్తున్న పరిణీత సౌమ్యురాలు, సరళ మనస్కురాలు.
“ పొద్దున మీరు వెళ్లేప్పుడు చెప్పలేదు. ఏముందిలే అనుకున్నాను. మూడ్రోజుల క్రితం చిన్నగా మొదలైన సెగ్గడ్డ – ఈ పూటకి పెద్దగా అయ్యి బాగా నొప్పి పెడుతోంది – ”
-
మెల్లగా నొప్పి ఫోన్ లోనుంచి కూడా కనిపించేటట్లు వుంది తన వాయిస్. తనకు షుగర్.
“ అబ్బాయితో చెప్పి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ , మలాం పట్టీ తెప్పించుకుంటాను ” బాధ నొక్కిపట్టి చెప్తున్నట్లు తెలుస్తుంది.
వాళ్ళ కొడుకు నిహిల్ బజారొవ్. తుర్గనేవ్ ‘ తండ్రులూ కొడుకులు ’ చదివి ఇంప్రెస్ అయ్యి పెట్టిన పేరు. పొద్దున రాజశేఖరం ను హాస్పిటల్లో అడ్మిట్ చేసింది అతగాడే.
“ అదేం వద్దు. ముందు నువ్వు అర్జెంటుగా మీ జ్ఞాన ప్రసూనాంబ గారి హాస్పిటల్ కు వెళ్ళు ” చెప్పేడు
రాజశేఖరం.
ఒక గంట తరువాత కొడుకు నిహిల్ ఫోన్ చేశాడు. మమ్మీని ఆ లేడి డాక్టర్ హాస్పిటల్లో అడ్మిట్ చేయమంటే అడ్మిట్ చేసేన’ని, రేపు ఆ సెగ్గడ్డకు గాటు పెట్టి చీము అంతా నొక్కి తీస్తార’ని ’ చెప్పాడు.
అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భార్య ఒక చోట, తానో చోట ఒకే రోజు ఒకే సారి విషమ పరీక్ష ఎదుర్కోవటం, రాజశేఖరం కు కాస్త ఆశ్చర్యం అనిపించినా ..
“ ప్చ్… కాకతాళీయం ! ” అనుకున్నాడు.
*****
సూది గుచ్చినట్లు తెలుస్తుంది. మత్తేమి ఇవ్వలేదు కానీ –
‘ ఇటు చూడకండి ’ అన్న ఏంజియోగ్రామ్
చేసే ఆయన చెప్పిన మాటననుసరించి చూళ్ళేదు అటు.
-
వెచ్చగా రక్తం చిందింది.
“ రక్తమేనా ” అడిగాడు రాజశేఖరం.
“ కాదు. హాట్ వాటర్ కదూ ! ”
కొంచెం నవ్వుతూ సమాధానం చెప్పేడు ఆయన, కొంచెం తేలికగా ధైర్యం చెప్పే విధానంలో.
నొప్పి అనిపించకుండా వుండటానికి ‘ జటా కటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఘరీ ’ శివ తాండవ స్తోత్రం మనసులో బిగ్గరగా చదువుకున్నాడు పరమ నాస్తిక శిఖామణి రాజశేఖరం.
ఏమిటో తెలిసే లోపు యాంజియోగ్రాం పూర్తయ్యింది.
అదే సమయంలో పరిణీతకు చికిత్స మొదలైంది. తను నరకం అనుభవించింది. చీము బయటకు రావటానికి నొక్కుతున్నప్పుడు రోజూ తను పూజించే దేవుళ్ళు కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యారు. ఈ బాధ మరో వారం పాటు తప్పదన్న డాక్టర్ అన్న మీదట మరింత భయం వేసింది ఆమెకు. ‘ పగవాడికి కూడా రాకూడదు ’ అని మనసులో అనుకుంది.
రాజశేఖరం కు ఏ ప్రోబ్లం లేదని డాక్టర్లు చెప్పిన మీదట తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. బరువు తగ్గాలి, పొట్ట తగ్గించుకోవాలి, వ్యాయామం రెగ్యులర్ గా చెయ్యాలి ’ అని సలహా ఇచ్చారు. మందులు వ్రాసిచ్చి మళ్ళీ నెల తరువాత రమ్మన్నారు చెకప్ కి.
రోజూ డ్రెస్సింగ్ చేసినప్పుడల్లా నరకం అనిపించి – జీవన శైలి మార్చుకోకపోతే లాభం లేదనే నిర్ణయానికి వచ్చింది పరిణీత.
******
తన జీవన విధానం మార్చుకుంది పరిణీత డాక్టర్ సలహాలతో. గూగుల్ సెర్చ్ చేసి చాలా విషయాలు తెలుసుకుంది. అన్నింటినీ గుడ్డిగా ఫాలో కాక శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఒక పూర్తి అవగాహనతో ఆచరణకు దిగి వంద శాతం అంకిత భావంతో ప్రతి రోజును డిజైన్ చేసుకుంది. సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా సాధన లోకి దిగింది.
రోజూ ఎర్లిగా నిద్ర లేస్తుంది. ఒకటిన్నర లీటర్లు గోరు వెచ్చని
నీళ్ళు తాగుతుంది.అక్కణ్నుంచి ప్రాణాయామం, యోగాభ్యాసం చేస్తుంది. ఇంకా నడక, డ్రిల్లు లాంటివి చేసి కాసేపు ధ్యానం చేస్తుంది.మళ్ళీ ఒకటిన్నర లీటర్లు నీళ్ళు తాగుతుంది. కాలకృత్యాల అనంతరం స్నానించి పూజ చేస్తుంది. పిదప పొట్ల,సొర, బీర,క్యారెట్ , బీట్ రూట్, పుదీనా, నిమ్మకాయ,తేనెలు - ఇంట్లో ఏవి వుంటే వాటితో జ్యూస్ చేసుకు తాగుతుంది. లంచ్ లో కోకోనట్ ఫ్లోర్, హస్క్ లతో అట్టు వేసుకొని ఏదైనా కర్రీ చేసుకుని తింటుంది. లేకుంటే శనగలు,అలసందలు, శనక్కాయలు, పెసలు – వీటి మొలకలు తింటుంది. రాత్రి ఆరులోపు ఫ్రూట్స్, అటుకులు, మరమరాలు తింటుంది.స్కూల్ కి అయితే క్యారియర్ తీసుకు పోతుంది అదే మెనూ తో. అంతా ఒక యజ్ఞం చేసినట్లు చేస్తుంది.
దాదాపు మూణ్నెళ్ళ తరువాత చూస్తే ఆమెకు షుగర్ లేకపోవటం గమనించిన రాజశేఖరం కు ఆశ్చర్యం వేసింది.
భర్తను కూడా ఆ దారిలో నడిపించటానికి పరిణీత తెగ ప్రయత్నం చేసింది. కానీ రాజశేఖరం తన అలవాట్లు ఏమీ మార్చుకోలేదు. రోజూ డ్రింక్ చేయటం, నాన్ వెజ్ తినటం – లేట్ గా నిద్ర పోవటం నిత్యకృత్యంగా సాగి పోతుంది. తన బాటను దిద్దుకున్న ఇల్లాలు, భర్త జీవితంలో దిద్దుబాటు కు పూనుకుంది.
ప్రతి ఆదివారం తలకు హెన్నా పెట్టుకుంటుంది. ఇంట్లో కూడా మేక్సీలతో కాకుండా చీరతోనే ఉంటుంది.చక్కగా మల్లె పూలమాల సిగలో ధరిస్తుంది. కానీ – రాత్రిళ్లు భర్త వొంటి మీద చెయ్యి
వేస్తే మునుపటిలా సహకరించక నో’ చెబుతుంది. అదేమంటే, ‘ ముందు పొట్ట
తగ్గించుకోండి ’ అంటుంది. తను తినదు కనక ఇంట్లో రైస్ వండటం లేదు. కావాలంటే వండుకో’ మంటుంది. దాదాపు సహాయ నిరాకరణకు పూనుకుంది. నిహిల్ పేరుకు తగ్గట్టు శూన్యవాది. వీరిద్దరి పేచీలకు ఏ మాత్రం పూచీ వహించడు. తనొక ఆధునిక క్రియేటివ్ వరల్డ్ లో వుంటాడు. జిమ్, బాట్మింటన్ అంటూ వెయిట్ లాస్ అంటూ స్లిమ్ గా వుండేందుకు తన సాధనలో తానుంటాడు. ఎటొచ్చీ కష్టం అంతా రాజశేఖరానికే మిగిలింది. ఇంట్లో ఆరోగ్యం, ఫిట్ నెస్ అంశాలు ముగ్గుర్నీ రెండు ధృవాలు గా మార్చేశాయి. తల్లీ కొడుకులు ఒక ధృవం – రాజశేఖరం ఒక్కడే ఒక ధృవం.
*****
“ శాంతి నికేతన్ బ్రాంచ్ వైజాగ్ లో ప్రారంభిస్తున్నారు. నేను ఆ బ్రాంచ్ కు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను ” చెప్పింది పరిణీత ఒక రాత్రి సమయాన.
తాగింది దిగి పోయింది రాజశేఖరం కు.
“ అదేం ?! ” నోట్లో మాట నోట్లోంచి రానట్లు అస్పష్టంగా గొణిగినట్లు అడిగాడు శే ఖరం !
“ అది పూర్తిగా బాలికల స్కూల్ ,హాస్టల్ – అక్కడకు వార్డెన్ గా నన్ను ప్రమోట్ చేశారు. ఎలాగూ నా అవసరం మీకు లేదు ”
“ అంటే ఆ మెంటల్ హాస్పిటల్ వున్న వైజాగ్ కు ’ బహుశా ఆ ప్రక్కనే ఏమో మీ అశాంతినికేతన్ ” వ్యంగ్యంగా అన్నాడు రాజశేఖరం.
“ ఆహా! ప్రపంచమే ఒక పెద్ద పిచ్చాసుపత్రి అంటారుగా మీ కవులు ” పంచ్ ఇచ్చింది పరిణీత.
“ నీకిది అవసరమా ? ఇప్పటికే ఏవో ఆరోగ్య సూత్రాలు అంటూ ఇంట్లో అన్నం వండటం మానేశావు. వాడూ ఆ వైట్ రైస్ మానేసి చప్పగా వుండే బ్రౌన్ రైస్ తింటున్నాడు – ఎటొచ్చీ నా అవసరాలు ఎవరూ పట్టించుకోరా” చికాకు పడ్డాడు రాజశేఖరం.
“ మీ అవసరాలు మీకున్నప్పుడు, మీ ప్రయారిటీలు
మీకున్నప్పుడు మాకూ అవసరాలు ఉంటాయి, ప్రయారిటూలూ వుంటాయి ! మీరే స్త్రీలకు శరీరం తో పాటు మెదడూ… ఇంకేదో … అదే హృదయం కూడా వుంటాయని అంటారు ” “ నా మాట మీరు వినరు. ఇన్నాళ్లూ మీ మాట నేను విన్నాను. ఒక చిన్న షుగర్ గడ్డ నాకు జ్ఞానోదయం కలిగించింది. మీరు మీ జీవన శైలి మార్చుకోకపోతే మీ ఖర్మ ” అంది.
“ అంతేనా ? ” అన్నాడు రాజశేఖరం.
“ ఇప్పటికి ఇంతే ” ముగించింది పరిణీత.
*****
తను వైజాగ్ వెళ్లి పోయాక రాజశేఖరం కు రెండు మూడ్రోజులు ఫర్లేదు అనిపించినా – తర్వాత తెలిసివచ్చింది, కొడుకు జిమ్, బాట్మింటన్, ఫ్రెండ్స్ అంటూ ఎప్పుడూ ఇంట్లో వుంటాడో తెలియదు. ఎంతలేదు అనుకున్నా ఒంటరితనం చాలా బాధ కలిగించింది. కనీసం పోట్లాడెందుకు కూడా మనిషి లేకపోవటం గొప్ప దిగులైంది. విడిచిన బట్టలు,కడగని అంట్లు, వూడ్చని ఇల్లు – గదంతా చిందరవందరగా వస్తువులు – ఇంటి ముఖచిత్రం మారి పోయింది.
తను మారిపోతాన’ని వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడు రాజశేఖరం భార్యకి.
‘ టూ లేట్ డియర్ ’ రోజుకు ఒక్కసారే చాట్ చేసే భార్యామణి రిప్లై.
వుండగా వుండగా పీడకలలు మొదలయ్యాయి రాజశేఖరం కు.
“ నువ్వు పక్కన వుండగా నాకే దయ్యాలు కలలోకి రావు ” అనేవాడు తనున్నప్పుడు సరదాగా.
ఇప్పుడు అదే నిజమైంది. తను లేదు – దయ్యాలు అతడ్ని దడిపిస్తున్నాయి. రెండ్రోజులు వరసగా తాగినా మార్నింగ్ తను లేక దిగులు మరింత హెచ్చయ్యింది. తట్టుకోలేని స్థితికి చేరువయ్యాడు పది రోజుల్లో.
వన్ ఫైన్ మార్నింగ్ తను వైజాగ్ నుండి వచ్చింది.
ఆ రాత్రి తాగకుండా, ఎవరూ చూడకుండా గదిలో ఆమె కాళ్ళు పట్టుకున్నాడు పరిణీత పతి.
“ అయ్యో! ఇదేంటండీ?! ” గుండెలకు హత్తుకుంది.
*****
పొద్దున్నే లేచి ప్రాణాయామం చేసి, యోగాభ్యాసం ఒనరించి ధ్యానానంతరం మొలకలు తిని ఆఫీస్ కు వెళ్లేప్పుడు కూరగాయల జ్యూస్ తాగుతున్న తండ్రిని ఆశ్చర్యంగా చూళ్ళేదు నిహిల్ బజారొవ్. తల్లి పన్నిన పన్నాగం ఫలించినందుకు
కంగ్రాట్స్ చెప్పాడు రహస్యంగా. ట్రాన్స్ఫర్ ఏమీకాదు కేవలం వైజాగ్ బ్రాంచ్ లో లైబ్రరీ ఏర్పాటుకు ఒక పది రోజులు స్కూల్ మేనేజ్ మెంట్ పంపితే వెళ్లిన పరిణీత భర్తలో మార్పుకై చిన్న తమాషా ప్లే చేసింది. అది బాగానే పే చేసింది. పరిణీత పేరును సార్ధకం చేసింది.
సమాప్తం
( తొలి తెలుగు కథ గురజాడ అప్పారావు గారి దిద్దుబాటు కథ నాటిదైతే,నేడు భార్యా భర్తల జీవన శైలిని , రేపటి రోజుకై మార్చుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పిన నేటి కథ పరిణీత !)
చదువరులకు కృతజ్ఞతలతో – రచయిత.
-
రిప్లయితొలగించండిచాల బాగుంది
చాల బాగుంది
చాల బాగుంది
కృతజ్ఞతాభివందనలండీ!
తొలగించండిఆధునిక జీవనశైలి నేపథ్యంలో మంచి కథను అందించిన రచయితకు అభినందనలు.
రిప్లయితొలగించండిప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంలో ఎంతో మంది ఉద్యోగం, సంపాదనల యావలో పడి అత్యంత విలువైన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.చదివే ప్రతి పాఠకుడికి అన్వయించే కథా వస్తువుతో అందరికీ ఆమోదయోగ్యమైన కథ హృద్యమైన కథనం తో అలరించింది.
భర్త లో మార్పు కోసం పరిణీత ఆడిన నాటకం కథలో కొసమెరుపు.
కథ ఆద్యంతమూ ఆకట్టుకుందనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
కృతజ్ఞతాభివందనాలండీ!
తొలగించండిపరిణీత కథను ఒక అనుభవ పాఠంలా చిత్రీకరించారు రచయిత. శరీరమాద్యం ఖలు ధర్మసాధనం. కావున ముందుగా శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన అవసరాన్ని , జీవన శైలిని మార్చుకోక తప్పదనే హెచ్చరికనూ చక్కగా చెప్పారు రచయిత. అభినందనలు . పి. వి. రమణ.
రిప్లయితొలగించండికృతజ్ఞతలు , అభివందనాలు సర్ !
తొలగించండిThis is really a nice Story which was ultimately aimed towards Woman Empowerment.
రిప్లయితొలగించండిNumber of Stories like this are expected from this Amazing Writer.
కృతజ్ఞతాభివందనాలండీ!
తొలగించండిThis is really a nice Story which was ultimately aimed towards Woman Empowerment.
రిప్లయితొలగించండిNumber of Stories like this are expected from this Amazing Writer.
..... From : Indira.M
కృతజ్ఞతాభివందనాలు మేడం !
తొలగించండిభార్య షుగర్ వ్యాధి పీడితురాలు, భర్త కూడా యాంజియోగ్రాం వరకూ వెళ్ళాడు. జీవన శైలిని సరిదిద్దుకోవాల్సిన అవసరం మొదట గుర్తించిన భార్య పరిణత ప్రదర్శించి తను మారి తర్వాత భర్తను మార్చుకోవటం కథ. అయితే రచయిత కథ నడిపించిన తీరు అద్భుతం. ఒకేసారి దంపతులను హాస్పిటల్ కు చేర్చి కాకతాళీయం అన్నా - తరువాత భర్తను సరిదిద్దు కోవటానికి ఆమె వేసిన ఎత్తుగడ చదువరులను క్రమంగా కథలోకి నడిపిస్తుంది. భార్య పక్కన లేకుంటే ఎంత బాధో అర్థమయ్యాక భర్త దారికి వస్తాడు. చివరి ట్విస్ట్ చాలాబాగుంది.
రిప్లయితొలగించండిరచయిత చమత్కారి కూడా. యాంజియోగ్రాం అప్పుడు జటా కటాహ, మెంటల్ హాస్పిటల్ వున్న సిటీలో అశాంతినికేతన్ తదితరాలు సునిశిత హాస్యం అనిపించాయి.
సందేశాత్మకంగా కథ, ఆసక్తిదాయకమైన కథనం, కొసమెరుపు ముగింపు వెరసి మంచి కథగా ఆహ్లాదాన్ని కలిగించింది.
రచయిత అభినందనీయులు !
- షేక్ బాజీ షరీఫ్
కృతజ్ఞతాభివందనాలండీ!
తొలగించండిNice Story & Story telling Skills superb !
రిప్లయితొలగించండికృతజ్ఞతాభివందనాలండీ!
తొలగించండిThis is a feel good story. Also narration is excellent.
రిప్లయితొలగించండిAmazing story about modern life which expressed the need to change the same for better & healthy life. _ K N Rao
తొలగించండికృతజ్ఞతాభివందనాలండీ!
తొలగించండిపరిణీత కథ ఆద్యంతమూ ఆసక్తికరంగా వుండి ఏకబిగిన చదివించింది. ఇంటికి ఇల్లాలే దీపం అన్నట్లు చిన్న ఎత్తుగడతో భర్తకు సరైన దారి చూపించి ఆరోగ్యకరమైన కుటుంబానికి బాటలు వేసింది. రచయిత అభినందనీయులు.
రిప్లయితొలగించండి- రాణి A. S.
కృతజ్ఞతాభివందనాలండీ!
తొలగించండికథలో రాజశేఖరం, పరిణీత లను వారి వారి అనారోగ్య పరిస్థితులలో పరిచయం చేయడం మంచి ఎత్తుగడ. పరిణీత తాను మారిన తరువాత భర్త ను మార్చుకొనేందుకు వేసింది మరో ఎత్తుగడ. ముగింపులో రాజు కు చెక్ చెప్పటం మరింత పాజిటివ్ గా వుంది. వెరసి కథ చాలా బాగుంది.
రిప్లయితొలగించండి- ప్రసాద్ M.
ధన్య వాదాలు అండీ !
తొలగించండిIt’s a feel good story . In this story we came to know that how much power is there in women’s word for not letting her husband into bad habits . This shows the women empowering the whole family with her ideaology . At last a good climax ending !
రిప్లయితొలగించండిRegards
Praveen Gelli
Thank You Sir !
తొలగించండిGood Family, Good achievement ,Good Story & very good narration ! ~ N B
రిప్లయితొలగించండిThank You Sir!
తొలగించండిHealthy Story and excellent narration ! Subba Rao V
రిప్లయితొలగించండిThank You Sir!
తొలగించండిNice Story. Excellent narration. - Nagarjuna
రిప్లయితొలగించండిThank You Sir !
తొలగించండికథ చాల బాగుంది. ఆరోగ్యం కోసం ఒక ఇల్లాలు చేసిన సాధన అపూర్వంగా చిత్రించారు. భర్త అలవాట్లు మార్చటానికి ఆమె వేసిన ప్లాన్ అద్భుతం. ఏది ఏమైనా మంచి కథ! - మనోజ్
రిప్లయితొలగించండిధన్యవాదాలు అండి!
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిGood writing. very good story. Congratulations to writer sir !
రిప్లయితొలగించండి- Sk Md Vali.
Thank You Sir !
తొలగించండిNice story, excellent narration!
రిప్లయితొలగించండిThank You Sir!
తొలగించండికథ చాలా బాగుంది. పరిణీత తన జీవన శైలి ని మార్చు కోవడమే కాక భర్త దురలవాట్లను మాన్పించిన తీరు అద్భుతం గా వ్రాశారు. రచయిత అభినందనీయులు.
రిప్లయితొలగించండి- సుబ్బారావు వడ్డి.
ధన్యవాదాలు అండీ!
తొలగించండిVery Good Story & Interesting narration
రిప్లయితొలగించండి- Prasad V.
Thank You Sir !
తొలగించండికథ చాలా ఆసక్తిదాయకంగా వుంది. హాస్యం, సరసం, ఆరోగ్యం కలిపి తయారించిన రసగుళిక.
రిప్లయితొలగించండిరచయిత కు అభినందనలు.
- మధుసూదనరావు శాఖమూరి.
కృతజ్ఞతాభివందనాలు అండీ !
తొలగించండిStory is very interesting&Beautiful narration. For this feel good story ,Congratulations to writer.
రిప్లయితొలగించండి- A.DEEPIKA
Thank You madam!
రిప్లయితొలగించండిFEEL GOOD STORY IT'S TO CHANGE EVERY HUSBAND LIFE STYLE FOR GOOD HEALTH AND GOOD RELATIONS
రిప్లయితొలగించండిThank You Sir !
తొలగించండిGood Story. Intelligent wife, changed her husband's Life Style. Congratulations to writer.
రిప్లయితొలగించండిThank You Sir !
తొలగించండిNice Story. And excellent narration. Best luck to writer .
రిప్లయితొలగించండిThank You Sir !
తొలగించండిKatha chaalaa bagundi. Health vishayamlo oka vayasu daatina taruvaata tisukovalasina jagrattalu mariyu Food vishayam lo saraina diet patimchatam vamtivi chebutune illalu bhartanu alavaatlanu maarchukunelaa chesi kutumbaanni diddubaata nadipimchatam vishesham. Kathanam kudaa chaala bgumdi. Rachayitaku abhinamdanalu.
రిప్లయితొలగించండి- ANIL P
Thank You Sir !
తొలగించండిA feel good story. And way of story telling is very nice & queit interesting. Congratulations to writer.
రిప్లయితొలగించండిThank You Sir !
తొలగించండికధ ఆధ్యంతము.ఆసక్తికరంగా సాగింది.తెలివయిన ఇల్లాలు తన జీవన శైలి మార్చుకోవటమే గాక భర్త దురఅలవాట్లను మాన్పించటం విశేషం.కధ సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో స్పాంటేనీయస్ కధనంతో ఆకట్టుకుంది .రచయత గారికి ప్రత్యేకమయిన అభినందనలు.
రిప్లయితొలగించండి- చీకుర్తి దుర్గాప్రసాద్
కృతజ్ఞతాభివందనాలు అండీ !
తొలగించండిVERY GOOD STORY AND INTERESTING WHILE READING. BEST OF LUCK TO WRITER SIR !
రిప్లయితొలగించండి_ SARADA U.
THANK YOU MA'AM !
తొలగించండిIt is a nice story. Now a days, every one is running towards earning without caring for health. Because of this attitude, major persentage of people are subjected to BP, Diabeties etc. Health is more than wealth. If a family is to be good health, the house wife must be with good health. Then, She can lead the family towards good health. In the present story, the wife stood as role model and giuded her husband also to achieve the good health. It is an inspiring story to many people to change life style for good health. I thank writer for his very good story
రిప్లయితొలగించండిThank You Sir !
తొలగించండిChala manchi katha, ante manchiga kathanamu nadichimdi. Hospital lo AME anubhavimchina baadha malli raakudadani arogyam meeda drushti petti sugar tamggimchukoni bhartanu kudaa ade daarilo nadipimchataaniki manchi plan vesi success kavatam vishesham. Feel good story gaa chala bagumdi.
రిప్లయితొలగించండిDhanyavaadamulu Andi !
రిప్లయితొలగించండిFeel good Story. Well written.
రిప్లయితొలగించండిThank You Sir !
తొలగించండిThank You Sir !
రిప్లయితొలగించండికథ కథనాలు అద్భుతం. చమత్కారము, సమయస్ఫూర్తి కలిగి ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు మంచి ప్రయత్నం గా ఎంచ దగ్గది. ఎంతైనా ఆ ఇల్లాలు తెలివి గలది. భర్త నడవడిక ను మార్చ గలి గింది . బహుమతి కి అర్హమైన కథ.
రిప్లయితొలగించండికృతజ్ఞతాపూర్వకంగా అభివందనాలు అండీ !!
తొలగించండిVery good story. Nice narration. Best wishes to writer. ~ Atluri Venkateswara Rao
రిప్లయితొలగించండిThank You Sir !
తొలగించండినిజ జీవితంలో వచ్చిన ఒడిదుడుకులు చాలా చక్కగా వర్ణించారు.భర్త చెడు అలవాట్లు మాన్పించి,మంచి గా మార్చిన పరిణీత గారిని ఆదర్శం గా తీసుకోవాలి. తల్లి దండ్రులు లను వృద్ద ఆశ్రమం లో వదిలేస్తున్న రోజుల్లో తండ్రిని ,తల్లిని ,పరిస్థితుల్ని చక్కగా నిర్వహించుకోనేలాగా కొడుకుని తయారు చేసిన రాజశేఖర్ మరియు పరినీతల గారి పెంపకం అభినందనీయం.చాలా ఆదర్శ వంతమిన రచన.
రిప్లయితొలగించండికృతజ్ఞతాభివందనాలు మేడమ్ !
రిప్లయితొలగించండిగింజలూ , మొలకలు తినే
రిప్లయితొలగించండిపరిణీత
కథలూ, కవితలు వ్రాసే
రాజ శేఖరం
జిమ్ , బ్యాట్మింటన్ అనే
నిహిల్
భార్యా , భర్త ,ఒక నిహిలిస్ట్ అబ్బాయి
హాస్పిటల్ , స్కూలు
బీ పీ, షుగర్, లైబ్రెరీ
చలం కొటేషన్
శివ తాండవ స్తోత్రం
అంతఃపుర కుట్ర
ఒంటరితనపు వేదన
మీర జాలగలడా తన ఆనతి
ఆరోగ్య వ్రత విధాన మహిమన్
పరిణీత పతి ’ అన్నట్లు
సాగిన కథనం తో ఆకట్టుకొనెన్ !
- చైతన్య మిత్ర !!
అమందానంద
తొలగించండికందళిత
హృదయారవిందం ' తో
అభివందనాలు ,
కృతజ్ఞతలు
సార్ !!
Very good story.
రిప్లయితొలగించండిJagannath. B
THANK YOU SIR !
తొలగించండిFeel good story and excellent narration.
రిప్లయితొలగించండిThank You madam !
తొలగించండిGood story about health consciousness and well written.
రిప్లయితొలగించండిThank You KIRAN !
తొలగించండిChaala manchi katha amte chakkani kathanam.
రిప్లయితొలగించండి- narasimha
Dhanyavaadaalamdi !
తొలగించండిGood story about health. Well written.
రిప్లయితొలగించండిPrakash K
Thank You Sir !
తొలగించండిHealthy story with excellent narration. Wife must be congratulated as well as writer.
రిప్లయితొలగించండిTHANK YOU SIR !
తొలగించండిGood story. Nice to read
రిప్లయితొలగించండిThank You Sir !
తొలగించండిVery good story to read & to learn about healthy life style.
రిప్లయితొలగించండిThank You Sir !
తొలగించండిGood story. I like this story and I felt Happy.
రిప్లయితొలగించండిThank You Andi !
తొలగించండిFeel good story about healthy life style. Well written.
రిప్లయితొలగించండి_ Victor Babu
Thank You Victor !
తొలగించండిExcellent story.Intelligent narration.
రిప్లయితొలగించండిThank You Sir !
తొలగించండిStory is very good.It is about good habits & good health helps in our daily life.
రిప్లయితొలగించండిThank You Sir !
తొలగించండిThank You Sir !
రిప్లయితొలగించండిరచయిత ఎంచుకున్న కథా వస్తువు ఆధునిక జీవన శైలికి సంబంధించినది. ప్రకృతి ఆహారము, యోగా వ్యాయామాలతో కూడిన జీవన విధానాన్ని ప్రోత్సహించేదిగావుండటమే కాక కథ నడిపిన తీరులో క్రమంగా జీవితాన్ని దిద్దుకోవటం కనిపిస్తుంది.
రిప్లయితొలగించండిఇద్దరు నడి వయస్కులు ఆరోగ్యం కోసం చేసే వినూత్న ప్రయత్నంలో భార్య భర్తను సంస్కరించటానికి వేసిన ఎత్తు ఫలించి కొత్త జీవితాలకు దారి సుగమమై శుభం పలికింది.
ఆరోగ్యవంతమైన కథ
అందమైన పద సందోహం
ఆహ్లాదవంతమైన వాక్య నిర్మాణం
అందం ఆహ్లాదం ఆరోగ్యం కలిపి
అభిరుచి తో తయారించిన మధుర పానీయం
ఆస్వాదించినంతనే కలుగు అనుభూతి
ఆచరించినంతనే సమాకూరును
ఆరోగ్య మహా భాగ్యం
అభినందనలు
- సరళ !
ధన్యవాదాలు మేడం !
రిప్లయితొలగించండి